Ticker

6/recent/ticker-posts

Ayurveda for Throat Pain: ఆయుర్వేదంతో గొంతు నొప్పికి ఉప‌శ‌మ‌నం

 Ayurveda for Throat Pain: చ‌లికాలంలోనో, వ‌ర్షాకాలంలోనో అంద‌రికీ గొంతు నొప్పి రావ‌డం స‌హ‌జం. కాని త‌రుచుగా పిల్ల‌ల‌లో  గొంతునొప్పి, ముక్కులు బిగ‌తీసుకు పోవ‌డం సాధార‌ణం. అది ఆంధ్ర రాష్ట్ర‌మే కావ‌చ్చు. అమెరికా దేశం కావ‌చ్చు. ఎదుగుతున్న పిల్ల‌ల్లో గొంతు నొప్పి, ముక్కులో శ్వాస ఆడ‌క‌పోవ‌డం, క‌ఫం అడ్డుకొని పిల్ల‌లు బాధ‌తో ఏడ‌వ్వ‌డం, దాన్ని చూసి ఏం చేయాలో తెలియ‌ని ఈనాటి త‌ల్లుల వేద‌న మ‌నం చూస్తూ ఉంటాం.

Ayurveda for Throat Pain
Photo Credits:Pixabay

ఈ మ‌ధ్య అర్థ‌రాత్రి ప‌క్క ఇంట్లో బిందు ఏడుస్తూ వ‌చ్చి పాపాయికి ఆరో నెల‌. చూడండి Doctor గారూ! ఎలా ఏడుస్తోందో, గుర‌గుర‌మంటోంది. యాంటీబ‌యాటిక్ సిర‌ప్ వేశాను కానీ త‌గ్గ‌డం లేదు. అమ్మా ! వాము వేయించి ప‌ల్చ‌టి గుడ్డ‌లో మూట‌గా క‌ట్టి గొంతుకు పైన‌, ముక్కుపైన‌, వీపుపైన కాచు త‌ల్లీ! కాసేప‌టికి బాబు హాయిగా ప‌డుకుంటాడు. వైద్యులు కాని మ‌న‌లో చాలా మంది సోర్ త్రోట్‌, టాన్సిలైటిస్‌, స్ట్రైప్‌ త్రోట్ లాంటి ప‌దాలు పిల్ల‌ల‌ను చూసి చెబుతూ ఉంటాం. ఇవ‌న్నీ ఒకే వ్యాధి కాదు. ల‌క్ష‌ణాల‌ను బ‌ట్టి, కార‌ణాల‌ను బ‌ట్టి ర‌క‌ర‌కాల వ్యాధులు.

ఇవి వ‌స్తే ఏం చేయాలి (Ayurveda for Throat Pain). ఎందుకు వ‌స్తాయి. ఎప్పుడు డాక్ట‌రు ద‌గ్గ‌రకి వెళ్లాలి అన్న‌ది మ‌న‌కు తెలుస్తుంది. ఇందులో స్ట్రెప్ త్రోట్ (Strep Throat) ఒక్క‌టే గొంతునొప్పికి, గొంతు గర‌గ‌ర‌కి ముఖ్య‌కార‌ణం. పిల్ల‌లో ఇది మ‌రీ ముఖ్య కార‌ణం. అన్ని వ‌య‌స్సుల వాళ్ళ‌కీ ఇది రావ‌చ్చు కానీ ఎదిగే వ‌య‌సులో ఇది మ‌రీ త‌ర‌చుగా బాధ‌పెడుతుంది.

Ayurveda for Throat Pain: గొంతు నొప్పికి గ‌ల‌ కార‌ణాలు

అవ‌య‌వ నిర్మాణం పూర్తికాని, త‌యార‌వుతున్న స్థితి పిల్ల‌ల‌ది. అందువ‌ల్ల శ‌రీరంలో వ్యాధినిరోధ‌క శ‌క్తి పూర్తిగా ఏర్ప‌డ‌దు. దాని కార‌ణంగా ఇన్‌ఫెక్ష‌న్స్ తొంద‌ర‌గా వ‌స్తాయి. ముక్కు నుండి గొంతుక‌, దాని క్రింద ఫేరెంక్సు (Pharynx) టాన్సిల్స్ (Tonsils), అన్న‌వాహిక (Esophagus), వాయువాళ‌పు ముఖ‌ద్వారం (harynx) చెడిపోవ‌డం వ‌ల్ల ఈ నొప్పి వ‌స్తుంది. గొంతుకి ఇరువైపులా ఎర్ర‌గా ఉండే చిన్న ముద్ద‌ల లాంటివి టాన్సిల్స్‌.

వీటిలో వ్యాధి నిరోధ‌క శ‌క్తి ఉండి ముక్కు ద్వారా లోప‌లికి వ‌చ్చే క్రిములు అడ్డుకుని కాపాడుతుంది. ఆ టాన్సిల్సే వ్యాధిగ్ర‌స్త‌మై చీముతో కూడి ఉంటే టాన్సిలైటిస్ (Tonsilitis) అంటారు. ఇదే గొంతునొప్పికి ముఖ్య కార‌ణం. గొంతులోప‌ల వెనుక భాగాన్ని Pharynx అంటారు. ఇది కూడా చీము చేరి గొంతుని పాడు చేస్తుంది.

మామూలు సూక్ష్మ‌జీవుల క‌న్నా తీవ్ర‌మైన వైర‌స్ ఇటువంటి స్థితికి కార‌ణం. చ‌లికాలంలో కాని రోజుల్లో ఈ వైర‌స్ వ్యాధిని క‌లుగ‌జేస్తుంది. స్ట్రెప్‌టో కొకై చాలా ముఖ్య‌మైన వ్యాధికార‌ణ సూక్ష్మ జీవి. దానివ‌ల్ల వ‌చ్చే గొంతువ్యాధిని Strep Throat అని అంటారు. ఇది అంటువ్యాదా? అవును. Strep Throat ఒక‌రి నుండి ఒక‌రికి వ‌స్తుంది.

పిల్ల‌లు ఎక్కువ‌గా గ‌డిపే సంర‌క్ష‌ణ కేంద్రాలు, పిల్ల‌ల స్కూళ్లు, పార్కులు వంటి చోట ఈ వ్యాధి ఒక‌రి నుంచి మ‌రొక‌రికి రావ‌చ్చు. గొంతు వాయ‌టం ఆరంభ‌మై తొలి నాలుగు రోజులు ఎటువంటి బాధ‌లు చూపించ‌దు. దీన్ని Incubation Period అంటారు.

 గొంతు నొప్పికి జాగ్ర‌త్త‌లు ఇవే

ఆ త‌ర్వాత గొంతులో లోప‌లి అంగట్లో ఎర్ర‌బ‌డుతుంది. వాస్తుంది. గొంతు వెనుక‌, లోప‌లి భాగాల్లో తెల్ల‌ని మ‌చ్చ‌లు క‌నిపిస్తాయి. ఒళ్లు వెచ్చ‌బ‌డ‌టం, కొంచెం జ్వ‌రం రావ‌డం, మెడ‌కి ఇరువైపులా వాయ‌టం ఉంటుంది. హ‌ఠాత్తుగా గొంతు బిగ‌ప‌ట్ట‌డం, గుర‌గుర‌ మ‌న‌డం, త‌ల‌నొప్పి వాంతులు, మింగ‌టం క‌ష్టంగా ఉండ‌టం, వికారం, గొంతు పైభాగం ఎర్ర‌గా వాచిఉండ‌టం ఇవి క‌నిపిస్తే విష‌ప‌దార్థం వ్యాపిస్తున్న‌ద‌ని అర్థం.

ముఖంపై ఎర్ర‌గా కందిన‌ట్లుంటుంది. ముక్కు నుండి స్రావం, క‌ళ్లు ఎర్ర‌బ‌డ‌టం వ‌స్తాయి. బాబు ఏడుస్తూ ఉంటాడు. ఇది పెద్ద‌వాళ్ల‌లోనూ రావ‌చ్చు. కాని పిల్ల‌లో ముక్కు ఉనంచి చిక్క‌ని, ప‌చ్చ‌ని స్రావం వ‌స్తూ ఉంటుంది. చికాకుగా ఉంటాడు.

ఒక‌టి నుంచి మూడేళ్ల పిల్ల‌లు ద‌వ‌డ కింద వాపుతో చాలా బాధ‌ప‌డ‌తారు. త‌రుచుగా వ‌చ్చే ఈ వ్యాధి వ‌ల్ల త‌ల్లులు జాగ్రత్త‌గా ఉండ‌టం అవ‌స‌రం. ఇది పిల్ల‌ల‌ను సోక‌కుండా జాగ్ర‌త్త‌ ప‌డ‌టం అవ‌స‌రం. వాతావ‌ర‌ణం మారిన‌ప్పుడు, చ‌ల్ల‌టి గాలి, వ‌ర్షం తుపాను వ‌స్తున్న‌ప్పుడు వేడి ప్ర‌దేశంలో ఉంచండి. ఆరు బ‌య‌ట ఆడ‌నీయ‌కండి. ముక్కుని, నోటిని ప‌ల్చ‌ని గుడ్డ‌తో (స‌న్న‌ని రంధ్రాలున్న‌) మూసి వుంచండి. వేడి నీళ్ల‌తో పిల్ల‌ల చేతులు క‌డిగి, తుడిచి వుంచండి. వాళ్ల‌కి వాడే వాస్తువులు తుడిచి వాడుతూ వుండండి.

 గొంతు నొప్పి నివార‌ణ

ఆయుర్వేద వైద్యం గొంతు నొప్పిని త‌గ్గించుకోవ‌చ్చు (Ayurveda for Throat Pain).రెండు  చిటికెలు ప‌సుపు, ఒక చిటికెడు మెత్త‌టి ఉప్పు నోటిలో వేసి గోరువెచ్చ‌ని నీళ్లు తాగించండి. ప‌సుపుకొమ్ములు, గోధుములు స‌మానంగా తీసుకుని వాటిని మ‌ట్టి మూకుడులో దోర‌గా వేయించి, మెత్త‌గా పొడిచేసి 50 మిగ్రా పొడిని ఒక చెమ్చా తేనెతో ఉద‌యం, సాయంత్రం ఇవ్వండి. త‌గ్గిపోతుంది. బాబుకి కాని, పాప‌కికాని త‌లంటుపోసే ముందు నువ్వుల నూనె రెండు చెవుల‌లో రెండేసి చుక్క‌లు వేసి త‌లంటి పోసిన‌ట్ల‌యితే సామాన్యంగా వ‌చ్చే ఈ స్థితి రాకుండా ఉంటుంది.

వాము చెమ్చా, బెల్లం 4 చెమ్చాలు క‌లిపి నూరి, ఒక క‌ప్పు నీళ్లో వేసి కాచండి. నాలుగో వంతు మిగిలే వ‌ర‌కూ కాచి, చ‌ల్లారాక బాబుకి ఆరుగంట‌ల‌కి ఒక సారి ఇవ్వండి. జ‌లుబు, గుర‌గుర త‌గ్గిపోతాయి. ప‌సుపు, ప‌టిక బెల్లంపొడి నిపు్పుల‌పై వేసి  ఆ పొగ‌ను త‌ల‌వైపునించి వేయండి. అలా చేస్తే ఆ సూక్ష్మ‌జీవి ప్ర‌తాపం త‌గ్గిపోతుంది. నిమ్మ‌ర‌సంలో తేనె, గోరువెచ్చ‌ని నీళ్లు క‌లిపి కొద్ది కొద్దిగా ఇస్తుంటే గొంతు నొప్పి త‌గ్గుతుంది. వాము, ఉప్పు, ప‌సుపు వేడి చేసి గుడ్డ‌లో క‌ట్టి గొంతుకు కాప‌డం పెట్టండి. త‌గ్గిపోతుంది.

Post a Comment

0 Comments