Ayurvedic Jasmine: మల్లెపూలను జడలో పెట్టుకోవడం వల్ల ఉపయోగాలు ఏమిటి?
Ayurvedic Jasmine: మహిళలు ముఖ్యంగా భారతీయ వనితలు నిజానికి చాలా అదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకంటే సౌందర్యాన్ని పెంపొందించుకునే ప్రయత్నానికి ప్రకృతి కూడా ఎన్నో రకాల వనమూలికలు, ఔషధ గుణాలు కలిగిన ఫల పుష్పజాతుల్ని అందించింది. అయితే వీటిని సక్రమంగా వినియోగించు కోవడంలో మనం విఫలమవుతున్నాం.
దీన్ని
అదును
చేసుకొని
కొన్ని
బడా
కంపెనీలు,
వ్యాపార
వేత్తలు
పలు
రకాల
కాస్మోటిక్
ప్రొడక్ట్స్
అనగా
హెయిర్
షాంపూలు,
ఫేస్
క్రీమ్లు,
లిప్స్టిక్లు,
స్నోలు, బాడీ లోషన్లు, ఫెర్మూమ్లు
ఇలా
కుప్పలు
తెప్పలుగా
పుట్టుకొస్తున్నాయి. వీటిని
ఈ
ఆధునిక
రంగంలో
పెద్ద
పెద్ద
సెలబ్రి టీలతోనూ, AI
Technologyతో ప్రకటనలు
చేస్తూ
సోషల్
మీడియాలో
విస్తృతంగా
ప్రచారం
చేస్తున్నారు.
కానీ
అవి
సహజమైన
ఉత్పత్తులు కావు,
అనేక
రకాల
కెమికల్స్
కలిపి
తయారు
చేసిన
ప్రొడక్స్ట్
అని
కొందరికి
తెలుసు.
వాటిని
వాడటం
వల్ల
చర్మం(skin)
పాడై,
సహజ
సౌందర్యం
దెబ్బతినే
అవకాశాలే
ఎక్కువగా
ఉన్నాయి.
Ayurvedic Jasmine: మల్లెపూల వల్ల ఉపయోగాలు ఏమిటి?
ప్రకృతి
సిద్ధమైన
వనరులతో
సౌందర్య
పోషణ
చేసుకుంటే
ఎప్పటికీ
చెక్కు
చెదరని
అందరం
మన
సొంతం
అవుతుంది.
అందుకే
మన
సౌందర్య
సాధనాల్లో
ముందుగా
పువ్వులు
ఎలా
ఉపయోగపడతాయో
తెలుసుకుందాం.
వాస్తవంగా
చెప్పాలంటే
ఈ
రోజుల్లో
చాలా
మంది
తలలో
పూలు
తురుముకోవడం
మానేశారు.
పాశ్చాత్య
ధోరణి
వంటబట్టిన
వాళ్లు
ఇదే
fashion అనుకుంటున్నారు.
కానీ
బజారు
సరుకులతో
అందాలు
దిద్దుకునే
ప్రయత్నాలు
చేసేవారు
ఓపిక
చేసుకుని
Old is Gold అన్నట్లు
పాత
పద్ధతుల్ని
అవగాహన
చేసేకుని
కొంత
కాలం
ఆచరణలో
పెడితే
తేడా
తెలుస్తుంది.
ముందుగా తలలో మల్లెపూలు (jasmine flower) పెట్టుకునే విషయాన్ని పరిశీలిస్తే ప్రతిరోజూ తలలో తురుముకుంటే, జుట్టు రాలడం ఆగిపోతుంది. అంతేకాక జుట్టు వత్తుగా, నిగనిగలాడుతూ ఉంటుంది.
మల్లెపూలు పెట్టుకోవడం వల్ల తలలో చుండ్రు (dandruff),
పేలు రాకుండా కాపాడుతుంది. తలలో తురుముకున్న మల్లెపూల వల్ల కళ్ళకి ఎంతో మేలు జరుగుతుంది. కళ్ళు వ్యాధుల్ని అరికడుతుంది. కళ్ళు తేటగా ప్రకాశంతంగా ఉంచుతుంది.
మల్లెపూల సువాసనతో ఒక ప్రత్యేకమైన గుణం కలిగి ఉండటం వల్ల దీని ప్రభావంతో మనుసుని ప్రశాంతంగా ఉంచే శక్తి ఈ పూలకి ఉంది.
రోజంతా శ్రమ పడి రాత్రి నిద్రపోయే ముందు కొన్ని మల్లెపూలు తలగడ కింద పెట్టుకున్నా, జడలో తురుముకొని పడుకున్నా, మంచి నిద్ర పట్టి ముఖాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది.
మల్లెపూలతో తీసిన నూనె (jasmine oil), రోజ్వాటర్లో కలిపి రోజూ ముఖానికి రాసుకుంటూ వుంటే, ముఖం మీద మచ్చలు పోయి తెల్లబడి ఎంతో అందంగా మారుతుంది.
గుప్పెడు mallepulu బాగా నలిపి రసం తీసి కళ్ళకి, రాసుకుని 15 నిమిషాల సేపు కళ్లు మూసి సేదతీరుతూ ఉంటే, కళ్లు జబ్బులు రాకుండా, తేటగా ఉంటాయి.
అలాగే మల్లెపూలు రెండు గుప్పిళ్లు తీసుకుని, బాగా నలిపి వాటిని స్నానం చేసే నీటిలో బాగా కలిపి 10 నిమిషాల తర్వాత స్నానం చేస్తూ ఉంటే, శరీరం మంచి రంగు దేలి ప్రకాశవంతంగా ఉంటుంది.
అంతేకాక ఎండవేడిమి వల్ల వచ్చే చెమట కాయల్ని రాకుండా, శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది.
గుప్పెడు పూలు నీటిలో నలిపి, ఆ నీటితో గంధం అరగదీసుకుని ముఖానికీ, శరీరానికి కూడా లేపనం చేసుకుని 5 నిమిషాలు ఆరిన తర్వాత స్నానం చేస్తే శరీరం, ముఖం ఎంతో మృదువుగా ఉండటమే కాక చర్మవ్యాధులు రాకుండా కాపాడుతుంది.
మల్లెపూలు కొబ్బరి నూనెలో వేసి నిల్వ వుంచి, కొద్ది రోజుల తర్వాత ఆ నూనె తల (hair oil)కి వాడుకుంటూ ఉంటే, జుట్టు వత్తుగా పెరుగుతుంది. జుట్టురాలకుండా, తొందరగా తెల్లబడకుండా కాపాడుతుంది.
బాల నెరుపు (white hair)వచ్చినవాళ్లు ఈ మల్లెపూల తైలం గానీ, పైన చెప్పిన విధంగా తయారు చేసుకున్న నూనెగానీ వాడుతూ ఉంటే మిగిలిన వెంట్రుకలు తెల్లబడిపోకుండా ఆపడమేకాక జుట్టుకి మంచి పోష్టికతనిచ్చి, బాల నెరుపు పోగుడుతుంది.
ఇలా
ఎన్నో
ప్రయోజనాలు
అందిస్తున్న
మల్లెపువ్వుల్ని
వీలైనంత
వరకూ
వాడుతూ
ఉంటే
మన
సహజ
సౌందర్యానికి
(Ayurvedic Jasmine)
ఆటంకం
అనేది
ఉండదు
సరికదా,
మరింత
ఇనుమడిస్తుంది.