Ticker

6/recent/ticker-posts

Ayurveda for hair : ఆయుర్వేదంతో చిక్క‌ని జుట్టు పెంచుకునే మార్గాలు!

image show Ayurveda for hair

Ayurveda for hair: మీ జుట్టు మీ స‌హ‌జ‌త‌త్వాన్ని సూచిస్తుంది. తెలిసిన‌ది కానీ, తెలియ‌న‌ది కానీ మీలో ఏదో వ్యాధో, లోప‌మో ఉంటే అది మీ జుట్టు మీకు చెబుతుంది. రాల‌ట‌మో, ప‌ల‌చ‌బ‌డ‌ట‌మో, తెల్ల‌వెంట్రుక‌లు రావ‌డ‌మో, త‌ల‌లో దుర‌ద రావ‌డ‌మో, ఇలా ఎన్నో ర‌కాలుగా మీ జుట్టు మీలో మీకు తెలియ‌ని అనారోగ్యాన్ని సూచిస్తుంది. మీకు ప‌డ‌ని మందుల‌ని, ముఖ్యంగా వాడే హార్మోన్లు లాంటివి కూడా మీ జుట్టు సూచిస్తుంది.

త‌న శ‌రీరాన్ని క‌ప్పి పై పొర‌ల‌తో ఉండే చేప‌లా ఉంటుంది. స‌హ‌జ‌సిద్ధ‌మైన జుట్టుతో ఉండే త‌ల‌, జుట్టుతో క‌ప్ప‌బ‌డే ఆ మ‌ధ్య ప్రాంతాన్ని Cortical అంటారు. నిజ‌మైన కేశ సౌంద‌ర్య‌మంటే జుట్టు కాంతివంతంగా, న‌ల్ల‌గా మెరుస్తూ, మెత్త‌గా దువ్వెన‌తో దువ్వుతూంటే నిటారుగా నిల‌బ‌డ‌క ఒదిగి వ‌య్యారంగా, సింగారంగా ఉండాల్సి వుంటుంది.

Ayurveda for hair :  జుట్టు ఊడిపోవ‌డానికి కార‌ణాలు

ఏ కార‌ణంతోనైనా కేల‌రీలు ఎక్కువ‌గా ఉన్న ఆహారం త‌గ్గించ‌డం, మీ దిన‌చ‌ర్య అంటే ప్ర‌తిరోజూ మీ జీవ‌న క‌ద‌లిక‌లు ఇష్టం వ‌చ్చిన‌ట్లు ఉండ‌టం మీ కేశ సౌంద‌ర్యం పాడైపోవ‌డానికి ముఖ్య‌, స‌హ‌జ కార‌ణాలు.

పోష‌కాహారం లేక‌పోవ‌డం, ర‌క్త‌క్షీణ‌త‌, విట‌మిన్లు త‌క్కువ అవ‌డం, దీర్ఘ‌వ్యాధులు జుట్టు ఊడి పోవ‌డానికి కార‌ణాలు. మీరు ఆరోగ్యంగా లేర‌నుకోండి మీ జుట్టు (Hair) కూడా ఆరోగ్యంగా ఉండ‌దు. అలాగే మీ శ‌రీర‌త‌త్వం కూడా మీ జుట్టును ప్ర‌భావితం చేస్తుంది.

ఉదాహ‌ర‌ణ‌కు మీది వాత ప్ర‌కృతి అనుకోండి, మీ జుట్టు న‌ల్ల‌గా ఎండిన‌ట్లుంటుంది. చ‌క్క‌గా ఒంపులు తిరిగివుంటుంది. స‌న్న‌టి తీగ‌లుగా ఉండి పేలు, ఈపు (Dandruff) వంటి వాటిని సులువుగా ఆక‌ర్షిస్తుంది. 

అదే మీ ప్ర‌కృతి పిత్త ప్ర‌కృతి అనుకోండి, కొంచెం ఎరుపు ఛాయ క‌ల్గిన న‌లుపుతో ఉండి స‌న్న‌గా సున్నితంగా తొంద‌ర‌గా తెల్ల‌బ‌డేటట్టు ఉంటుంది. నూనెతో ఉన్న‌ట్టు ఎంతో స్నిగ్ధంగా జుట్టు ఉంటుంది. అదే క‌ఫ ప్ర‌కృతి అయితే ద‌ట్ట‌మైన వెంట్రుక‌ల‌తో మెరుస్తూ క‌దులుతూ ఉంటుంది.

త‌ల ఎండిపోయి గ‌రుకుగా త‌యారై దుర‌ద‌తో కూడి ఉంటే దాన్ని చుండ్రు అంటారు. దీనికి వాత‌దోషం కార‌ణం. శ‌రీరంలో అధిక వేడివ‌ల్ల వెంట్రుక‌ల మూలం ఎండి అక్క‌డున్న స్థ్నిగ‌త్వాన్ని కోల్పోయి అక్క‌డ పొర‌లు ఏర్ప‌డితే దాన్ని పూర్తి Dandruff అంటారు.

ఇక్క‌డ అధిక వేడి అంటే జ్వ‌రం కాదు, అధిక శ్ర‌మ‌, ఎక్కువ కారం, మాంసం తిన‌డం, అధిక సంభోగం, హార్మోన్ల‌లో తేడాలు వీటివ‌ల్ల అధిక వేడి త‌యారై ఈ విధ‌మైన స్థితి వ‌స్తుంది. ఇది చిర‌కాలం ఉండి దువ్వుతూంటే తెల్ల‌ని పొడిరాలుతూ మంట‌, దుర‌ద అధికంగా ఉంటే దీన్ని సోరియాసిస్ (Psoriasis) అంటారు. 

అంద‌మైన జుట్టును కాపాడుకోండి ఇలా!

మీరు నిండు ఆరోగ్యాన్ని కోరుకునేవారే అయితే మీ జుట్టు కూడా అందంగా ఉంటుంది.  ఒక చెమ్చా క‌ర్పూరం, అర‌క‌ప్పు కొబ్బ‌రి నూనెలో కాని వేప‌నూనెలో కానీ మంచి సీసాలో భ‌ద్ర‌ప‌ర‌చుకొని త‌ల‌పై మ‌ర్ద‌న చేసుకోండి. రోజుకి 16 నిమిషాలు చొప్పున 15 రోజులు ఇలా చేసుకుంటే ఈ స్థితిలో చాలా ఫ‌లితం ఉంటుంది. 

ఈ మ‌ర్ధ‌న రాత్రి ప‌డుకునేముందు చేసుకోవ‌డం ఎంతో మంచిది. ఒక చెమ్చా ఆముదం, ఒక చెమ్చా ఆవ‌నూనె, కొంచెం కొబ్బ‌రి నూనె క‌లిపి త‌ల‌కి మ‌ర్ద‌న చేసుకొని త‌ర్వాత రోజు ఉద‌యం కుంకుడుకాయ పులుసుతో త‌లంటు పోసుకోవ‌డం చాలా మంచిది.

ఇలా ప్ర‌తీ అయిదు రోజుల‌కి అయిదుసార్లు చేయ‌డం వ‌ల్ల సంపూర్ణంగా జుట్టు, త‌ల‌బాధ‌లు త‌గ్గుతాయి. జుట్టు బాగా రాలిపోతూ బ‌ట్ట‌త‌ల‌లాగా త‌యార‌వుతూంటే, కొబ్బ‌రి నూనెలో మందార‌ పువ్వులు ఉడికించి చ‌ల్లారిన త‌ర్వాత వ‌డ‌పోసి త‌ల‌కి ప్ర‌తిరోజూ మ‌ర్ద‌న చేసుకోండి.

వేపాకులు నీళ్ళ‌ల్లో మ‌ర‌గ‌నిచ్చి చ‌ల్లారిన త‌ర్వాత ఈ నీళ్ల‌తో త‌ల‌ను క‌డుక్కోండి. త‌ర్వాత ఆర‌బెట్టుకొని కొబ్బ‌రినూనెలో నీలి ఆకు, ఉసిరిక వ‌లుపు వేసి, కాచి చ‌ల్లారిన త‌ర్వాత త‌ల‌కి మ‌ర్ధ‌న చేసుకోవాలి.

ఆకుకూర‌లు, పాలు, ప‌ళ్ళు, చిక్క‌ని మ‌జ్జిగ ఆహారంలో ఎక్కువ‌గా ఉండేట‌ట్టు చూసుకోండి. చిన్న వ‌య‌సులోనే జుట్టు తెల్ల‌బ‌డుతుంటే 2 చెమ్చాల హెన్నాపొడి, ఒక చెమ్చా పెరుగు క‌లిపి రాయండి. అల్లం బాగా దంచి ఒక చెమ్చా తేనెలో కొంచెం క‌లిపి రోజూ తీసుకోండి. జుట్టు తెల్ల‌బ‌డ‌టం త‌గ్గుతుంది. 

Ayurveda for hair: జుట్టు ఊడిపోకుండా ఉండాలంటే ఏమి చేయాలి?

త‌యారైన షాంపూలు కాక స‌హ‌జ‌మైన కుంకుడు కాయ‌, షీకాయ వాడితే మంచిది. ఉసిరిక వ‌ల‌పు నూనెలో కాచి త‌ల‌కి రాసుకోండి. దానివ‌ల్ల వేడి త‌గ్గుతుంది. ఫ్యాష‌న్ కోస‌మో, చికాకు క‌లుగుతుంద‌నో త‌ల‌కి నూనె రాసుకోవ‌డం మాన‌కండి. త‌ల ఎండిపోయి క్ర‌మంగా జుట్టు రాలి పోతుంది. అన్ని కేశ‌తైలాల‌లో శ్రేష్ట‌మైన‌ది స‌హ‌జ సిద్ధ‌మైన కొబ్బ‌రి నూనె (Coconut Oil), ఉద‌యం రాత్రి ప‌డుకునేముందు కొబ్బ‌రి నూనెతో త‌ల‌కి మ‌ర్ధ‌న చేసుకోండి.

మ‌ల‌బ‌ద్ధ‌కం ఉంటే మీ జుట్టు ఎద‌గ‌దు. ప్ర‌తిరోజూ రాత్రి త్రిఫ‌ల‌చూర్ణం ఒక చెమ్చా తీసుకోండి. భృంగ‌రాజ‌, మందార‌, ఆమ్ల‌, న‌ల్లావాలు వంటివాటితో చేసిన ఆయుర్వేద (Ayurveda) త‌ల నూనెల‌ను వాడ‌టం హితక‌రం. 

త‌లంటు పోసుకున్న త‌ర్వాత క‌నీసం ఇరువై నిముషాలు త‌ల‌ని బాగా మ‌ర్ధ‌న చేయండి. దానివ‌ల్ల త‌ల‌కి ర‌క్త‌ప్ర‌సారం బాగా జ‌రిగి జుట్టు గ‌ట్టిప‌డుతుంది. కొబ్బ‌రినూనెలో నిమ్మ‌ర‌సం క‌లిపి త‌ల‌కి మ‌ర్ద‌న చేసుకోవ‌డం (Ayurveda for hair) చాలా మంచిది.

మిన‌ప పిండి, మెంతులు క‌లిపిన ముద్ద‌ని త‌ల‌కి ప‌ట్టించుకొని ఒక గంట త‌రువాత వేడినీళ్ల‌తో క‌డుక్కుంటే జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. ఎదుగుతున్న పిల్ల‌లో, న‌డివ‌య‌స్సువాళ్ల‌ల్లో తెలియ‌ని హార్మోన్లు హెచ్చు త‌గ్గుల వ‌ల్ల జుట్టు ఊడిపోతుంది. 

నెల‌స‌రి చ‌క్క‌గా ఉండేట‌ట్టు చేసుకోవ‌డం, నువ్వుల నూనెతో క్రింద‌పొట్ట మ‌ర్ద‌న చేసుకోవ‌డం మంచిది. ఎక్కువ‌సార్లు త‌ల దువ్వ‌కండి. త‌ల‌ని ఎండిపోనివ్వ‌కండి. మంచి ఆహారం, మంచి ఆలోచ‌ న‌లు, నిర్మ‌ల‌మైన మ‌న‌స్సు, నిండుగా న‌వ్వే నవ్వు మీ ముఖాన్నే కాదు మీ కేశ సౌంద‌ర్యాన్ని కూడా ఇనుమ‌డింప‌చేస్తాయి.

Post a Comment

0 Comments