Ayurveda for Muscle Pain : ప్రతి వ్యక్తీ ఎప్పుడో ఒకసారి ఎక్కడో అక్కడ కండరాలు పట్టుకుపోయి నొప్పితో బాధ పడుతాడు. ఒక్కసారి భుజాల నొప్పి, మెడనరాల నొప్పి, చేతులు లాగడం, వేళ్లు నొప్పితో తిమ్మిరి అనిపించడం, గజ్జలు పట్టి నొప్పిగా ఉండటం, నడుంనొప్పి, తొడలు పట్టేయడం, మోకాళ్ల కింద కండరాల నొప్పి,మడమల నొప్పి (Pain) ఇలా శరీరంలో కండరాల నొప్పులు రావడం సాధారణం.
![]() |
| Photo Credits:Pixabay |
మనం నొప్పి కొద్దికాలం ఉంటే వెంటనే ఎముకల నొప్పి అని అనుకుంటాం. కాని ఎముకల వల్ల కలిగే నొప్పి అయితే అది చాలా లోతునుండి వచ్చి గుచ్చతున్నట్టు, పొడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ నొప్పి చికాకు కలిగిస్తూ మనల్ని బాధ పెడుతుంటుంది.
కండరాల నొప్పి సాధారణంగా తీవ్రత తక్కువగా ఉండి, లాగుతున్నట్టు ఉంటుంది. కానీ మనని స్థిమితంగా ఉండనివ్వదు. కదలే కండరం ఒక స్థితిలో అలా ఉండిపోతే దాన్ని స్పేజమ్ అంటారు. ఆ నొప్పి పిక్కలలో వచ్చిందనుకోండి సరిగ్గా నడవనివ్వదు. దాన్ని లాగే గుర్రం నొప్పి అంటారు.
ఒక్కొక్కప్పుడు కండరాలకి దెబ్బతగిలి దానివల్ల నొప్పి రావచ్చు. సాధారణంగా పిల్లలు ఆటల్లోనో, క్రీడాకారులకు ఇలాంటి నొప్పి రావచ్చు. ఈ దెబ్బల వల్ల అక్కడ తాత్కాలికంగా రక్తస్రావం ఆగిపోవడం, చీము పట్టడం ద్వారా నొప్పి అధికంగా ఉంటుంది.
మరో సంగతి! అన్ని కీళ్ల నొప్పులలోనూ కీళ్లు బిగుసుకుపోవడం, పొడుస్తున్నట్టు నొప్పి రావడం ఉంటాయి. అదే అక్కడ వాపు కనిపించిందనుకోండి, చీము లేదా నీరు అక్కడ చేరినట్టు! అప్పుడు కదలిక కూడా కష్టమవుతుంది. దీన్ని ఆర్థరైటిస్ నొప్పి అంటారు.
అమ్మా! ముఖ్యంగా నడి వయస్సు ఆడవారిలో మోకాళ్లలో నొప్పి కలిగినప్పుడు అక్కడి చర్మంపై చిన్న చిన్న దద్దర్లు కనిపిస్తాయి. అంటే ఏదో సూక్ష్మజీవి చేరిందని అర్థం. రక్త పరీక్షలో అది కనిపిస్తుంది.
గోవ్ (gowt) అని మరో స్థితి ఉంది. హఠాత్తుగా కీళ్లలో నొప్పి వచ్చి అది బొటన వేలుదాకా పాకి ఎక్కువతుంది. ఇది రక్తంలో యూరిక్ యాసిడ్ (Uric acid) ఎక్కువగా ఉంటే వస్తుంది.
ఒక్కొక్కప్పుడు నలభై ఏళ్ల వయసున్న వారిలో అరచేతిలో కండరాలు బిగపట్టి నొప్పిగా ఉంటాయి. దీనిని Tensynovitis లేదా పులిగోరు నొప్పి అంటారు. బలహీనత వల్ల కండరాలు కూడా క్షయించి ఎప్పుడూ లాగుతున్నట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఇది షుగర్ వ్యాధి, రక్తహీనత ఉన్నవారిలో కనిపిస్తుంది.
Ayurveda for Muscle Pain : కండరాల నొప్పికి గల కారణాలు
ఎక్కువగా వ్యాయామం చేయడం
అలవాటు లేని శ్రమ చేయడం.
దెబ్బలు తగలడం.
Virus కాని Bacterial వల్ల కాని చీము చేరటం.
థైరాయిడ్ వ్యాధులు.
కీళ్ల నొప్పులు Rh.arthritis.
షుగర్ వ్యాధి.
ఆవేదన, అశాంతి.
ఆపలేని కండరాల కదలికని Cramps అంటారు. ఇది సాధారణంగా పిక్కలలో వస్తుంది. ఇది పడుకున్నప్పుడు మరీ వస్తుంది. అన్ని క్రీడలవారిలో కన్నా ఈత కొట్టేవాళ్లలో ఇది సాధరణంగా వస్తుంది.
ఇటువంటి స్థితి రావడానికి వాత శక్తిలో హెచ్చు తగ్గులు కారణం అని చెపుతోంది ఆయుర్వేదం (Ayurveda for Muscle Pain). చేయకూడని పనులు, వ్యాయామం (exercise) వల్ల వాత ప్రకోపం చెంది కండరాన్ని బిగదీసి నొప్పికి కారణమవుతుంది.
కండరాల నొప్పి తగ్గాలంటే ఏమి చేయాలి?
నొప్పి కలిగిన వెంటనే ఆ కండరానికి రక్తప్రసారం పెరిగేటట్టు కదపండి. చేత్తో నొప్పి ఉన్న భాగాన్ని అదిమిపట్టుకోండి. మీ బొటనవేలుతో నొప్పి ఉన్న ప్రాంతం మధ్యలో నొక్కి పది, పదిహేను నిముషాలుంచండి. అది మర్మస్థానమైతే ఆ కండరం విశ్రాంతి పొందుతుంది. చాలా సార్లు బాగా ఊపిరి తీసుకొని వదులుతూ ఉండండి.
ఉపశమనం కలుగుతుంది. నువ్వులనూనెతో సున్నితంగా మర్ధన చేయండి. ఆ కండరాల నొప్పి కడుపుపై ఉంటే వేడిపాలు త్రాగండి. త్రిఫల చూర్ణం ఒక చెమ్చా నీళ్లతో తీసుకోండి. మహాశంఖనటి, లసూవాదినటి చాలా మంచిది.
దశమూలచూర్ణం అరచెమ్చా ఒక కప్పు నీళ్లలో మరగనిచ్చి, దానిలో కొంచెం పాలు కలుపుకుంటే, దాన్ని దశమూల టీ అనవచ్చు. ఇది రోజూ క్రమం తప్పక తీసు కుంటే కండరాల నొప్పులు తగ్గుతాయి.
యోగరాజగుగ్గులు, నువ్వుల నూనెతో అభ్యంగన అంటే మర్థన చేసుకోవడం (కనీసం ఒక గంట), పాదాభ్యంగనం, శిరోభ్యంగనం కూడా చాలా ఉపకరిస్తాయి. వంకాయ, మినుములు, రాత్రిపూట పెరుగు, వేరు శనగనూనె మానేయడం మంచిది.
కండరాల నొప్పికి ఆయుర్వేద చిట్కాలు
తులసి గింజలు (Basil seeds) ఒక చెంచాడు ఒక కప్పు నీటిలో వేసి కాసేపు ఉంచి తాగితే మూత్రం సరిగ్గా వెళ్లి కాళ్ల నీరు తగ్గిపోతుంది. చిన్న ఉల్లిపాయల రసం రెండు చెమ్చాలు ఉదయం, సాయం త్రం పూట తీసుకుంటూ పుల్లటి పదార్థాలు వంటివి తినకుండా ఉంటే ఆయాసం (Ayurveda for Muscle Pain) తగ్గుతుంది.
కళ్లజోడు వాడేవారికి ముక్కు మొదట్లో నల్లని మచ్చ వచ్చే అవకాశముంది. వాళ్లు రాత్రి పడుకునే ముందు కొబ్బరినూనెలో పసుపు కలిపి రాసుకుంటే మంచిది. వేపాకును ఎండబెట్టి మెత్తగా పొడిచేసి దానిలో నిమ్మరసం, Rose water కలిపి పైన పూస్తే మొటిమలు పోతాయి. శరీరంలో క్రొవ్వు ఎక్కువగా ఉన్నవాళ్లూ పంచదారను ఎక్కువగా వాడకూడదు. ఖర్జూరం వాడటం మంచిది.

0 Comments