Benefits of coconut water: సుగుణాలు క‌లిగిన‌ నీళ్లు కొబ్బ‌రి నీరు


 Benefits of coconut  water: మ‌న సంస్కృతిలో, మ‌న ఆచారాల‌లో  కొబ్బ‌రి బొండాకి ఎన‌లేని ప్రాధాన్యం ఉంది. క‌ళ్యాణ వేదిక‌పైకి న‌డిచి వ‌చ్చే న‌వ‌వ‌ధువు చేతుల‌ను కొబ్బ‌రి బొండం లేకుండా ఊహించ‌లేం. ఎన్నో పూజ‌ల్లో, వ్ర‌తాల్లో ఇది ఉండి తీరాల్సిందే. గుండ్రంగా, మ‌చ్చ‌లు లేని నున్న‌ని లేలేత ప‌చ్చ‌ని బొండాన్ని ఎంచుకుని మ‌రీ ఆయా కార్య‌క్ర‌మాల్లో ఉప‌యోగిస్తాం. ఇక కొబ్బ‌రికాయ కొట్ట‌ని శుభ‌కార్యాలు, పూజ‌లు అస్స‌లు ఉండ‌వు.

Benefits-of-coconut-water


అందుకే ఎన్నో ఉప‌యోగాలున్న కొబ్బ‌రి చెట్టు క‌ల్ప వృక్ష‌మైంది. మ‌న దేశంలో కొబ్బ‌రి సాగుకు విశిష్ట‌స్థానం ఉంది. ల‌క్ష‌లాదిమందికి జీవ‌నాధారంగా ఉంది ఈ పంట‌. కొబ్బ‌రినీటి (coconut water
లో ఎన్నో విట‌మిన్లు, ఖ‌నిజాలుంటాయి. శ‌రీరానికి  అనేక ర‌కాల పోష‌కాల్ని అందించ‌డంలో అస‌మాన‌మైన స‌హ‌జ పానీయం కొబ్బ‌రినీరు. నూటికి నూరుపాళ్ళు స‌హ‌జ‌సిద్ధ‌మైన‌, క‌ల్తీకి ఆస్కారం లేని పానీయం.

Benefits of coconut  water: కొబ్బ‌రి నీరు ఉప‌యోగాలు

ప్ర‌పంచంలో మ‌రేదీ దీనికి సాటిరాదు. దీనికి ప్రాసెసింగ్ ప్ర‌క్రియ‌లో ప‌నిలేదు. మ‌న ర‌క్తంలో ఎల‌క్ట్రోలైట్ స‌మ‌తౌల్యం ఏ విధంగా ఉంటుందో కొబ్బ‌రి నీటిలోనూ అదే మాదిరి ఉంటుంది.  ఇందుకు కార‌ణం ఈ నీటిలోని లెక్క‌లేన‌న్ని ప్ర‌యోజ‌న‌ములే. దైనందిన అవ‌స‌రాల‌కు సులువుగా అమ‌రే స‌హ‌జ ఉత్ప‌త్తి. పోష‌కాహార లేమి నివార‌ణ‌లో ప్ర‌ధాన ఆధ‌రువు.

కొబ్బ‌రినీటిలో చ‌క్కెర ప్ర‌ధానం

లేత కొబ్బ‌రినీటిలో చ‌క్కెర‌లు ప్ర‌ధానంగా ఉంటాయి. కొబ్బ‌రిబొండాంలో చ‌క్కెర కాన్స‌న్‌ట్రేష‌న్ పెరుగుతూ ఉంటుంది. ఈ చ‌క్కెర స్థాయిలో మార్పులు మ‌న‌కు కాయ తీరును బ‌ట్టి అర్థ‌మ‌వుతుంది. కొబ్బ‌రి అస్స‌లు క‌ట్ట‌ని బొండం నీరు ఉప్ప‌గా ఉంటుంది. కొద్దిగా కొబ్బ‌రి క‌ట్ట‌డం ఆరంభించాక ఓ మాదిరి లేత కొబ్బ‌రిదాకా నీళ్లు తియ్య‌గా ఉంటాయి. కొబ్బ‌రి బాగా ముదిరిన త‌ర్వాత నీటిలో చ‌క్కెర శాతం ప‌డిపోతూ ఉంటుంది. కాబ‌ట్టి తిరిగి నీరు ఉప్ప‌ద‌నాన్ని సంత‌రించుకుంటుంది. 

కొబ్బ‌రి నీళ్ల‌లో ఖ‌నిజాలు మెండు

లేత కొబ్బ‌రి నీటిలో దాహాన్ని తీర్చే గుణం మాత్ర‌మే కాదు, ఎన్నో ఖ‌నిజాలు ల‌భిస్తాయి. కాబ‌ట్టి అనేక ర‌కాల రుగ్మ‌త‌ల్ని తొల‌గించే శ‌క్తి క‌లిగి ఉంటుంది. తాజా లేత కొబ్బ‌రినీటిలో అనేక స్థూల‌, సూక్ష్మ పోష‌కాల దృష్ట్యా, హైపోలిపిడెమిక్‌, యాంటీ ఆక్సిడెంట్ ప్ర‌భావం క‌లిగి ఉంటుంది. లేత కొబ్బ‌రినీటిలో అత్య‌ధికంగా ల‌భించే పొటాషియం, త‌గిన స్థాయిలో సోడియం వున్న నీటిని, ఆల్క‌లైన్ స‌మ‌తౌల్యాన్ని క్ర‌మ‌బ‌ద్ధీక‌రించి ర‌క్త‌పోటు చికిత్స‌ల‌లో స‌హ‌క‌రిస్తుంది. 

ఈ నీటిలో కాల్షియం ఎముక‌ల్ని, ప‌ళ్ళ‌ను దృఢంగా ఉంచి, కండ‌రాల బ‌లోపేతానికి, హార్ట్‌బీట్‌కు స‌హ‌క‌రిస్తుంది. వివిధ కార‌ణాల‌తో స‌ర్జ‌రీలు చేయించుకుని స్వ‌స్థ‌త చేకూర్చ‌కుంటున్న రోగుల‌కు ఇది మంచి పానీయం. చాలా ర‌కాల స్పోర్ట్స్‌, ఎన‌ర్జీ డ్రింకులలో కంటే కొబ్బ‌రి నీటిలో ఎక్కువ పొటాషియం, క్లోరైడ్ ఉంటాయి. 

కొబ్బ‌రి నీటి (Benefits of coconut water) లో ఈ రెండు పానీయాల కంటే త‌క్కువ సోడియం ఉంటుంది. కొబ్బ‌రి నీళ్ళ‌లో 15 నుండి 25 మిల్లీగ్రాముల సోడియం ఉంటే, స్పోర్ట్స్ డ్రింక్స్‌లో 41 మిల్లీగ్రాములు, ఎన‌ర్జీ డ్రింక్స్‌లో 200 మిల్లీ గ్రాముల‌కు మించి ఉంటుంది. లేత కొబ్బ‌రినీటిలో ప్రొటీన్ల శాతం బాగా ఉంటుంది. లేత కొబ్బ‌రినీటిలో ఉండే ముఖ్య‌మైన ఎమినోయాసిడ్లు ఆర్గినైన్‌, అల‌నైన్‌, సిస్టైన్‌, సెరైన్లు ఉంటాయి.

0 comments:

Post a Comment