Ticker

6/recent/ticker-posts

telugu Cooking tips: వంటింటి చిట్కాలు ఇక్క‌డ తెలుసుకోండి!

telugu Cooking tips: ఇంట్లో కూర‌లు లేన‌ప్పుడు అనుకోని అతిథి వ‌చ్చార‌నుకోండి కంగారు ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ఈ క్రింది తెలిపిన వంటింటి చిట్కాలు తెలుసుకుని ట్రై చేయండి. 

image show telugu Cooking tips

telugu Cooking tips: వంటింటి చిట్కాలు!

గుప్పెడు పెస‌ర‌పప్పు నాన‌వేసి, అన్నం ఉడికేలోగా అది గ్రైండ్ చేసి, పిండిలో చిటికెడు ఉప్పు వేయాలి. బాండ్లీలో నూనె వేసి కొద్దిగా శ‌న‌గ‌ప‌ప్పు, మిన‌ప‌ప్పు, ఆవాలు, జీల‌క‌ర్ర వేగాక కొద్దిగా ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి ముక్క‌లు, క‌రివేపాకు వేసి వేగాక ఈ పెస‌ర పిండి వేసి క‌లియ తిప్పాలి. ఐదు నిమిషాల త‌ర్వాత కూర‌లా పొడిపొడిగా వుడుకుతుంది. అప్పుడు కూర‌కంటే ఇది మంచి రుచిగా ఉండి మ‌రికాస్త ఎక్క‌వ అన్నం తింటారు సుమా.

ఇంట్లోకి అతిథి వ‌చ్చిన‌ప్పుడు పెరుగు త‌క్కువ‌గా ఉండే కంగారు ప‌డ‌కండి. కాసిని పాలు చేర్చితే స‌రి వ‌డ్డించే స‌మ‌యానికి పాలు, పెరుగు క‌లిసి తోడుకుని మ‌ర్యాద‌ను కాపాడుతాయి. 

అన్నం వండే ప‌ద్ధ‌తి

అన్నం (rice cooking tips) అంద‌రూ వండ‌గ‌ల‌రు. కానీ కొంద‌రు పేస్టులా వండేస్తారు. కొంద‌రు మేకుల్లా వండేస్తారు.  మొద‌టిది చూడ్డానికి బాగుండ‌దు. రెండోది తింటే క‌డుపునొప్పి!. అన్నానికి పెట్టిన ఎస‌రు స‌ల‌స‌ల్లాడుతున్న‌ప్పుడు ఓ స్పూను నూనె వేసి త‌ర్వాత బియ్యం క‌డిగిపోయాలి. అప్పుడు ఉడుకు త‌న్న‌ప్పుడూ త‌రువాత కూడా అన్నం విర‌విర‌లాడుతూ చ‌క్క‌గా ఉడుకుతుంది.  

ఇంటింటి చిట్కాలు! 

1.కుక్క‌ర్ అడుగు భాగంలో న‌ల్ల‌గా ఉన్న‌ట్ల‌యితే వంట‌కు ముందు ప్ర‌తి రోజూ చిటికెడు నిమ్మ ఉప్పు వేస్తే తెల్ల‌గా వ‌స్తుంది.

2.రాత్రి నిద్ర మ‌ధ్య‌లో ఒక సారి లేచి మంచినీళ్లు త్రాగితే కాల‌కృత్యం ఫ్రీగా అవుతుంది.

3.దొండ‌కాయ‌లు కొద్దిగా మ‌గ్గిన‌వి పారేయ‌కుండా చ‌క్రాల్లా త‌ర‌గి ఎండ‌లో పెట్టి గ‌ల‌గ‌లా ఎండ‌నిచ్చి వ‌డియాల్లా నూనెలో వేసుకుని కారం, ఉప్పు చ‌ల్లుకుంటే బాగుంటాయి.

4.నూనె మడ్డిగా ఉండే చిన్న బెల్లం ముక్క నూనెలో వేసి వుంచితే మ‌డ్డి అంతా నూనె అడుగు భాగానికి చేరుకుంటుంది.

5.ఉద‌యం లేవ‌గానే కాఫీకి బ‌దులు నిమ్మ‌ర‌సం తీసుకుంటే ఆరోగ్యం మ‌నల్ని వ‌రిస్తుంది.

6.దొండ‌కాయ‌, అర‌టికాయ కోసేట‌ప్పుడు చేతికి నూనె రాసుకుంటే చేతులు న‌ల్ల‌బ‌డ‌వు.

7.ద‌గ్గు బాగా వ‌స్తున్న‌ప్పుడు ఒక ల‌వంగ మొగ్గ కానీ, చిన్న ప‌టిక బెల్లం ముక్క కానీ నోట్లో వుంచుకుని చ‌ప్ప‌రిస్తే  ద‌గ్గు కొంత వ‌ర‌కూ రానీయ‌కుండా చేయ‌వ‌చ్చు.

8.జిగురుతో కూడిన విరోచ‌నాలు అయిన‌ప్పుడు కొద్దిగా మెంతులు నోట్లో వేసుకుని చిన్న గ్లాసు మ‌జ్జిగ తాగితే స‌రిపోతుంది.

9.పెన్ను పాళీ వ్రాయ‌క‌పోతే పాళీని కొంత సేపు స‌బ్బు నీళ్ల‌లో నాన‌బెడితే మ‌ళ్లీ రాయ‌డం మొద‌లు పెడుతుంది.

10.కాళ్ల ఒరుపుల‌కు ప‌సుపు, నూనె క‌లిపిన ముద్ద రాస్తే ఒరుపులు త‌గ్గుతాయి.

11.పాలు విరిగిపోయినా స‌రే తోడు పెట్టుకుంటే బాగుంటుంది. (telugu Cooking tips)

12.బియ్యం పురుగు ప‌ట్ట‌కుండా వుండాలంటే వేప ఆకులు మూట క‌ట్టి బియ్యంలో వుంచాలి.

Post a Comment

0 Comments