Ticker

6/recent/ticker-posts

kamala fruit: క‌మ‌లా పండుతో అద్భుత‌మైన ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు

kamala fruit: చూడంగానే నోరూరించే గ‌మ్మ‌త్తైన పండు క‌మ‌లాపండు. పుల్ల‌గా, తీయ‌గా ఉంటుంది. బ‌య‌ట తోపుడుబండ్ల మీద‌, మార్కెట్‌లో ఎక్క‌డ చూసినా ఇవే పండ్లు క‌నిపిస్తాయి క‌దా!. క‌మ‌లా పండు ఆరోగ్యానికి అద్భుమైనదిగా చెప్ప‌వ‌చ్చు. 

image show kamala fruit

క‌మ‌లా పండు (Orange fruit) లో సిట్ర‌స్ ఎక్కువ‌గా ఉంటుంది. ఇది చ‌ర్మం,ఊపిరితిత్తులు, క‌డుపు, ప్రేవుల్లో క్యాన్స‌ర్ రాకుండా కాపాడుతుంది. క‌మ‌లా ర‌సం తాగితే కిడ్నీ జ‌బ్బులు ద‌రి చేర‌వు. ఒక వేళ కిడ్నీల్లో రాళ్లు ఏర్ప‌డే అవ‌కాశం ఉంటే ఈ పండు నిరోధిస్తుంది. కాలేయ క్యాన్స‌ర్‌ను అరి క‌డుతుంది. శ‌రీరంలో కొవ్వును త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. 

kamala fruit లో ఫైబ‌ర్ ఉంటుంది. ఇది జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌రుస్తుంది. ఆక‌లిని పుట్టిస్తుంది. శ‌రీరానికి కావాల్సిన పొటాషియం, మెగ్నీషియం ఈ పండులో పుష్క‌లంగా ల‌భిస్తుంది. vitamin c కూడా ఎక్కువ‌గా ఉంటుంది. ఏమైనా వైర‌ల్ ఇన్‌పెక్ష‌న్స్ వ‌చ్చినా రాకుండా చూస్తుంది. శ‌రీరంలో ఏమైనా మ‌లినాలు వుంటే శుద్ధి చేసి, జీర్ణ‌కోశ స‌మ‌స్య‌ల‌ను చ‌క్క‌బ‌రుస్తుంది. 

kamala fruit: క‌మ‌లాపండుతో చ‌క్క‌ని అందం మీసొంతం!

క‌మ‌లాపండు తొక్క‌ని వ‌లిచి ఎండ‌బెట్టి పొడి చేసుకోవాలి. రెండు చెంచాల ఈ పొడిలో కాస్త పాలు, చెంచా గంధం క‌లిపి ముఖానికి ప‌ట్టించాలి. 20 నిమిషాల త‌ర్వాత నీటితో క‌డిగేసుకుంటే ముఖం కాంతివంతంగా త‌యార‌వుతుంది. 

2 చెంచాల క‌మ‌లా పండు తొక్క పొడిలో చెంచా అలివ్ నూనె, 2 చెంచాల పెస‌ర‌పిండి క‌లిపి ఒంటికి ప‌ట్టించి న‌లుగు పెట్టిన‌ట్టుగా రుద్దాలి. త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటిలో 2 చుక్క‌ల తేనె క‌లిపి స్నానం చేస్తే చ‌ర్మం(skin) మృదువుగా త‌యార‌వుతుంది. 

జిడ్డు చ‌ర్మం క‌లిగిన వారు 3 చెంచాల క‌మ‌లాఫ‌లం ర‌సంలో చెంచా ఓట్ మీల్ పొడి, చెంచా తేనె క‌లిపి ముఖానికి రాసుకుని 5 నిమిషాలు మృదువుగా మ‌ర్ధ‌న చేయాలి. అది ఆరాక కూల్ వాట‌ర్‌తో క‌డిగేసుకోవాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తుంటే చ‌ర్మం తాజాగా ఉంటుంది. 

న‌ల్ల‌గా వున్న‌వారు కాస్త క‌ల‌ర్ రావాలంటే స‌మాన ప‌రిమాణంలో క‌మ‌లాఫ‌లం ర‌సం, నిమ్మ‌ర‌సం తీసుకుని 2 చుక్క‌ల తేనె క‌లిపి రోజూ రెండుపూట‌లా రాసుకుంటే ఫ‌లితం ఉంటుంది. 

నిద్ర‌లేని వారికి, అల‌సే ప‌నులు చేసే వారికి క‌ళ్ల కింద న‌ల్ల‌టి వ‌ల‌యాలు వ‌స్తుంటాయి. అలాంట‌ప్పుడు క‌మ‌లాపండు (kamala fruit) రసంతో కాస్త పాలు క‌లిపి దానిలో ముంచిన దూదితో క‌ళ్ల‌కింద తుడిస్తే స‌మ‌స్య దూర‌మ‌వుతుంది.

Post a Comment

0 Comments