Computer Vision Syndrome: నెల రోజుల నుంచి కణతలు నొప్పి, మెడనొప్పి...ఏవేవో బాధలు, కళ్లు చిట్లించుకుని చూడాలని పిస్తుంది. ఇలా ఎంతో మంది నడివయస్సు రాకుండానే బాధపడు తుంటారు. ఇది కనిపించని దెబ్బ తగలటం వల్ల వచ్చిన లక్షణాలు. రోజులో చాలాసేపు కంప్యూ టర్‌తో ఉండి పని చేసుకునే వాళ్లకు తగిలే తెలియని దెబ్బ ఇది. దీన్ని Computer Related Injury (CRI) అని అంటారు.
ఇది మనం బాధపడే సమయం. చాలా నెమ్మదిగా రావడం వల్ల ఆలస్యంగా గుర్తిస్తాం. ఈ రోజు మన జీవనయానంలో దాదాపు ప్రతిరంగంలోనూ, ప్రతి పనిలోను ఆఖరికి ఆటల్లోను కంప్యూటర్ లేకుండా జరగటం లేదు. ఈనాటి లెక్కల ప్రకారం మన దేశంలో, నగరాలలో నూరుశాతం ఇండ్లలో కంప్యూటర్ వాడకం ఉంది. చాలా ఇళ్ళల్లో ఒకటికన్నా ఎక్కువ ఉన్నాయి. మీకు తెలుసో తెలియదో కాని కొన్ని ఇళ్ళల్లో పడకగదిలోను, హాలులోను చివరికి వంటింట్లో కూడా కంప్యూటర్ ఉంది.
ఆఫీసుల్లో అయితే సరేసరి, ఇదంతా ఎందుకంటే చాలాసేపు కంప్యూటర్ వాడటం వల్ల శరీరంలో పలుచోట్ల దెబ్బ (Injury) తగిలే అవకాశం ఉంది. ఎందుకంటే మెడ, నడుం వంచుకొని చాలాసేపు ఒకే రకంగా కళ్లు కదల్చకుండా కూర్చోవడం కొన్ని అవయావాలకి రక్తప్రసారం తగ్గి కండరాలు, ఎముకలు, కండరాల చివరలు బిగపట్టి నొప్పిని (Computer Vision Syndrome) కలుగజేస్తాయి.
పరిశోధనలలో ఇంకా తేలలేదు కానీ ఉత్పత్తి పెరుగుతుందని, పని సామార్థ్యం పెరుగుతుందని అనిపించే ఈ కంప్యూటర్ నిరంతర వాడకం, మనిషి ఆయుఃపరిమాణంపై కూడా ప్రభావం చూపిస్తుంది. అందుకే అంటున్నాను కంప్యూటర్ మనకి అత్యవసరం కనుక దానివల్ల వచ్చేటు వంటి అనర్థాల నుండి కూడా మనని మనం పరిరక్షించుకోవాలి అని. సుమారు అయిదు సంవత్స రాల నుండి కంప్యూటర్ వాడకం వల్ల వచ్చే బాధలు మన దేశంలో గుర్తించబడ్డాయి. ఇప్పు డు అది పెరిగి ప్రపంచవ్యాప్తమైంది.
Computer Vision Syndrome: అన్ని వయసులవారికీ..
చాలామంది కుర్రవాళ్లు,చిన్న వయస్సు ఆడపిల్లలు నడి వయస్సువారు వేలమంది ఆరోగ్య వంతులు నీరసం, నిస్సత్తువ వంటి రకరకాల బాధలతో బాధపడుతుంటారు. ముఖ్యంగా Respective strain injury (RSI) పని ఒత్తిడి వల్ల వచ్చే బాధలని అర్థం. మెడ, వీపు, భుజాలు, కాళ్లు, చేతులు, మడమలు, వ్రేళ్లు ఇవి తిమ్మరెక్కడం, లాగుతున్నట్లనిపించడం జరుగుతుంది.
RSI ఎలాంటి వాళ్ళలో రావచ్చు?
రాత్రి, పగలనక కంప్యూటర్‌తో పనిచేసేవాళ్లు, వైద్య నిపుణులు, నర్సులు నిరంతరం డ్యూటీ చేసే వాళ్లు, చిన్నపనీ, పెద్దపనీ అనీ లేకుండా ఎప్పుడూ ఇంట్లో పనిచేసుకునే పెద్దవాళ్లు.
కారణాలు - ఒకే స్థితిలో చాలాసేపు ఉండటం, చాలా సేపు చేతిని కదుపుతూ ఉండటం, బలహీన మైన స్థితిలో చాలాసేపు ఉండటం, కండరాల ఒత్తిడి చాలా సేపు ఉండేటట్టు కూర్చోవడం లేదా బోర్లాపడుకోవడం, చాలా సేపు ఏ.సిలో ఉండటం, అనువు కాని సులువు లేని కుర్చీల్లో, సోఫాల్లో, మంచాలపై ఉండటం, కళ్ళు వెడల్పు చేసుకొని చూడటం.
లక్షణాలు - హఠాత్తుగా నిస్సత్తువ, అక్కడా ఇక్కడా అని లేకుండా నొప్పి. మెడ, కాళ్లు, చేతులు, వీపు, నడుములలో కొద్దిగా వాపునొప్పి, పైచోట్ల పొడుస్తున్నట్లుండటం, తరుచూ తిమ్మిరిగా ఉండటం. క్రమ క్రమంగా చేతిపట్టు లేకుండా ఉండటం.
నుదురు, అరచేతులు మంటగా ఉండటం, సూదులు పొడిచినట్లనిపించడం, కళ్లు అలసటచెంది పైరెప్పలు రాలుతూ ఉండటం చూపు తగ్గడం (cvs), రోజూ మనం చేసుకునే పనుల్లో సామర్థ్యం తగ్గడం, సంసారంలో అనురక్తి తగ్గడం, తరుచూ తలనొప్పి రావడం.
మరి ఇవన్నీ వస్తున్నాయని కంప్యూటర్ వాడకం నూనెయ్యాలా? అక్కరలేదు. దానివల్ల వచ్చే బాధల నుంచి మనని మనం పరిరక్షించుకోవాలి. అవీ దినచర్యలో చిన్న చిన్న మార్పులు చేసుకుని, కంప్యూటర్ వాడుతున్నప్పుడు ముఖ్యంగా కాళ్లు, మెడ, మన నడుం ఒకే స్థితిలో చాలా సేపు ఉండకుండా చూసుకోవాలి.
Computer Vision Syndrome: బయటపడేదెలా?
1.కంప్యూటర్ చాలా సేపు వాడవల్సి వస్తే ముందుకు ఒంగి చాలా సేపు కూర్చోకుండా నడుమును వెనుకకు వాల్చి కొంతసేపు ఉండండి.
2.మీరు మౌస్ (Mouse) ని వాడేటప్పుడు ప్రతి అరగంటకి చేతికి కాస్త విశ్రాంతినిచ్చి మోచేయి, వేళ్లు, పైనించి కిందకు చేత్తో మర్దన చేసుకోండి.
3.కంప్యూటర్
తెర సాధ్యమైనంత వరకు మీనుదురుకు
సమాన
ఎత్తులో ఉండేటట్టు చూసుకోండి.
కాళ్లు బిగదీసుకుని వుంచకుండా నేలపై చాపి ఉంచండి. వేళ్ళు
కదుపుతూ
ఉండండి.
ఆయుర్వేదం (Ayurveda) వీటికి చక్కని ఉపాయాలని ప్రతిపాదించింది.
నాడు జనపద
వ్యాధులు గా
అనబడే వీటికి నేటికి
అన్వయం
చేసుకుంటే చక్కటి వైద్యం
మనకి
లభిస్తుంది.
దీంతో అందరూ చేసుకో తగ్గది అభ్యంగ
స్వేదం. అభి
అంటే లోపలకి లేదా
ముందుకి అని
అర్థం.
స్వేదమంటే చెమట పట్టించడం అని, కనీసం 45 నిమిషాలు శరీరమంతటినీ నువ్వుల నూనెతో మర్ధన చేసుకోవాలి. దీనివల్ల కండరాలు, ఎముకలు, నరాలు న్నీ క్లేదపడి మలినాలను బయటకు తెచ్చి కొత్త శక్తి వస్తుంది. ఇలా ప్రతి రోజూ చేసుకుంటే మంచి నిద్ర పడుతుంది.
అలాగే మంచి పంచకర్మ విభాగంలో లలక్కిజి శిరోధార, అక్షితర్పణం వంటివి నెలకో, రెండు నెలలకో ఒక్కసారి చేయించుకుంటే మెడ, నడుము, చేతులు, కళ్ళు నిర్మలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల వాళ్ళు, వాళ్ల ఉద్యోగులు ఆనందంగా ఉండాలంటే, వాళ్ళకి ఆయుర్వేద సహజ పద్ధతులని తెలియజేప్పే అవకాశాలు కలుగ చేయడం అవసరం.

0 Comments