Ayurveda For Pregnancy : ఒక
శివువు పుట్టినప్పటి నుండి ఆ
పసి వయస్సులో
తల్లి తీసుకునే సం రక్షణ, బాద్యత భవిష్యత్తులో ఉత్తమ వ్యక్తిగా
మారుస్తుంది. అప్పటి తల్లి
ఆరోగ్య రక్షణే
భవిష్య త్తులో సౌందర్య సౌకుమార్యాలకి, బిడ్డ ఎదుగుదలకి ప్రాతిపదికమవుతుంది.
తల్లీపిల్ల సరంక్షణ
ఆధునిక కాలంలో
మాదిరి పిల్లలు పుట్టినప్పటి నుండి కాక
పూర్వకాంలో
ముఖ్యంగా ఆయుర్వేదం తల్లిగర్భం
ధరించిన
రోజు నుండి
చక్కటి పరిచర్యని సూచించింది.
గర్భం
ధరించిన
క్షణం
నుండి అది
పెరిగి జననం పొందేదాకా
తల్లిని,
పెరుగుతున్న శిశువుని
దృష్టిలో ఉంచుకుని
మనం
చేసే జాగ్రత్తని గర్భిణీ పరిచర్య (Ayurveda For Pregnancy) అంటారు.
Ayurveda For Pregnancy : గర్భవతికి ఇచ్చే ఆహారం ఏమిటి?
ఆరోగ్యానికి తల్లి స్వయంగా చేసుకోవాల్సినవి శుచిగా ఉండటం, స్నానం, ధరించే బట్టల గురించి
జాగ్రత్త
పడాలి. వదులుగా ఉండి
సూర్యరశ్మి హాని
కలిగించని బట్టలు వేసుకోవాలి. నెలనెలా శిశువులో
ఏర్పడే
వృద్ధి, ఏర్పడే అవయవాలు దృష్టిలో
ఉంచుకొని తేలికైన,
బలమైన ఆహారం తీసుకోవాలి.
సంగీతం, చక్కటి కవనం, కథలు వింటూ
మనస్సుని ఆహ్లాదకరంగా ఉంచు
కుంటూంటే సిజేరియన్ (Cesarean) అక్కరలేకుండా సుఖప్రసవమవుతుంది.
గర్భవతికి ఇచ్చే ఆహారం,
జీర్ణమైన
తర్వాత
మూడు రకాలుగా ఉపయోగపడుతుంది.
ఒక భాగం
తల్లి
శక్తికి,
మరోభాగం
శిశువు ఎదుగుదలకి, మూడవ భాగం స్తనములను
చేరి పుట్టబోయే శిశువుకి
తల్లిపాల
రూపంలో ఆహారం
తయారవ్వడానికి, అందువల్ల అప్పుడిచ్చే ఆహారం
రసపుష్టి కలిగి జీవనీయపదార్థాలతో (Nutrients)
నిండి ఉండాలి.
ఆకలిని
చంపకూడదు. గర్భిణీకాలంలో
ఆవుపాలు, ఆవు
నెయ్యి హితకరం. మొదటి మూడు మాసాలలో తీయనైనది, చల్లనైనది అయిన
ఆహారం తల్లి తీసుకోవాలి.
పూర్తిగా ఉడికిన
అన్నం, పెసరపప్పు,
చిక్కని
మజ్జిగ
తీసుకోవడం
చాలా మంచిది.
నాలుగు నుండి
ఆరు నెలల వరకు పాలు, నెయ్యి
ఇవ్వాలి. శాఖాహారులు
కాని వారు
మాంసరసం తీసుకోవడం
మంచిది. నెలలు నిండేముందు ఒళ్లు
పెరగని సమతుల్య ఆహారం
ముఖ్యంగా పలచని
పాయసం,
ద్రాక్షరసం, బార్లీనీళ్లు తీసుకోవడం మంచిది. ఎల్లప్పుడూ పడుకోకుండా నువ్వుల
నూనె రోజూ
పొట్టపై
నుండి క్రిందకి రాసుకుంటుంటే సుఖప్రసవమవుతుంది.
చక్కటి
ఋతువు, సారవంతమైన నేల,
సంపూర్ణంగా నీరు,
మంచి విత్తనం చక్కటి పంటకి
కావాలి. అలాగే
సరియైన
ఋతుచక్రం
(Menstrual cycle), మంచి గర్భావయం,
మంచి ఆహారం,
చక్కగా తయారైన గర్భావ క్రాంతి,
మంచి ఆరోగ్యకరమైన ఆయుష్కరమైన శిశువుకుకారణమవుతాయని శుశృత మహాశయులంటారు. అలాగే
గర్భిణీగా
వున్న కాలంలో
ఎక్కువగా
విరేచనాలు,
వాంతులు, ఫిట్స్,
ఆయాసం, మూత్రం
ఆగిపోవడం
లేదా సరిగా రాకపోవడం, రక్తక్షీణత
వంటివి రాకుండా
చూసుకోవాలి.
ప్రసవం తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ప్రసవ కాలంలోనూ, తర్వాత తీసుకోవాల్సి.
జాగ్రత్తలను సూతికా
పరిచర్య అంటారు. ప్రసవం అయిన
తొలి మూడు
రోజులు తల్లి ఉప్పులేని
తేలికైన ఆహారం
తీసుకోవాలి. ప్రసవ వేదనంలో కదిలి అలిసిన
అవయవాలు, పొట్ట
కండరాలు
తిరిగి సహజ స్థితికి
వచ్చేవరకూ జాగ్రత్తగా ఉండాలి.
మొదటి
నెలంతా మంచి
ఉడికిన కూరలు, పాలు, నెయ్యి
తీసుకోవాలి. ఆకలిని పుట్టించే
పిప్పళ్లు,
ధనియాలు,
జీలకర్ర,
మోడి, సైంధవలవణం
వంటివి రాకుండా
చూసుకోవాలి.
ఆయుర్వేదం ప్రసవం తరువాత తొలి పదకొండు రోజులు
ఎలాంటి ఆహారం
తీసుకోవాలో చెప్పింది.
శతావరి, అశ్వగంధ
కలిసిన
టానిక్లు
తీసుకోవడం
మంచిది. వేడిచేసిన
నువ్వుల నూనె
రెండు చెమ్చాలు
ఉదయం
తీసుకుంటే, కదిలిపోయిన నడుం లోపలి
కండరాలు,
కింద పొట్టలోని కండరాలు, అవయవాలు స్థిరపడి చక్కగా నిలబడతాయి.
చెరుకురసం,
దర్బలకొసలతో కాచిన పాలు,
పాలు పడని తల్లులకిస్తే
పాలు నిండుతాయి.
మీకు తెలుసా!
ప్రసవానికి కొన్ని
గంటలకు ముందు దాకా
కడుపులో
ఉన్న బిడ్డకు పూర్వజన్మ జ్ఞానం కదలికలు
ఉంటాయి. ప్రసవమనే వేదన వల్ల
మెదడు
స్తంభించి సర్వ అవయవాలు ముకుళించుకుని
మావిచే కప్పబడి
దీర్ఘసుషుప్తిలో
జీవిస్తాడు శిశువు.
అప్పుడు అతని ప్రాణం నిలబెట్టడం,
శ్వాసక్రియ
ని ఆరంభింపచేయడం వెంటనే చేయాలి. ఆ
ప్రయత్నాన్ని, జాగ్రత్తని నవజాత శిశు
(A newborn baby) పరిచర్య అంటుంది ఆయుర్వేదం.
ఆసుపత్రులలో అన్నీ వారే చేసినా, సైంధవలవణం, నెయ్యి కలిపి శిశువు శరీరానికి రాసి సున్నితంగా నలుగులా నలచి వేడినీళ్లతో కడిగి వెచ్చని బట్టల మధ్య ఉంచడం వల్ల శిశువు శరీరం, చర్మం గట్టిపడతాయి. వేడినీళ్లలో మంచి గంధం, పసుపు, వేపాకులు వేసి కాచిన నీళ్ళతో శిశువుకు స్నానం (Ayurveda For Pregnancy) చేయించడం తొలి మాసాలలో హితకరం. వీలైతే బంగారం, వెండి వస్తువులని ఆ నీళ్ళలో ముంచి తీయడం మంచిది.
మూడవ రోజు మాతృస్తన్యంలో ఒక బొట్టు తేనె కలిపి బంగారపు ఉంగరంతో, బాబు నాలుకపై వేయడం మధుప్రాస అంటారు. ఇది సహజమైన ఇమ్యూనిటీని ఇచ్చే చక్కటి ప్రక్రియ. శిశువుకి పాలు, నెయ్యి, తేనె మంచి బాలరసాయనాలు అంటే శక్తిని, బుద్ధిని ఇచ్చే బలవర్థక మైన ఆహారాలు. తల్లీపిల్లల పరిచర్య మంచి మానవాళి మనుగడకు పరిచర్య.

0 Comments