Ticker

6/recent/ticker-posts

women sexual health: ఆయుర్వేదంతో స్త్రీత్వంను పున‌రుద్ద‌రించుకోండి

image show women sexual health

women sexual health: స్త్రీ శ‌రీరం ఆమెలోని వివిధ అవ‌స్థ‌ల కార‌ణంగా అనేక‌మైన మార్పుల‌కు లోన‌ వుతుంది. బాల్యావ‌స్థ‌లో ఉన్న బాల ప‌ద‌మూడు, ప‌దు నాలుగు ఏళ్ల వ‌య‌సు వ‌చ్చే స‌రికి శ‌రీర‌పు ఎదుగుద‌ల‌తో పాటు శ‌రీరంలో కూడా మార్పులు వ‌స్తాయి.

అంత‌వ‌ర‌కూ శ‌రీరంలోని ప్ర‌త్యేక ప్ర‌క్రియల‌ని నియంత్రించే హైపోథాల్మ‌స్ (Hypothala mus) గ్రంథి క్ర‌మంగా ప‌నిచేయ‌డం మాని, మరో గ్రంథి పిట్యూట‌రీ ప్ర‌భావం చూప‌డం ప్రారంభ‌మై, తొలి మార్పునకు సూచ‌న‌గా తొలి ఋతుస్రావం క‌నిపిస్తుంది. అప్ప‌టి నుంచి స్త‌న‌ముల ఎదుగుద‌ల జ‌రుగుతూ, ముఖం ప్ర‌స‌న్న‌మై, తొడ‌లు, న‌డుం, యోని (vagina) భాగం నునుపు తేలి స్ఫుర‌ణ‌ని పొందుతాయి. అప్ప‌టి నుండి బాల‌క‌న్య‌గా (female sexual health) మారుతుంది.

women sexual health: మాడ్యులేష‌న్ ప్రారంభం 

20 సంవ‌త్స‌రములు నిండితే ఈ మార్పు నిల‌బ‌డిపోతుంది. అందుకే ఈ స్థితిని మాడ్యులేష‌న్ అంటారు. త‌ర్వాత వివాహ‌మై, మాతృత్వాన్ని పొంది, ఇద్ద‌రు ముగ్గురు పిల్ల‌లు పుట్టాక శ‌రీరం స‌డ‌లి, బిగుతు త‌గ్గి, స్థ‌న‌ములు జారి, పొట్ట పెద్ద‌దై, కింద‌కు జారి తొడ‌లు వెనుక‌భాగం అటూ ఇటూ లూజుగా క‌దులుతుంటాయి. విచిత్ర‌మేమంటే 20 సంవ‌త్స‌రాల వ‌య‌సులో కోరిక‌లు తెలిసీ తెలీని స్థితిలో ఉండి, ఆశ త‌ప్ప అనుభ‌వ‌స్థితిని పొంద‌లేరు.

ఇరువై-ముప్పై అయిదు సంవ‌త్స‌రాలు మ‌ధ్య స్త్రీ శ‌రీర సౌఖ్యాన్ని బాధ్య‌త మ‌ధ్య పొందీ పొంద‌కుండా వుండే స్థితిలో ఉంటుంది. ముప్ప‌యి అయిదు సంవ‌త్స‌రాల త‌ర్వాత స్త్రీ ప్రౌఢ అంటారు. అన్ని హార్మోన్లు ఉచ్ఛ‌స్థితిలో ఉండి పురుషాధిక్య‌భావాల‌తో సంపూర్ణ శ‌రీర సౌఖ్యాన్ని కోరుకుంటుంది. ఈ స్థితిని ప్రౌఢ స్థితి అంటారు. ఆ వ‌య‌సులో స‌డ‌ల‌ని శ‌రీరాన్ని చూసి, మాన‌సిక ప్రౌఢ‌త్వాని గ‌మ‌నించని భ‌ర్త పూర్తి ఆతృత‌ని, ఉత్సాహాన్ని చూపించ‌డు. 

ఈ సందిగ్ధ ప‌రిణామం వ‌ల్ల న‌డివ‌య‌స్సు వారిలో తెలియ‌ని అసంతృప్తి, దానివ‌ల్ల వ‌చ్చే తెలియ‌ని కోపం, విసుగు క‌లుగుతూ ఉంటాయి. ఏ వ‌య‌స్సులోనూ స‌డ‌ల‌ని శ‌రీర సౌంద‌ర్యాన్ని ఆయుర్వేదం ప్ర‌తిపా దిస్తుంది.

ఆధునిక వైద్యంలో ఈ శ‌రీర‌పు పున‌ర్ నిర్మాణాన్ని నియంత్రించే ప్ర‌క్రియ‌లు, మందులు తెలిసి లేవు. ముప్పైయేడు సంవ‌త్స‌రాల త‌ర్వాత స్త్రీ రాగిచెంబులో నాలుగు గంట‌లు నిలువ వుంచిన నీళ్లు ఆహారానికి ముందు తాగితే శ‌రీరంలో కొవ్వు అధికంగా పెర‌గ‌కుండా ఉంటుంది.

రాత్రి, పెరుగు, అన్నంలో వేపుడు కూర‌లు, తీపి ప‌దార్థాలు, నెయ్యి వేసుకోకుండా ఉండ‌టం మంచిది. రాత్రి ప‌రుండే ముందు అర‌గ్లాసు వేడి పాల‌ల్లో ఒక చెమ్చా ప‌టిక‌బెల్లం చూర్ణం క‌లుపుకొని తాగ‌డం మంచిది. 

అన్నం మొద‌టి ముద్ద‌లో నువ్వుల‌పొడి ఒక చెమ్చా క‌లుపుకుని తిన‌డం వ‌ల్ల హార్మోన్సు బాల్యెన్స్‌గా ఉంటాయి. మినుముల‌తో చేసే గారెలు వారానికి రెండు సార్లైనా తిన‌డం మంచిది. మీ వారికి బెల్లంతో చేసిన నెయ్యి క‌లిపిన మిన‌ప సున్నివుండ‌లు సాయంత్రం 7.30 గంట‌ల‌కు తినిపించ‌డం మరువ‌కండి.

న‌వ యవ్వ‌నానికి ఆయుర్వేదం 

female sexual health: 10 నీరుల్లిపాయ ముక్క‌ల‌ను అర లీట‌రు నీళ్ల‌లో ఒక వంతు మిగులున‌ట్లు కాచుకుని, వ‌డ‌పోసుకుని కొంచెం బెల్లం క‌ల‌పుకొని మూడువారాలు రోజుకు ఒక్క‌సారి తాగండి. నెల‌స‌రి స‌క్ర‌మంగా ఉంటుంది. 

స్త‌న‌ములు జారి మెత్త‌నై ఉంటే తామ‌ర గింజ‌ల చూర్ణం, పంచ‌దార క‌లిపి పాల‌తో లోప‌లికి తీసుకొని తామ‌ర పూలు మెత్త‌గా నూరిన ముద్ద‌ను పైన‌ప‌ట్టించినా అవి గ‌ట్టిప‌డి ఆక‌ర్షణీయంగా త‌యార‌ వుతాయి. నిమ్మ‌చెట్టు ఆకుల ర‌సం మూడు చెమ్చాలు, దానిమ్మ బెర‌డు చూర్ణం, అశ్వ‌గంథం చూర్ణం క‌లిపి ముద్ద‌గా చేసి పైన ప‌ట్టులా వేసుకుంటే స్త‌న‌ములు ధృడ‌మై ఉంటాయి.

కొంత‌మందిలో స్త‌న‌ములు (Breasts) చిన్న‌వై పెర‌గ‌కుండా ఆగిపోతాయి. వారు అశ్వ‌గంథ చూర్ణం, పిల్లి తేగ‌లు, చెంగ‌ళ్ళ వోట్టు వీటిని ముద్ద‌గా నూరి ఆవుపాలు, నువ్వుల నూనెలు కలిపి కాచి ముద్ద‌గా త‌యారైన త‌ర్వాత పైన లేప‌న చేసుకుంటే అవి పెరిగి చ‌క్క‌గా ఉంటాయి. 

అలాగే, తెల్ల మందార పువ్వుల‌ను ఆవు పాల‌తో నూరి స్త‌న‌ముల‌ పై మ‌ర్ద‌న చేస్తుంటే పుష్టిగా పెరుగు తాయి. కొంత‌మందికి ప్ర‌స‌వ‌ముల కార‌ణంగా యోని విశాల‌మైపోతుంది. కాడ‌ల‌తో కూడిన తామ‌ర‌పువ్వులు ఆవుపాల‌తో మ‌ర్దించి చుట్టూ రాసుకుంటే గ‌ట్టిప‌డుతుంది.

అలాగే గింజ‌లు తీసిన ఉసిరికాయ పెచ్చుల‌ను నీళ్ల‌తో నూరి ఆ ముద్ద‌ను నీళ్ళ‌తో క‌లిపి రోజూ రెండుసార్లు అక్క‌డ క‌డుగుకుంటుంటే యోని గ‌ట్టిప‌డుతుంది. వేప‌చెట్టు బెర‌డు తీసుకొని ఎండించి దాన్ని గంధంగా తీసుకొని ఆ గంధాన్ని పైన‌, లోప‌ల రాసుకుంటూంటే యోని బిగువుగా త‌యార‌వుతుంది. 

మూడు రోజుల‌కు ఒక్క‌సారి నువ్వుల నూనెతో శ‌రీర‌మంతా మ‌ర్ద‌న చేసుకొని, పెస‌ర‌పిండిలో కొంచెం ప‌సుపు, వేప‌పొడి, గంధంపొడి క‌లుపుకొని దాంతో న‌లుగు పెట్టుకుని వేడినీళ్ళ‌తో స్నానం చేస్తుంటే శ‌రీరం ఆక‌ర్ష‌ణీయంగా వుంటుంది. 

అలాగే కొంత‌మంది స్త్రీల‌లో కాళ్ళ‌పై చేతుల‌పై ఉండ‌కూడ‌నిచోట వెంట్రుక‌లు (hair) పెరుగు తాయి. వారు హ‌రి ద‌ళం మోదుగు పుల్ల‌లు కాల్చిన బూడిద స‌మ‌భాగాలుగా తీసుకొని అర‌టి దుంప ర‌సంతో మ‌ర్ధ‌న చేసి పైన రాస్తూంటే వెంట్రుక‌లు వూడిపోయి తిరిగి పుట్ట‌వు. గుర్తిం చ‌ని హార్మోన్ల ప్ర‌భావం వ‌ల్ల బ‌హిష్టులు ఆగి ఆగి వ‌స్తూంటే మీ శ‌రీరం బ‌రువు పెరుగుతుంది. ఒళ్ళు పెరిగితే బ‌రువు మాత్ర‌మే, కాదు మీ ఆకృతి కూడా వికారంగా త‌యార‌వుతుంది. 

అయిదే తులాల నీరుల్లిపాయ‌ల‌ని ముక్క‌లు చేసి ఒక లీట‌రు నీళ్ల‌లో క‌లిపి కాచి మూడ‌వ‌వంతు నీరు మిగులున‌ట్టు కాచి వ‌డ‌పోసుకొని అందులో బెల్లం క‌లుపుకొని మూడు వారాలు తాగితే బ‌హిష్టు స‌క్ర‌మ‌మై శ‌రీరం చ‌క్క‌గా ఉంటుంది. 

మీలో శ‌రీర‌పు ఛాయ త‌ర‌గ‌కుండా ఆక‌ర్ష‌ణీయంగా వుండాలంటే ప‌సుపు, ఆవాలు, కుంకుమపువ్వు, శొంఠి, కొంచెం క‌ర్పూరం క‌లిపి పెస‌ర‌పిండిలో క‌లుపుకొని స్నానానికి ముందు న‌లుగు పెట్టుకుంటే న‌లుపు విరిగి తెల్ల‌బ‌డ‌తారు. వ‌య‌స్సు పెర‌గ‌డం స‌హ‌జం. దాంతో శ‌రీర‌పు సౌంద‌ర్యం పెర‌గాలి కాని, స‌డ‌ల కూడ‌దు. 

Post a Comment

0 Comments