Kokilaksha: క‌లుపుమొక్కగా పిలిచే కోకిలాక్ష అంత ప‌వ‌ర్‌ ఫుల్లా?


 Kokilaksha: క‌లుపు మొక్క‌గా పెరిగే ఈ మొక్క‌ను హిందీలో తాల‌మ‌ఖాన అని ఆయుర్వేద మూలిక‌లు అమ్మే దుకాణాల్లో తాలంఖాన గింజ‌లు అని పిలిచే ఈ మొక్క అమోఘ‌మైన ఔష‌ధ‌గుణాలు క‌లిగి ఉంది. అయితే వృధాగా పెరిగే ముళ్ళచెట్టు (hygrophila auriculata) కాబ‌ట్టి చాలా మంది దీని జోలికి పోరు.

kokilaksha kashayam, kokilaksha, hygrophila auriculata,


ఆయుర్వేద మూలిక‌లు సేక‌రించే వారు మాత్రం దీని గింజ‌ల‌ను ఆకుల‌ను, వేర్ల‌ను సేక‌రించి అమ్ముతుంటారు. ఇది ఎక్కువ‌గా బంజ‌రుభూములు, వృధాగా నీరు ఉండే ప్రాంతాలు, మురికి కాలువ‌లు, గుంట‌లు, చెరువుల‌లో బాగా పెరుగుతుంది. 

ఇది ఆయుర్వేద మూలిక‌ల‌లో అరుదైన మూలిక‌గా చెప్పే క్షీర‌కాకోళి అనేది దొక‌న‌ప్పుడు దానికి ప్ర‌త్యామ్నాయంగా (Kokilaksha benefits) ఉప‌యోగించ‌మ‌ని తెలియ‌జేసింది. ఇది పొడ‌వైన కంట‌క‌యుత‌మైన మొక్క‌. బ‌ల్లెం ఆకారంలో ఉన్న సామాన్య ప‌త్రాలు బ‌హుముఖ విన్యాసంలో అమ‌రి ఉంటాయి. లేత నీలిరంగులో ఉన్న పుష్పాలు గ్రీవ‌స్థ‌మై జ‌త‌లుగా రూపొంది ఉంటాయి.

ఫ‌ల‌ము గుళిక‌, కేశ‌యుత‌మై చ‌క్రాకారంలో ఉన్న విత్త‌నాలు గుళిక‌లో గ‌ట్టి కొక్కేల‌పై నిలిచి ఉంటాయి. ఈ మొక్క చెరువు గ‌ట్ల‌పైన రోడ్డు ప్ర‌క్క‌న క‌లుపు మొక్క‌గా పెరుగుతుంది. ఈ మొక్క‌ను నీరుగొబ్బి అని కూడా అంటారు.

Kokilaksha: కోకిలాక్ష మొక్క ఔష‌ధ ఉప‌యోగాలు

కోకిలాక్ష స‌మూల‌ము, తిప్ప‌తీగ కాడ‌లు స‌మాన‌ముగా క‌లిపి త‌యారు చేసిన క‌షాయం 30-60 మి.లీ. చొప్పున రోజుకు రెండుపూట‌లు కొద్దికాల‌ము సేవించాలి. ఇలా చేస్తే వాత ర‌క్త‌ము త‌గ్గుతుంది.

కోకిలాక్ష స‌మూల‌మును నీడ‌న ఎండ‌బెట్టి కాల్చి బూడిద చేసిన దానిని ఒక స్పూను మోతాదులో పావు క‌ప్పు గోమూత్రంలో గానీ, నీటిలో గాని క‌లిపి త్రాగుచున్న శ‌రీర వాపు త‌గ్గుతుంది. ఇది కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వారిలో ఈ యోగం ఉప‌యోగ‌ప‌డుతుంది. ఆకుల ర‌సాన్ని రెండుస్పూన్‌లు ప‌ర‌గ‌డుపున ఒక వారం పాటు వాడాలి. 

కోకిలాక్ష గింజ‌ల చూర్ణ‌ము మ‌రియు దూల‌గొండి గింజ‌ల చూర్ణంను స‌మానంగా క‌లిపి ఒక స్పూన్ మోతాదులో అప్పుడే పితికి, చ‌క్కెర క‌లిపిన ఆవుపాల‌లో క‌లిపి సేవిస్తే వాజీక‌ర‌ణంగా ప‌నిచేయును. సంభోగ‌శ‌క్తి పెరుగును. శీఘ్ర‌స్య‌ల‌నం పోగొట్టును.

కోకిలాక్ష స‌మూల‌మును దంచి అందుకొంచెం ఆముదం క‌లిపి వెచ్చ‌గా చేసి క‌ట్టిన న‌డుము, వెన్ను, తుంటి వీనియంద‌లి నొప్పులు త‌గ్గిపోతాయి.

50-100 మి.లీ కోకిలాక్ష వేరు క‌షాయ‌మును (kokilaksha kashayam) రోజుకు రెండుపూట‌లా త్రాగుచున్న మూత్ర‌పు బ‌ద్ధ‌ము, బొట్టు బొట్టుగా నొప్పి చురుకుతో కూడి ప‌డే మూత్రం, శ‌రీర వాపులు, ఉద‌రం మొద‌ల‌గున‌వి త‌గ్గును.

రెండు స్పూన్ల విత్తుల‌ను ఒక గ్లాసునీటిలో ఒక గంట నాన‌బెట్టితే అవి ఉబ్బిగుజ్జుగా త‌యారు అవుతాయి. ఈ గుజ్జును ఆ నీటిలోనే బాగా పిసికి అందు రెండు స్పూన్ల చ‌క్కెర క‌లిపి త్రాగితే ఎండాకాలంలో శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. 

రేరును న‌ల‌గ‌గొట్టి  అర‌క‌ప్పు నీటిలో క‌లిపి తీసుకుంటే తెల్ల‌బ‌ట్ట స‌మ‌స్య పోతుంది. రెండు స్పూన్ల గింజ‌ల‌ను అర‌క‌ప్పు నీటిలో ఒక రాత్రంతా నాన‌బెట్టి ఉద‌యం అర‌క‌ప్పు చ‌క్కెర క‌లిపిన పాల‌తో సేవించాలి. మూడ్రోజుల‌కు ఒక‌సారి చొప్పున సేవించాలి.

Benefits of coconut water: సుగుణాలు క‌లిగిన‌ నీళ్లు కొబ్బ‌రి నీరు


 Benefits of coconut  water: మ‌న సంస్కృతిలో, మ‌న ఆచారాల‌లో  కొబ్బ‌రి బొండాకి ఎన‌లేని ప్రాధాన్యం ఉంది. క‌ళ్యాణ వేదిక‌పైకి న‌డిచి వ‌చ్చే న‌వ‌వ‌ధువు చేతుల‌ను కొబ్బ‌రి బొండం లేకుండా ఊహించ‌లేం. ఎన్నో పూజ‌ల్లో, వ్ర‌తాల్లో ఇది ఉండి తీరాల్సిందే. గుండ్రంగా, మ‌చ్చ‌లు లేని నున్న‌ని లేలేత ప‌చ్చ‌ని బొండాన్ని ఎంచుకుని మ‌రీ ఆయా కార్య‌క్ర‌మాల్లో ఉప‌యోగిస్తాం. ఇక కొబ్బ‌రికాయ కొట్ట‌ని శుభ‌కార్యాలు, పూజ‌లు అస్స‌లు ఉండ‌వు.

Benefits-of-coconut-water


అందుకే ఎన్నో ఉప‌యోగాలున్న కొబ్బ‌రి చెట్టు క‌ల్ప వృక్ష‌మైంది. మ‌న దేశంలో కొబ్బ‌రి సాగుకు విశిష్ట‌స్థానం ఉంది. ల‌క్ష‌లాదిమందికి జీవ‌నాధారంగా ఉంది ఈ పంట‌. కొబ్బ‌రినీటి (coconut water
లో ఎన్నో విట‌మిన్లు, ఖ‌నిజాలుంటాయి. శ‌రీరానికి  అనేక ర‌కాల పోష‌కాల్ని అందించ‌డంలో అస‌మాన‌మైన స‌హ‌జ పానీయం కొబ్బ‌రినీరు. నూటికి నూరుపాళ్ళు స‌హ‌జ‌సిద్ధ‌మైన‌, క‌ల్తీకి ఆస్కారం లేని పానీయం.

Benefits of coconut  water: కొబ్బ‌రి నీరు ఉప‌యోగాలు

ప్ర‌పంచంలో మ‌రేదీ దీనికి సాటిరాదు. దీనికి ప్రాసెసింగ్ ప్ర‌క్రియ‌లో ప‌నిలేదు. మ‌న ర‌క్తంలో ఎల‌క్ట్రోలైట్ స‌మ‌తౌల్యం ఏ విధంగా ఉంటుందో కొబ్బ‌రి నీటిలోనూ అదే మాదిరి ఉంటుంది.  ఇందుకు కార‌ణం ఈ నీటిలోని లెక్క‌లేన‌న్ని ప్ర‌యోజ‌న‌ములే. దైనందిన అవ‌స‌రాల‌కు సులువుగా అమ‌రే స‌హ‌జ ఉత్ప‌త్తి. పోష‌కాహార లేమి నివార‌ణ‌లో ప్ర‌ధాన ఆధ‌రువు.

కొబ్బ‌రినీటిలో చ‌క్కెర ప్ర‌ధానం

లేత కొబ్బ‌రినీటిలో చ‌క్కెర‌లు ప్ర‌ధానంగా ఉంటాయి. కొబ్బ‌రిబొండాంలో చ‌క్కెర కాన్స‌న్‌ట్రేష‌న్ పెరుగుతూ ఉంటుంది. ఈ చ‌క్కెర స్థాయిలో మార్పులు మ‌న‌కు కాయ తీరును బ‌ట్టి అర్థ‌మ‌వుతుంది. కొబ్బ‌రి అస్స‌లు క‌ట్ట‌ని బొండం నీరు ఉప్ప‌గా ఉంటుంది. కొద్దిగా కొబ్బ‌రి క‌ట్ట‌డం ఆరంభించాక ఓ మాదిరి లేత కొబ్బ‌రిదాకా నీళ్లు తియ్య‌గా ఉంటాయి. కొబ్బ‌రి బాగా ముదిరిన త‌ర్వాత నీటిలో చ‌క్కెర శాతం ప‌డిపోతూ ఉంటుంది. కాబ‌ట్టి తిరిగి నీరు ఉప్ప‌ద‌నాన్ని సంత‌రించుకుంటుంది. 

కొబ్బ‌రి నీళ్ల‌లో ఖ‌నిజాలు మెండు

లేత కొబ్బ‌రి నీటిలో దాహాన్ని తీర్చే గుణం మాత్ర‌మే కాదు, ఎన్నో ఖ‌నిజాలు ల‌భిస్తాయి. కాబ‌ట్టి అనేక ర‌కాల రుగ్మ‌త‌ల్ని తొల‌గించే శ‌క్తి క‌లిగి ఉంటుంది. తాజా లేత కొబ్బ‌రినీటిలో అనేక స్థూల‌, సూక్ష్మ పోష‌కాల దృష్ట్యా, హైపోలిపిడెమిక్‌, యాంటీ ఆక్సిడెంట్ ప్ర‌భావం క‌లిగి ఉంటుంది. లేత కొబ్బ‌రినీటిలో అత్య‌ధికంగా ల‌భించే పొటాషియం, త‌గిన స్థాయిలో సోడియం వున్న నీటిని, ఆల్క‌లైన్ స‌మ‌తౌల్యాన్ని క్ర‌మ‌బ‌ద్ధీక‌రించి ర‌క్త‌పోటు చికిత్స‌ల‌లో స‌హ‌క‌రిస్తుంది. 

ఈ నీటిలో కాల్షియం ఎముక‌ల్ని, ప‌ళ్ళ‌ను దృఢంగా ఉంచి, కండ‌రాల బ‌లోపేతానికి, హార్ట్‌బీట్‌కు స‌హ‌క‌రిస్తుంది. వివిధ కార‌ణాల‌తో స‌ర్జ‌రీలు చేయించుకుని స్వ‌స్థ‌త చేకూర్చ‌కుంటున్న రోగుల‌కు ఇది మంచి పానీయం. చాలా ర‌కాల స్పోర్ట్స్‌, ఎన‌ర్జీ డ్రింకులలో కంటే కొబ్బ‌రి నీటిలో ఎక్కువ పొటాషియం, క్లోరైడ్ ఉంటాయి. 

కొబ్బ‌రి నీటి (Benefits of coconut water) లో ఈ రెండు పానీయాల కంటే త‌క్కువ సోడియం ఉంటుంది. కొబ్బ‌రి నీళ్ళ‌లో 15 నుండి 25 మిల్లీగ్రాముల సోడియం ఉంటే, స్పోర్ట్స్ డ్రింక్స్‌లో 41 మిల్లీగ్రాములు, ఎన‌ర్జీ డ్రింక్స్‌లో 200 మిల్లీ గ్రాముల‌కు మించి ఉంటుంది. లేత కొబ్బ‌రినీటిలో ప్రొటీన్ల శాతం బాగా ఉంటుంది. లేత కొబ్బ‌రినీటిలో ఉండే ముఖ్య‌మైన ఎమినోయాసిడ్లు ఆర్గినైన్‌, అల‌నైన్‌, సిస్టైన్‌, సెరైన్లు ఉంటాయి.

Stomach Ulcer: క‌డుపులో పుండులా కాల్చేదే అల్స‌ర్‌!


 Stomach Ulcer: ఆధునిక మాన‌వ‌జీవితం ప్ర‌కృతి ప‌రిణామానికి విరుద్ధంగా మారి తెలియ‌ని ఎన్నో బాధ‌ల‌కి నెల‌వుగా మారుతోంది. అలాంటి బాధ‌ల్లో ఒక‌టి మ‌నం అనుభ‌విస్తూ కూడా అశ్ర‌ద్ధ చేసే క‌డుపునొప్పి. ఒక ప‌రిశోధ‌న ఒక సూత్రాన్ని క‌ల్గించే అద్భుతాన్ని సృష్టిస్తే ఆ అనుభ‌వం మ‌రో సుఖం కోసం ప‌రుగెత్తిస్తుంది.

Stomach Ulcer

 
ఈ సుఖానుభ‌వం కోసం మ‌నం స‌హ‌జ జీవ‌నానికి దూర‌మై అస‌హ‌జ‌మైన భౌతిక వ్య‌వ‌స్థ‌లో ఉండిపోయి ఆక‌లి త‌గ్గిపోవ‌డం, గుండె కింద మంట‌, క‌డుపుబ్బ‌రం, క‌డుపులో నొప్పి, వాంతి వ‌చ్చిన‌ట్టు వికారంగా ఉండ‌టం వంటివి రావ‌డానికి ఆస్కార‌మ‌ వుతున్నాం. మ‌న‌లో ప్ర‌తిక్ష‌ణం పుట్టే కోరిక‌లు, క్ష‌ణ‌కాల సుఖంకోసం ప‌డే ఆరాటం, దాంతో ప‌రుగెడుతూ తినే ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాలు మ‌న జీర్ణాశ‌యాన్ని పాడు చేసి ర‌క‌ర‌కాల వ్యాధుల‌ని క‌లుగ‌జేస్తున్నాయి.

Stomach Ulcer: అల్స‌ర్ అంటే ఏమిటి? 

పూర్వం కూడా ఆమ్ల‌, పిత్త‌మ‌ని, క‌డుపుబ్బ‌ర‌మ‌ని ఆమాశ‌య‌శూల‌, ప‌రిణామ‌శూల అని వున్నా చాలా త‌క్కువ మందిలో వ‌చ్చేవి. ఆప‌రేష‌న్ దాకా వెళ్లే ప‌రిస్థితులు ఉండేవికాదేమో. ఆక‌లి వేయ‌డం, అన్నం తిన్న త‌ర్వాత బ‌రువుగా ఉండి అర‌గంట త‌ర్వాత నొప్పి ప్రారంభ‌మై అది ఎక్కువై మెలితిరిగిపోతూ, ఒక గంట త‌ర్వాత పెద్ద వాంతి అయి నొప్పి త‌గ్గ‌డం ఆగిపోతే అది క‌డుపులో అల్స‌ర్ అని గ్ర‌హించాలి.

ఈ అల్స‌ర్ అంటే ఆమాశ‌యంలో కాని ప్రేవుల‌లో కాని లోప‌లి గోడ‌లు చిట్లి చుట్టూ ఎర్ర‌బ‌డి వాచివుండ‌టం. ఈ అల్స‌ర్ ఇక్క‌డే కాదు శ‌రీరంలోని ఏ అవ‌య‌వంలోనైనా రావ‌చ్చు. జీర్ణాశ‌యంలో వ‌చ్చే ఈ వ్యాధిని పెప్టిక్ అల్స‌ర్ (Peptic Ulcer) అని అంటారు.

మ‌న జీర్ణాశ‌యాన్ని Alimentary Tract అంటారు. ఇది ఒక పొడువైన మాంసంతో త‌యారైన గొట్టంలాంటిది. ఈ గొట్టం కొన్ని చోట్ల గుండ్రంగా, మ‌రికొన్నిచోట్ల ఒంపులు తిరిగివుంటుంది. నోటికింద గొంతుక నుంచి ఆరంభ‌మై పెద్ద సంచీగా మారి త‌ర్వాత ఒంపులు తిరిగి డియోడిన‌మ్‌గా మారి అక్క‌డ చిన్న ప్రేవులు Small Intestine గాను, పెద్ద ప్రేవులు Large Intestine గానూ మారుతుంది. వీటికి ముఖ‌ద్వార‌మైన డియోడిన‌మ్ ప‌న్నెండు వేళ్ల పొడుగు ఉంటుంది. 

లాటిన్ భాష‌లో ప‌న్నెండును Dwodeni అంటారు. అందుకే దీన్ని Duodenum అని పిలుస్తారు. 30 సెంమీ. పొడువు ఉండే ఆమాశ‌యం లో కాని, ఈ డియోడిన‌మ్‌లో గాని గోడ ప‌గిలి పుండు ఏర్ప‌డితే దాన్ని Peptic Ulcer అని అంటారు. ఆరంభంలో ఆమాశ‌యంలో ఏర్ప‌డిన ఉద్రిక్త‌త వ‌ల్ల‌, వాపు వ‌ల్ల‌, లోప‌లి గోడ‌లు పాడై త‌ర్వాత ప‌గిలిన‌ట్ల‌యి అది మ‌ళ్లీ వాచి పూర్తిగా జీర్ణం కాని ఆహారం దానికి త‌గిలి అది పుండుగా త‌యార‌వుతుంది. పుండుపైన చ‌నిపోయిన క‌ణాలు ఉంటాయి. ఈ పుండు మ‌రీ పెద్ద‌దై ప‌క్క‌న పెరిగే డియోడిన‌మ్ దాకా విస్త‌రిస్తుంది. దీన్ని Perforation స్థితి అంటారు.

అల్స‌ర్ ల‌క్ష‌ణాలు గుర్తించ‌డం ఎలా?

సాధార‌ణంగా అల్స‌ర్స్ ఆమాశ‌య‌పు  కిందభాగంలో ఏర్ప‌డ‌తాయి. మ‌న జీర్ణాశ‌యంతో తీసుకున్న ఆహారం జీర్ణం కావ‌డానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్‌, పెప్సిన్ అనే రెండు ప‌దార్థాలు ఆమాశ‌యం నుంచి స్ర‌విస్తాయి. ఇవి జీర్ణ‌ప్ర‌క్రియ‌ని కొన‌సాగిస్తాయి. ఇవి చాలా బ‌ల‌మైన‌వి, తీక్ష‌ణ‌మైన‌వి. ఒక చిన్న ఇనుప‌ర‌జ‌ను ఈ యాసిడ్‌లో క‌లిస్తే ఒక రాత్రిలో క‌రిగిపోతుంది. ప్ర‌పంచంలోని వివిధ దేశాల‌లో ఉండే వింత ఆహార‌పు అల‌వాట్లు, వాళ్ల వాళ్ల జీర్ణ‌ప్ర‌క్రియ‌ను స‌హ‌జంగా కొన‌సాగించాయి. వాటిలో తీవ్ర‌మైన మార్పులు వ్యాధుల‌కి, అల్స‌ర్స్‌కి కార‌ణ‌మ‌వుతాయి. 

ఉడికీ ఉడ‌క‌ని ఆహార ప‌దార్థాలు, నిలువ వున్న ఆహార ప‌దార్థాలు, తీక్ష‌ణ‌మైన ఆహార ప‌దార్థాలు, క‌ఠిన‌మైన జంతు మాంసాలు, మ‌ద్యం, హ‌డావిడిగా తిన‌డం, తిన‌గానే ప‌రుగెత్త‌డం, కొన్ని కుటుంబాల్లోని వార‌స‌త్వ ల‌క్ష‌ణాలు ఈ అల్స‌ర్‌కి కార‌ణాలుగా వైద్యులు గుర్తించారు. 

ఈ అల్స‌ర్‌లో వ‌చ్చే నొప్పి విచిత్రంగా ఉంటుంది. ఆమాశ‌యంలో పుండు ఏర్ప‌డితే అన్నం తిన్న వెంట‌నే నొప్పి వ‌స్తుంది. అదే డియోడిన‌ల్ అల్స‌ర్‌ (Stomach Ulcer)లో అయితే రెండు మూడు గంట‌ల త‌ర్వాత నొప్పి ఆరంభ‌మ‌వుతుంది. ఒక్కొక్క‌ప్పుడు ఖాళీ క‌డుపుతో ఉన్న‌ప్పుడు నొప్పి వ‌చ్చి, తిన్న త‌ర్వాత త‌గ్గిన‌ట్లుంటుంది. 

మ‌రొక‌ప్పుడు అన్నం తింటే నొప్పి పెరుగుతుంది. ఈ నొప్పి సాధార‌ణంగా పొట్ట పై భాగంలో ఛాతికింద మ‌ధ్య భాగంలో ఉంటుంది. ఇది ఒక్కొక్క‌ప్పుడు ప‌క్క‌కి పాకిన‌ట్లు ఉంటుంది. అప్పుడు ఛాతిలో నొప్పిగా అనిపించ‌వ‌చ్చు. వికారంగా ఉండ‌టం, వాంతులు అవ‌డం, క‌డుపు (Stomach )లో మంట‌, గుండెల్లో మంట‌గా అనిపించ‌డం, బ‌ల‌హీన‌త‌, నోరు చేదుగా ఉండ‌టం, ర‌క్త‌క్షీణ‌త‌, అజీర్ణం కూడా ఉంటాయి.

Ayurvedic foods: ఆయుర్వేద ఆహారం ప‌వ‌ర్ అంటే ఇదే మ‌రీ!


Ayurvedic foods:  మ‌నం నిద్ర లేచిన‌ప్ప‌టి నుండి అర్ధ‌రాత్రి దాకా ప‌రుగెత్తే యాంత్రిక జీవ‌నంలో చుట్టూ పొగ‌, ధూళి ర‌సాయ‌నాల‌తో క‌లుషిత‌మైన వాతావ‌ర‌ణంలో స‌గ‌టు మ‌నిషి నుండి మేధావిదాకా మంచి ఆహారాన్ని గుర్తించ‌డం క‌ష్ట‌మ‌వుతుంది. 

Ayurvedic foods

రోడ్డు మీద ఫాస్ట్ ఫుడ్ వంటి వాటి వ‌ల్ల పొట్ట పెర‌గ‌డం, మ‌లి వ‌య‌స్సులోనే షుగ‌రు వ్యాధి వంటివి రావ‌డం మిన‌హా మంచి జ‌ర‌గ‌డం లేదు. ఒక ప్రాంతాన్ని ఒక కాలాన్ని బ‌ట్టికాక విశ్వ‌స‌నీయ‌త‌తో ప్ర‌కృతిని పురుష‌త‌త్వాన్ని ఆక‌ళింపు చేసుకుని ప్ర‌కృతికి స‌మీపంగా ఆహార నిర్మాణం, నియ‌మావ‌ళి పాటించేదే ఆయుర్వేద శాస్త్రం. 

Ayurvedic foods: ఆయుర్వేద ఆహారం ప‌వ‌ర్ అంటే ఇదే మ‌రీ!

అమ్మ చేసిన సున్నివుండ‌లో వీర్య‌బ‌లం ఉంది. నువ్వుల వుండ‌లో స్త్రీ హార్మోన్ల‌ను క్ర‌మ‌ప‌రిచే శ‌క్తి ఉంది. పాయ‌సంలో తృప్తినిచ్చే గుణం ఉంది. పాలు, నెయ్యి, తేనె మ‌ధుర ప‌దార్థాలే కాదు, నిత్య జీవ‌ర‌సాయ‌నాలు అంటే స‌ప్త‌ధాతువుల‌కు శ‌క్తిని ఇచ్చేవి.

అన్నం బ్ర‌హ్మ స్వ‌రూపం, ర‌సం విష్ణు స్వ‌రూపం. భోజ‌నం చేసే త‌ను మ‌హేశ్వ‌ర రూప‌మ‌ని భావించి అన్నం ప్రాణ‌మ‌య‌మ‌ని మంచి మ‌న‌స్సుతో, ఆనందంలో స‌మ‌యాన్ని అనుస‌రించి తీసుకోవాలి. ఉద‌యం 9-12 గం. మ‌ధ్య , సాయంత్రం 7-10 గంట‌లు మ‌ధ్య ఆహారాన్ని తీసుకోవ‌డం మంచిది. ఆయుర్వేదం (Ayurvedic) ప‌థ్యాన్ని ప్ర‌తిపాదిస్తుంది. ప‌థ్యం మ‌నిషికి కాదు అత‌ని త‌త్వానికి, అత‌నికున్న రోగానికి. ఆహార ప‌దార్థాల‌లో ఉండే ర‌స‌శ‌క్తిని బ‌ట్టి ప‌థ్యం ఉంటుంది. 

ఉదాహ‌ర‌ణ‌కి అర‌టిపండు, దోస‌కాయ త‌ప్ప దానిమ్మ‌, చెర‌కు వంటివి ఆహారం ముందు తినాలి. నేరేడు, కొబ్బ‌రి, మామిడిపండు, ప‌న‌స‌, అర‌టిపండు వంటివి ఉద‌య‌మే తీసుకోకూడ‌దు. తీపి పిండి వంట‌లు అటుకుల‌తో చేసిన‌వి భోజ‌నాంత‌ర‌మే తినాలి. ఇదీ ప‌థ్య‌మంటే. 

ఆహారం యొక్క రుచుల అర్థం ఏమిటి?

ఆహారం కూడా మందు లాంటిదే. దానికి ర‌సం అంటే రుచి, వీర్యం అంటే బ‌లం వంటివి ఉంటాయి. ఈ రుచులు ఆరు. తీపి, కారం చేదు, ఉప్పు, వగ‌రు, పులుపు. మ‌న ఆహారంలో ఈ ఆరు రుచులు ఉండాలి. తీపి ప‌దార్థాలు మ‌న‌లో ఓజోశ‌క్తిని పెంచుతాయి. కారం, పులుపు జీర్ణ‌శ‌క్తిని, చేదు జ్ఞాప‌క‌శ‌క్తిని, ర‌క్త‌శోధ‌న‌ని క‌లుగ‌జేస్తుంది. వ‌గ‌రు క‌ఠిన ప‌దార్థాల‌ను ముక్క‌లు చేస్తుంది. ఉప్పు ఆహారానికి రుచిని ఇస్తుంది. 

గ‌ట్టిగా ఉండే రొట్టెలు, చ‌పాతీలు వంటివి అన్ని కూర‌ల‌తో ముందుగా తినాలి. అన్నం (FOOD) త‌ర్వాత తినాలి. ప‌ల్చ‌ని మ‌ధుర ప‌దార్థాలు అన్నం ముందు తినాలి. కారం, పులుపు ప‌దార్థాలు మ‌ధ్య‌లో తినాలి. వ‌గ‌రు చేదు ప‌దార్థాలు చివ‌ర‌న తిని మ‌జ్జిగ‌, ప‌ళ్ళ ర‌సాలు ఆఖ‌రున తినాలి. అన్ని కూర‌లు వేసిన పులుసుని అమెరికాలో రిచ్ వెజిట‌బుల్ సూప్ అని అంటారు. దీన్ని వారానికి ఒక్క‌సారైనా తీసుకోవ‌డం మంచిది. 

మిరియాలు, ధ‌నియాలు వేసిన చారు ప్ర‌తిరోజూ తీసుకోవ‌డం హిత‌క‌రం. అన్ని ఆహార ప‌దార్థాలు క‌లిపి తీసుకోకూడ‌దు. అది హానిచేస్తుంది. ఇటువంటి ఆహారాన్ని విరుద్ధాహార‌మంటారు. ఉదాహ‌ర‌ణకి పెరుగు, నెయ్యి క‌లిపి తీసుకోకూడ‌దు. అర‌టి పండు, పాలు ఒకేసారి తీసుకోకూడ‌దు. వేడి కాఫీ, టీల‌లో తేనె క‌లుపుకోకూడ‌దు. వెన్న‌తో చేప‌ని వండుకోకూడ‌దు. 

ఋతువుల‌ను అనుస‌రించి పండే ప‌ళ్ల‌ను తీసుకోవ‌డం మంచిది. అలా కాకుండా తీసుకుంటే ఆమం త‌యారువుతుంది. ఆమం అంటే జీర్ణం కాక నిలువ ఉండిపోయిన విష‌ప‌దార్థ‌మ‌న్న‌మాట‌. అదే మోకాళ్ల‌నొప్పుల వంటి వ్యాధుల‌కి కార‌ణం అవుతుంది. ఉదాహార‌ణ‌కి వేస‌వికాలంలో జీర్ణ‌శ‌క్తి మ‌న‌లో త‌క్కువ‌గా ఉంటుంది. అందువ‌ల్ల తేలిక‌పాటి ఆహారం రెండు మూడుసార్లు తీసుకోవ‌డం మంచిది. 

రాత్రి పెరుగు వేసుకోకూడ‌దు. ఎందుకంటే అది పూర్తిగా జీర్ణంకాక శ్రోత‌స్సుల‌ని మూసేస్తుంది. వ‌య‌స్సుని బ‌ట్టి కూడా ఆహారం ఇవ్వాలి. పిల్ల‌లు ఎదిగే వ‌య‌స్సు క‌నుక శ‌రీరం, మ‌న‌స్సు ఎదిగే ఆహారాన్ని ఇవ్వాలి. యవ్వ‌నంలో ఉండేవాళ్ల‌కి మెటాబాలిజ‌మ్ & కెటాబాలిజ‌మ్ స‌మానంగా ఉంటాయి. క‌నుక శ‌క్తినిచ్చే ప్రొటీన్లు, విట‌మిన్లు ఉన్న ఆహారం ఇవ్వాలి. 

సాత్వికాహారం అంటే పూర్తి శాఖాహారం, రాజాసాహారం అంటే మాంసాహారం, ఎక్కువ కారం, మ‌సాలా వున్న‌ది, తామ‌సాహారంఅంటే నిలువ వున్న‌వి, చ‌ల్లారిన‌వి. వీటిని బ‌ట్టి కూడా మ‌న ప్ర‌వ‌ర్త‌న మారుతూ ఉంటుంది. అన్నింటికీ మించి ఎప్పుడూ ముందు తీసుకున్న ఆహారం జీర్ణం కాకుండా మ‌ళ్లీ ఆహారం తీసుకోకూడ‌దు. 

అన్నం మొద‌టి ముద్ద‌లో పాత ఉసిరిప‌చ్చ‌డి తిన‌డం హిత‌కరం. ధ‌నియాల పొడితో మ‌లి ముద్ద తిన‌డం మ‌రీ మంచిది. పిల్ల‌ల‌కి రాత్రి ప‌రుండే ముందు ప‌టిక‌బెల్లం పొడి క‌లిపిన పాలు ఇవ్వ‌డం అమృతం ఇవ్వ‌డం లాంటిది. మీరు నిద్రించే స‌మ‌యానికి మీరు తీసుకున్న ఆహారం (Ayurvedic foods) అన్నం కొంచెం జీర్ణ‌మ‌వ‌డం చాలా మంచిది. అన్నం తిన్న‌వెంట‌నే సంసార‌సుఖం పొంద‌కండి. తిన్న వెంట‌నే క‌నీసం ప‌ది అడుగులు న‌డ‌వండి. 

Ayurveda in Telugu: ఆధునిక చికిత్స‌లో ఆయుర్వేదం


Ayurveda in Teluguఆయుర్వేదం ప్ర‌పంచ తొలి సంపూర్ణ జ్ఞాన మిళిత సంహిత‌మైన వేదంలో ఒక ఉప‌వేదం. వేదం ఒక వ్య‌క్తి రాసింది కాదు అది అపౌరుషేయం. త‌ను సృష్టించిన జ‌న‌హితం కోసం సాక్షాత్తూ విధాత చెప్పిన స‌మ‌గ్ర వైద్య‌శాస్త్రం ఇది.


సంస్కృత‌సంహిత‌, చ‌ర‌క‌సంహిత వంటివి. వాటికి త‌మ అనుభ‌వాలు, ప‌రిశోధ‌న‌లు జోడించి మ‌రింత విస్త‌రింప చేసి గ్రంథాలుగా నిలిపారు వ్యాఖ్యాన‌క‌ర్త‌లు. నాటి భాష‌లైన పాళీ, సంస్కృత భాష‌ల‌లో రాయ‌బ‌డ్డ‌వి అవి. నేడు ఆధునిక వైద్యం లాటిన్ భాష‌లో ఉన్న‌ట్లు అలా పెరిగిన ఆయుర్వేద‌శాస్త్రం పురోగ‌తి ప‌ర‌ణ‌తి అక్క‌డితో ఆగిపోలేదు. 

Ayurveda in Telugu: ఆయుర్వేదం స‌హ‌జ‌మైన వైద్య‌విధానం

అష్టఅంగాలుగా అంటే ఎనిమిది విభాగాలుగా ఆదిలోనే వివ‌రించ‌బ‌డ్డ ఆయుర్వేదం వైద్య‌ప‌రంగా, శ‌ల్య‌ప‌రంగా అంటే ఆప‌రేష‌న్ లేదా స‌ర్జ‌రీ విభాగాలుగా మ‌రింత ప‌రిశోధ‌ న‌ల‌లో ముందుకెళ్లింది. ఆధునిక కాలంలో గుజ‌రాత్‌లో జామ్‌న‌గ‌ర్‌, ఉత్త‌ర భార‌తంలో, బెనార‌స్ ద‌క్షిణ భార‌తంలో కేర‌ళ ప్రాంతాల‌లో విస్తార‌మైన ప‌రిశోధ‌న‌లు, వైద్య ఒర‌వ‌డితో మంచి ఫ‌లితాల‌ను సాధించారు. దేశంలో అనేక ఆయుర్వేద క‌ళాశాల‌లు, పోస్టుగ్రాడ్యుయేట్ క‌ళాశాల‌లు, వైద్య క‌ళాశాల‌లు విస్తారంగా పెర‌గ‌డ‌మే కాకుండా వివిధ దేశాల‌లో ఆయుర్వేద వైద్యం ప‌రిశోధ‌న‌లు ఆరంభించ‌బ‌డి ఎన్నెన్నో ఫ‌లితాల‌ను సాధిస్తున్నారు.

అమెరికా, జ‌ర్మ‌నీ, యూర‌ప్‌దేశాల్లో ముఖ్యంగా హాలెండ్ వంటి దేశాల‌లో ర‌ష్యాలో ఆయుర్వేద చికిత్సాశాల‌లు చ‌క్క‌టి ప్రాబ‌ల్యాన్ని పాటించ‌డ‌మే కాకుండా స‌హ‌జ‌మైన వైద్య విధానంగా గుర్తించ‌బ‌డింది. రెడ్డీస్ లాబ‌రేట‌రీ హిమాల‌యా వంటి ప్ర‌సిద్ధ ఔష‌ధ నిర్మాణ సంస్థ‌లు మంచి ప‌రిశోధ‌న‌ల‌తో ముందుకు న‌డుస్తున్నాయి. ఇప్పుడు స‌హ‌జ జీవ‌న విధానం ప్ర‌కృతికి ద‌గ్గ‌రగా ఉండే ఔష‌ధ వినియోగంపై ఆసక్తి పెరిగింది.

ఒక వైద్య విధానం అన్ని అవ‌స్థ‌ల‌కీ సంపూర్ణ వైద్యం అందించ‌లేద‌న్న‌ది జీవ‌న స‌త్యం. ఎక్క‌డో దారి మూసుకుపోయిన గుండెకు ఆధునిక వైద్యం అందిస్తున్న సాంకేతిక వైద్య విధానం అత్యవ‌స‌రం. కానీ ఎప్పుడూ వ‌చ్చే జ‌లుబుకు సంపూర్ణ చికిత్స అక్క‌డ దొర‌క్క‌ పోవ‌చ్చు. ప‌క్ష‌వాతానికి, లివ‌ర్ జ‌బ్బుల‌కి ఆయుర్వేదం (Ayurveda in Telugu) చ‌క్క‌టి సంపూర్ణ చికిత్స అందివ్వ‌క‌లుగుతుంది. శుక్ర‌బీజం త‌క్కువ‌గా ఉండి సంతానం లేని వారిని కోడీక‌ర‌ణ చికిత్స అద్భుత ఫ‌లితాల‌నిస్తుంది. 

అకాల వృద్ధాప్యం వ‌స్తున్న వారికి ర‌సాయ‌న చికిత్స‌హిత‌క‌రం. ఎక్క‌డో మారుమూల క‌ణాల మ‌ధ్య వుండిపోయిన టాక్స‌న్స్‌ను బ‌య‌టికి తెచ్చిన‌వోన్మేషాన్నిచ్చే పంచ‌క‌ర్మ చికిత్స ప్ర‌పంచ‌మంతా ఆద‌రించ‌బ‌డుతుంది. ముఖ్యంగా మ‌న‌కి అందుబాటులో మ‌న చుట్టూ ఉన్న ప‌సుపు, మారేడు, తుల‌సి వంటి మూలిక‌ల‌పై ఆధునిక శాస్త్ర‌రీత్యా HPTLC వంటి ప్ర‌క్రియ‌లో LCMS వంటి ప్ర‌త్యేకత‌ని వాటిని వాడ‌టం వ‌ల్ల చెడు ఫ‌లితాలున్నదీ లేనిదీ ప‌రిశోధించి తేల్చారు.

ఉదాహ‌ర‌ణ‌కి ఉసిరికాయ‌, క‌ర‌క్కాయ‌, తానికాయ‌ల‌ను క‌లిపి నూరితే త్రిఫ‌ల అంటారు. ఇది ప్రేవుల‌లో చ‌క్క‌టి క‌ద‌లిక‌ల‌ను క‌ల‌గ‌జేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్‌గా ప‌నిచేస్తుంది. ఇది అల‌వాటు కానీయ‌ద‌ని సూచించ‌బ‌డింది. త్రిక‌టు, మారేడు, శొంఠి, యష్టిమ‌ధు జీర్ణ‌కోశంపై ప‌నిచేసే చ‌క్క‌టి స‌హ‌జ మూలిక‌ల‌ని నిర్థారించ‌బ‌డింది. 

అలాగే వేప ప్రో- ఇన్‌ఫ్ల‌మేట‌రీ సైటోకైన్స్ అనేదాన్ని త‌గ్గించే గుణం వుంద‌ని ROS ని త‌గ్గించే చ‌క్క‌టి యాంటీ ఇన్ఫ్ల‌మేట‌రీ ద్ర‌వ్య‌మ‌ని గుర్తించ‌బ‌డింది. ప‌సుపు, మంచిష్ట‌, శారిబ వంటివి చ‌క్క‌టి చ‌ర్మ‌వ్యాధిని త‌గ్గించే స‌హ‌జ మూలిక‌లు. 

dalchina chekka: దాల్చిన చెక్క నమిలితే ఎన్ని ప్రయోజనాలో మీకు తెలుసా?


dalchina chekka: ప్ర‌తి వంట ఇంట్లో దాల్చిన చెక్క (cinnamon) ఉంటుంది క‌దా. కానీ ఉప‌యోగించేది మాత్రం చాలా త‌క్కువ సంద‌ర్భాలేన‌ని అంటుంటారు. నిజానికి దాల్చిన చెక్క‌లో ఎన్నో ఔష‌ధ గుణాలున్నాయి తెలుసా!.మ‌న వంట్లో వున్న కొవ్వు క‌రిగిపోవ‌డంలో ఇది కీల‌కంగా ప‌నిచేస్తుంద‌ట‌.

dalchina chekka: దాల్చిన చెక్క ఉప‌యోగాలు

1.దాల్చిన చెక్క ర‌క్తంలో చ‌క్కెర శాతాన్ని నియంత్రిస్తుంద‌ని ప‌లు ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. డ‌యాబెటిస్‌, హైపో గ్లైసిమిక్‌తో బాధ‌ప‌డే వారు దాల్చినచెక్క తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ప్ర‌యోజ‌నం చేకూరుతుంది. టైప్ 2 డ‌యాబెటిస్‌తో బాధ‌ప‌డేవారు రోజూ 1 గ్రాము దాల్చిన చెక్క పొడిని తీసుకుంటే వ్యాధి పూర్తిగా నియంత్ర‌ణ‌లోకి వ‌స్తుంది.

2.చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గించ‌డంలోనూ దాల్చిన చెక్క ఉప‌యోగ‌ప‌డుతుంది. రోజూ 120 మిల్లీగ్రాముల దాల్చిన చెక్క‌ను తీసుకోవ‌డం వ‌ల్ల చెడు కొలెస్ట్రాల్ బాగా త‌గ్గిపోతుంది. ఫ‌లితంగా గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయి. ర‌క్త‌పోటును త‌గ్గించ‌డంలోనూ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అధ్య‌య‌నాల్లో తేలింది.

3.దాల్చిన చెక్క‌లో సిన్న‌మాల్డిహైడ్ అనే కెమిక‌ల్ ఉంటుంది. ఇది పిరియాడ్స్ స‌మ‌యంలో వ‌చ్చే నొప్పిని త‌గ్గిస్తుంది. స్త్రీల‌లో ప్రొజెస్టిరాన్ హార్మోన్ ఉత్ప‌త్తిని పెంచుతుంది. టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్ప‌త్తిని త‌గ్గిస్తుంది. హార్మోన్ల స‌మ‌తుల్య‌త‌కు దోహ‌ద‌ప‌డుతుంది.

4.అల్టీమ‌ర్స్‌, పార్కిన్‌స‌న్స్‌, మ‌ల్టిఫుల్ స్క్లెరొసిస్‌, బ్రెయిన్ ట్యూమ‌ర్‌, మెనింజైటిస్ వంటి వ్యాధుల నివార‌ణ‌లో దాల్చిన చెక్క చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతోంద‌ని అధ్య‌యానంలో వెల్ల‌డైంది.

5.ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. పాలీఫెనాల్స్ అనే యాంటీఆక్సిడెంట్లు వ్యాధుల బారిన‌ప‌డ‌కుండా కాపాడ‌తాయి.

6.కేన్స‌ర్ ద‌రిచేర‌కుండా చూడ‌టంలోనూ కీల‌క‌పాత్ర పోషిస్తుంది. కేన్స‌ర్ క‌ణాల పెరుగుద‌ల‌ను అడ్డుకోవ‌డంలో ఇది స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తోంద‌ని ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది.

7.బ్యాక్టీరియా, ఫంగ‌ల్ ఇన్‌ఫెక్ష‌న్ల‌పై పోరాటానికి ప‌నిచేస్తుంది. ఫంగ‌స్ కార‌ణంగా వ‌చ్చే శ్వాస‌కోస ఇన్‌ఫెక్ష‌న్ల‌ను దూరం చేయ‌డంలో దాల్చిన చెక్క నూనె స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తంద‌ని వెల్ల‌డైంది. నోటి దుర్గందాన్ని దూరం చేస్తుంది. దంత‌క్ష‌యాన్ని నివారిస్తుంది.

8.HIVతో బాధ‌ప‌డే వారు రోజూ dalchina chekka తీసుకోవ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి బ‌ల‌ప‌డుతుంది.

దాల్చిన చెక్క ప్రయోజనాలు

  • రువు గ్గుతారు.
  • కీళ్ల నొప్పులు గ్గుతాయి.
  • ధుమేహం గ్గుతుంది.
  • మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
  • లుబు గ్గులను గ్గిస్తుంది.
  • రోగ నిరోధ క్తి పెరుగుతుంది.
  • క్తప్ర మెరుగుపరుస్తుంది.
  • కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుతుంది.
  • గుండె బ్బుల నుండి కాపాడుతుంది.
  • క్తపోటు అదుపులో ఉంటుంది.
  • నోటి దుర్వాసను దూరం చేస్తుంది.
  • దంత స్యలను దూరం చేస్తుంది.
  • గ్యాస్ట్రబుల్ గ్గిస్తుంది.
  • అజీర్ణం గ్గి ఆరోగ్యం బాగుంటుంది.
  • విరేచనాలను అరికడుతుంది.
  • కండరాల నొప్పులు, ఎలర్జీలు గ్గుతాయి.
  • క్యాన్సర్ను నిరోధిస్తుంది.
  • మొటిమను గ్గిస్తుంది.
  • ర్మంపై చ్చే ఇన్ఫెక్షన్లను గ్గిస్తుంది.
  • జుట్టు బాగా పెరుగుతుంది. రాలిపోవడం గ్గుతుంది.

ఇన్ని కాల ఉపయోగాలు వున్న దాల్చిన చెక్క (dalchina chekka ) ఇంట్లో ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నీసం రోజూ తినపోయినా అప్పుడప్పుడు తినడం మంచిది. కూరల్లో రుచూ వేసుకోవడం అందరికీ మంచిది.

what is TB: టీబీ వ్యాధి ఎలా వస్తుంది?


what is TBప్ర‌తి ఒక్క‌రిలోకి టిబి (క్ష‌య‌వాధి) బ్యాక్టీరియా తేలిక‌గా ప్ర‌వేశిస్తుంద‌ని అంద‌రికీ తెలిసిందే. ఇది శ‌రీరంలోకి వెళ్లిన త‌ర్వాత వ్యాధి సోక‌డం, సోక‌క‌పోవ‌డం అనేది ఆయా వ్య‌క్తుల వ్యాధి నిరోధ‌క శ‌క్తిపై ఆధార‌ప‌డి ఉంటుంది.

what is TB

what is TB: టీబీ వ్యాధి ఎలా వ‌స్తుంది?

వ్యాధి నిరోధ‌క శ‌క్తి త‌గిన‌ప్పుడు టిబి(క్ష‌య‌వ్యాధి) బ‌య‌ట ప‌డుతుంది. దీని వ్యాప్తికి ట్యూబ‌ర్క్‌లోసిస్ (tuberculosisబ్యాసిల్ల‌స్ అనే బ్యాక్టీరియా కార‌ణం. ఈ వ్యాధి రెండు ర‌కాలుగా ఉంటుంది. ప‌ల్మొన‌రి టిబి, ఎక్స్‌ట్రా ప‌ల్మోన‌రి టివి. ప‌ల్మొన‌రి టిబిలో వ్యాధిని వ్యాప్తి చెందిస్తుంది.

ఊప‌రితిత్తుల్లో నివాసం చేసుకుని వ్యాధిని వ్యాప్తి చెందిస్తుంది. ఊపిరితిత్తుల్లో గాకుండా వ్యాధి ఇత‌ర భాగాల‌లో క‌నిపిస్తే, దానిని ఎక్స్‌ట్రా ప‌ల్మోన‌రి TB అంటారు. ఊపిరితిత్తుల బ‌య‌టి పొర‌ల్లో నీరు చేర‌డం, సంతానంలేని మ‌హిళ‌ల్లో గ‌ర్భాశ‌యంలో కూడా టిబి అంటారు. ఊప‌రితిత్తుల బ‌య‌టి పొర‌ల్లో నీరు చేర‌డం, సంతానం లేని మ‌హిళ‌ల్లో గ‌ర్భాశ‌యంలో కూడా టిబి రావ‌డం గ‌మ‌నించ‌వ‌చ్చు. వీటితో పాటు వెన్నుముక‌, ఎముక‌, మెద‌డు భాఘాల‌కు కూడా క్ష‌య వ్యాధి రావ‌చ్చు.

గ‌తంలో ఎక్కువ‌గా ప‌ల్మొన‌రి టిబి కేసులే ఎక్కువ‌గా క‌నిపించేవి. ఎక్స్‌ట్రా ప‌ల్మొన‌రి కేసులు చాలా త‌క్కువ‌గా ఉండేవి. అయితే ఇప్పుడు వైద్య రంగంలో వ‌చ్చిన ఆధునిక వైద్య ప‌రీక్ష‌ల‌తో దాదాపు 30 శాతం మందిలో ఈ కేసులు న‌మోద‌వుతున్న‌ట్టు తెలుస్తోంది.

టిబి వ్యాధి ఎలా వ్యాపిస్తుంది?

ఊపిరితిత్తుల‌కు వ‌చ్చే ప‌ల్మొన‌రి టిబి మాత్ర‌మే ఒక‌రి నుంచి మ‌రొక‌రికి వ్యాపిస్తుంది. తుమ్ము, ద‌గ్గు వంటి కార‌ణాల‌తో ఈ సూక్ష్మ‌జీవి గాల్లోకి చేరి, ఒక‌రి నుంచి మ‌రొక‌రికి వ్యాపిస్తుంది. ఎక్స్‌ట్రా ప‌ల్మోన‌రి ఒక‌రి నుంచి మ‌రొక‌రికి వ్యాపించ‌దు. వ్యాధి నిరోధ‌క శ‌క్తి త‌గ్గ‌డం వ‌ల్ల సూక్ష్మ‌జీవి బ‌ల‌ప‌డి, వ్యాధి బ‌య‌ట‌ప‌డుతుంది.

HIV, డ‌యాబెటిస్‌, క్యాన్స‌ర్ వ్యాధి గ్ర‌స్తుల్లో వ్యాధి నిరోధ‌క శ‌క్తి త‌గ్గ‌డం వ‌ల్ల ఇది బ‌య‌ట ప‌డుతుంది. దీంతో పాటు మారుతున్న జీవ‌న‌శైలి, ఒత్తిడి, నిద్ర‌లేమి, ప‌నిభారం, కొవ్వు ఉన్న ఆహారం అధికంగా తీసుకోవ‌డం వంటి కార‌ణాల‌తో వ్యాధి గ్ర‌స్తుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది.

టిబి వ్యాధి ల‌క్ష‌ణాలు

టిబి బ్యాక్టీరియా శ‌రీరంలో ఉన్న స్థానాన్ని బ‌ట్టి వ్యాధి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. అది ఊపిరితిత్తుల్లో ఉంటే ఎడ‌తెరిపిలేకుండా ద‌గ్గు రావ‌డం, ద‌గ్గిన‌ప్పుడు తెమ‌డ‌, ర‌క్తం ప‌డ‌టం, ఆక‌లి త‌గ్గ‌డం, బ‌రువు త‌గ్గ‌డం, నీర‌సించిపోవ‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. ఎక్స్‌ట్రా ప‌ల్మోన‌రిలో కొన్ని ఇత‌ర ల‌క్ష‌ణాల‌తో పాటు బ‌రువు త‌గ్గుతుండ‌టం, జ్వ‌రం, నీర‌సం వంటి ల‌క్ష‌ణాలు ఉంటాయి.

టిబి నిర్థార రీక్షలు

సాధారణంగా ఎక్స్రే, తెమ రీక్ష ద్వారా 60 నుంచి 70 శాతం వ్యాధి నిర్థార చేయచ్చు. వీటితో నిర్థార కాకపోతే రికొన్ని రీక్షతో పాటు సిటిస్కాన్‌, బోన్ స్కాన్ యాప్సి వంటి రీక్ష ద్వారా నిర్థారించచ్చు. ఇప్పుడు టిబి గ్గించడానికి పూర్తి స్థాయిలో మందులు అందుబాటులో ఉన్నాయి. ప్రైమరీ డ్రగ్స్‌, సెకండ్ లైన్ డ్రగ్స్ వాడటం ల్ల పూర్తిగా యం చేయచ్చు.

గుర్తుంచుకోవాల్సింది

చిన్నప్పుడు ఇచ్చే బిసిజి వ్యాక్సిన్ దీని తీవ్ర పెరకుండా చూస్తుంది. టిబిని మొదటి లోనే గుర్తిస్తే మందులతో గ్గించడం తేలిక‌. వ్యాధి నిరోధ క్తి గ్గకుండా చూసుకోవడం, క్రద్ధమైన జీవశైలి, యానికి భోజనం చేయడం, ఒత్తిడి లేకుండా చూసుకోవడం వంటివి పాటిస్తే టిబిని నివారించచ్చు.

పొగతాగడం, పొగాకు ఉత్పత్తులు వాడటం, గుట్కా డం, ద్యం సేవించడం హానికరం. అలవాట్లు ఉన్న వారికి ఒక వేళ టిబి స్తే గ్గే అవకాశాలు (what is TBక్కువ‌, కాబట్టి వ్యసనాలకు దూరంగా ఉండాలి.