![]() |
| Photo Credits:freepik |
Ayurveda for Paralysis: పక్షవాతం మనిషి బ్రతికి ఉండీ అచేతనంగా ఉండే విచిత్ర స్థితి! శరీరం లో ఒక భాగం కాని, పూర్తిగా కాని తమ కదిలే శక్తిని సంపూర్ణంగా కోల్పోతే దాన్ని పక్షవాతం లేదా పెరాలసిస్ అంటారు. ఇది వస్తే ఆ భాగం స్పర్శ, కదలిక ఏమీ ఉండవు. ఈ స్థితి వచ్చిన శరీర భాగాన్ననుసరించి ఇది మూడు, నాలుగు విధాలుగా ఉంటుంది.
శరీరంలో
ఒక వైపు
భాగమంతా
సైథ్యిమైనది
అనుకోండి దాన్ని
హెమీప్లీజియా (Hemiplegia) అంటారు. అదే
రెండు వైపులా
వచ్చిందనుకోండి దాన్ని
పెరప్లీజియా
(Paraplegia) అని అంటారు. దీన్ని
ఆయుర్వేదంలో పక్షాగాతమంటారు.
ఒక భాగం ముఖంలో వచ్చిందనుకోండి దాన్ని బెల్స్ పాల్సీ అంటారు. దీన్ని ఆయుర్వేదంలో అర్జితవాతమంటారు. ఒక్కొక్కప్పుడు శరీరంలో ఒకవైపు మాత్రం కదలికని కోల్పోయి బరువుగా ఉంటుంది. దీన్ని యూనీలేటరల్ అంటారు. దీన్ని ఆయుర్వేదంలో ఏకాంగవాతమంటారు.
అలాగే శరీరానికి రెండువైపులా సైథిల్యం చెందితే దాన్ని బైలేటరల్ అంటారు. అదే పక్షవాతం. ఆయనకి స్ట్రోక్ వచ్చిందంటారు. అంటే హఠాత్తుగా శరీరమంతా బలహీనమై నట్లనిపించి కాళ్లు, చేతులు కదపలేకపోవడం, తర్వాత ఏదో ఒకవైపు కాళ్లు, చేతులు అచేతనంగా అయిపోవడం. దీన్ని హెమిప్లీజియా అంటారు. సకల నరాలశక్తి, కండరాల శక్తి నిర్వీర్యమయ్యే ఈ స్థితిని పక్షవాత మంటారు (Ayurveda for Paralysis) ఆర్యులు.
Ayurveda for Paralysis: ఏ కారణాల వల్ల వస్తుంది?
స్రోక్! ఇది అత్యవసర వ్యాధి. ఈ స్థితిలో మన కదలికలన్నింటికీ సకల శరీర చైతన్యానికి కేంద్రమైన బ్రైన్‌కి రక్తప్రసారం ఆగిపోతుంది. దానివల్ల బ్రైన్‌లోని జీవకణాలు చచ్చిపోవడం ప్రారంభమవుతుంది. ఈ స్థితి రెండు రకాలుగా ఉంటుంది. ఒక దానిలో బ్రైన్కు వెళ్లే రక్తనాళాలలో రక్తం గట్టకట్టడం, దాన్ని ఇన్కీమిక్ స్ట్రోక్ అంటారు. అలాగే బ్రైన్లో రక్తనాళాలు తీవ్ర ఒత్తిడి వల్ల పగిలి రక్తస్రావం జరిగిందనుకోండి అప్పుడు హెమరేజిక్ స్ట్రోక్ అని అంటారు.
ఎలా గుర్తుపట్టడం?
హఠాత్తుగా ముఖం, కాళ్లు, చేతులు నీరసపడి తిమ్మిరిగా ఉండటం. అదీ ఒక వైపు ఉండటం. హఠాత్తుగా భ్రమ, ఏమీ తెలియని స్థితి, మాట్లాడలేక పోవడం, సరిగ్గా చూడలేకపోవడం. హఠాత్తుగా విపరీతమైన తలపోటు రావడం, సరిగ్గా నిలబడలేక, లేవలేక, తెలిసీతెలియని స్థితిలో ఉండటం.
పక్షవాతం స్వభావరీత్యా రెండు రకాలు
కదలికలలో నియంత్రణ లేక, కండరాలు బండబారి ఉండటం, దీన్ని స్పాసిటిక్ పెరాలసిస్ అంటారు. దీనిలో కండరాలు సన్నబడవు. కండరశక్తి చాలా తక్కువగా పోతుంది. కాని ఫ్లాసిడ్ పెరాలసిస్ లో కండరాల శక్తి పూర్తిగా పోతుంది. నరాలలో విద్యుత్ శక్తి పోతుంది. కండరాలు సన్నగిల్లి పూర్తిగా సైథిల్యం చెందుతాయి. వెన్నుపూసకు తగిలిన దెబ్బలు అందులో ఏర్పడిన గడ్డలు వంటవి ఈ స్థితికి కారణమవుతాయి.
ఏ కారణం లేకుండా ముఖ్యంగా నడి, పెద్ద వయసులో ఒళ్లంతా తూలుతూ, కాళ్లు, చేతులు కంపం తో కదులుతూ సరిగ్గా నడవలేక తూలుతూ ఉండే స్థితి వస్తుంది. దీన్ని పార్కిన్‌సన్స్ సిండ్రోమ్ అంటారు. ఈ పక్షవాతం వల్ల మరో ఉపద్రవమేమంటే మల, మూత్ర విసర్జనపై అదుపు ఉండదు. తెలియకుండానే వెళ్లిపోతుంటాయి. దీనివల్ల అక్కడ చీముపట్టే అవకాశం ఉన్నది.
Ayurveda for Paralysis: ఇది వచ్చిన వెంటనే గమనించాల్సినవి!
శరరీంలో ఏ భాగం? శరీరంలో ఒక వైపు భాగమంతానా లేదా శరీర మంతానా?
క్రింద నుంచి పైకా లేదా పై నుండి క్రిందకి వ్యాపించిందా? చెయ్యి కాని కాలు కాని బరువుగా ఉండి ఎత్తడం కష్టమవుతున్నదా?
అక్కడ తిమ్మిరిగా ఉందా లేదా అసలు స్పర్శ లేదా?
ఇది పక్షవాతం కాదు
ఆ అవకాశం ఉంది. చంక దగ్గర ఉన్న నరాలకు దెబ్బ తగిలితే తాత్కాలికంగా చేయి చచ్చుబ డవచ్చు. తలకి తగిలిన బలమైన గాయం వల్ల స్పృహ కోల్పోతే తాత్కాలికంగా మన కాళ్లు, చేతులు కదపలేక పోవడం. కొంత మందిలో అనువంశికంగా పెద్ద వయస్సులో నరాల బలహీనత రావచ్చును. శరీరపు వ్యాధి నిరోధక శక్తిలో లోపాల వల్ల నరాల శక్తి సన్నగిల్లి ఈ స్థితి రావచ్చు (Guillain Barre Syndrome). కొంత మందిలో వచ్చే జన్మజ వ్యాధులలో ముఖ్యంగా మస్కులర్ డిష్‌ట్రఫీ వంటి వాటిలో కూడా ఈ స్థితిలాగే ఉంటుంది.
పక్షవాతం రాకుండా ఏమి చేయాలి?
ఒళ్లు పెరగకుండా వాతాన్ని అంటే మన నెర్వస్ శక్తిని పాడుచేసే వేరుసెనగ నూనె, వేపుడు కూరలు అధిక తీపి, నెయ్యిలకు దూరంగా ఉండటం మంచిది. రక్తపు పోటు, షుగరు ఉన్నవాళ్లు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నిత్యం చిన్నపాటి శరీర వ్యాయామం, నియమబద్ధంగా జీవించడం మనం అలవరచుకోవాలి.
పక్షవాతానికి మంచి చికిత్స ఉన్నదా?
స్ట్రోక్ వచ్చినప్పుడు ఆ కారణం వివిధ పరీక్షల ద్వారా అంటే రక్తపరీక్షల ద్వారా, సిటీ స్కాన్, M.R.I ద్వారా నిర్ణయించుకొని అత్యవసర చికిత్స ఆధునిక వైద్యంలో లభ్యమవుతుంది. నిండు పూర్తి నివారణకు తిరిగి పూర్తి ఆరోగ్యకర జీవనానికి ఆయుర్వేద శాస్త్రం మంచి ప్రక్రియలని ప్రతిపాది స్తున్నది. స్ట్రోక్ వచ్చినప్పుడు చిన్నపాటి విరేచనం చేయించమంటుంది ఆయుర్వేదం. ఆశ్చర్య మేమంటే దీని వల్ల స్ట్రోక్‌కు కారణమైన బ్రైన్‌లోని మార్పులను సరిచేయడానికి ఉపయోగ పడుతుంది.
ప్రాణవాయువు అంటే బ్రైన్ విధులని నియంత్రించి కదిల్చే శక్తి అన్నమాట. సమాన స్థితికి వచ్చి రక్తనాళాలలో రక్తప్రసారం ఆరంభమవుతుంది. ఆముదం, కరక్కాయపొడి, త్రిఫలా చూర్ణం ఇందుకు వాడవచ్చు. శరీరానికి ముందుగా తయారైన నూనెలతో పూర్తిగా ఒత్తి రాయడానికి అభ్యంగ మనమంటారు. దాని తర్వాత ఆవిరిలో శరీరం ఉంచడం. ఇది స్ట్రోక్ స్థితిలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. బల, నారాయణ, మహానూష, కుపిలు తైలాదులు ఇందుకు వాడతారు.
ఇవి అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యుల సంరక్షణ (Ayurveda for Paralysis) లో చేయించు కొనడం మంచిది. అలాగే స్వేదం, మనకి చెమటని పుట్టించే స్ట్రీమ్ బాత్లో నిర్గుండి, దశమూల, ఏరండమూల కషాయాలని వాడవల్సి ఉంటుంది. ఆ తర్వాత వస్తీ అని ఒక ప్రత్యేక చికిత్స. వస్తి అంటే వైద్యంలో చేసే ఎనీమా వంటిది. ఈ వసి నిరూహవస్తి, అనువాసన వస్తి అని రెండు రకాలు. అలాగే నశ్యకర్మ అంటే ముక్కులో మందు చుక్కలు వేసి లోపలికి పీల్చడం వంటిది.
అణుతైలంతో నశ్యకర్మ చేస్తే తద్వారా బ్రైన్లో జ్ఞానేంద్రియాల న్నింటినీ కదిల్చే శక్తులను జాగృతపరచి తిరిగి పనిచేసేటట్టు చేస్తాయి. షట్ట్ బిందు లేదా పంచేంద్రియ మర్దన తైలం వంటి వాటితో కూడా చేయవచ్చు. అలాగే రాస్నా, అశ్వగంధ, మినుము, నిర్గుండి, బలాకొంచి బీజాలు, వెల్లుల్లి, మండూక పర్ణి, సర్పగంధ వంటి మూలికలు కూడా చాలా ఉపయుక్తం. పక్షవాతం వచ్చిన వాళ్లు వేడిగా అప్పుడే వండిన అన్నం, మధుర పదార్థాలు తినాలి.
చేదు, వగరు ఉన్న పదార్థాలు తినకూడదు. బార్లి తినకూడదు. అరిటిపళ్లు, మామిడిపళ్లు, బత్తాయి పళ్లు మంచివి. పక్షవాతం మన కదలికని, మనస్సుని సైథిల్యం చేసే వ్యాధి కాని చంపే వ్యాధి కాదు. చక్కగా వైద్యం చేయించుకుంటే మనం దాన్ని జయించవచ్చు.

0 Comments