Ticker

6/recent/ticker-posts

Ayurveda For Women Health: స్త్రీల వ్యాధుల‌కు అద్భుత‌మైన వైద్యం ఆయుర్వేదం

 Ayurveda For Women Health: ఆమెకు ముప్పై అయిదేళ్లు, ఇంట్లోనూ, వ్యాపారంలోనూ భ‌ర్త‌కి తోడుగా, హుషారుగా ఉంటుంది. కాని ఈ మ‌ధ్య తెలియ‌ని ఉదాసీన‌త‌. త‌న డాక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కెళ్లి, చెప్పండి డాక్ట‌ర్! ఒక ప‌ద్ధ‌తి లేకుండా నెల‌స‌రి వ‌స్తోంది.

Ayurveda For Women Health
Photo Credits:Pixabay
పూర్వంలా నెల‌కి రావ‌డం లేదు. అయిదో రోజుతో ఆరంభ‌మై అలా క‌నిపిస్తూనే ఉంది. బాధ లేదు కాని చికాకుగా ఉంటోంది. బాగా నీర‌సం అనిపిస్తోంది అంది. డాక్ట‌ర్ కొన్ని మందులు ఇచ్చి వాడుకోమ‌న్నారు. ఆ నెల బాగుంది. కానీ మ‌ళ్లీ మామూలే.

స్త్రీకి 20వ సంవ‌త్స‌రం నుండి 45వ సంవ‌త్స‌రాల మ‌ధ్య కాలాన్ని సంతానోత్ప‌త్తి స‌మ‌ర్థ స‌మ‌యం అంటారు. ఆ స‌మ‌యంలో ఆమె యోనిమార్గం నుండి అధికంగా స్ర‌వించే ర‌క్త‌స్రావ‌పు స్థితిని డిస్‌ఫంక్ష‌న‌ల్ యూట‌రైన్ బ్లీడింగ్ అంటారు. ఈ స్థితి ఆ కాలంలో ఎప్పుడైనా రావ‌చ్చు, కాని తొలి మాసాల‌లోను, చివ‌రి యేళ్ళ‌ లోను సాధార‌ణంగా వ‌స్తుంది. 

ప్ర‌తి స్త్రీ సాధార‌ణంగా నెల‌కి ఒక‌సారి అంటే 28 నుండి 30 రోజుల‌కి ఒక‌సారి న‌ల‌భై నుండి, నూట యాభై ఐదు ml ర‌క్తాన్ని పోగొట్టుకుంటుంది. ఇది నాలుగైదు రోజులుంటుంది. నిజానికిది స్త్రీకి ప్ర‌కృతి సిద్ధంగా ఉండే చ‌క్క‌టి వ‌రం. ఇది రాక‌పోవ‌డం, లేక‌పోవ‌డం వ్యాధి.

ఈ స‌హ‌జ‌మైన ఋతుస్రావం (menstruation) ఎలా వ‌స్తుందో తెలుసుకోవ‌డం అవ‌స‌రం కూడా. క‌నిపించ‌డం ప్రారంభించిన తొలి నాలుగు రోజులు ఋతుస్రావానికి కార‌ణ‌మైన గ‌ర్భాశ‌య పొర స్ర‌వించ‌డం ద్వారా (దానిని Endometrial Layer అంటారు.) జ‌రుగుతుంది.

ఆ త‌ర్వాత ఎనిమిది తొమ్మిది రోజులు ప్రొలిఫిరేష‌న్ స్థితిలో ఈస్ట్రోజ‌న్ అనే హార్మోను త‌న ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ త‌ర్వాత ఓవ‌రియ‌న్ ఫాలిక్యూల ప్ర‌భావం వ‌ల్ల కొంత కాలం ఉండి త‌ర్వాత మ‌ళ్లీ నెల‌స‌రి వ‌చ్చే వ‌ర‌కూ ఆ ప్ర‌భావంలో ఉంటుంది. ఇది సామాన్య ఋతు చ‌క్రం (Menstrial Cycle) అనుకొన‌వ‌చ్చు.

Ayurveda For Women Health: ఋతుస్రావ స‌మ‌స్య‌లు

ఆయుర్వేద‌రీత్యా త‌ర్ప‌క‌శ్లేష్మం అంటే హార్మోన్ల రంజిక పిత్తం అంటే గ‌ర్భాశ‌య‌పు లోప‌ల పొర‌ల్లోని ర‌క్తం అపాన‌వాతం అంటే స్త్రీ జ‌ననేంద్రియాల క‌దిలిక‌కి కార‌ణ‌మ‌య్యే న‌రాల‌శ‌క్తి క‌లిసి ఆ ప్ర‌కృతిసిద్ధ‌మైన ఈ ఋతుచ‌క్రాన్ని నిర్వ‌హిస్తాయి.

వీటిలో ఎక్క‌డైనా హెచ్చుత‌గ్గులొచ్చిన‌ప్పుడు ఋతుచ‌క్రంలో మార్పులు వ‌స్తాయి. వాటినా ఆర్త‌న వికృతులు అంటారు (Menstrual Disorders). అందులో ఈ అధిక రక్త‌స్రావాన్ని అసృగ్ధారం అంటారు. ఆయుర్వేదాచార్యులు లోహిత‌క్షా, ర‌క్త‌పిత్త అని కూడా అంటారు.

ఆధునిక వైద్య‌శాస్త్ర రీత్యా గ‌ర్భాశయం నుంచి స్ర‌వించే అధిక ర‌క్త‌స్రావం నెల‌క్ర‌మంతో సంబంధం లేకుండా కాల నియమం లేకుండా ఉండే, దానిని Dysfunctional Uterine Bleeding (DUB) అంటారు. ఈ DUB శ‌రీరంలో ఏ గ‌డ్డ‌ల‌ వ‌ల్ల‌నో, అవ‌య‌వాల‌లో లోపం వ‌ల్ల‌నో కాకుండా హార్మోన్ల ప్ర‌భావం హెచ్చు త‌గ్గుల వ‌ల్ల ముఖ్యంగా ఈస్ట్రోజ‌న్ ప్ర‌భావం వ‌ల్ల వ‌స్తుంది.

 ముఖ్యంగా స్త్రీ శ‌రీరంలో ఈస్ట్రోజ‌న్‌, ప్రొజెస్టిరోన్ అనే రెండు హార్మోన్ల హెచ్చుత‌గ్గుల వ‌ల్ల ఈ వ్యాధి వ‌స్తుంది. సాధార‌ణంగా ఎక్కువ గ‌ర్భ‌నిరోద‌క మాత్ర‌లు వాడే స్త్రీల‌లో ఈ వ్యాధి వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంది.

ఈ DUB స్రావాన్నిబ‌ట్టి, స‌మ‌యాన్నిబ‌ట్టి అనే ర‌కాలుగా ఉంటుంది. దీన్ని 1.మెన‌రేజియా, 2.మెట‌రేజియా 3.సంభోగా నంత‌ర ర‌క్త‌స్రావం, 4.అప్పుడ‌ప్పుడు క‌నిపించ‌డం, 5.ఋతు క్షీణ‌త (అనార్త‌నం అని కూడా అంటారు) స్త్రీల‌లో అధిక ర‌క్త‌స్రావం గ‌ర్భాశ‌యపు లోప‌లి పొర నిర్మాణంలో లోపం వ‌ల్ల వ‌స్తుంది.

ఒక్కొక్క‌ప్పుడు ఈస్ట్రోజన్ అధికంగా ఉండి ప్రొజెస్టిరోన్ అస‌లు లేకుండా ఉంటే కూడా ఈ స్థితి వ‌స్తుంది. ఒక్కొక్క‌ప్పుడు FSH అనే హార్మోను హెచ్చుత‌గ్గుల వ‌ల్ల కూడా అధిక‌స్రావం వ‌స్తుంది. దీన్ని మెనోమెట్రారేజియా (Menometrorrhagia) అని అన‌వచ్చు.

అసృగ్ధార వ్యాధి అంటే ఏమిటి?

సాధార‌ణంగా 38 ఏళ్ల వ‌య‌స్సు దాటిన స్త్రీల‌లో ఓవ‌రి వెలువ‌రించే బీజం బ‌ల‌హీన‌మై వ‌చ్చి పూర్తిగా విక‌సించ‌కుండా ఉంటే, అది త‌గినంత ఈస్ట్రోజ‌న్ త‌యారు కాదు. దీనివ‌ల్ల కూడా నిమిత్తం లేకుండా అధిక ర‌క్త‌స్రావం వ‌స్తుంది.

ఇవి సాధార‌ణ కార‌ణాలైతే, కొన్ని గ్రంధుల కార‌ణంగా అంటే ఎండోక్రేన్ లోపాలు ఓవ‌రీమీద గ్రంథులు థైరాయిడిజ‌మ్‌, క్యాన్స‌ర్ వంటి కార‌ణంగా కూడా ఈ అధిక ర‌క్త‌స్రావం జ‌రుగుతుంది. స్త్రీ యోని నుండి చిర‌కాలం నెల‌స‌రికి సంబంధం లేకుండా ర‌క్త‌స్రావం జ‌రుగుతూ ఉంటే అదీ మామూలు ర‌క్త‌స్రావం లాగే కొంచెం కొంచెం అవుతూ ఉంటే, దాన్ని అసృగ్ధారం అంటారు.

విరుద్ధాహారం తిన‌డం వ‌ల్ల‌, మ‌ద్య‌, మాంసాదులు క్ర‌మం కాకుండా తిన‌డం వ‌ల్ల‌. పూర్తిగా ఉడ‌క‌ని పదార్థాలు తిన‌డం వ‌ల్ల ఈ వ్యాధి వ‌స్తుంద‌ని ఆయుర్వేదం సూచిస్తుంది. చిన్న వ‌య‌స్సులోనే గ‌ర్భ‌స్రావాలు జ‌ర‌గ‌డం, అధికంగా సంభోగం, గుర్రం-ఒంటెవంటివాటిపై తిర‌గ‌డం, స్కూట‌రు - కారు వాటిపై ఎక్కువ‌గా తిరుగుతూ ఉండ‌టం, కారం - పులుపు - మ‌సాలా ప‌దార్థాలెక్కువ‌గా తినడం, మాన‌సిక అశాంతి, ఎక్కువ‌గా ఒత్తిడికి లోనుకావ‌డం వ‌ల్ల హార్మోన్లు ప్ర‌భావిత‌మై ఈ వ్యాధి వ‌స్తుంది.

పిత్త‌శ‌క్తి వ‌ల్ల ర‌క్తం దూషిత‌మై ఈ వ్యాధి వ‌స్తుంది క‌నుక దీన్ని అశ్ర‌ద్ధ‌చేయ‌కూడ‌దు. స‌మాజంలో ఈ వ్యాధి ఇత‌ర బాధ‌లు క‌నిపించ‌క పోవ‌డం వ‌ల్ల కొంత‌, ఏం చెప్పుకుంటాంలే అని కొంత అశ్ర‌ద్ధ చేస్తారు.

కాని దాని వ‌ల్ల ర‌క్తం కోల్పోయి, బ‌ల‌హీన‌త‌, ఒళ్లునొప్పులు, కాళ్లు లాగ‌డం, ఆక‌లి త‌గ్గ‌డం, గుండెద‌డ‌, జుట్టు ఊడిపోవడం వంటి శారీర‌క బాధ‌ల‌తో పాటు కోసం, చికాకు, ఓర్పు లేక‌పోవ‌డం వంటి మాన‌సిక ల‌క్షణాలు కూడా వ‌స్తాయి. ప్రౌఢ‌గా తాను అనుభవించ వ‌ల్సిన సుఖాన్ని కోల్పోడ‌మేకాక‌, త‌న భ‌ర్తకి ఇవ్వ‌వ‌ల‌సిన సుఖాన్ని కూడా ఇవ్వ‌లేక‌ పోతూంటుంది.

అసృగ్ధార వ్యాధి చికిత్స‌

ఈ వ్యాధి నిర్థార‌ణ కోసం ఆధునిక వైద్యులు CBC, FSH, PTT, DAP, SMEAR, TSH వంటి వివిధ ప‌రీక్ష‌లు చేసి ఇదీ వ్యాధి అని నిర్ణ‌యిస్తారు. గ‌ర్భాశ‌యానికి స్కాన్ కూడా చేయిస్తారు. మందులు, ఆప‌రేష‌న్ లేదా రెండూ క‌లిపి వైద్యం చేస్తారు. ముఖ్యంగా గ‌ర్భాశ‌యాన్ని తీసివేయ‌డం కూడా చేయ‌వ‌చ్చు.

ఇది ముఖ్యంగా ఇత‌ర పరిస్థితులు అంటే గ్రంథులు ఏర్ప‌డ‌టం, అక్క‌డ భాగం చెడిపోవ‌డం వంటివాటిపై ఆధార‌ప‌డి ఉంటుంది. గ‌ర్భాశ‌య ద్వారాన్ని వెడ‌ల్పు చేసి లోప‌ల శుభ్ర‌ప‌ర్చ‌డం కూడా చాలా సాధార‌ణ చికిత్స‌, గ‌ర్భాశ‌యం తొల‌గించ‌డం శాశ్వ‌త చికిత్స‌.

ఆయుర్వేదం (Ayurveda For Women Health) నాడీప‌రీక్ష ద్వారా ఈ వ్యాధిని నిర్థార‌ణ చేసుకొని శ‌రీత‌త్వం. వ్యాధి కార‌ణం చూసి స‌హ‌జ‌మైన వైద్యం ప్ర‌తిపాదిస్తున్నారు. దీన్ని న‌వాస‌మ‌ని, దీర్ఘ‌కాలితమ‌ని గుర్తించి చికిత్సనందిస్తారు.

అప్పుడే ఆరంభ‌మైన ఎక్కువ ర‌క్తం స్ర‌విస్తూ ఉంటే నాగ‌కేశ‌క చూర్ణం, కామ‌దుగ్ధ‌రసం, ద్రాక్షాది చూర్ణం, లాక్షాది చూర్ణం పంచ‌ దార‌తో కాని, ప‌టికిబెల్లం చూర్ణంతో కాని ఇచ్చి, బియ్యం క‌డుగు నీళ్లు అనుపానంగా ఇస్తే, ఏ హార్మోన్లూ అక్క‌ర లేకుండా చ‌క్క‌గా త‌గ్గుతుంది. శారిబాద్యాస‌వం, ద్రాక్షారిష్ట కూడా ఇస్తే ఇన్‌ఫెక్ష‌న్‌, బ‌ల‌హీన‌త కూడా త‌గ్గుతాయి. ఇవి తీవ్ర‌త‌ని బ‌ట్టి ఎక్కువ మోతాదు కూడా ఇవ్వ‌వ‌చ్చు.

ఇక అశ్ర‌ద్ధ‌వ‌ల్ల కాని, ఇత‌ర కార‌ణాల వ‌ల్ల కాని చాలాకాలం నుంచి ఉంటే అశోకారిష్ట‌, చోల‌బ‌ద్ధ‌ర‌సం, ల‌క్షాది గుగ్గులు, చంద్ర ‌ప్ర‌భావ‌టి, ప్ర‌వాళ‌ భ‌స్మం, లోద్రాస‌వం, శ‌తావ‌రీ ఘృతం వంటివి ఉప‌యోగ‌పడ‌తాయి. చ‌లువ మిరియాల చూర్ణం అర‌చెమ్చా, ప‌టిక చూర్ణం నాలుగు చిటికెలు క‌లిపి మూడు పొట్లాలుగా ఉద‌యం, మ‌ధ్యాహ్నం, సాయంత్రం ఇస్తూంటే, నాలుగు రోజుల్లో త‌గ్గుతుంది.

వేయించిన శ‌న‌గ‌పిండి రెండు చెమ్చాలు, పంచ‌దార చెమ్చా, దాసిన చెక్క చూర్ణం అర‌చెమ్చా క‌లిపి రోజూ మూడుపూట్లా ఇస్తోంటే ఈ వ్యాధి త‌గ్గుతుంది.

మెత్త‌టి బియ్య‌పు పిండి 3 తుల‌ములు

ప‌టిక‌బెల్లం చూర్ణం ఒక తులం

 నెయ్యి ఒక తులం

 మామిడి జీడి చూర్ణం అర‌తులం

క‌లిపి పాలుపోసి ఉడికించి ప్ర‌తి రోజూ తీసుకుంటుంటే చాలా వ‌ర‌కు త‌గ్గిపోతుంది. మిన‌పిండి పాల‌తో, బెల్లంతో క‌లిపి తిన‌టం, ఆవుపాలు త్రాగుతూ ఉండ‌టం, తేనె తీసుకోవ‌డం, పులుపు, కారాలు త‌గ్గించ‌డం చాలా హిత‌క‌రం.

Post a Comment

0 Comments