![]() |
| Photo Credits:Freepik |
Ayurveda for Allergy : ఉన్నట్టుండి గొంతు గరగరమంటుంది. మరుసటి రోజు ముక్కునుండి నీరు రావడం ప్రారంభమై జలుబు చేస్తుంది. మరొకరికి హఠాత్తుగా కళ్లు ఎర్రబడి నీరు కారడం ప్రారంభ మవుతుంది.
మరొకరికి కారణం లేకుండా ఒళ్లు
వెచ్చబడి ఆయాసంగా ఉంటుంది.
శ్వాస వదిలేటప్పుడు
పిల్లికూతలవంటి శబ్ధం వస్తూ ఉంటుంది.
మరొకరికి హఠాత్తుగా కాళ్లు,
చేతులు వ్రేళ్ల
మధ్య
దురద
ప్రారంభమవుతుంది. ఇవన్నీ ఒకే
కారణం
వల్ల
వస్తాయి.
అదే ఎలర్జీ (Ayurveda for Allergy) అంటారు ఆధునిక
శాస్త్రజ్ఞలు.
కొన్ని పదార్థాలకి
శరీరం
పొందే తీవ్రమైన ప్రతిబంధిత
చలానాన్ని
(Reaction) ఎలర్జీ అంటారు.
మనకి
తెలియదు
కానీ మన చుట్టూ ఉండే
చెట్టు, చేమ,
గడ్డి
వంటివి చిన్న
చిన్న రేణువులలాంటి పదార్థాలని
విడుదల
చేస్తూ ఉంటాయి.
వీటిని పోలెన్
(Pollen) అంటారు. ఈ
పదార్థాలు
ఇతర
చోట్లకి
వ్యాపించి ఆ
వృక్ష జాతులని మళ్ళీ
పుట్టించడం
వాటి ధ్యేయం.
కాని ఇవి
ఆ ధ్యేయానికి
చేరక
మునుపే ఆడకూడని మనుష్యల
ముక్కు, గొంతుక,
చర్మం,
కళ్లు
వంటి వాటిని
చేరతాయి.
ఈ శరీరం తనది కాని
పదార్థం
తనలో చేరినప్పుడు
వికటిస్తుంది
అంటే రియాక్టవు తుంది. అదే
ఎలర్జీ.
అప్పుడు ముక్కు
దిబ్బడేసి
జలుబు
చేస్తే ఎలర్జిక్ రినైటిస్
(Allergic Rhinitis) అంటారు. జ్వరం వస్తే
హేఫీవర్
(Hay Fever) అంటారు. ఎన్నో
ఇలాంటి చిన్న
చిన్న రేణువులు
ప్రకృతిలో
ప్రయా
ణించి మనుష్యులకి
వివిధ వ్యాధులని కలుగజేస్తున్నా ఈ
పోలెన్ అనే
పదార్థం
ఎక్కువగా
ఎలర్జీని
తీసుకొస్తుంది.
కొన్ని ఆహార
పదార్థాలు,
కొన్ని జంతువుల
స్పర్శ,
దుమ్ము, ధూలి,
కొన్ని మందులు,
కొన్ని రసాయనాలు, ఇలాంటి
ఎలర్జీని
కలుగజేస్తాయి. అన్నీ
అందరికీ
ఇలాంటి ఎలర్జీని తీసుకు
రాకపోవచ్చు. ఎందుకంటే
ఎవరి
శరీరంలో
వ్యాధి నిరోధక శక్తి
చక్కగా ఉంటుందో వారికి
ఈ వికటించడం
తక్కువలో ఉంటుంది.
కొందరి
శరీతత్వం సున్నితమై ఉంటుంది. వాళ్లకి ఈ ఎలర్జీ సులభంగా వస్తుంది. అలాగే
ఎలర్జీ,
ఆస్తమా
ఉన్నటువంటి
వాళ్ల పిల్లలకి, ఈ
సున్నితమైన
శారీరతత్వంలో ఎలర్జీ ఉన్నవాళ్ల పిల్లలకి ఈ
స్థితి వస్తుందని
శాస్త్రజ్ఞలు పరిశోదనలో తేలింది.
అలాగే మన శరీరంలో
వ్యాధి నిరోధక శక్తి
తగ్గి
ఉన్న సమయాల్లో అంటే
తీవ్ర జ్వరం వచ్చి
తగ్గిన తర్వాత, ఆడ
పిల్లలు
పెద్ద మనిషి అయ్యే
సమయంలోను, గర్భిణీ కాలంలోను,
ఋతువులు మారే
సంధి కాలంలోను
చాలా కాలం
నుంచీ రక్షక్షీణత
(Anemia) క్షయ (T.B), షుగరు వ్యాధి,
బలక్షయం కేన్సరు వంటి వ్యాధితో
బాధపడే వారిలో ఈ
ఎలర్జీ
రావచ్చు.
ఒక ప్రత్యేక
మైన స్థితి
ఏమంటే మిగతా కారణాలతో పాటు ఆత్రుత,
ఆరాటం, మానసిక ఒత్తిడి ఎక్కువ,
ఆలోచనలు ఉండే వాళ్లలో ఈ ఎలర్జీ తొందరగా వస్తుందట.
మేధావులు, సున్నిత
మనస్కులు, లేతగా సన్నగా లాలిత్యంగా ఉండే
వాళ్లకి ఈ ఎలర్జీ తొందరగా వస్తుందని పరిశోధనలో తేలింది.
చల్లటి
ప్రదేశాలలో ఉండే వాళ్లు,
ఎక్కువగా
బయట ప్రయాణాలు
చేసేవారిలో ఈ
ఎలర్జీ
ఎక్కువగా
ఉంటుంది. నేటి శాస్త్ర
పరిశోధనలలో
అన్ని ఎలర్జీలకి
పోలెన్ పదార్థం ఒకటే కారణం
కాకపోవచ్చు. చిన్న
చిన్న క్రిమి
కీటకాదులు
కూడా ఎలర్జీని కలిగిస్తాయి.
మన శరీరమనే కోటని
రక్షించడం కోసం శరీరమంతా ఎప్పుడూ
తిరుగుతూ ప్రమాదం వచ్చిన వెంటనే స్పందించే రక్షణ వ్యవస్థని
మనలో ఉంచాడు భగవంతుడు. ఈ
శరీరంలో
ఏదారిలోనైనా నీరు,
గాలి, ఆహార
సంస్కంలాంటి మార్గాల
ద్వారా వచ్చే సూక్ష్మజీవులు ఆయుధాలైన
టాక్సిన్స్ ని
ఎదుర్కొని, మనని కాపాడుకోవడానికి ఈ
రక్షణవ్యవస్థ అయిన ఇమ్యూనిటీ,
ఏంటీ బాడీ,
అనే పదార్థాన్ని విడుదల చేస్తుంది. దాన్ని
ఐజిఇ (IGE) అంటారు. ఈ
సూక్ష్మజీవుల
టాక్సిన్స్కి,
ఏంటా బాడీలకి జరిగే
పోరులో వచ్చే చిన్న
మార్పు ఈ
ఎలర్జిక్
యాక్షన్.
Ayurveda for Allergy : ఎలర్జీ వ్యాధి లక్షణాలు ఏమిటి?
ముక్కు చీదడం, ముక్కు నుండి
నీరు కారుతూ
తడిగా
ఉండటం,
ముక్కు లోపల, గొంతుకలో,
కళ్లలో దురదగా ఉండటం,
కళ్ల
క్రింద నల్లటి వలయాల వంటి
రేఖలు
లేదా ముడతలు ఏర్పడటం. ఇది
రక్త
ప్రసారం
కొంచెం తగ్గడం వల్ల ఏర్పడుతుంది.
ముఖ్యంగా దురదకి ముక్కుని
అస్తమానం
రుద్దడం
వల్ల
తయారవుతుంది. దీన్ని
ఎలర్జిక్
సెల్యూట్ (Allergic Salyate) అంటారు. కళ్ల నుండి నీళ్లు
కారటం,
కళ్లు
ఎర్రబడి, దురద,
మంటతో
ఉండటం.
ఎలర్జీని గుర్తించడం ఎలా?
మొదట
ఇది మామూలుగా
వచ్చే
జలుబు
అనుకుంటారు. తరుచూ వస్తుంటే డాక్టర్ దగ్గరికెళతారు.
ఆయన
కూడా ముందు
సందేహించకపోయినా మందులకి తగ్గకపోతే అప్పుడు
ఇది ఎలర్జీ అనుకుంటారు.
చర్మం
పరీక్షలో తేలుతుంది. రక్త పరీక్షలు ముఖ్యంగా Rast టెస్ట్
చేస్తారు.
కాని ఇది
చాలా ఖరీదైందే కాక
ఫలితం
రావడానికి
చాలా సమయం తీసుకుంటుంది.
చర్మానికి
చేసే టెస్టు
మంచిది. ఖర్చు తక్కువ కూడా.
అన్నింటికీ మించి
లక్షణాల్ని బట్టి అనుభవజ్ఞులైన ఆయుర్వేద
వైద్యులు చూసే
నాడీ పరీక్షద్వారా
గుర్తించవచ్చు.
ఎలర్జీ రాకుండా ఉండాలంటే ఏమి చేయాలి?
దీన్ని మూడు
విధాలుగా చికిత్సించుకోవాలి. ఎలర్జీని
కలుగజేసే పరిసరాలని,
పదార్థాలనీ దూరంగా ఉంచడం. ఎలర్జీ
లక్షణాలకి వివిధ
మందులు వేసుకోవడం. శరీరపు సహజవ్యాధి నిరోధక శక్తిని
పెంచుకొనడం.
దీనికి అసలు కారణం
శరీరపు శ్రోతస్సులలో ఉండి పోయిన
విషపదార్థం (Toxins) మనలోని రక్షణ వ్యవస్థని నిర్వీర్యం
చేయడం
అంటుంది ఆయుర్వేదం
(Ayurveda for Allergy). ఈ ఆమ
మనే
పదార్థం
శరీరంలోని
పిత్తాన్ని అంటే
రక్త
రసాదిధాతువులని, తర్వాత
కఫాన్ని
అంటే జీవకణ శక్తిని క్షీణింప
చేయడం
వల్ల
ఈ స్థితి
వస్తుంది.
ముఖ్యంగా సన్నగా, లాలిత్యంగా,
సున్నితంగా ఉండే
వాత ప్రకృతి కలవారిలో ఇది
ఎక్కువగా
వస్తుంది. నిద్రలేకపోవడం, తలనొప్పి,
మనో అవృత ఉంటే
అది వాత
కారణమని, పచ్చని ద్రవం ముక్కు నుండి
కారడం,
కళ్లు
మంటలు,
చర్మంపై
రేఖలు
ఉంటే పిత్త
కారణమని, తెల్లటి ముద్ద లాంటది ముక్కు నుండి
వస్తూ
శరీరం,
తలబరువుగా ఉండటం కఫ
కారణమని మనం గుర్తించవచ్చు.
Ayurveda for Allergy: ఎలర్జీ కి చికిత్స ఎలా ఉండాలి?
ఉదయం
రెండు చిటికెలు
పసుపు,
ఒక చిటికెడు
మంచి మెత్తటి ఉప్పు నోట్లో
వేసుకొని వేడినీళ్లు
త్రాగితే తరుచూ వచ్చే ఎలర్జీ తగ్గిపోతుంది. నువ్వులనూనెలో అగరు, మారేడుదళం,
కంటకారి
వేసి కాచి
చల్లారిన
తరువాత
ముక్కులో రెండు
చుక్కలు
వేసుకుంటే మంచి
ఫలితం
వస్తుంది.
తమలపాకులు నీళ్లలో మసులుతున్నప్పుడు ఆ
ఆవిరిని పీల్చడం ఎలర్జీ
లక్షణాలని తగ్గిస్తుంది.
మంచి కొబ్బరి నూనెలో గులాబీరేకులు
వేసి కాచి
చల్లార్చిన
తర్వాత
ముక్కులో చుక్కలుగా వేసుకుంటే
తేలికగా
ఉంటుంది.
మనలో ఓజస్సును పెంచే రసాయనం తీసుకొనడం చాలా మంచిది. ఆహారంలో చల్లటి పదార్థాలు, బరువైన పదార్థాలు పెరుగు, వెన్న వంటివి తీసుకోకపోవడం మంచిది. చన్నీటి స్నానం, చన్నీళ్లు త్రాగడం మానేయాలి. జలుబు పది రోగాల పెట్టు అంటారు పూర్వీకులు. పసుపు, ఉప్పు, వేప, అగరు, కంటకారి, తులసి, తమలపాకు, ఆవాలు, వాము ఇవన్నీ ఎలర్జీని తగ్గించే సహజ పదార్థాలు.

0 Comments