Ticker

6/recent/ticker-posts

karivepaku: క‌రివేపాకు ఆకే క‌దా అని తీసిపారేయొద్దు

karivepaku: కూర‌ల్లో క‌రివేపాకు (Curry leaves) క‌నిపిస్తే చాలు తీసిపార‌వేయ‌డం చేస్తుంటారు. తాలింపుల్లో వేసి ఆ త‌ర్వాత తీసివేయ‌డం సుదీర్ఘ‌కాలంగా వ‌స్తున్న ఆన‌వాయితీ. క‌రివేపాకు ప‌లు ర‌కాల వ్యాధుల‌లో దివ్య ఔష‌ధంగా ప‌నిచేస్తుంద‌ని, తీసిపార‌వేయ‌కుండా తిన‌డం మంచిద‌ని వైద్య‌నిపుణులు చెబుతున్నారు.

image show karivepaku
 క‌రివేపాకు 

అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు గ‌ల క‌రివేపాకు గురించి తెలుసుకుంటే ఆశ్చ‌ర్యం క‌లుగుతుంది..! మీ జుట్టు ముందుగానే తెల్ల‌బ‌డిపోతోందా! అయితే క‌రివేపాకు క‌ల్పించే అద్భుత ప్ర‌యోజ‌నాలు తెలుసుకోవాల్సిందే. క‌రివేపాకు వంట‌ల్లో త‌ప్ప‌నిస‌రిగా ఉప‌యోగిస్తారు. ప్ర‌త్యేకంగా ద‌క్షిణ భార‌త‌ దేశం, శ్రీ‌లంక‌లో వంట‌కాల‌లో విరివిగా వాడ‌తారు.

క‌రివేపాకు పుట్టినిల్లు భార‌త‌దేశ‌మే. ఆయుర్వేద ఔష‌ధాల త‌యారీలో క‌రివేపాకు (Curry leaves in the preparation of Ayurvedic medicines) ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. మ‌ధుమేహం, పైల్స్‌, బొల్లి, చ‌ర్మ దుర‌ద‌లు, ఎర్ర‌టి మొటిమ‌లు, గ్యాస్‌, మ‌ల‌బ‌ద్ధ‌కం, డ‌యోరియా, వాంతులు లాంటి రుగ్మ‌త‌ల చికిత్స‌కు క‌రివేపాకు ఒక మంచి ఔష‌ధంగా ప‌నిచేస్తుంది.

karivepaku: క‌రివేపాకు అద్భుత కేశ‌వ‌ర్థ‌ని

త‌ల వెంట్రుక‌ల‌కు క‌రివేపాకు ఎంతో మేలు చేస్తుంది. (Curry leaves are very good for hair) ప్ర‌త్యేకించి ముందుగానే జుట్టు తెల్ల‌బ‌డుతున్నా, రోజుకు ఒక డ‌జ‌ను వెంట్రుక‌లు ఊడిపోతున్నా దీని ప‌రిష్కారానికి ఎంతో బాగా ప‌నిచేస్తుంద‌ని నిపుణులు అంటున్నారు.

శ‌రీరంలో అధిక వేడి ఉంటే వెంట్రుక‌ల‌కు స‌ర‌ఫ‌రా అయ్యే పోష‌కాలు త్వ‌ర‌గా హ‌రించుకుని పోతా య‌ని, అందువ‌ల్ల వేడి మూలంగా త్వ‌ర‌గా వెంట్రుక‌లు తెల్ల‌బ‌డ‌తాయ‌ని తెలిపారు. వెంట్రు క‌లు ఎక్కువ‌గా ఊడిపోయినా, ముందుగా జుట్టు తెల్ల‌గా (white hair) అవుతున్నా అర్థం చేసుకుని, మంచి పోష‌కాలు తీసుకోవ‌డం, వేడి త‌గ్గే ప‌దార్థాలు వాడ‌టం అవ‌స‌రం.

బ‌ట్ట‌త‌ల‌, త‌ల‌పై దుర‌ద‌లు, చుండ్రు లాంటివి నివారించాలంటే ప్ర‌తిరోజూ ఉద‌యం ప‌ర‌గ‌డ‌పున 7-8 క‌రివేపాకులు న‌మిలి తినాలని, ఆ త‌ర్వాత‌నే మంచినీళ్లు తాగాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. క‌రివేపాకు బాగా వ‌గ‌రుగా ఉండ‌టం వ‌ల్ల వేడి త‌గ్గిపోతుంది. క‌రివేపాకుల‌ను పుదీన‌, కొత్తిమీర‌, ఉసిరితో క‌లిపి ప‌చ్చ‌డి చేసుకోవ‌చ్చు. అందులో రుచికోసం కాస్త ఉప్పు వేయ‌వ‌చ్చు. 

కొబ్బ‌రినూనె లేదా నువ్వుల నూనెలో క‌రివేపాకులు వేసి కాచి చ‌ల్లార్చి త‌ల‌కు రాసుకుంటే న‌లుపురంగు రావ‌డానికి, జుట్టు పెరుగుద‌ల‌కు దోహ‌దం చేస్తుంది. అందులో కాస్త నిమ్మ‌ర‌సం కూడా క‌ల‌పాలి. చుండ్రు త‌గ్గ‌డానికి ఇది అద్భుతంగా ప‌నిచేస్తుంది. ప‌ది ర‌కాల మూలిక‌లు, క‌రివేపాకు, భృంగ‌రాజ్‌తో క‌లిపి జీవ హెయిర్ ఆయిల్ త‌యారు చేస్తున్నారు.

వెంట్రుక‌ల కుదుళ్లు బ‌ల‌ప‌డానికి క‌రివేపాకు (karivepaku) లు బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. కొత్త‌గా వెంట్రుక‌ల కుదుళ్లు ఏర్ప‌డి, ఆరోగ్యంక‌రంగా పెరిగి జుట్టు సాధార‌ణంగా త‌యార‌వుతుంద‌ని వైద్యులు అంటున్నారు.

జీర్ణ‌వ్య‌వ‌స్థ‌లో క‌రివేపాకు కీల‌కం

ఆయుర్వేద చికిత్సా విధానంలో ముందుగా రోగి ముఖం ప‌రీక్షించి గాకుండా జీర్ణాశ‌యం ప‌రిస్థితిని బ‌ట్టి చికిత్స చేస్తార‌ని నిపుణులు అంటున్నారు. ప్ర‌తి ఆరోగ్య స‌మ‌స్యా ముందుగా జీర్ణాశ‌యం ప‌ని విధానంలో తేడా రావ‌డం వ‌ల్ల ప్రారంభ‌మ‌వుతుంది. జీర్ణాశ‌యాన్ని శుభ్రం చేసి తిరిగి చ‌క్క‌గా ప‌నిచేయించ‌డంలో క‌రివేపాకు (Curry leaves are good for digestive system) ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని రుజువైంది. అదే విధంగా జీర్ణ వ్య‌వ‌స్థ కూడా ప‌టిష్ట‌మ‌వుతుంది.

మ‌జ్జిగ లేదా తేనెతో క‌లిపి క‌రివేపాకు పేస్టును ఇస్తే దాని వ‌ల్ల జీర్ణ‌కోశం శుభ్ర‌ప‌డి, మొత్తం వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌మ‌వుతుంద‌ని, త్వ‌ర‌గా రోగికి పూర్తి స్వ‌స్థ‌త చేకూరుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

క‌రివేపాకును కొబ్బ‌రి నూనె, మేథితో క‌లిపి త‌ల‌వెంట్రుక‌ల‌కు రాసిన‌ట్ల‌య‌తే చుండ్రు అదుపులో ఉండి, జుట్టు పెరుగుతుంది. karivepaku లు రుచిగా ఉండ‌వ‌నుకుని ఆహారంలోంచి తీసి వేయ‌ కూడ‌దు. వాటిని వ‌దిలిపెట్ట‌కుండా తిన‌డం వ‌ల్ల ఎన్నో ఉప‌యోగాలున్నాయి.

Post a Comment

0 Comments