Ticker

6/recent/ticker-posts

digestive diseases symptoms: జీర్ణాశ‌య వ్యాధుల‌కు హోమియోతో ప‌రిష్కారం సుల‌భం!

digestive diseases symptoms: ప్ర‌తి ఒక్క‌రూ వారి జీవితంలో దాదాపు ఒక్క‌సారైనా క‌డుపునొప్పితో బాధ‌ప‌డే ఉంటారు. పొత్తి క‌డుపులో ఏదో అవ‌య‌వం వ‌ల్ల ఇలాంటి ప‌రిస్థితి వ‌స్తూ ఉంటుంద‌ని వైద్యులు చెబుతున్నారు.

image show digestive diseases symptoms

digestive diseases symptoms: జీర్ణాశ‌య వ్యాధుల‌కు హోమియోతో ప‌రిష్కారం

గాల్‌స్టోన్స్ అంటే ఏమిటి?

గాల్ స్టోన్స్ (Gallstones) అంటే పిత్తాశ‌యంలో రాళ్లు త‌యారు కావ‌డ‌మే. వ్యాధి నిర్థార‌ణ జ‌ర‌గాలంటే ప‌రీక్ష‌లు ముఖ్యం. ఈ రాళ్ళు ఉండటం వ‌ల్ల వాపు ఉంటుంది. క‌డుపులో తీవ్ర నొప్పి ఉంటుంది. పొత్తి క‌డుపు ఎగువ భాగంలో నొప్పి ఉంటుంది. ఎప్పుడైతే పిత్తాశ‌యం వాచి ఉంటుందో రాళ్లు ఉన్న‌ట్టు అనుమానించాలి. కొవ్వు ప‌దార్థాలు తిన్న త‌ర్వాత ఈ స‌మ‌స్య మ‌రింత జ‌ఠిల‌మ‌వుతుంది.

పాంక్రియాటైటిస్ అంటే ఏమిటి?

పాంక్రియాస్‌లో మంటరావ‌డం, పొత్తిక‌డుపుపై భాగాన నొప్పి రావ‌డ‌మ‌నేది పాంక్రి యాటైటిస్ (Pancreatitis) వ్యాధి ల‌క్ష‌ణాలు. వాహ‌నాలు న‌డిపే స‌మ‌యంలో ఈ నొప్పి తీవ్రంగా ఉంటుంది. వాంతులు రావ‌డం ఈ వ్యాధి ల‌క్ష‌ణంగా చెప్ప‌వ‌చ్చు. ఆల్కాహాలును తీవ్రంగా సేవించ‌డం వ‌ల్ల పాంక్రియాటైటిస్ రావ‌డానికి అవ‌కాశాలున్నాయి. పిత్తాశ‌యం, పాంక్రియాస్ జీర్ణ‌ర‌సాల‌ను విడుద‌ల చేస్తాయి.

జెర్డ్ అంటే?

గ్యాస్ట్రోఈసోఫాగ‌ల్ రిఫ్ల‌క్స్ డిసీజ్ (జెర్డ్‌) వ్యాధి వ‌ల్ల క‌డుపు పైభాగంలో నొప్పి ఉంటుంది. మితిమీరి ఆహారం సేవించ‌డం వ‌ల్ల లేదా కొవ్వు ఆహార‌ప‌దార్థాలు సేవించ‌డం వ‌ల్ల ఈ వ్యాధి వ‌స్తుంది. 

లాక్టోస్ ఇన్‌టోలెరెన్స్ అంటే?

లాక్టోస్ ఇన్‌టోలెరెన్స్ వ్యాధికి ప్ర‌పంచ వ్యాప్తంగా మిలియ‌న్ల మంది బాధితుల‌వుతున్నారు. పాల ప‌దార్థాల వ‌ల్ల ఈ వ్యాధి వ‌స్తుంది. ఈ ర‌క‌మైన ఆహార ప‌దార్థాలు సేవించ‌డం వ‌ల్ల పొత్తి క‌డుపు పై భాగంలో తీవ్ర నొప్పి వ‌స్తుంది. కాబ‌ట్టి డైరీ ఉత్ప‌త్తుల‌కు దూరంగా ఉండాలి. డైరీ ఉత్ప‌త్తులు పాలు, వెన్న‌, చీజ్ వంటి వాటికి దూరంగా ఉండాలి. 

సైడ్ ఎఫెక్ట్స్‌

ప్ర‌తీ మందూ ఎంతో కొంత శ‌రీరంపై దుష్‌ప్ర‌భావాన్ని చూపిస్తుంది. దీనివ‌ల్ల క‌డ‌పు నొప్పి రావ‌డం స‌హ‌జ‌మే. ఎముక సాంద్ర‌త‌ను త‌గ్గించే మందులు చాలా ఉన్నాయి. అల్స‌ర్ వ్యాధి రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణాల‌లో మితిమీరి మందులు వాడ‌ట‌మేన‌ని ఇటీవ‌ల ఒక స‌ర్వేలో తేలింది.

డైవ‌ర్టిక్యులిటిస్ అంటే?

ఈ వ్యాధి (Diverticulitis) పెద్ద‌పేగు అనారోగ్యానికి గురైన‌ప్పుడు వ‌స్తుంది. పెద్ద పేగుకు రంధ్రాలు ప‌డ‌ట‌మే డైవ‌ర్టిక్యులిటిస్ అంటారు. మ‌ల విస‌ర్జ‌న స‌మ‌యంలో తీవ్ర అసౌక‌ర్యం క‌లుగుతుంది. ఫైబ‌ర్ ఎక్కువుగా ఉన్న ఆహార ప‌దార్థాల‌నే తినాలి. ఈ వ్యాధికి స‌ర్జ‌రీ అవ‌స‌ర‌మ‌వుతుంది.

గ్లూటెన్ ఇన్‌టోలెరన్స్‌

గ్లూటెన్ ఇన్‌టోలెర‌న్స్ వ్యాధినే సెలియాక్ డిసీజ్ (Celiac disease) అంటారు. చిన్న పేగు దెబ్బ‌తిన‌డం వ‌ల్ల ఈ వ్యాధి వ‌స్తుంది. 

ఎండో మెట్రియోసిస్ (Endometriosis) అంటే?

ఎండో మెట్రియోసిస్ అనే వ్యాధి మ‌హిళ్లోనే వ‌స్తుంది. గ‌ర్భాశ‌య అంచు క‌ణాలు ఇత‌ర అవ‌య‌వాల్లో పెరిగి పెద్ద‌ద‌వ్వ‌డ‌మే ఎండోమెట్రియోసిస్ వ్యాధి అంటారు. నొప్పి, ర‌క్త‌స్రావం, వంధ‌త్వం దీని ల‌క్ష‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. దీనికి స‌ర్జ‌రీ చేయాల్సి ఉంటుంది. మ‌హిళ‌ల నెల‌స‌రి స‌మ‌స్య‌లు ఎక్కువుగా ఉంటాయి. 

అల్స‌ర్స్ అంటే?

పొత్తి క‌డుపులో ప‌దే ప‌దే నొప్పి వ‌స్తుంటే అల్స‌ర్స్ (ulcer) గా అనుమానించాలి. భోజ‌నం తీసుకున్న వెంట‌నే ఈ స‌మ‌స్య వ‌స్తుంది. పుల్ల‌టి ప‌దార్థాలు తిన్న‌ప్పుడు ఈ స‌మ‌స్య మ‌రింత జ‌టిల‌ మ‌వుతుంది. రాత్రిపూట ఈ నొప్పి వ‌స్తుంది. జీర్ణాశ‌యం (digestive diseases symptoms)లో ఉన్న పుండుకు స‌రైన చికిత్స అందిస్తే అల్స‌ర్‌ను అరిక‌ట్ట‌వ‌చ్చు.

Post a Comment

0 Comments