Ticker

6/recent/ticker-posts

Ayurveda for Rheumatoid Arthritis : శ‌రీరాన్ని నియంత్రించే వాతం గురించి ఆయుర్వేదం ఏమంటుంది?

Ayurveda for Rheumatoid Arthritis : వాతం అంటే క‌డుపులో చేరే గాలికాదు. వాతం అంటే కీళ్ళ‌ల్లో వ‌చ్చే వాపు, నొప్పి కాదు. వాతం అంటే కింద నించి వెళ్లిపోయే వాయువు కాదు. వాతం మ‌న దేహాన్ని పాలించే, న‌డిపించే, క‌దిల్చే ఒక అద్బుత‌శ‌క్తి. 

Ayurveda for Rheumatoid Arthritis
Photo Credits:Freepik

అది మ‌న శారీర‌క మాన‌సిక క‌దలిక‌ల‌న్నింటినీ నియంత్రిస్తుంది. వాతం మ‌న ర‌క్త‌ప్ర‌సారాన్ని క్ర‌మ‌బ‌ద్ధ ప‌రుస్తుంది. శ‌రీరంలో త‌యార‌య్యే మ‌లిన‌ప‌దార్థాల‌ని బ‌య‌ట‌కు పంపుతుంది. మ‌న శ్వాస‌ని స‌మీక్షిస్తుంది. మ‌న మ‌న‌స్సులో చెల‌రేగే ఆలోచ‌న‌ల‌ని, ఆశ‌ల‌ని మ‌న ప్ర‌తిక్రియ‌ల‌ని అది అదుపుచేస్తుంది.

సూక్ష్మంగా ఆలోచిస్తే, మ‌న శ‌రీరంలో ప్రాణం పోసుకొన‌డం నుంచి ప్రాణం పోయేదాకా ప్ర‌తి క‌దలికా వాత‌, పిత్త‌, క‌ఫాలు అనే మూడు శ‌క్తుల వ‌ల్ల జ‌రుగుతోంది. పిత్త‌, క‌ఫాలు శ‌క్తులైనా వాటిలో క‌ద‌లిక‌కు కార‌ణం వాత శ‌క్తి!. ఆయుర్వేదం త్రిదోషాలు, త్రిమ‌ లాలు, స‌ప్త‌ధాతువులు ఆత్మ‌ల సంయోగం ఈ జీవిత‌ మంటుంది. 

మ‌న త‌ల్లిగ‌ర్భంలో ఉన్న‌ప్పుడే మ‌న పిండంలోనే మాతృజ‌, పితృజ‌, ఆత్మ‌జ భావాల వ‌ల్ల శ‌రీరం ఏర్ప‌డి వాత‌, పిత్త‌, క‌ఫాల స‌మ్మేళ‌నంలో మ‌న దేశం, ప్ర‌వ‌ర్త‌న‌, ఆలోచ‌న‌, ఆకృతి దాలుస్తాయి. మ‌న శ‌రీరం ప్ర‌కృతిని తెలుసుకొని నియంత్ర‌ణ‌తో చ‌క్క‌గా జీవిస్తే జీవితం ఆనంద‌మ‌య‌మ‌వుతుంది.

మ‌నం గ‌ర్భంలో ఉన్న‌ప్పుడే మ‌న ప్ర‌కృతికి, ప్ర‌వృత్తికి బీజాలే ర్ప‌డ‌తాయి. సాధార‌ణంగా మ‌గపిల్ల‌ల్లో త‌ల్లి ల‌క్ష‌ణాలు, ఆడ‌పిల్ల‌ల‌లో తండ్రి ల‌క్ష‌ణాలు, మ‌నోభావాలు, ఆత్మజ‌ ల‌క్ష‌ణాలుగా వ‌స్తాయంటారు. యోగులు, త‌త్వ్త‌వేత్త‌లు, ఉపాసకులు ఎక్కువ‌గా ఆత్మ‌జ ల‌క్ష‌ణాల‌తో క‌ఫప్ర‌వృత్తి క‌లిగి ఉంటారు.

Ayurveda for Rheumatoid Arthritis: వాత ప్ర‌వృత్తి అంటే ఏమిటి?

వాత ప్ర‌వృత్తి (Constitution) క‌లిగిన వారు ఎలా ఉంటారంటే? మంచి నిర్మాణాత్మ‌క‌మైన ఆలోచ‌న‌ ల‌తో, మ‌న‌సులో చాలా వేగంగా ఆలోచించేవారుగా ఉంటారు. ఊహ‌ల్లో ఊగుతూ ఉంటారు. కొత్త కొత్త సంగ‌తుల‌ని నేర్చుకోవ‌డంలోను, గ్ర‌హించ‌డంలోను చాలా చురుకుగా ఉంటారు. 

కాని చిన్న చిన్న విష‌యాల‌ని మ‌రిచ‌పోతూ ఉంటారు. శృంగార‌ ప‌రంగా తొంద‌ర‌గా ఉత్తేజితు లై, తొంద‌ర‌గా చ‌ల్ల‌బ‌డిపోతారు. స‌న్న‌గా, చిన్న‌గా మంచి ముఖ‌వ‌ర్ఛ‌స్సుతో ఉంటారు. చ‌క్క‌గా మాట్లా డుతూ తొంద‌ర‌గా న‌డుస్తారు. కాళ్ళు, చేతులు కొంచెం చ‌ల్ల‌గా ఉంటాయి. చ‌లిగా ఉన్న‌ప్పుడు, వ‌ర్షాకాలంలో ఇబ్బందిగా ఉంటారు.

ఉత్సాహంగా ఉంటూ హాస్య‌ప్రియులై నిరంత‌రం జీవంతో జీవిస్తుంటారు. రోజువారీ కార్య‌క్ర‌మాల‌లో క్ర‌మం ఉండ‌దు. త‌రుచుగా మూడ్స్ మారుతూ ఉంటాయి ఆక‌లి, కోరిక‌లు అంతంత‌మాత్రంగానే ఉంటాయి. జీర్ణ‌శ‌క్తి అంతంత‌మాత్రంగానే ఉంటుంది. 

మంచి మ‌నోశ‌క్తి గ‌ల‌వారై తొంద‌ర‌గా అలిసిపోతారు. అలాగే తొంద‌ర‌గా ఉద్వేగానికి లోన‌వుతారు. మంచి స్థితిలో ఉన్న‌ప్పుడు నిండుగా న‌వ్వుతూ శ‌క్తితో, సంతోషంతో ఉంటారు. అదే మంచిస్థితిలో లేన‌ప్పుడు భ‌యం, ఆందోళ‌న‌తో ఉంటారు. త‌న‌కి తోచిన క్ష‌ణంలో నిర్ణ‌యం తీసుకుని వెంట‌నే ఆరంభిస్తారు.

చ‌ర్మం (skin) పొడిగా ఉండి త‌ల‌వెంట్రుక‌లు కూడా నూనె రాయ‌క‌పోతే పొడిగా ఉండి ఎక్కువ చెమ‌ట పోయ‌కుండా ఉండే త‌త్వం వీరిది. వాత ప్ర‌వృత్తి క‌లిగిన‌వారికి త‌ల‌నొప్పి, బి.పి, పొడిద‌గ్గు, గొంతు బాధ‌లు, చెవిపోటు, మాన‌సిక ఒత్తిడి, గుండె చ‌ప్పుడులో మార్పులు, కండ‌రాల‌లో నొప్పులు, కాళ్లు లాగ‌డం, న‌డుం నొప్పి, మ‌ల‌బ‌ద్ధ‌కం, క‌డుపులో గ్రేస్ చేర‌డం, బ‌య‌ట ఉన్న‌ప్పుడు స్త్రీల‌లో నొప్పులు, తొంద‌ర‌గా పురుషుల‌లో స్థ‌ల‌నం, మోకాళ్ల వాపులు ఉంటాయి. ముఖ్యంగా వాత‌ప్ర‌వృత్తి క‌లిగిన వారు న‌రాల వ్యాధుల‌తో ఎక్కువ (Ayurveda for Rheumatoid Arthritis) బాధ‌ప‌డ‌తారు.

వాతం వ‌స్తే శ‌రీర‌ ల‌క్ష‌ణాలు

స్తూలంగా వాత‌మంటే మ‌న శ‌రీరంలోని స‌ర్వ‌న‌రాలు వాటిని నియంత్రించే CNS వంటి కేంద్రాన్ని న‌డిపించే శ‌క్తి, వాత‌ప్ర‌వృత్తి క‌లిగిన‌వారు శారీరకంగా పూర్తిగా ఎద‌గ‌ని ఆకృతి క‌లిగి ఉంటారు. వాళ్ళ ఛాతీ ప‌ల్చ‌గా, అట్ట‌లా ఉండి ఎముక‌లు, న‌రాలు క‌నిపిస్తూ ఉంటాయి.

వాళ్ల చేతుల‌పై ర‌క్త‌నాళాలు స‌న్న‌గా, సున్నితంగా ఉండి పైకి క‌న‌బ‌డుతూ ఉంటాయి. కీళ్ళ‌ల్ల ఎముక‌లు పైకి బాగా ప్ర‌స్పూటంగా క‌నిపిస్తూ కండ‌రాలు ప‌ల‌చ‌నై అంటుకొని ఉంటాయి. చ‌ర్మం రంగు ఆక‌ర్ష‌వంత‌మై అంద‌రికీ ఆమోదయోగ్యులై ఉంటారు.

క‌ళ్లు కొంచెం లోప‌లికి ఉండి చిన్న‌వై, క‌నుబొమ్మ‌లు స‌న్న‌గా ఉండి క‌ళ్లు తేజోవంతంగా ఉంటాయి. ముక్కు కొంచెం వంగి చాలా కొద్దిగా ప‌క్క‌కి వాలి ఉంటుంది. గోళ్లు త్వ‌ర‌గా పెరుగుతూ ఎండిన‌ట్టుంటాయి. ఆక‌లి (hungry) , జీర్ణ‌శ‌క్తి హెచ్చుత‌గ్గులుగా ఉంటుంది. వీళ్లు తీపిప‌దార్థాలు, పుల్ల‌టి వ‌స్తువులు, ప‌చ్చ‌ళ్లు, వేడి కాఫీ, టీ, పాలు ఇష్ట‌ప‌డ‌తారు. 

వాళ్లు విస‌ర్జించే మూత్రం కొంచెం కొంచెంగా ఉండి మ‌లం గ‌డ్డ‌లుగా ఉంటుంది. నిద్ర కొంచెం క‌ల‌త‌బారి ఉంటుంది. ఎక్కువ‌గా క‌ల‌లు వ‌స్తూ ఉంటాయి. మాన‌సికంగా, తొంద‌ర‌గా గ్ర‌హించే శ‌క్తిని క‌లిగి, మ‌నోధైర్యం త‌క్కువ‌గా ఉండి ఓర్పు, ఆత్మ‌విశ్వాసం కొంచెం త‌క్కువ‌గా ఉంటాయి. 

వీరు కొన్ని విష‌యాలు త్వ‌ర‌గా గ్ర‌హిస్తారు. ఎప్పుడో చ‌దివిన‌వి, విన్న‌వి నిక్షిప్తం చేసుకుని మ‌ళ్లీ చెప్ప‌గ‌లుగారు. కాని కొన్ని చిన్న విష‌యాలు త్వ‌ర‌గా మ‌రిచిపోతారు. సందిగ్థ స‌మ‌యాల‌లో మ‌నోధైర్యం బ‌ల‌హీన‌ప‌డి ఒత్తిడ‌లోనై భ‌య‌స్తుల‌వుతారు. సంపాదించ‌డంలో చురుగ్గా ఉంటారు. 

అలాగే ఖ‌ర్చు పెట్ట‌డంలోనూ చురుగ్గా ఉంటారు. తొంద‌ర‌గా కోపం వ‌స్తుంది. ఈ వాతం త‌ల‌, గుండె, ఊపిరితిత్తులు, ఉద‌రం (stomach), న‌డుం, మిగ‌తా భాగాలు ఆశ్ర‌యించుకుని 5 ర‌కాలుగా ఉంటుంది.

స‌మ‌స్థితి కోసం

విశేష‌మేమంటే మ‌న త‌త్త్వం వాత‌మ‌ని తెలుసుకొని అది స‌మ‌స్థితిలో ఉంచుకుంటే కొన్ని రాకూడ‌ని బాధ‌లు రాకుండా మ‌నం హాయిగా జీవించ‌వ‌చ్చు. నిజంగా మీరు వాత‌ప్ర‌వృత్తి వారైతే, దాన్ని చ‌క్క‌గా ఉంచాల‌నుకుంటే ఈ క్రింది ప్ర‌శ్న‌ల‌కి జ‌వాబులు రాసుకోండి.

  1. మీ చ‌ర్మం పొడిగా ఉండి స‌న్న‌గా ప‌ల‌చ‌గా ఉందా?
  2. మీరు చూడ‌టానికి స‌న్న‌గా, బ‌క్క ప‌ల‌చ‌గా ఉన్నారా?
  3. మీరు తొంద‌ర‌గా ఉద్రేక‌ప‌డి, కోపం తెచ్చుకొని, తొంద‌ర‌గా అల‌సిపోతున్నారా?
  4. విరేచ‌నం తృప్తిగా కాదా?
  5. అన్నింటికీ బాధ‌ప‌డుతుంటారా?
  6. నిద్ర త‌క్కువ‌గా ఉంటోందా?
  7. మీ జ‌న‌నేంద్రియాలు పొడిగా ఉంటాయా?
  8. కాళ్ళ‌లో ఇబ్బందిగా ఉంటోందా?
  9. తొంద‌ర‌గా అల‌సిపోతున్నారా?
  10. మీరు శ‌రీర‌కంగా పూర్తి ఆకారంతో ఎద‌గ‌లేదా?

Ayurveda for Rheumatoid Arthritis: ఈ సూచ‌న‌లు పాటించండి!

శారీర‌కంగా, మాన‌సికంగా విశ్రాంతి తీసుకోండి. మీ ఆహారంలో, ప్ర‌వ‌ర్త‌న‌లో, న‌డ‌వ‌డిక‌లో, బంధు మిత్రుల సాన్నిహిత్యంలో మార్పు తెచ్చుకోండి. శ‌రీరంలో మ‌న‌స్సులో వ‌చ్చే ఆలోచ‌న‌లు నియంత్రిస్తే, మీ ప్ర‌వృత్తిలోనూ స‌మ‌తుల్యం వ‌స్తుంది. వేడిగా ఉడికిన ఆహారాన్ని తీసుకోండి. 

ప‌చ్చికూర‌లు తిన‌వ‌ద్దు. తొంద‌ర‌గా పడుకోండి. ఆలోచ‌న‌లు పెట్టుకోకుండా మంచి పుస్త‌కం చ‌దువుతూ విశ్రాంతి పొందండి. నూనె ప‌దార్థాలు, వేపుడు కూర‌లు తినండి. ఉద్రేక‌ప‌రిచే ద్ర‌వాలు అస్స‌లు తీసుకోకండి.

యాపిల్స్‌, బొప్పాయి, పుచ్చ‌కాయ‌, గోరు చిక్కుడు కాయ‌, అల్లం, క్యాలీఫ్ల‌వ‌రు, టొమేటో, బంగాళా దుంప‌, బార్లీ (Barley) మంచివి కావు. అర‌టిప‌ళ్ళు, బ‌త్తాయి, నారింజ‌, ద్రాక్ష‌, మామిడి ప‌ళ్ళు, చిక్కుడు కాయ‌లు,క్యారెట్‌, జీడిప‌ప్పు, స‌ముద్ర ఆహారం మంచిది. 

Post a Comment

0 Comments