Ticker

6/recent/ticker-posts

ayurveda coconut : ఆయుర్వేదంలో అపురూప జీవ‌సారం కొబ్బ‌రి

ప్రాచీన కాలంలో విశ్వ మంత‌టా ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ‌కు వాడిన స‌హ‌జ ఫ‌లం కొబ్బ‌రి. నేటి ఆధునిక మేధావి వ‌ర్గం కొబ్బ‌రి అనేక ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కి స‌మాధాన మంటోంది. ప్ర‌క‌టించ‌బ‌డ్డ అనేక ప‌రిశోధ‌నా ప‌త్రాలు కొబ్బ‌రి ఏదో రూపంలో మ‌నిషి ఆరోగ్యానికి ఉప‌యోగ‌ప‌డుతోంద‌ని ధృవీక‌రించింది. సాంకేతికంగా కొబ్బ‌రిని కొకోస్ న్యూసి ఫెరా (Cocos Neucifera) అంటారు. న్యూసిఫెరా అంటే పొట్టుతో కూడుకున్న‌ది అని అర్థం (nut bearing).

ayurveda coconut
Photo Credits:Pixabay

స్పానిష్‌లో కోకో అంటే కోతిముఖం అని, కొబ్బ‌రి పీచుపైన మూడు సుళ్లు ఉండి కోతిముఖంలా క‌నిపిస్తుంద‌ది. సంస్కృతంలో దీనిని నారికేళం అంటారు. ఈ నారికేళం భ‌గ‌వంతుని ముందు కొట్టి ఆ నీళ్ళు త్రాగి ఆ కొబ్బ‌రి తినే మ‌న‌లేదు ప్ర‌పంచ‌మంతా, మ‌నుషుల‌కు పోష‌కత్వాన్నిస్తోంది. 

త‌ర‌త‌రాల నుండి ఎన్నో ద్వీప‌క‌ల్పాల‌లో కొబ్బ‌రి జీవ‌నాధార‌మే కాదు, జీవితాహారం కూడా!. కొబ్బ‌రి మాంసం, ఫ‌ళ్ళ‌ర‌సం, పాలు, నూనె కలిగి ఉన్న నిండు పోష‌కాహారం, ప్ర‌పంచంలో మూడ‌వ‌ వంతు జ‌నాభా వాళ్ళ ఆహారంలోనూ, ఆర్థిక సంప‌త్తులో చాలా భాగం కొబ్బ‌రితోనే ఆధార‌ప‌డుతోంది. మ‌న దేశంలో నేడు ప‌శ్చి మాసియా లోని, అమెరికాలోని ఎన్నెన్నో ప్రాంతాల‌లో కొబ్బ‌రి జీవ‌సాధ‌న‌మైన ప‌విత్ర మైన‌దిగా గౌర‌వించ‌బ‌డుతున్న‌ది. 

ayurveda coconut : కొబ్బ‌రిలో ఔష‌ధ గుణాలు ఇవే!

ఆసియా ప‌సిఫిక్ జ‌నావ‌ళిలో కొబ్బ‌రి అద్భుత‌మైన‌, స‌హ‌జ‌మైన ప్ర‌కృతి ప్ర‌సాదిత ఔష‌ధంగా వ్య‌వ‌హ‌రించ‌బ‌డుతున్న‌ది. కొబ్బ‌రిలో శ‌రీరంలోని గ్రంధుల ప‌రిర‌క్ష‌ణ‌కు అవ‌స‌ర‌మైన ఫైబ‌ర్ (fiber) విట‌మిన్లు, ఖ‌నిజాలు క‌లిగిన సంతులితాహారం. ఎందుకంటే ఇది శ‌రీర‌పు పోష‌క‌త్వ‌మే కాకుండా శ‌రీర‌పు స‌హ‌జ నిర్వ‌హ‌ణ‌కు కూడా ఉప‌ యోగ‌ప‌డుతుంది. కొబ్బ‌రి నూనెకు ప్ర‌త్యేక‌త ఉంది. అది గాయాలు, వ్ర‌ణాలు మాన్ప‌డంతో అద్బుత శ‌క్తి ఉంద‌ని ప్రాచీనుల నుండి నేటి వ‌ర‌కు విశ్వ‌సిస్తున్నారు. 

ప‌సిఫిక్ దేశాల‌లో ఈ కొబ్బ‌రి నూనె, కొబ్బ‌రి ఆకులు చాలా విలువైన‌విగా, ఆమారంగా, ఔష‌ధంగా కూడా ఉప‌యోగ‌ యుక్త‌మైన ప్ర‌కృతి వ‌రంగా భావిస్తున్నారు. ఈ మ‌ధ్య‌కాలంలోనే ఆధునిక వైద్య‌శాస్త్రం కొబ్బ‌రిలో దాగి ఉన్న అద్భుత ఔష‌ధ గుణాల‌ని, ముఖ్యంగా కురుపుల‌ను మానిపే మందుగా గుర్తించి కొత్త ప‌రిశోధ‌నా ద్వారాలు తెరుస్తున్నారు. మ‌తం, కులం, జాతి, దేశం, సంస్కృతులు వేరైనా విశ్వ‌మంతా కొబ్బ‌రిని వ‌న‌దేవ‌త ఆవిష్క‌రించిన అద్భుత ఫ‌ల‌మ‌ని గౌర‌విస్తున్నారు.

శ‌తాబ్ధాల నుండి సాంప్ర‌దాయ‌క (ayurveda coconut) వైద్య విధానాల‌న్నీ కొబ్బ‌రిని ఆస్మ్తా, ప‌గుళ్ళు, పుళ్లు, బ‌ట్ట‌త‌ల‌, కాలిన పుళ్ళు, ద‌గ్గు, ర‌క్త విరేచ‌నాలు, గొంతు గ‌ర‌గ‌ర‌, పోష‌కాహార లేమి, టిబి, థైరాయిడ్‌, బ‌ల‌హీన‌త‌, బ‌హిష్టు స‌మ‌యంలో, నొప్పి, కంటి వ్యాధులు, వికారం, సాంక్రామిక వ్యాధులు, దంత వ్యాధులు, వాపు జీర్ణ‌దోషాలు, మ‌ల‌బ‌ద్ధ‌కం వంటి వివిధ వ్యాధుల‌లో మందుగా దీన్ని వాడుతున్నారు. మంచి ఫ‌లితాన్ని పొందుతున్నారు. నేటి ఆధునిక శాస్త్ర‌జ్ఞులు పై వ్యాధుల‌న్నిటిలో కొబ్బ‌రి ఔష‌ధ గుణాణ్ని గుర్తించి ఎన్నెన్నో ప‌రిశోధ‌నా ప‌త్రాల‌ని ప్ర‌పంచ వైద్య స‌మ్మేళ‌నాల్లో ప్ర‌క‌టించారు. 

కొబ్బ‌రి హెప‌టైటిస్ ఇన్‌ఫ్ల‌య‌న్‌జా వంటి వ్యాధికార‌క వైర‌స్‌ని చంపే శ‌క్తిగ‌ల‌ద‌ని గుర్తించారు. అలాగే పుండ్ల మీద ఉండి వాటిని ఇన్‌ఫెక్ట్ (infection) చేసే బ్యాక్టీరియాని చంపే గుణం కొబ్బ‌రి కుంద‌ని గుర్తించారు. అలాగే టేప్‌వార‌మ్‌ని నాశ‌నం చేసే గుణం కొబ్బ‌రికుంది. ఆట‌గాళ్ళ‌లో శ‌క్తిని పెంపొం దించే శ‌క్తి కూడా కొబ్బ‌రికి ఉంది. షుగ‌ర్ వ్యాధికి కార‌ణ‌మైన ఇన్సులిన్ ఉత్ప‌త్తిని, ఉప‌యోగాన్ని కొబ్బ‌రి పెంచుతుంది. 

క్యాల్షియ‌మ్‌, మెగ్నీషియం శ‌రీరం తీసుకునే శ‌క్తిని పెంచి ఎముక‌లు పెర‌గ‌టానికి, గ‌ట్టిప‌డ‌టానికి స‌హ‌క‌రిస్తుంది. గాల్‌బ్లాడ‌ర్‌కి సంబంధించిన వ్యాధి ల‌క్ష‌ణాల‌ని త‌గ్గిస్తుంది. అర్శ మొల‌ల వ‌ల్ల వ‌చ్చే మంట‌ని, నొప్పిని త‌గ్గిస్తుంది. జీర్ణ‌శ‌క్తిని పెంచి మ‌ల‌బ‌ద్ధాకాన్ని నివారిస్తుంది. రొమ్ము, అన్న‌వాహిక‌ల‌లో వ‌చ్చే క్యాన్స‌ర్‌ని పెర‌గ‌కుండా నిరోధిస్తుంది. శ‌రీరంలోని ర‌క్త వాహిక‌లు, జీవ ప‌దార్థాలు కొబ్బ‌రి వ‌ల్ల ర‌క్షించ‌బ‌డ‌తాయి. కిడ్నీలో రాళ్లు కొబ్బ‌రితో క‌రుగుతాయి.

కొబ్బ‌రి నూనె వ‌ల్ల ప్ర‌యోజ‌నాలు!

కొబ్బ‌రినూనెలో ఉన్న స‌న్న‌ని పీచుప‌దార్థం, దానిలో ఉన్న పోష‌క ప‌దార్థం వ‌ల్ల అటు ఆహారం గాను, ఇటు మందుగాను ఉప‌యోగ‌క‌రం. కేర‌ళ వంటి రాష్ట్రాల‌లో కొబ్బ‌రినూనె, వంట‌కి వాడ‌తారు. అది వాతాహ‌రం క‌నుక వాళ్లు మ‌నోదృఢ‌త్వాన్ని క‌లిగి ఉంటారు. 

ఇందులో ఉండే కొవ్వు ప‌దార్థం మంచిది కాద‌ని అనుకుం టారు. కాని కొబ్బ‌రిలో ఉండే క్రొవ్వు మిగ‌తా వాటిలో ఉండే క్రొవ్వు క‌న్నా విభిన్న‌మైన‌ది. అందుకే ఆరోగ్య‌క‌ర మైన ఆహారంగా గుర్తించ‌ బ‌డుతోంది. coconut oil కేశ సౌంద‌ర్యా నికి, చ‌ర్మ సౌంద‌ర్యానికి, మాన‌సిక ఒత్తిడి త‌గ్గిం చేందుకు, శ‌రీరంలోని కొలెస్ట్రాల్‌ని నియంత్రించేందుకు శ‌రీరంల ఉన్న immunityని పెంచేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది.

క్రీడాకారులు కొబ్బ‌రినూనె వాడ‌టం చాలా మంచిది. ఎందుకంటే వాళ్లు త‌క్కువ ఆహారం తీసుకుంటు న్న‌ప్పుడు ఇది శ‌క్తిని ఇస్తుంది. ఇందులో క్రొవ్వు (fat) ప‌దార్థాలు చాలా త్వ‌ర‌గా శ‌క్తికి కార‌ణాల‌వుతాయి. మ‌న‌లో జుట్టు అందానికి చ‌క్క‌ని చిక్క‌ని జుట్టుకు స‌హ‌జ‌మైన పోష‌క‌త్వం కొబ్బ‌రినూనెకు ఉంది. పూర్తి స‌హ‌జ‌మైన కొబ్బ‌రి నూనె వాడితే జుట్టు పెర‌గ‌డ‌మే కాదు, మెరుస్తూ, సున్న‌తిమై వంగి ఉంటుంది. 

కొబ్బ‌రితో త‌యారు చేసుకునే చిట్కాలు

త‌లంటు పోసుకొని కొబ్బ‌రి నూనె రాసుకుంటే త‌ల‌పై పేలు, చుండ్రు క్ర‌మంగా త‌గ్గిపోతాయి. అలాగే జుట్టు ఊడిపోతూ తెల్ల‌బ‌డుతుంటే కొబ్బ‌రినూనె దానిక‌వ‌స‌ర‌మైన మాంస‌కృతుల‌ను చేకూరుస్తుంది. త‌ల‌కి ప్ర‌తి రాత్రి కొబ్బ‌రినూనెతో త‌ల‌కు మ‌ర్ధ‌న చేసుకుంటుంటే మాన‌సిక ఒత్తిడి త‌గ్గి, ప్ర‌శాంతంగా నిద్ర ప‌డుతుంది.

చ‌ర్మం గ‌ట్టిప‌డ‌టానికి, ఆహ్లాదంగా ఉండ‌టానికి కొబ్బ‌రి నూనెత మ‌ర్ద‌న చేసుకోవడం చాలా మంచిది. ఈ నూనె అకాల‌వార్ద‌క్యం రాకుండా కాపాడుతుంది. గుండె జ‌బ్బుల‌కు కొబ్బ‌రి నూనె హిత‌క‌రం. ఎదుకంటే ఇందులో ఉన్న 50 శాతం ల్యూరిక్ ఆసిడ్ వివిధ గుండె జ‌బ్బుల నుండి కాపాడుతుంది.

కొబ్బ‌రినూనె బ‌రువు త‌గ్గ‌డానికి ఉప‌క‌రిస్తుంది. ఇది లివ‌ర్ వ్యాధుల‌ని త‌గ్గిస్తుంది. ఎందుకంటే దీనిలోని ఫాటీ యాసిడ్స్ లివ‌ర్‌ని కాపాడ‌తాయి క‌నుక‌. కొబ్బ‌రి నూనె షుగ‌ర్ వ్యాధిలో మంచిది. ఇది బ్ల‌డ్ షుగ‌ర్‌ని త‌గ్గిస్తుంది. ఇన్సులిన్ ఉత్ప‌త్తిని పెంచుతుంది. హెచ్ఐవిలో వ్యాదినిరోధ‌కంగా ఇది ముఖ్య భూమిక పోషిస్తున్న‌ద‌ని ప‌రిశోధ‌న‌లు సూచించాయి. 

లేత కొబ్బ‌రి నీళ్లు వెంట‌నే శ‌క్త‌నిచ్చే అమృతం లాంటిది. ఇందులోని జీవ ప‌దార్థాలు తొంద‌ర‌గా ర‌క్తంలోని వెళ్లి స‌త్వ‌ర శ‌క్తినిస్తాయి. కొబ్బ‌రి నీళ్లు స‌హ‌జ‌మైన డైయూరిటిక్ అంటే మూత్రాన్ని స‌జావుగా జ‌రిగేట‌ట్టు చేసి, ఒంట్లో నిల‌వ ఉన్న నీటిని బ‌య‌ట‌కు పంపుతుంది. 

పిల్ల‌ల్లో వ‌చ్చే క్రిములు, వ్యాధుల‌లో కొబ్బ‌రి (ayurveda coconut) నీరు చాలా ఉప‌క‌రిస్తుంది. కొబ్బ‌రిపీచు శుభ్ర‌ప‌ర‌చి ఆముదంతో ఇస్తే ఎక్క‌డ ఉన్నా క్రిములు బ‌య‌ట‌కు వ‌చ్చేస్తాయి. కొబ్బ‌రి బెర‌డు ఎర్ర‌గా కాల్చి త‌రువాత పొడిని 250 గ్రాములు మ‌జ్జిగ‌తో తీసుకుంటే పొట్ట‌లో పుండు (ulcer) త‌గ్గుతుంది. అందుకే కొబ్బ‌రి ఆరోగ్యాన్ని, శ‌క్తిని వ్యాధులు త‌గ్గించే అద్భుత గుణాన్ని క‌లిగి ఉండే దేవుడి ఇష్ట‌మై మ‌న‌కు ప్ర‌సాద‌మ‌య్యింది. 

Post a Comment

0 Comments