Ticker

6/recent/ticker-posts

Ayurveda Tips for Cancer : క్యాన్స‌ర్ అదుపుకి 12 ఆయుర్వేద టిప్స్ పాటించండి!

image show Ayurveda Tips for Cancer

Ayurveda Tips for Cancer : మాన‌వ స‌మాజాన్ని వేధిస్తున్న వ్యాధి క్యాన్స‌ర్‌. శ‌రీరంలో ఏ భాగానికి ఎందుకు వ‌స్తుందో, ఎప్పుడు వ‌స్తుందో అంతుబ‌ట్ట‌డం లేదు.

ప్రారంభ‌ద‌శ‌లో క‌నుక్కోగ‌లిగితే క్యాన్స‌ర్‌ని క‌ట్ట‌డి చేయ‌గ‌లం అంటారు వైద్యులు. కాని ప్రారంభ‌ద‌శ ఏదో, ఎలా ఉంటుందో అంత సుల‌భంగా తెలీదు. ఒక ద‌శ దాటిన త‌ర్వాత రోగి క‌ర్మ‌కు వ‌దిలేయ‌డం త‌ప్పించి చేయ‌గ‌లిగిన‌దేమీ లేదు. క్యాన్స‌ర్ వ్యాధితో బాధ‌ప‌డేవారి సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. 

తాజాగా జ‌రిగిన అధ్య‌యనంలో కొత్త‌గా క్యాన్స‌ర్ (Cancer) బారిన ప‌డుతున్న‌వారిలో భారీకాయం క‌ల‌వారు, పోష‌క ప‌దార్థాల లోపం ఉన్న‌వారు, శారీర‌క శ్ర‌మ పూర్తిగా త‌గ్గించి వేసిన వారున్న‌ట్టు గుర్తించారు. గ‌తంలో క్యాన్స‌ర్ పేషంట్లు ప్ర‌తి ఐదుగురిలో క‌నీసం ఇద్ద‌రికి కార‌ణం పొగ‌త్రాగే అల‌వాటు అయి ఉండేది. 

పొగాకు, పొగాకుసంబంధిత ఉత్ప‌త్తుల వాడ‌కం వ‌ల్ల క్యాన్స‌ర్ అధికంగా వ‌స్తుంది. కాబ‌ట్టి క్యాన్స‌ర్ (Ayurveda Tips for Cancer) రాకుండా కాపాడుకునేయ‌త్నం మ‌నం చేయాలి. జీవ‌న విధానం మార్పుతో క్యాన్స‌ర్‌ని కొంత మేర దూరంగా ఉంచ‌వ‌చ్చ‌న్న‌ది నిపుణుల స‌ల‌హా.

Ayurveda Tips for Cancer: క్యాన్స‌ర్ అదుపుకి 12 ఆయుర్వేద టిప్స్

దుర‌ల‌వాట్ల‌కు దూరం : పొగాకు వాడ‌కం అల‌వాటు లేనివారు అదృష్ట‌వంతులు. పొగాకును  న‌స్యం మొద‌లుకుని చుట్ట‌ల వ‌ర‌కు ప‌లు ప‌ద్ధ‌తుల‌లో వాడే వారున్నారు. పొగాకు వాడ‌క‌పోతే ఆరోగ్యం బాగున్న‌ట్టే. కాబ‌ట్టి పొగాకును పూర్తిగా వ‌దిలేసి, మ‌త్తు పానీయాల‌ను ప‌రిమితం చేసుకోవ‌ డం అవ‌స‌రం.

క్ర‌మ వ్యాయామం: వ్యాయామం (exercise) చేసేవారికి శ‌రీర రూపం అదుపులో ఉంటుంది. శ‌రీర రూపం అదుపు త‌ప్పితే క్యాన్స‌ర్ ప్ర‌మాదం పొంచి ఉన్న‌ట్టే. కాబ‌ట్టి శ‌రీర‌పు బ‌రువును గ‌మ‌నిం చుకోండి. శ‌రీర బ‌రువు, రూపం అదుపులో ఉంచుకునేందుకు ప్ర‌తిరోజూ కనీసం అర‌గంట‌సేపు వ్యాయామం చేయాలి. మీకు వీలైన స‌మ‌యంలో, త‌గిన‌టువంటి వ్యాయామాన్ని ఎంచుకోవ‌చ్చు. అర‌గంట‌ను మించి చేయ‌గ‌లిగితే మ‌రీ మంచిద‌ని గ్ర‌హించండి.

కొవ్వు త‌గ్గాలి: శ‌రీరంలోకి చేరే కొవ్వు (fat) ప‌దార్థాల కొల‌త మారాలి. అదుపులేని కొవ్వుల‌ను తిన‌డ‌ మంటే క‌ష్టాలు కొనితెచ్చుకోవ‌డ‌మే. శ‌రీరానికి అవ‌స‌ర‌మైన శ‌క్తిలో కొవ్వుల ద్వారా అందించే కాల‌రీలు 30 శాతానికి మించ‌కుండా చూసుకోవాలి. అందుకే సాట్యురేట‌డ్ కొవ్వుల‌ను దూరంగా నెట్టండి. ఒమేగా 3 ఫ్యాట్స్‌ని ఆహ్వానించండి.

తాజా పండ్లు, కూర‌గాయ‌లు మేలు: ఆహారం ఆరోగ్యం, ఆరోగ్యం అందించే ప్ర‌కృతి స‌హ‌జ ఆహార ప‌దార్థాలు పండ్లు, కూర‌గాయ‌లు. వీటిని ఎంత తాజాగా తింటే అంత మంచిది. ఇష్ట‌మైన పండ్లు, కూర‌గాయ‌ల‌ను అధికంగా తీసుకుని, ఇత‌ర పండ్లు, కూర‌గాయ‌ల‌ను వ‌దిలివేయ కూడ‌దు. 

అన్ని ర‌కాల రసాయ‌నాలు శ‌రీరానికి చేరాలంటే అన్ని రంగుల కూర‌గాయ‌లు, పండ్లు తినాలి. పండ్లు, కూర‌గాయ‌ల‌తో పీచు ప‌దార్థంతో పాటుగా యాంటీ ఆక్సిడెంట్స్‌ని అందిస్తాయి. క‌ణాలు (cells) దెబ్బ‌తిని, క్యాన్స‌ర్‌కి గుర‌య్యే ప్ర‌మాదం నుండి కాపాడ‌గ‌లిగిన శ‌క్తి ఈ యాంటీ ఆక్సి డెంట్స్‌కి ఉంది. 

త‌గినంత పీచు ప‌దార్థం: శ‌రీరంలో చేరే పీచు ప‌దార్థం క‌నీసం రోజుక 35 గ్రాములు ఉండాల‌ని నిర్థారించారు. కాబ‌ట్టి ఎటువంటి ప‌రిస్థితుల్లో కూడా అంత‌క‌న్నా పీచును త‌గ్గ‌నీయ‌కూడ‌దు. అందుకు త‌గిన మార్గం అన్ని ర‌కాల కూర‌గాయ‌ల‌ను తిన‌టం. భోజ‌నం త‌ర్వాత పండ్లు తీసుకోవాలి. చిక్కుడు వంటి ఆహార‌ప‌దార్థాలు పీచుప‌దార్థాన్ని ఇస్తాయి. 

మాంసం వ‌ద్దు:  ప‌శు మాంసానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మాంసాహారంతో కొత్త అనారోగ్య చిక్కులు కొని తెచ్చుకునేక‌న్నా మాంసం, మాంసంతో చేసిన ఇత‌ర ఆహార ఉత్ప‌త్తుల‌కు బై చెప్ప‌డం ద్వారా క్యాన్స‌ర్ భ‌యం నుంచి బ‌య‌ట‌ప‌డ‌గ‌లుగుతారు. 

ఉప్పు (salt), పంచ‌దార‌ల‌తో జాగ్ర‌త్త‌:  రుచికి ఎంతో అవ‌స‌రం ఉప్పు, పంచ‌దార‌, మితం దాటితే ఆ రెండే విష‌మ‌వుతాయి. అందుకే ఉప్పు, పంచ‌దార‌ల విష‌యంలో నియంత్ర‌ణ అవ‌స‌రం. తీపి వ‌స్తువులు, కూల్‌డ్రింక్స్‌, కాఫీ. టీల‌ను ప‌రిమితం చేయాలి. 

వంట తీరు మారాలి:  మైక్రోవేన్ వాడ‌కం ఫ్యాష‌న్‌గా ఉంటుందేమో కానీ దాని వ‌ల్ల ప్ర‌మాదం ఎక్కువ‌. అంతేకాదు, వేపుళ్ల‌తోనే చిక్కు ఉంది. ఉడికించిన కూర‌గాయ‌లే శ్రేష్టం. నెమ్మ‌దిగా ఉడికిస్తూ చేసే వంట‌కాలు రుచిక‌రం. ఆరోగ్యం. వంట వండిన వెంట‌నే ప‌దార్థాలు తినాలి. చ‌ల్లారిన‌వి తిరిగి వేడి చేసుకుని లేదా ఫ్రిజ్‌లో పెట్టుకుని తిన‌డం మానేయాలి. 

విట‌మిన్ డి పెంచాలి: శ‌రీరానికి చేరే విట‌మిన్ డి (Vitamin D)అత్య‌ధికంగా ఉండాలి. బాల్యం లో, య‌వ్వ‌న‌పు తొలి రోజుల్లో  విట‌మిన్ డి ఎవ‌రైతే అధికంగా పొంది ఉంటారో వారిలో రొమ్ము క్యాన్స‌ర్ కేసులు త‌క్కువ ఉండ‌టం గ‌మ‌నించారు.

డి విట‌మిన్ సూర్య‌కాంతి ద్వారా ల‌భిస్తుంది. సాయంత్ర‌పు ఎండ‌లో ఆడుకుంటే కాంతి ప్ర‌భావాన డి విట‌మిన్ త‌యార‌వుతుంది. అయితే తీవ్ర కాంతి కిర‌ణాల‌తో ముప్పు ఉంటుంది. అందుకే త‌క్క‌వు స్థాయి ఎండ‌లోనే ఆట‌లు ఆడాలి. 

త‌ల్లిపాలు (mother's milk) : త‌ల్లి పాల‌కున్న విలువ ఎంత‌చెప్పినా త‌క్కువే. అయితే పాలు పిల్ల‌ల‌ కు మేలుచేస్తే, అలా పిల్ల‌ల‌కు పాలివ్వ‌డం త‌ల్లికి మేలు. పిల్ల‌ల‌కు ఆరో నెల వ‌చ్చేవ‌ర‌కు పాలిచ్చే త‌ల్లుల‌లో రొమ్ము క్యాన్స‌ర్ ప్ర‌మాదం బాగా త‌క్కువ‌.

స్వీయ‌, వైద్య ప‌రీక్ష‌లు (12 Ayurveda Tips for Cancer) : ఒక వ‌య‌సు త‌ర్వాత వైద్య ప‌రీక్ష‌లు త‌ప్ప‌నిస‌రి. 20 ఏళ్లు దాటిన స్త్రీలు త‌మ స్త‌నాల‌ను తామే ప‌రీక్షించుకోవ‌డం అవ‌స‌రం. స్త‌నాల‌లో ఎటువంటి మార్పు క‌నిపించినా వెంట‌నే వైద్యుని సంప్ర‌దించాలి. 40 ఏళ్ల వ‌య‌సు దాటిన మ‌హిళ‌ల‌కు ప్ర‌తిఏటా స్త‌న‌ప‌రీక్ష వైద్యుని ప‌ర్య‌వేక్ష‌ణ‌లో జ‌రిపించాల్సి ఉంటుంది.

క్యాన్స‌ర్ వ్యాధి ల‌క్ష‌ణాల‌ను గుర్తించాలి

స్ప‌ష్టంగా నిర్థారించ‌లేక పోయినా, కొన్ని ర‌కాల ల‌క్ష‌ణాల‌ను క్యాన్స‌ర్ వ్యాధి హెచ్చ‌రిక‌గా తీసు కోవాలి. వీటిలో ముఖ్య‌మైన‌వి త‌గ్గ‌ని ద‌గ్గు, నోటివెంట‌, మూత్రం, మ‌లంతో ర‌క్తం, హ‌ఠాత్తుగా బ‌రువు త‌గ్గ‌టం, ర‌క్త‌లేమి, వృష‌ణాల వాపు.

మూత్ర విస‌ర్జ‌న‌లో మార్పు, శ‌రీరం మీద కాయ‌లు, యోనిలో ర‌క్తం, చ‌ర్మం (skin) రంగులో తేడా, త‌గ్గ‌ని త‌ల‌నొప్పి, అజీర్ణం, రాత్రివేళ చెమ‌ట‌లు, భ‌యం, ఇటువంటి ల‌క్ష‌ణాల‌లో ఏవి క‌నిపించినా వైద్యుని సంప్ర‌దించి, క్యాన్స‌ర్ ప‌రీక్ష చేయించుకోవ‌డం అవ‌స‌రం.

Post a Comment

0 Comments