Ticker

6/recent/ticker-posts

Ayurveda for Kidney Stone: ఆయుర్వేదంతో కిడ్నీ స్టోన్స్‌కి శాశ్వ‌త ప‌రిష్కారం

Ayurveda for Kidney Stone: రాత్రి ప‌ద‌కొండు గంట‌లైంది. కొద్దిగా పొత్తిక‌డుపులో ఎడమ వైపు నొప్పి ప్రారంభ‌మ‌య్యింది. అది నిమిష నిమిషానికి ఎక్క‌వుతూ ప్ర‌క్క‌ల‌కి, వీపు ఎడం వైపున కూడా నొప్పి పెరుగుతోంది. అబ్బాయి నొప్పితో అరుస్తున్నాడు. డాక్ట‌ర్ గారు చూసి ఇది కిడ్నీ వున్న ప్రాంతం. బ‌హుశా రాళ్లు ఉండ‌వ‌చ్చ‌న్నారు. త‌ర్వాత ప‌రీక్ష‌ల‌లో అదే నిర్థార‌య్యింది. అయితే ఈ కిడ్నీలో రాళ్ళ‌ని అశ్మ‌రి అంటుంది ఆయుర్వేదం (Ayurveda).
image show Ayurveda for Kidney Stone

కిడ్నీల‌లోనే కాక గాల్ బ్లేడ‌ర్‌లోనూ కూడా ఈ రాళ్లు త‌యారు కావ‌చ్చు. సంస్కృత‌లో అశ్మ‌రి అంటే రాయి. పాషాణంలా చిన్న గుళిక‌లా ఉంటుంది. క‌నుక దీన్ని అశ్మ‌రి అంటారు. పూర్వ‌పు రోజుల‌లో కూడా ఈ అశ్మ‌రీ ఉన్నా, నేటి కాలంలో ఆహారంలో, నీటిలో ఉండే కాలుష్యాల వ‌ల్ల మ‌నం అస‌లు అంత‌ర్ శ‌రీర శుద్ధి చేసుకోక‌పోవ‌డం వ‌ల్ల మ‌న దేశంలోనే కాదు ప్ర‌పంచంలో అన్ని ప్రాంతాల్లో ఇది సాధార‌ణంగా వ‌స్తుంది.

ముప్పై సంవ‌త్స‌రాల త‌రువాత ప్ర‌తీ 37వ వ్య‌క్తికి ఇది రావ‌చ్చున‌ని సూచింబ‌డింది. సాధార‌ణంగా మ‌న ఆహారంలో ఉండేటువంటి ఖ‌నిజాల‌ని జీర్ణం త‌రువాత ఎక్క‌డా ఉండిపోకుండా మూత్రం ద్వారా బ‌య‌ట‌కు పంపుతుంది శ‌రీరం. దానివ‌ల్ల ఈ ఖనిజాలు ఒక‌దాని కొక‌టి అంటుకొని గ‌ట్టి ప‌డ‌కుండా ఉంటాయి.

Ayurveda for Kidney Stone: కిడ్నీలో రాళ్లు ఎలా త‌యార‌వుతాయి?

ఒక్కొక్క‌ప్పుడు మ‌న‌లో నీటి ప‌రిమాణం త‌గ్గిన‌ప్పుడు ఈ ఖ‌నిజాలు గ‌ట్టిప‌డి చిన్న చిన్న ప‌ల‌కులుగా త‌యార‌వుతాయి. అవి ఇసుక‌రేణువులుగానో, చిన్న చిన్న గుల‌క రేణువులుగానో, ఆవ‌ గింజ‌లుగానో త‌యార‌వుతాయి. ఇవి అప్పుడు వెళ్ల‌కుండా ఉన్న ఖ‌నిజాల్ని బ‌ట్టి ఉంటుంది. ఈ కిడ్నీలో రాళ్లు ఆడ‌వారి క‌న్నా మగ‌వారిలో అధికంగా ఏర్ప‌డ‌తాయి. ఈ వ్యాధి సాధార‌ణంగా స్త్రీ పురుషుల‌లో,  మ‌ధ్య వ‌య‌సు వారిలో వ‌స్తుంది.

కిడ్నీలో రాళ్లు (Kidney Stone) చాలా గ‌ట్టిగా ఉంటాయి. ఇది కిడ్నీ అంచుల‌లో కాని, మూత్రాశ‌ యంలో కాని, మూత్ర వాహిక‌లో కాని ఉండిపోతాయి. దాని చుట్టూ రక్తం చేరి పొత్తి క‌డుపు పైన‌, కుడి ఎడ‌మ‌ల ఎటువైపు అయినా, గ‌జ్జ‌ల‌లోకి, వీపులోనూ నొప్పి వ‌స్తుంది. ఈ రోజుల్లో ఈ నొప్పి సాధార‌ణ‌మైనా, హ‌ఠాత్తుగా ఆరంభ‌మై ఎంత విప‌రీత‌మైన‌దిగా ఉంటుం దంటే ప్ర‌స‌వ నొప్పులు క‌న్నా తీవ్రంగా ఉంటుంది.

కిడ్నీలు మ‌న క‌డుపులో వెనుక భాగంలో ఉంటాయి. ఇవి మ‌న శ‌రీరంలోని వ్య‌ర్థ ప‌దార్థాల‌ని వ‌డ‌పోసి మూత్ర‌శ‌యం, మూత్ర‌వాహిక ద్వారా బ‌య‌ట‌కు పంపుతాయి. మ‌న దేశంలో అన్నిచోట్లా ఈ వ్యాధి ప్ర‌బ‌లివున్న‌ప్ప‌టికీ రాజ‌స్థాన్‌, సౌరాష్ట్రాల‌లో Stone Belts అంటారు.

మ‌న మూత్రం గ‌ట్టిప‌డి న‌ప్పుడు మూత్రం ద్వారా ఈ గ‌ట్టిప‌డిన రేణువులు వెళ్ల‌లేన‌ ప్పుడు అవి లోప‌ల ఉండి నొప్పిని క‌లుగ‌జేస్తాయి. కాల్షియం, అమోనియం ఫాస్పేటు, యూరిక్ ఆసిడ్ వంటివి ఈ ఖ‌నిజాలు. ఇది ఒత్తిడి వ‌ల్ల‌, చుట్టూ వాయ‌టం వ‌ల్ల బాధ తీవ్ర‌త ఉంటుంది. కాల్షియం స్టోన్స్ అనీ, ఆక్స‌లేట్ స్టోన్స్ అనీ, ఫాస్పేట్ స్టోన్స్ అనిర‌క‌ర‌కాలుగా ఉంటాయి.

కిడ్నీ యొక్క‌ వ్యాధి ల‌క్ష‌ణాలు

నులిపెడుతున్న‌ట్టు, నొక్కుతున్న‌ట్టుగా క‌డుపులో మొద‌లై వెనుక‌వైపుకి పెరుగుతుంది. నొప్పి తీవ్రంగా గ‌జ్జ‌ల నుండి ఎక్కువ అవుతుంది.వాంతి, వికారం వంటి వాటితో బాధ‌ప‌డ‌తారు. మూత్రంలో ర‌క్త‌పుచారిక ఉండ‌వ‌చ్చు. ర‌క్తంతో పాటు చీము కూడా మూత్రంతో వ‌స్తుంది. మూత్రం కొద్దికొద్దిగా వ‌స్తూ ఉంటుంది.

వ్యాధి రావ‌డానికి కార‌ణాలు

మ‌న శ‌రీరంలో తెలియ‌ని లోపాలు, ద్ర‌వ ప‌దార్థాలు త‌క్కువ‌గా తీసుకోవ‌డం, ఆహారం స‌రిగా లేక‌పోవ‌డం, పుల్ల‌టి ప‌దార్థాలు ఎక్కువుగా తిన‌డం, విట‌మిన్ డి ఎక్కువుగా వాడ‌టం కార‌ణాలు అని వైద్యులు చెబుతున్నారు. ఋతువు మారిన‌ప్పుడు విరేచ‌నాదుల‌చే శ‌రీరాన్ని శుభ్ర‌ప‌ర‌చుకోక పోవ‌డం, ఆహారంలో లోపాలు, ఎక్కువ నీరు త్రాగ‌క‌పోవ‌డం వంటివి కూడా కొన్ని ముఖ్య కార‌ణాలు అని ఆయుర్వేదం అంటుంది. 

ఒక్కోసారి మ‌న‌కి కిడ్నీలో రాళ్లు ఏర్ప‌డితే  ఆప‌రేష‌న్ చేసి వాటిని విచ్ఛిన్నం చేసినా చాలా కాలం దాకా ఆ ఏర్ప‌డే స్వ‌భావం శ‌రీరంలో ఉంటుంది. క‌నుక మ‌నం జాగ్ర‌త్త‌గా ఉండాలి. సాధార‌ణంగా ఈ రాళ్లు చిన్న‌విగా ఉంటాయి. 4 ఎంఎం కానీ, అంత‌కంటే ఎక్కువ సైజులో గాని ఉంటాయి.

తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు (Ayurveda for Kidney Stone)

కిడ్నీలో రాళ్లు ఉన్నాయ‌ని తెలిసిన త‌ర్వాత పాల‌కూర‌, క్యాబేజీ, క్యాలీఫ్ల‌వ‌రు, ట‌మేటో, ముల‌ క్కాయ‌, కాల్షియం ఎక్కువ‌గా ఉండే పానీయాలు క‌నీసం ఆరు నెల‌లు మానేయాలి. పాలు ఎక్కువ‌గా త్రాగ‌కూడ‌దు. ఎక్కువ నీళ్ళు, ప‌ళ్ల ర‌సాలు త్రాగ‌డం మంచిది. ద్రాక్ష‌ర‌సం మంచిది. ఊర‌గాయ‌లు, ఎక్కువ ఉప్పు, పులుపు ప‌దార్థాలు తిన‌కూడ‌దు. ఎక్కువ మ‌ద్యం త్రాగ‌కూడ‌దు. 

కొబ్బ‌రి నీళ్లు వీళ్ల‌కి చాలా మంచిది. బార్లీనీళ్లు కూడా ఈ స్థితిలో చాలా ఉప‌యోగ‌క‌రం. పుచ్చ‌కాయ‌, నీరుల్లి ర‌సం చాలా మంచిది. పెస‌ర‌క‌ట్టు, రాగిచెంబులో క‌నీసం మూడుగంట‌లు నిల‌వ ఉంచిన నీళ్లు మ‌న కిడ్నీలో రాళ్లు రాకుండా కాపాడ‌తాయి. 

గోక్షూరాది చూర్ణం వారుణ‌పాషాణ‌బేది, భూమ్యామ‌ల‌కి, తుల‌సి, అజా మోదా వంటి వంటి మూలికల‌తో చేసిన స‌హ‌జ ఔష‌ధాలు ఈ కిడ్నీలో రాళ్ల‌కి శాశ్వ‌త ప‌రిష్కారాన్నిస్తాయి. ముఖ్యంగా చాక్లెట్లు, పిజ్జాలాంటి ప‌దార్థాలు పిల్ల‌ల‌కి పెట్ట‌కూడ‌దు. వాళ్ల‌కి కూడా ఈ వ్యాధి రాకూడ‌ద‌ని లేదు. రావ‌చ్చు కూడా. నారింజ‌ర‌సం, కాల్షియం రాళ్ళ‌ని ఏర్ప‌డ‌కుండా కాపాడుతుంది. 

ఆయుర్వేద చిట్కాలు

ఉద‌యం కాలంలో సూర్య‌ర‌శ్మి ఎక్కువ శ‌క్తివంత‌మైన‌ది. అందుకే బాల‌భానుని లేత గులాబీరంగు కిర‌ణాల‌లో తిర‌గ‌డం కానీ, కూర్చోవ‌డం కాని ఆయుష్క‌రం. ప్రాతఃకాలంలో చ‌న్నీటి స్నానం హిత‌క‌రం. త‌ల‌మీద (Ayurveda for Kidney Stone) ఎప్పుడూ చ‌న్నీటిస్నానం చేయ‌కూడ‌దు. జీవ‌న‌దిలో త‌ప్ప‌. రాత్రి ఆహారం బలానిస్తుంది. ఆక‌లి లేక‌పోతే మ‌ధ్యాహ్నం కొంచెం త‌గ్గించైనా రాత్రి ఆహారం తినండి, మాన‌కండి.

Post a Comment

0 Comments