Ticker

6/recent/ticker-posts

barley seeds: షుగ‌ర్‌, గుండె నొప్పులు అదుపులో ఉండాలంటే బార్లీ ఆహారం బెట‌ర్‌!

barley seeds: ఆహారంలో బార్లీని వినియోగించ‌డం వ‌ల్ల ర‌క్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్‌ను అదుపులో ఉంచ‌డంతో పాటు గుండె సంబంధిత వ్యాధుల‌ను అరిక‌ట్ట‌వ‌చ్చున‌ని ప‌రిశోధ‌న‌లో తేలింది. ఆహారంలో స‌లాడ్స్‌, సూప్స్ వంటి వాటిల్లో బార్లీని త‌ర‌చూ వినియోగించ‌డంతో హార్మోన్ల స్థాయి కూడా అదుపులో ఉంటుంద‌ని వైద్యులు చెబుతున్నారు. 
image show barley seeds

రోజులో చివ‌రిసారి ఆహారం తీసుకున్న అనంత‌రం 11- 14 గంట‌ల అనంత‌రం ప‌రీక్ష చేయ‌గా వీరిలో డ‌యాబెటిస్‌ (diabetes), గుండె వ్యాధులు ఉన్న‌ట్లు తేలింది. వైద్యులు చేసిన అధ్యా య‌నంలో మ‌ధ్య‌వ‌య‌స్కులో 3 రోజులు బ్రేక్‌ఫాస్ట్‌ (breakfast), లంచ్‌, డిన్న‌ర్‌లో బార్లీతో చేసిన బ్రెడ్‌ను, వివిధ ప‌దార్థాల‌ను వినియోగించిన వారిలో 85 శాతం మందిలో మెట‌బా లిజ‌మ్ మెరుగైంద‌ని తేలింది. వీరిలో బ్ల‌డ్‌షుగ‌ర్‌, ఇన్సులిన్ లెవెల్స్ త‌గ్గాయి. 

ఆక‌లిని కూడా నియంత్రించ‌డం జ‌రిగింది. బార్లీ వినియోగంతో శ‌రీరంలో మంచి బాక్టీరియా సంఖ్య పెరిగి హార్మోన్స్ స‌క్ర‌మంగా విడుద‌ల అవుతాయి. హార్మోన్లు పెర‌గ‌డం వ‌ల్ల దీర్ఘ‌కాలంగా ఉన్న వ్యాధులు మ‌రింత త‌గ్గ‌డంతో డ‌యాబెటిస్‌, గుండె నొప్పులు అదుపులో ఉన్నాయ‌ని వెల్ల‌డైంది.  

barley seeds: ఆరోగ్యానికి బార్లీ

సులువుగా జీర్ణ‌మ‌య్యే ప‌దార్థాల్లో బార్లీ ఒక‌టి. దాహాన్ని తీర్చ‌డంలో బాగా దోహ‌ద‌ప‌డుతుంది. జ్వ‌రంతో బాధ‌ప‌డే వారికి బార్లీ జావ (java) మంచి ఆహారం. వీటిలో పోఫ‌కాలు అధికంగా ఉండి త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతాయి. 

మూత్ర‌పిండ స‌మ‌స్య‌లు వున్న‌వారు బార్లీ జావ‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా కొన్నాళ్లు తీసుకుంటే యూరిన‌రీ ఇన్‌ఫెక్ష‌న్ల నుండి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. మూత్ర‌పిండాల‌లోని రాళ్ళు క‌రిగి పోయేందుకు బార్లీ స‌హ‌క‌రిస్తుంది. 

ఎండ‌వేళ బార్లీ గింజ‌ల‌ (barley water) ను ఉడికించి ఆ ద్ర‌వాన్ని తాగితే దాహాన్ని శ‌రీర తాపాన్ని త‌గ్గిస్తుంది. ఇందులో పీచు, ఫాస్ఫ‌ర‌స్ విట‌మిన్లు, ఎమినో ఆసిడ్స్ ఆరోగ్యానికి ఉప‌క‌రిస్తాయి. పేగుల్లోని చెడు బాక్టీరియాను తొల‌గిస్తుంది. కొలెస్ట్రాల్ నిల్వ‌ల‌ను త‌గ్గించ‌డానికి ఉప‌క‌రిస్తుంది. 

శ‌రీరంలో చ‌క్కెర స్థాయిని నియంత్రించే శ‌క్తి వున్నందున మ‌ధుమేహం ఉన్న‌వారు దీన్ని తీసుకోవ‌చ్చు. ర‌క్త‌పోటు, గుండె సంబంధ వ్యాధులున్న‌వారికి ఇది మంచి ఆహారం. కీళ్ల నొప్పులు, అరికాళ్ళ మంట‌ల‌కు ఔష‌ధంలా ప‌నిచేస్తుంది. 

గ‌ర్భిణుల‌కు బార్లీ నీళ్లు మంచిది!

బార్లీని నీళ్ల‌ (barley water) లో నాన‌వేసి రోజూ తాగితే శ‌రీరానికి ప‌ట్టిన నీరు త‌గ్గుతుంది. అలాగే వంటికి నీరు చేరిన గ‌ర్భిణులు బార్లీ నీటిని తాగ‌డం చాలా మంచిద‌ని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.  ఇంక అనారోగ్యంతో బాధ‌ప‌డేవారు ప్ర‌తిరోజూ బార్లీ గంజిని తాగితే బ‌ల‌హీన‌త‌, నీర‌సం త‌గ్గి నూత‌న శ‌క్తి ల‌భిస్తుంది. 

బార్లీని ర‌వ్వ‌గా, మెత్త‌టి పిండిలా చేసి దానితో ఫ‌ల‌హారాల‌ను చేసి తింటే త్వ‌ర‌గా, తేలిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. బార్లీ నుండి తీయ‌బ‌డిన నూనెను వాడితే శ‌రీరంలో కొలెస్ట్రాల్ శాతం త‌గ్గుతుంది. బార్లీలో ప్రొటీన్లు, కార్పొహైడ్రేట్లు, కొవ్వు, విట‌మిన్లు, ఖ‌నిజాలు స‌మృద్ధిగా ల‌భిస్తాయి. 

పిల్ల‌ల‌కు ఇచ్చే సూప్‌ల‌లో పాల‌లో బార్లీ (barley seeds) వాడ‌టం ద్వారా వారి ఎదుగుద‌ల‌కు ఆరోగ్యా నికి, శ‌క్తికి దోహ‌దం చేస్తాయ‌ని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

Post a Comment

0 Comments