Best Herbal Remedies: మన దేశంలో అనేక ప్రత్యేమ్నాయ వైద్య విధానాలు అమలులో ఉన్నాయి. వైద్యశాస్త్ర నిపుణులు, హేతువాదులు ఆయా వైద్య విధానాల ప్రామాణికతను ప్రశ్నించడం జరుగుతోంది.
గోమూత్రం, చేపమందు, లీచ్ థెరపి (Leech therapy) వంటివి వాటిలో కొన్ని. అయినప్పటికీ సామాన్య ప్రజలతో పాటు చదువుకున్న వారు కూడా ఆ విధానాలను అనుసరిస్తున్నారు. మంచి ఫలితాలు వస్తున్నాయని చెబుతున్నారు. వాటి ప్రామాణికత, నిజానిజాలను పరిశీలిద్ధాం.
Best Herbal Remedies : గోమూత్ర చికిత్స అంటే ఏమిటి?
ఆవును భారతీయులు పవిత్రమైనదిగా భావిస్తారు. ఆవుపాలు, ఆవు నెయ్యి వంటి వాటిలో మంచి పోషక విలువలున్నాయి. అయితే ఆవు యొక్క మూత్రంలో కూడా ఔషధ విలువలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది. గోమూత్రాన్ని(cow urine) వడగట్టి, స్టెరిలైజ్ (Sterilize) చేసి ప్రజలకు బాటిల్స్తో అందించే సంస్థలు కూడా ఉన్నాయి. నాగపూర్‌లో ఈ చికిత్స అధికంగా అమలులో ఉంది.
విశ్వాసాలు - గోమూత్రం వల్ల చర్మ వ్యాధులు, గుండె వ్యాధులతో పాటు ఎయిడ్స్ (Aids), క్యాన్సర్ వంటి మొండి వ్యాధులు నయమవుతాయనే విశ్వాసం ఉంది. శరీరం విసర్జించే అనేక సూక్ష్మ పోషక పదార్థాలను పూరిస్తుంది. కొలెస్టరాల్‌ను తగ్గిస్తుంది. లివర్ సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. జ్ఞాపక శక్తిని పెంచుతుంది. వృద్ధాప్యం దరిచేరనీయదు. గుండె, మెదడులోని కణాల్ని బలపరుస్తుంది.
ఆయుర్వేద వైద్య ప్రకారం - గోమూత్రం పైత్యం చేస్తుంది. కఫాన్ని తగ్గిస్తుంది. ఆయుర్వృద్ధిని ఇస్తుంది. జ్వరము, పైల్సు, దగ్గు, శ్వాసకోశ వ్యాధులు, కుష్టు, ఉబ్బు వంటి వ్యాధులను నయం చేస్తుంది. క్రిములను, వాటివల్ల వచ్చే రోగాలను నయం చేస్తుంది. మల, మూత్ర బద్ధకం రాకుండా చేస్తుంది. ఆకలిని పుట్టిస్తుంది. జీర్ణం చేస్తుంది.
డోసేజ్ - రోజుకో గ్లాసు తాగాలని నిపుణులు చెబుతున్నారు.
నిజమని తేలినవి - శాస్త్రీయంగా నిర్థారణ జరగకపోయినా గోమూత్ర చికిత్స వల్ల కొన్ని వ్యాధులు తగ్గుతాయని అంటున్నారు. అవి కొలెస్టరాల్ స్థాయి తగ్గిస్తుంది. జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ఏజిం గ్‌ని తగ్గిస్తుంది. కాలేయం సక్రమంగా పనిచేసేలా చేస్తుంది.
పోషకాలు - పరిశోధకుల అభిప్రాయం ప్రకారం గోమూత్రంలోని పోషకాలు ఏ,బీ,సీ,డీ,ఈ విటమి న్లు, సోడియం, మెగ్నీషియం, పొటాషియం, గంథకం, ఐరన్, నత్రజని వంటి మూలకాల, మాలిక్, సిట్రిక్, టైట్రిక్, సక్సీనిక్ ఆమ్లాలతో పాటు ఎంజైములు, హార్మోనులు, క్రియాటినిన్, లాక్టోజ్ వంటివి ఉన్నాయి.
జలగ వైద్యం అంటే ఏమిటి? (Aquatic medicine)
జలగల తో వైద్యం ఒక పురాతన పద్ధతి (Best Herbal Remedies). గ్రీస్, రోమ్ వంటి విదేశాలతో 80-40 BC లోనే ఇది అమలులో ఉంది. మనిషి శరీరం నుండి రక్తం పీల్చడం ద్వారా జలగ పొట్ట నింపుకుంటుంది. ఒక గంటలో 10 మి.లీ రక్తం తాగుతుంది.
రక్తం గడ్డకట్టకుంటే జలగ 12 రకాల రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. జలగ రకాన్ని బట్టి ఇవి మారుతుంటాయి. ఈ విషయాలే జలగలతో వైద్యానికి ఆధారాలు, జలగ వైద్యం యునానీ పద్ధతిలో చాలాకాలం నుండి అమల వుతోంది.
విశ్వాసాలు - జలగ ఉమ్మిలోని హైరుడిన్ రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. రక్తంలోని ప్లేట్‌లెట్స్ గుమిగూడ నివ్వదు. కరోనరి ఆర్టరీలోని గడ్డలను కూడా కరిగిస్తుంది. రక్తంలోని కంతులను కరిగిస్తుంది. నొప్పిని తగ్గిస్తుంది. రక్తసరఫరాను క్రమపరుస్తుంది.
వైద్య పద్ధతి - పసుపు జలగను ఉత్తేజపరుస్తుంది. అందువల్ల పసుపు కలిపిన నీటి టబ్‌లో జలగను ఉంచుతారు. ఆ తరువాత ఇన్ఫెక్ట్ అయిన రోగి శరీరంపై ఉంచుతారు. అది గంటలో సుమారు 10 మి.లీ రక్తం ఆ ప్రదేశం నుండి పీలుస్తుంది. ఆ తరువాత అది విడిపోతుంది. తదుపరి దెబ్బతగిలిన భాగం మీద డిజిన్ ఫెక్టెంట్ రాసి బ్యాండేజ్ వేస్తారు. జలగను పసుపు కలిపిన నీటిల వస్తే అది పీల్చిన రక్తాన్ని వమనం చేస్తుంది.
తర్వాత దానిని 15 డిగ్రీల నుండి 25 డిగ్రీల వద్ద సీసాలో భద్రపరుస్తారు. ఒక గుర్తింపుమార్కు ఇచ్చి, తిరిగి దానిని అదే రోగికి ఉపయోగిస్తారు. ఆరువారాల తర్వాత దాన్ని నాశనం చేస్తారు. సూక్ష్మరక్తనాళాలు, చిన్నరక్తనాళాలలో రక్తం గడ్డకట్టినప్పుడు, రక్తపు కంతులు ఏర్పడినప్పుడు ఆయా ప్రదేశాలకు రక్తసరఫరా సరిగ్గా జరగదు. అందువల్ల ఆయా భాగాలు నీలంగా మారడం వంటి అనేక ఇబ్బందులు కలుగుతాయి. అప్పుడు జలగలతో రక్తం పీల్చడం ద్వారా ఆ వ్యాధులు నయం చెయ్యడానికి వీలుకల్గుతుంది.
నిజమని తేలినవి - జలగలతో వైద్యం ద్వారా వాపులు, ఎన్నటికీ తగ్గని అల్సర్లు, ఫైల్స్, కొన్ని రకాల కంటి వ్యాధులు, కీటకాలు కుట్టడం వల్ల వచ్చిన బాథలు, మైగ్రేన్ తలనొప్పి, పాదాల మంటలు, పక్షవాతం, ఆస్టియో ఆర్డ్రెటిస్, జుట్టు (hair) రాలడం, వివిధ రకాల చర్మవ్యాధులు వంటివి తగ్గించవచ్చుననే నమ్మకాలు ఉన్నాయి.
పచ్చి ఉల్లిపాయతో వైద్యం (Healing with onion)
ఎండలో వడదెబ్బ తగలకుండా తలపై ఉల్లిపాయ పెట్టుకొని టోపీ ధరించడం, ఉల్లివాసన చూడటం పరిపాటి. అధిక ఉష్ణోగ్రతగల ప్రదేశాలలో పచ్చి ఉల్లిపాయను తింటారు.
విశ్వాసాలు - పచ్చి ఉల్లిపాయలో బి1, బి6 విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. మంచి శక్తిదాయకం. అధిక మొత్తంలో నీటిని కలిగి ఉంటుంది. ఫ్రీ రాడికల్స్తో పోరాడే శక్తి కలిగిఉంది. కొలెస్టరాల్‌ను 30 శాతం పెంచుకోవాలంటే ఒక పెద్ద ఉల్లిలో సగం ముక్కనైనా రోజూ తినాలి.
డోసెజ్- ఎండలో ప్రయాణం చెయ్యడానికి ముందు ఉల్లిని యథాతథంగా తినవచ్చు లేదా పెరుగులో అద్దుకు తినవచ్చు. చెట్నీలు, సలాడ్స్‌తో కూడా తీసుకొనవచ్చు.
నిజమని తేలినవి - వడదెబ్బను రాకుండా చేస్తుంది. రక్తం సరఫరాను క్రమపరుస్తుంది. బ్లడ్ ప్రెషర్‌ను తగ్గిస్తుంది. రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది.
చేప మందు అంటే ఏమిటి? (Fish medicine)
ఆస్త్మా, ఇతర శ్వాసకోశ వ్యాధులు తగ్గించేందుకు చేపమందు (Best Herbal Remedies) ఇస్తున్నారు. సుమారు 150 ఏళ్లుగా చేపమందు ఎంతో మంది ప్రజలు ఉపయోగిస్తున్నారు. చేపమందు విశ్వస నీయతను శాస్త్రజ్ఞులు, హేతువాదులు ప్రశ్నిస్తున్నా, వేలసంఖ్యలో దేశవిదేశాలలో ఈ మందుపై ఆసక్తి చూపిస్తున్నారు. ఉబ్బసానికి మంచి మందుగా పరిగణిస్తున్నారు. మృగశిర కార్తె మొదటిరోజున చేపమందును ఉబ్బస రోగులకు ఇస్తున్నారు.
విశ్వాసాలు - పసుపురంగు హెర్బల్ పేస్ట్, చిన్న మ్యూరియల్ చేపపిల్ల వాడే పదార్థాలు. హెర్బల్ ఫేస్ట్ ఏ విధంగా తయారుచేస్తారనేది చాలా గోప్యంగా ఉంచుతారు. ఉచితంగా ఇచ్చే ఈ మందును ఇతరులు తయారుచేసి వ్యాపారం చెయ్యకుండా ఉంచడం ముఖ్యోద్దేశం.
డోసేజ్- 2-3 అంగుళాల పొడవుండే చిన్న మ్యూరియల్ చేపపిల్ల నోటిలో పసుపురంగులో ఉండే హెర్బల్ మందు ఉంచుతారు. తరువాత ఆ చేపపిల్లను ఉబ్బసరోగి నోటిలో ఉంచి మింగిస్తారు. చేపపిల్ల లోనికి దిగేటప్పుడు అక్కడ పేరుకున్న కఫాన్ని కరిగిస్తుందని నమ్మకం.
నిజమని తేలినవి - చేపమందు ఉబ్బస వ్యాధిని తగ్గిస్తుంది. ఇది ఆయుర్వేద ఔషదం. కనీసం 3 సంవత్సరాలు వరుసగా చేపమందు తీసుకోవాల్సి ఉంటుంది.
బోన్ సెట్టింగ్ (Bone setting)
విరిగిన ఎముకలు అతుక్కోవడానికి, బెణుకులు వంటివి తగ్గించడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని పుత్తూరు ఇందుకు చాలా ప్రసిద్ధి చెందిన ప్రదేశం. పుత్తూరులోని బోన్‌సెట్టింగ్ హాస్పిట్‌లలో బోన్ సెట్టింగ్ చేసే ఎంతో మంది నిపుణులు ఉన్నారు. ఇందుకోసం అనేక రకాల హెర్బ్స్‌ను వాడతారు.
విశ్వాసాలు - ఎముకల్ని సరియైన స్థానంలో అమరుస్తారు. దానిపైన హెర్బల్ పేస్ట్ పూస్తారు. దానిలో వాడే వనమూలికలను గోప్యంగా ఉంచుతారు. హెర్బల్ మందు ఎముకలను స్థానచలనం చెందకుండా చూస్తాయని వారి విశ్వాసం. ఇదేలా పనిచేస్తుందో శాస్త్రీయమైన వివరణ లేదు. చర్మం పై రాసిన మందు లోపలి ఎముకల్ని ఎలా అతుక్కుందుకు ఉపయోగిస్తుందో తెలుసు కోవాల్సివుంది.
డోసేజ్ - ఆయా ప్రదేశాలను బట్టి వాడే వనమూలికలు, పద్ధతులలో మార్పు ఉంటుంది. పుత్తూ రులో బోన్ సెట్టింగ్ చాలా ప్రసిద్ధి చెందింది. ఏ పనిముట్లు వాడకుండా చేతులతో ఎముకలను స్వస్థానంలో ఉంచి సరిచేస్తారు. దానిపై గోప్యంగా ఉంచే హెర్బల్ పేస్ట్, గుడ్డుసొన రాస్తారు. కాటన్ క్లాత్‌తో కట్టుకడతారు. వెదురు కర్రలతో సపోర్టు ఇస్తారు. 45 రోజుల తర్వాత కట్టు విప్పుతారు. సాధారణంగా ఎముకలు అతుక్కుంటాయి. లేకపోతే మరోసారి కట్టు వేస్తారు.
నిజమని తేలినవి - చిన్న చిన్న ఫ్రాక్చర్లు తగ్గుతాయి. సర్జరీ అవసరం లేకుండా తగ్గుతాయన్నది విశేషం.
కధ - హెర్బల్ టీకి మరాఠీ వారి మరో పేరు కధ. ఇది దగ్గు, జలుబు, గొంతు నొప్పి, జ్వరంవంటి వాటిని తగ్గించడానికి ఉపయోగించే హోమ్రెమిడీ.
విశ్వాసాలు - తులసి, ఫెన్నెల్, నిమ్మగడ్డి, యాలకులు కథలోని ముఖ్యదినుసులు. తులసిలో ఉండే సీనియోల్, యూజెనాల్, కాంఫీన్ వంటి రసాయనాలు బ్రాంకైటిస్, ఇతర శ్వాసకోస వ్యాధులు తగ్గిస్తాయి. లెమన్ గ్రాస్ నిద్రపట్టకపోవడం, స్ట్రెస్‌తగ్గించి ప్రశాంతత చేకూరుస్తుంది. కాలేయం, పాంక్రియాస్, మూత్రాశయం, ఆహారనాళాలలోని విషపదార్థాలను పోగొట్టి, జీర్ణక్రియ ప్రసరణ వ్యవస్థలను మెరుగుపరుస్తుంది.
డోసెజ్ - కథ తయారీకి కావాల్సినవి: తులసి ఆకులు కడిగినవి 8-10, ఫెనెల్ సీడ్స్ టీ స్పూన్, నిమ్మగడ్డి ఆకు ఒకటి, లవంగాలు 3-4 , శొంఠిపొడి చిటికెడు, లికొరిస్ చిటికెడు. ఇవన్నీ నీటిలో వేసి సగానికి మరిగించాలి. అవసరమైతే వడగొట్టి వేడిగా తాగాలి. లికోరిస్ లేక తేనె కలుపుకోవచ్చు. ఏ వయసువారైనా తాగవచ్చు.
నిజమని తేలినవి - దగ్గు, జలుబు, గొంతు నొప్పి, శరీరానికి సంబంధించిన నొప్పులు, వికారం తగ్గిస్తాయి.
హీట్ థెరపీ అంటే ఏమిటి? (Heat therapy)
ఆయుర్వేద వైద్యవిధానంలో వేడిని ఉపయోగించి వైద్యం చెయ్యడాన్ని హీట్ థెరపీ (Best Herbal Remedies) అంటారు. హిమాలయ్యాల్లోని గ్రామీణ ప్రాంతాలలో ఈ ప్రక్రియ అమలులో ఉంది. ఆరు నెలల నుండి ఒక సంవత్సరం లోపు పిల్లలకు ఇది తప్పనిసరి వైద్య చికిత్స. హీట్ థెరపీని థెర్మోథెరపీ అని కూడా అంటారు.
విశ్వాసాలు : దీనిలో 45-60 సెం.మీ పొడవు గల టావ్ అనే ఇనుపచువ్వను ఉపయోగిస్తారు. ఒక వైపు బాగా వంచబడి, ఒకటి/ రఎండు చిల్లులు కలిగి ఉంటుంది. ఇనుప చువ్వను బాగా ఎర్రగా కాలుస్తారు. దానిని దెబ్బతిన్న ప్రదేశంపై కొద్ది సెకనులు ఉంచుతారు. తరువాత ఆ ప్రదేశంపై ప్రత్తి లేక ఆలివ్ నూనె పూస్తారు.
నిజమని తేలినవి - వేడి చేసిన ఇనుపచువ్వను దెబ్బతిన్న ప్రదేశంపై ఉంచడం, ఆలివ్ ఆయిల్‌తో మసాజ్ చేయడం దీనిలోని ప్రత్యేక పద్ధతులు.
వైద్యుల దృష్టిలో - ప్రకృతిసిద్ధమైన ఔషధాలు ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయని కొందరు వైద్యుల నమ్మకం. వీటిని ప్రతిరోజూ తీసుకోవచ్చు. తొందరగా జీర్ణమవుతాయి. ప్రకృతి వైద్యం చేయించుకుంటూ నెమ్మదిగా సింథటిక్ వైద్యం తగ్గించుకోవాలి.
ప్రకృతి సిద్ధ మందులు (Best Herbal Remedies) తొందరగా పనిచెయ్యవు కాబట్టి సింథటిక్ మందు లు ఒక్కసారిగా వాడటం మానేస్తే ఇబ్బంది కలగవచ్చు. నవీన వైద్యశాస్త్రాన్ని అనుసరించే వైద్యులు ప్రకృతి వైద్యంపై వ్యతిరేక భావంతో ఉన్నారు.
హెర్బల్ మందులు అంత తొందరగా పనిచేయవని వీరి నమ్మకం. ఎక్కువ డోస్‌లలో కూడా వాడాలి. ప్రస్తుతం వాడే మందులు తొందరగా రిలీఫ్నిస్తాయి. కనుక మోడరన్ రెమిడీస్ మంచివని ప్రస్తుత డాక్టర్ల వాదన.
ఈ వైద్య పద్ధతులు అనేక మంది అనుసరిస్తున్నప్పటికీ శాస్త్రీయంగా ఋజువుపరచబడలేదు. ప్రామాణికంగా అంగీకరింపబడలేదు. కనుక, సమాచారం, అవగాహన కోసం ఈ వైద్యవిధానాల్ని తెలిసిననుభవజ్ఞులైన డాక్టర్ల సలహాతో మాత్రమే పాటించవల్సి ఉంటుంది.
ఎన్నో నవీన వైద్య పద్ధతులు, సురక్షితమైన వైద్య విధానాలు అమలులో ఉన్న ఈ రోజులలో ఈ విధానాలు ఎంత వరకు అనుసరణీయమో విజ్ఞతతో ఆలోచించి, నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. లేకపోతే పెయిన్ ఉండవచ్చు. Gains ఉండకపోవచ్చు.
జుట్టు మూలాలు తెల్లబడుతుంటే - మీకు రంగు వేసుకునేందుకు వ్యవధి లేకపోతే గ్రౌండ్ కాఫీ పూయండి. రంగు వేసుకునేవరకు కవర్ చేస్తుంది.
దంతాలు తెల్లగా కనబడాలంటే - స్ట్రాబెర్రీస్‌ని ముద్దగా చెయ్యండి. టూత్బ్రష్పై వేసి పళ్ళని తోమండి.
ఎక్కిళ్లు తగ్గాలంటే - గ్లాసులో నీరు తీసుకొని స్ట్రా దానిలో వెయ్యండి. దవడలు రెండూ మెడ ఎముక కలిసే చోట, రెండు చెవుల కింద, బొటన వేళ్లతో నెమ్మదిగా నొక్కండి. స్ట్రాతో నీరు తాగాలి. నీరు తాగడం పూర్తయ్యే వరకు బొటనవేళ్లతో ఒత్తిడిచేస్తూండాలి.
చర్మంపై తెగిన గాయాలకు, విషకీటకాలు కుట్టినప్పుడు -
1.చిన్న చిన్న తెగిన గాయాలు, చర్మం రేగినప్పుడు అరటి పండు తొక్కను ముద్దగా చేసి వెయ్యండి. దానిలోని యాంటీబయాటిక్స్ త్వరగా మాన్పుతాయి.
2.చిన్నదెబ్బలు, బెణుకులకు కొద్దిగా ఉప్పుకు వెనిగర్ కొంచెం కలిపి ముద్ద చెయ్యాలి. దాన్ని దెబ్బతిన్న ప్రదేశంపై వేసి కట్టుకట్టాలి.
3.కీటక విషం నుండి ఉపశమనానికి - పెట్రోలియం జెల్లీ, మీట్ టెండరైజర్‌ల మివ్రమం తయారు చేసిన కీలటకం కుట్టినచోట వెయ్యాలి.
4.చర్మం ఎరుపెక్కడం, దురద ఉంటే నాసల్ డి కన్‌జెస్టెంట్‌ను ఆ ప్రదేశంపై పూయాలి.
5.తేనెటీగ, సాలీడు కుడితే కోసిన పచ్చి బంగాళా దుంప ఆ ప్రదేశంపై ఉంచితే విషాన్ని పీలు స్తుంది. ఉపశమనం కలగజేస్తుంది. ముద్దలో కొద్దిగా నీరు కలిపివేస్తేకూడా తేనెటీగ కుట్టిన బాధ తగ్గుతుంది.
6.స్వల్పంగా ఉన్న కట్స్‌కు మిరపకాయ లోపలి పదార్థాన్ని వేరుపరిచి దానిని రక్తం కారుతున్న ప్రదేశంపై వెయ్యాలి. ఇది వేగంగా ప్రభావం చూపుతుంది.

0 Comments