తలలో ఒక తెల్ల వెంట్రుక కనిపించగానే ఆందోళన ఆరంభం అవుతుంది. ఒక్కో వెం ట్రుక పెరుగుతుంటే మరింత ఆందోళన. చాలా మంది స్త్రీ, పురుషులకు 20 ఏళ్లు నిండే సమయానికి తెల్లవెంట్రుకలు కన్పించడం మొదలవుతుంది. ఇలా వెంట్రుకలు ఎందుకు తెల్లబడటం ఆరంభిస్తాయి? అని ప్రశ్నించుకుంటే ఇందుకు శారీరక, రసాయనిక, వారసత్వ, పోషకాహార లోప, వాతావరణ కారణాలు కనిపిస్తాయి.
![]() |
| Photo Credits:Pixabay |
వెంట్రుక కుదుళ్లలో తక్కువ స్థాయి మెలానిన్ ఉత్పత్తి, రక్తహీనత, చుండ్రు, మలబద్ధకం, థైరాయిడ్ స్థితి, దీర్ఘకాలిక అనారోగ్యం, మానసిక, భావోద్రేక ఒత్తిడి శారీరక కారణాల కోవలోనివి. హెయిర్ స్ప్రేల వాడకం, పని ప్రదేశాల్లో రసాయనిక చర్యలకు గురికావడం, షాంపూలు, ఇతర శిరోజాల ఉత్పత్తుల్ని తరచూ మార్చడం రసాయనిక కారణాల్లోనివి.
వారసత్వం, త్వరిత మోనోపాజ్ మూడో కారణం. ఆహారంలో విటమిన్ బి12 లోపం, అదనపు కెఫైన్ (Caffeine), ఆల్కాహాల్, టుబాకో (Tobacco), చిరుతిండ్లలోని రసాయ నాలు, ఆహారంలో ప్రోటీన్ లోపం పోషకాహారలేమి కారణాలు. గాలిలో కాలుష్యం, అతి వేడి, పొడి వాతావరణం, ఎలక్ట్రిక్ డ్రయ్యర్లు తరుచూ వాడటం చివరిరకం.
ముందుగా జుట్టు తెల్లబడటానికి వీటిలో ఏ కారణాలో గుర్తించాలి. కొన్ని సార్లు వాటిని ఖచ్చితంగా అంచనా వేసి తెలుసుకోవడం కష్టం, చిన్నపాటి రక్త పరీక్షలు, హిమోగ్రోబిన్, విటమిన్ బి12 లోపాల్ని గుర్తించే పరీక్షలు, థైరాయిడ్ గ్రంథి పనితీరు అంచనాలద్వారా వైద్య సలహాతో కారణాన్ని గుర్తించవచ్చు. కొన్ని రకాల ప్రత్యామ్నాయ చికిత్సలు, జాగ్రత్తలతో జుట్టు మరింత
తెల్లబారే కాలాన్ని పొడిగించుకోవచ్చు.
Ayurveda for White Hair: ఆయుర్వేదం ఏం చెబుతోంది?
నూనె (oil) చల్లారాక వడకట్టి నిండురంగు గాజుసీసాలో పోసి వాడుకోవాలి. దీనివల్ల జుట్టు తెల్లబడటం క్రమంగా ఆగుతుంది.50 గ్రాముల అల్లం శుభ్రంగా తోలు తీసేసి కడిగి తురమాలి. ఈ తురుమును 250 గ్రాముల తేనె (honey) సీసాలో వేసి వుంచాలి. ప్రతిరోజూ ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కు ముందుగా ఒక టీ స్పూన్ తింటుండాలి.
అరోమా థెరపి అంటే ఏమిటి?
రెండు టీ స్పూన్లు నిమ్మ నూనె, రెండు టీ స్పూన్లు సిప్రెస్ లేదా జూనిపర లేదా రోజ్మేరీఆయిల్, రెండు టీ స్పూన్లు జింజర్ లేదా రోజ్ ఆయిల్స్‌ను, రెండు ఔన్సులు నువ్వుల నూనె లేదా పొద్దు తిరుగుడు నూనెలో కలపాలి. ఈ మిశ్రమాన్ని మసాజ్ కోసం ఉపయోగించాలి. వేలి కొసళ్లతో తలముందు నుంచి వెనుకకు మసాజ్ చేసుకోవాలి.
వెళ్ళను గుండ్రంగా తిప్పుతూ జరపాలి.
అమరంథీ తయారీ - అమరంథీ ఆకుల్నితీసుకుని బాగా కడిగి రెండు కప్పుల నీటిలో వేసి, నీరు అరకప్పు అయ్యేంత వరకు మరగించాలి. చల్లారనిచ్చి మాడుకు రాసి, గంటాగి షాంపూ చేసుకోవాలి.
గోరింట, మందార -100 గ్రాముల గోరింటాకు, రెండు తాజా మందారపూలు,20 గ్రాముల వేపాకు, అరముక్క కర్పూరం బిళ్ల,250ml కొబ్బరి నూనెలో వేసి కాయాలి. చల్లారాక వడకట్టి గాజుసీసాలో భద్రపరచాలి. వారంలో రెండుసార్లు తలస్నానానికి ఓ గంట ముందుగా శిరోజాలకు పట్టిస్తూ ఉండాలి.
గోరింట, అల్లం - రెండు టేబుల్ స్పూన్లు గోరింట పొడి, ఒక టీ స్పూన్ మెంతిపిండి, ఒక టీ స్పూన్ కాఫీ పొడి, ఒక టీ స్పూన్ అల్లం, తులసి పేస్ట్, ఒక గుడ్డు (egg) కలిపి తలకు పట్టించి రెండు మూడు గంటలాగి తలస్నానం చేయాలి. కిందకు తలవొంచి చేసే డాగ్ పొజ్ యోగా వల్ల తలలో రక్త ప్రసరణ మెరుగై తెల్లవెంట్రుకల సంఖ్య పెరగడం క్రమంగా తగ్గుతుంది.
తీసుకోవాల్సిన ఆహారం (Ayurveda for White Hair)
జుట్టు సంరక్షణలో ఆయిల్స్, కండిషనర్స్‌తో పాటు పౌష్టికాహారానికి కూడా తగినంత స్థానం కల్పించాలి.
విటమిన్ బి12, పదార్థాలు - ఓస్టర్లు, చేపలు, ఛీజ్, గుడ్లు.
ఫొలేట్ ఉండే పదార్థాలు - అన్నిరకాల బీన్స్, లెంటిల్స్, జంతు సంబంధమైనవి.
ఐరన్ పదార్థాలు - గుడ్డులోని పచ్చసొన, పాలకూర, బీన్స్, చికెన్, లెంటిల్స్, సోయాబీన్స్.
ఐయోడిన్, కాపర్ ఉండేటువంటి పదార్థాలతో పాటు పెరుగు, స్ట్రాబెర్రి, గుడ్లు, ఛీజ్, ఆవుపాలు.
సెలీనియం ఉండే పదార్థాలు - పుట్టగొడుగులు, టునా, ఆవాలు, గుడ్లు, వెల్లుల్లి, బార్లీ తదితరాలు.
Ayurveda for White Hair: ఎక్కువగా తినాల్సిన పదార్థాలు
- ఛీజ్, ఆకు కూరలు, లివర్, కిడ్నీ, టొమేటో, ఈస్ట్, పుట్టగొడుగులు, బాదం పప్పులు, లెగ్యూమ్స్.
విటమిన్ ఇ ఉండే టొకోఫిరాల్స్ - బాదం (almond), వేరు శనగ పప్పులు, ఆలివ్ ఆయిల్, వాల్‌నట్స్, ఓట్స్, కొబ్బరి.
ప్రొటీన్లు - చేపలు, వైట్‌మీట్స్, గుడ్లు, లెంటిల్స్, పప్పులు, పాలు, ఛీజ్, టోపు.

0 Comments