Ticker

6/recent/ticker-posts

Ayurveda for Kidney Problems: ఆయుర్వేదంతో కిడ్నీల‌లో లోపం గుర్తించ‌వ‌చ్చు.

 Ayurveda for Kidney Problems: సాధార‌ణంగా హైబిపి, షుగ‌రు వ్యాధి, గుండె జ‌బ్బులు, కిడ్నీ జ‌బ్బులు పెద్ద‌వాళ్ల‌కే వ‌స్తాయ‌నుకుంటాం. నిజానికి పూర్వకాలంలో అంతే. కాని ఇప్పుడు ఈ వ్యాధులు పిల్ల‌ల‌కి కూడా వ‌స్తున్నాయి. 

Ayurveda for Kidney Problems
Photo Credits:Pixabay
పెద్ద‌ వాళ్ల‌కు షుగ‌రు వ్యాధి, బి.పి, ఈ రెండు వ్యాధులు కిడ్నీని పాడుచేస్తాయి. లేదా కిడ్నీ వ్యాధుల‌కు కార‌ణమ‌వుతాయి. కాని ఈ స్థితికి మూలాలు వాళ్ల చిన్న‌ వ‌య‌సులోనే ఆరంభ‌ మవుతాయ‌ని సూచింబ‌డింది.

పిల్ల‌ల్లో వ‌చ్చే మూత్ర సంబంధ‌మైన వ్యాధుల‌ని స‌రిగ్గా గుర్తించ‌క‌పోవ‌డం లేదా స‌రియైన చికిత్స చేయించ‌క ‌పోవ‌డం పెద్ద‌వాళ్ల‌య్యాక ఈ స్థితికికార‌ణ‌మ‌వుతుంది. పిల్ల‌ల‌కి వ‌చ్చే వ్యాధుల‌కు ఆహారం, ప‌థ్యంలో లోపాలు పెద్ద‌వాళ్ల‌లో దీర్ఘ వ్యాధుల‌కి కార‌ణ‌మంటుంది ఆయుర్వేదం. యూరె ట‌ర్ కిడ్నీల నుండి మూత్రాన్ని తీసుకెళ్లి మూత్రాశ‌యంలోకి (Bledder) వ‌దిలే గొట్టం.

ఇక్క‌డ ఒక త‌లుపులాంటిది ఉంటుంది. అది మూత్రాన్ని బ్లెడ‌ర్‌లోకి త‌ప్ప వెన‌క్కి వెళ్ల‌నీయ‌దు. ఒక్కొక్క‌ ప్పుడు అది చెడు కొంత మూత్రం వెన‌క్కి వ‌స్తుంది. ఈ స్థితిని VUR అంటారు. దీని వ‌ల్ల బి.పి పెరుగుతుంది. ఇది చాలా సార్లు జ‌రిగితే జ్వ‌రం, వికారం, వాంతులు వంటివి కూడా వ‌స్తాయి. తొలిరోజుల్లోనే కిడ్నీల స్థితిని గుర్తిస్తే ఈ వ్యాధులు రాకుండా ఉంటాయి.

అస‌లు కిడ్నీకి సంబంధించిన స‌మ‌స్య ఉందంటే ఒక ముఖ్య సూచ‌న మీ ముఖంలో క‌నిపిస్తుంది. మీ క‌ళ్ల‌క్రింద వాపు రోజూ క‌నిపిస్తుంటే మీ కిడ్నీల‌లో లోపం ఉంద‌ని సూచ‌న‌. మీ పిల్ల‌ల‌లో ఉద‌యం లేచిన వెంట‌నే ముఖం ఉబ్బిన‌ట్లుండ‌టం, క‌ళ్ల‌ కింద బాగం వాయ‌టం క‌నిపిస్తోంటే అది కిడ్నీల గురించి ఆలోచించ‌మ‌న‌నే వార్నింగ్ లాంటిది. దీన్ని నెఫ్రోటిక్ సిండ్రోమ్ (Nephrotics Syndrome) అంటారు. దీంట్లో మందుల‌కి ఈ వాపు త‌గ్గుతుంది. మ‌ళ్లీ వ‌స్తుంది.

Ayurveda for Kidney Problems : అద్భుత‌మైన ప‌నితీరు

ఆధునిక వైద్యంలో స్టెరాయిడ్స్ (Steroids) ఇచ్చి దీన్నిత‌గ్గిస్తారు. చాలా కాలం త‌ర్వాత ఈ మందులు ప‌నిచేయ‌క పోవ‌డం వ‌ల్ల కిడ్నీలు పూర్తిగా చెడిపోయే ప‌రిస్థితి వ‌స్తుంది. కొంత‌మంది స్కూలుకి వెళ్లే పిల్ల‌ల‌లో త‌ర‌చుగా వ‌చ్చే గొంతునొప్పి, చ‌ర్మ వ్యాధులు (Skin Diseases) కూడా ఈ వ్యాధిని క‌లుగ‌జేయ‌వ‌చ్చు.

మూత్రం త‌క్కువ‌గా రావ‌టం, ఒళ్లంతా వాయటం కిడ్నీల వ్యాధిలో ఉండే ల‌క్ష‌ణాలు. మ‌న శ‌రీరంలో స‌హ‌జ‌స్థితిని, అంత‌ర్గ‌త వాతావ‌ర‌ణాన్ని చ‌క్క‌గా వుంచే అద్భుత అవ‌యవం కిడ్నీ. ఈ కిడ్నీలు చెడిపోతే మ‌న దేహంలో రోజూ త‌యార‌య్యే మ‌లిన‌ప‌దార్థాలు బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా శ‌రీరంలోనే ఉండి దేహాన్ని క‌లుషితం చేస్తాయి.

దాని వ‌ల్ల శ‌రీరం విషపూరిత‌మై అనేక ఉప‌ద్ర‌వాల‌కి అల‌వాల‌మ‌వుతుంది. క్ర‌మంగా శ‌రీర‌దారు ఢ్యం త‌గ్గి, శ‌రీరం ఉబ్బి ఆక‌లి లేక‌పోవ‌డం, ఆయాసం వ‌చ్చి చాలా బాధ‌కు గుర‌వుతాం. ఈ కిడ్నీలు చెడిపోవ‌డం తాత్కాలికంగా కావ‌చ్చు. లేదా పూర్తిగా చెడిపోవ‌డం కావ‌చ్చు. పిల్ల‌ల‌లో త‌రుచూ తీవ్ర‌మైన విరేచ‌నాలు, దీంత శ‌రీరంలో ద్ర‌వ‌ధాతువు ఇంకిపోవ‌డం అంటే డీహైడ్రేష‌న్ ఇవి కిడ్నీల సామ‌ర్థ్యాన్ని త‌గ్గిస్తాయి. అప్పుడు జాగ్ర‌త్త‌ప‌డి కిడ్నీల ప‌నితీరును స‌మీక్షించుకొని బాగు చేసుకోవాలి. అప్పుడు పిల్ల‌లు చ‌క్క‌గా ఎదిగి స‌హ‌జ జీవ‌నం సాగిస్తారు.

ఒక్కొక్క కిడ్నీ స‌రిగ్గా ప‌నిచేయ‌డం లేద‌ని గుర్తించాక రెండు మూడు నెల‌లు అశ్ర‌ద్ధ చేస్తే శాశ్వ‌తంగా  అవి చెడిపోతాయి. ఈ కిడ్నీ వ్యాధి (Kidney Problems) తొలిరోజుల్లో చాలా నిశ్శ‌బ్ధంగా ఉంటుంది. ఏ బాధ‌ప‌డే ల‌క్ష‌ణాలు మ‌న‌కిచూపించ‌దు. పిల్ల‌లు స‌రిగ్గా ఎద‌గ‌క‌, తిన‌క‌, అస్త‌మానూ వికారంగా ఉంద‌ని వాంతి చేసుకుంటుంటే, ర‌క్తం త‌క్కువ‌గా ఉన్న‌ట్టు పాలిపోతుంటే, బి.పి, పెరుగుతున్న‌ట్టు అనిపిస్తే మ‌నం జాగ్ర‌త్త‌ ప‌డ‌టం అవ‌స‌రం.

 ప‌నిచేయ‌క‌పోవ‌డానికి కార‌ణాలు

జ‌న్మ‌తః కిడ్నీలు చిన్న‌విగా ఉండ‌టం. వ‌య‌సుతో పాటు అవి పెర‌గ‌క‌పోవ‌డం, బాగా ఒళ్లు రావ‌డం, బి.పి పెర‌గ‌టం, మూత్రానికి సంబంధించిన వ్యాధులు రావ‌డం, మూత్రం ఎర్ర‌గా రావ‌డం, లేచిన వెంట‌నే ముఖం, క‌ళ్ల‌చుట్టూ వాయ‌డం, మూత్రం చాలా త‌క్కువ‌గా పోయ‌డం, త‌రుచూ జ్వ‌రం రావ‌డం, దాహం ఎక్కువ‌గా ఉండ‌టం, ఎముక‌లు వంగిపోవ‌డం, మూత‌రం మంట‌గా పోయ‌టం. ఎప్పుడూ వాంతి వ‌చ్చేట‌ట్టుండ‌టం.

ఆయుర్వేదం (Ayurveda for Kidney Problems) తో దీన్ని వృక్క రోధా అంటారు. ఆహారంలో ఉప్పు త‌క్కువ తిన‌డం, అధికమైన ఒళ్లు  రాకుండా గోరువ‌చ్చ‌ని నీళ్ల‌లో తేనె క‌లుపుకుని త్రాగ‌టం, స‌ర్ప‌గంధ‌, జ‌ఠామాంసివ‌టి స‌హ‌జ‌మైన మందుల‌లో B.P త‌గ్గించుకోవ‌డం చాలా ఉప‌క‌రిస్తాయి. గోక్షూర‌, పున‌ర్న‌వ‌, త్రిఫ‌ల ఈ స్థితిలో చ‌క్క‌టి ఫ‌లితాల‌నిస్తాయి.

ఆకుకూర‌లు, పెస‌ర‌ప‌ప్పు, క‌మ్మ‌ని మ‌జ్జిగ‌, బార్లీనీళ్లు త‌రుచూ తీసుకోవ‌డం చాలా మంచిది. మ‌న కిడ్నీలు మ‌న దేహంలో రోజూ త‌యార‌య్యే చెత్త‌ని బ‌య‌ట‌కు పంపి మ‌న‌ని శుభ్రంగా ఉంచే ఆరోగ్య వ‌ర‌దాయ‌ని. వాటిని జాగ్ర‌త్త‌గా చూసుకోవాలి.

Post a Comment

0 Comments