eye care tips in telugu: ఆ కళ్లు ఆరోగ్యంగా ఉన్నాయంటే కచ్చితంగా వారి కళ్ళల్లో మెరుపు ఉం టుంది. ఆ మెరుపు కళ్ళు ముఖానికి వన్నె తెస్తుంది. ఎప్పటికీ అందం, మేకప్ వంటి పై మెరుగుల వల్ల రానేరాదు. మనం తీసుకునే ఆహారంతోపాటు మానసిక ఆనందం తప్పనిసరి. కాబట్టి కళ్లు అందంగా కనిపించాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం!.
eye care tips in telugu: ఆరోగ్యకరమైన కళ్ళు కోసం చిట్కాలు!
కళ్లు మంచిగా కనిపించాలంటే విటమిన్ ఎ, సిలు పుష్కలంగా ఉండే క్యారెట్లు, చిలగడ దుంపలు, పాలకూర, జామకాయలు, సిట్రస్తో ఉన్న పండ్లు లాంటి ఆహార పదార్థాలను తినాలి. డాక్టర్ సలహా మేరకు ఒమేగా 3 క్యాప్సూల్స్ కూడా తీసుకోవచ్చు. రోజూ ఉదయాన్నే బీట్‌రూట్ రసం తాగాలి. రుచి కోసం ఒక ముఖ్క నిమ్మకాయ పిండుకోవచ్చు.
అలసిపోయిన కళ్ళకు ఉపశమనం కలగాలంటే రెండు అరచేతులనీ గట్టిగా వేడి పుట్టే వరకు రుద్ది ఆ చేతులను కళ్ళ మీద పెట్టుకోవాలి. కళ్ళు విశ్రాంతిని పొంది తాజాగా ఉంటాయి.
ఒక గిన్నెలో వేడి నీరు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న ఐస్ ముక్క (ice cubes ) తీసుకుని కనుగుడ్లపై వృత్తాకారంలో రుద్దాలి. దీని వెంటనే కొంత దూదిని తీసుకుని వేడినీటిలో ముంచి కళ్ళపై పెట్టుకోవాలి. ఈ విధంగా చన్నీటిని, వేడి నీటి ప్రక్రియను ఏడెనిమిది సార్లు చేయాలి. కళ్ళకు విశ్రాంతి దొరకడమే కాదు, తప్పకుండా కళ్ళకు మెరుపు వస్తుంది.
ఒక టీ స్పూన్ టీ ఆకులు, పావు కప్పు నీటితో చిక్కగా బ్లాక్ టీ (black tea) డికాక్షన్ పెట్టుకుని, ఒక ఐదు నిమిషాలు దాన్ని ఫ్రిజ్లో ఉంచి చల్లారనివ్వాలి. తర్వాత బయటకు తీసి అం దులో దూది ఉండలను ముంచి తీసి మూసిన కనురెప్పలపై పెట్టుకోవాలి. ఒక 15 నుంచి 20 నిమిషాలు అలా వదిలేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కంటి మీద ఉంచిన దూది ఉండల్లోని రసాన్ని కళ్ళలోనికి వెళ్లేలా కళ్ళను గట్టిగా పట్టి ఉంచాలి. ఇలా కళ్లు నుంచి నీరు కారేంత వరకూ చేయాలి. ఇలా చేస్తే కళ్ళు తాజాగా మెరుస్తూ ఉంటాయి.
కీరా రసంలో దూది ఉండలు ముంచి కళ్ళపై ఉంచినా కళ్ళు బాగుంటాయి. కళ్ళకు చలువ అద్దాలు పెట్టుకుని ఎండలోకి వెళ్ళడం వల్ల కళ్ళకు హాని జరగదు. మెడిటేషన్ లేక యోగా చేసి రిలాక్స్ అవడం, దీర్ఘంగా శ్వాస తీసుకుని నెమ్మదిగా వదులుతూ సానుకూల ధృక్పథంతో ఉంటే, ప్రశాంతంగా (eye care tips in telugu) ఉంటుంది.
కంటి కింద నల్లటి వలయాలు (black dark eyes) పోవాలంటే?
eye care tips: కంటి కింద నల్లటి వలయాలు ఉంటే బాదం పప్పును నానబెట్టి తర్వాత మెత్తటి పేస్టులా చేసుకుని దానికి పచ్చి బంగాళదుంప తురుము కలిపి కంటి కింద రాసుకుంటే వలయాలు మాయ మవుతాయి. బాదం నూనెతో కంటి చుట్టూ మర్ధన చేసుకుంటే వలయాలను అరికట్టవచ్చు. దోసకాయ కూడా కళ్ళ కింద వలయాలను అరికట్టేందుకు బాగా ఉపకరిస్తుంది. మరి కొందరికైతే కళ్ళ కింద ముడతలు ఉంటే ఫ్రిజ్లో ఉంచిన టీ బ్యాగులను ఒక 15 నిమిషాల పాటు కళ్ళపై ఉంచుకుంటే చక్కటి ఫలితం కనిపిస్తుంది.

0 Comments