Ticker

6/recent/ticker-posts

Ayurveda for Obesity : స్థూల‌కాయం త‌గ్గించుకోవ‌డానికి ఆయుర్వేద సూచ‌న‌లు

 image show Ayurveda for Obesity

Ayurveda for Obesity: ఈ ప్ర‌పంచంలో అన్ని దేశాల్లో 69 శాతం ప్ర‌జ‌లు లావుగా వుండి, దాని వ‌ల్ల వ‌చ్చే ఉప‌ద్ర‌వాల‌తో బాధ‌ప‌డుతున్నారు. అధిక కొవ్వు శ‌రీరంలో పేరుకుపోవ‌డం స్థౌల్య‌ము అం టారు. దీనినే ఒబెసిటీ (Obesity) అని కూడా అంటారు. 

లావుగా వుండ‌టం చూడ్డానికి బాగుండ‌క పోవ‌డం మాత్ర‌మే కాదు. దీర్ఘ‌కాలంలో ప్ర‌మాద‌ర‌మైంది కూడా. ఎందుకంటే గుండె మామూలుక‌న్న ఎక్కువ ఒత్త‌డితో ప‌నిచేయాలి. మ‌రి పెరుగుతున్న ఎక్కువ కొవ్వుకి కూడా ర‌క్తాన్ని పంపాలి క‌దా!. దీని వ‌ల్ల గుండె సామ‌ర్థ్యం తొంద‌ర‌గా మార్పు చెందుతుంది.

అంతే కాదు, మీరు స్థూల‌కాయుల‌యితే న్యూమోనియా (Pneumonia) వంటి శ్వాస కోశ వ్యాధులు, డ‌యాబెటీస్‌, ర‌క్త‌నాళాలు కుంచించుకు పోవ‌డం, గుండె జ‌బ్బులు, మోకాళ్ల నొప్పులు, బ్ల‌డ్ ప్రెష‌ర్‌, న‌డుం నొప్పి, ఆయాసం వంటి వ్యాధుల‌కు (Ayurveda for Obesity) కార‌ణ‌మ‌వుతుంది. 

వ్యాధి త‌గ్గ‌డంలో కూడా మీకు బాగా ఒళ్లు ఉంటే ఆల‌స్య‌మ‌వుతుంది. ఒళ్లు అధికంగా ఉన్న వాళ్ల‌కి శారీర‌క‌, మానసిక అశాంతితో బాటు నిత్య‌జీవ‌నం బ‌ద్ధ‌కంగానూ, తొంద‌ర‌గా అల‌స‌ట చెందేట‌ట్టు వుంటుంది. సంసార‌ సుఖం కూడా తృప్తిగా వుండ‌దు.

Ayurveda for Obesity : లావు పెర‌గ‌టానికి కార‌ణాలు

చిన్న‌త‌నంలో అతి ప్రేమ‌తో ఎక్కువ‌గా తింటిపెట్ట‌డం, దానివ‌ల్ల ఎదుగుతున్న కొల‌దీ ఎక్కువ‌గా తిన‌డం అలవాట‌వుతుంది. దానివ‌ల్ల లావుగా వున్న పిల్ల‌లు, బ‌రువు (weight) మించి పెరుగుతున్న బాలురు, బాలిక‌లు, పొట్ట‌, పిరుదులు, ఛాతీ ఇవి పెరుగుతున్న మ‌ధ్య‌వ‌య‌స్సులు ఉంటారు. ఏ త‌ల్లి తండ్రులు ప్రేమ‌తోనైనా తెలిసికానీ, తెలియ‌క గాని పిల్ల‌ల‌కి అధికంగా తిండి పెడుతుంటే వాళ్ల జీవ‌న ప్ర‌మాణాన్ని త‌గ్గిస్తున్నార‌న్న‌మాట‌.

లావుగా  వుండ‌ట‌మ‌న్న‌ది మ‌ధ్య వ‌య‌స్సులో వ‌స్తుంది. కాని అస‌లు ఈ స్థితికి కార‌ణం వాళ్ల బాల్యం లోనే ప్రారంభ‌మౌతుంద‌ని ప‌రిశోద‌న‌లు తెలుపుతున్నాయి. ఫాస్టుఫుడ్ తినే వాళ్ల‌లో ఒళ్లు పెర‌గ‌డానికి ఆస్కార‌ముంది. మ‌ధ్య‌త‌ర‌గ‌తి క‌న్న పైన ఉన్న వ‌ర్గంలోనూ, ఉన్న‌త స‌మాజంలోనూ ఉన్న వ్య‌క్తుల‌కి ఈ స్థితి సాధార‌ణం.

బీద‌వాళ్ళ‌ల్లో కూడా కార్పొహైడ్రేట్స్ ఎక్కువ‌గా తింటే ఒళ్లు రావ‌చ్చు. మాన‌సిక వైరుఢ్యాలు కూడా స్థౌల్యానికి కార‌ణ‌మ‌వుతుంది. ఒంట‌రిగా జీవించే వాళ్లు, నిరాశ‌లో జీవించే వాళ్లు తెలియ‌కుండానే ఏదో ఒక‌టి తింటార‌ని, అది తెలియ‌కుండా ఒళ్లు పెర‌గ‌టానికి కార‌ణ‌మ‌వుతుంద‌ని ప‌రిశోద‌న‌లు తెలుపుతున్న‌వి.

ప‌నిచేసే వృత్తిని బ‌ట్టి కూడా ఉంటుంది. సాధార‌ణంగా వంట చేసేవాళ్లు, తిని కూర్చునే వృత్తి ఉన్న‌వాళ్ల‌లో బ‌రువు పెర‌గ‌డం సామాన్య‌మైన‌ది. డ్యాన్సు చేసి మానేసిన‌వాళ్లు, మంచి ఆట‌లాడి మానేసిన ఎథ్లెటిక్స్ వంటివారు త‌రువాత కాలంలో బ‌రువు పెర‌గ‌వ‌చ్చు.

ప్ర‌స‌వం త‌ర్వాత‌, సిజ‌రిన్ ఆప‌రేష‌న్ త‌ర్వాత‌, బ‌హిష్టు ఆగిపోయిన త‌ర్వాత స్త్రీల‌లో అధికంగా బ‌రువు పెరిగి లావుతారు. అలాగే హైపో థైరాయిజ‌మ్‌, హై సిట్యూట‌రిజ‌మ్ వంటి వ్యాధులు కూడా స్థూల‌కాయానికి కార‌ణ‌మ‌వుతాయి.

తీసుకున్న ఆహారం, శ‌రీరం ఒంట‌ బ‌ట్టించుకున్న ఆహారం (food) లో వ్య‌త్యాసం స్థౌల్యానికి కార‌ణ‌మ‌వుతుంది. సుమారు ఐదు అడుగుల ఎనిమిది అంగుళాలు ఎత్తున్న వ్య‌క్తికి 68 కేజీలు బ‌రువు వుండ‌టం స‌హ‌జ స్థితి. స్థౌల్యం అంటే లావు. 

స్వ‌భావం వ‌ల్ల‌, తిన్న వెంట‌నే ప‌డుకోవ‌డం వ‌ల్ల‌, శ‌రీరానికి త‌గ్గ వ్యాయామం లేక‌పోవ‌డం వ‌ల్ల‌, ఇష్టం వ‌చ్చిన‌ట్టు తిన‌డం వ‌ల్ల స్త్రీల‌లో ప్ర‌స‌వానంత‌రం ఒళ్లు వ‌స్తుంద‌నంటుంది ఆయుర్వేదం (Ayurveda for Obesity).

మీర వారానికి ఒక్క‌సారైనా పొట్ట‌. పిరుదులు పెరుగుతున్న‌దేమో గ‌మ‌నించండి. స్త్రీలు ముప్పై దాటాక వారానికి ఒక్క‌సారైనా ఛాతీ, పొట్ట‌, తొడ‌లు, సీటు బ‌రువుగా, ఎత్తుగా వుంటున్నాయేమో చూసుకోండి. మోకాళ్ల‌లో బ‌రువు, నొప్పి వుంటే బ‌రువు పెర‌గ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డండి. గుండెజ‌బ్బు కానీ, బ్ల‌డ్ ప్రెష‌ర్ కాని వుంటే బ‌రువు పెర‌గ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డండి. గుండె జ‌బ్బు కాని, బ్ల‌డ్ ప్రెష‌ర్ కాని వుంటే అస‌లు ఒళ్లు పెర‌గ‌కూడ‌దు. 

చ‌ల్ల‌టి ప్ర‌దేశాల‌లో వుండేవాళ్లు అధిక బ‌రువు పెర‌గ‌టానికి ఆస్కారం ఎక్కువుగా ఉంది. ఉదాహార‌ణ‌కు ఎస్కిమోలు (Eskimos) చాలా లావుగా ఉంటారు. అంద‌రూ మాంస‌కృత్తులు అంటే ప్రోటీన్స్ ఫ్యాట్సు తింటే ఒళ్లు వ‌స్తుంద‌నుకుంటారు.

అస‌లు దొంగ పిండిప‌దార్థాలే తీపి ప‌దార్థాలు, పిండి ప‌దార్థాలు జీర్ణం త‌రువాత శ‌రీరంలో నిల్వ‌వుండి, కొవ్వుగా మార‌తాయి. అదే ఒళ్లు పెర‌గ‌డానికి హేతువు. అందుకే అన్నం ఎక్కువ తింటే ఒళ్లు బ‌ర‌వునిపిస్తుంది కొంత‌మందిలో.

అన్నం తింటే ఒళ్లు పెరుగుతుంద‌ని, ఉప‌వాసం చేస్తే ఒళ్లు త‌గ్గుతుందో లేదో కాని నీర‌సం వ‌స్తుంది. అనేక వ్యాధుల‌క‌ది కార‌ణ‌మ‌వుతుంది. ఆహారం తిన్న మూడున్న‌ర గంట‌ల‌లోపు మ‌ళ్లా ఆహారం తీసుకొన‌కండి. క‌డుపులో స‌గం మాత్రం అన్నం తిని, మిగ‌తా స‌గం మ‌జ్జిగ‌, నీళ్ళు, ప‌ళ్ల ర‌సాల‌తో నింపండి. 

ప్ర‌తి రోజూ దేశ‌వాళీ వ్యాయామం చేయండి. అన్నం తిన్నాక క‌నీసం యాభై అడుగులు న‌డిచి త‌ర్వాత ప‌డుకోండి. రాత్రి ప‌డుకునేముందు నాలుగు గంట‌లు నిలువ వుంచిన రాగిచెంబులో నీళ్లు తాగ‌డం హిత‌క‌రం.

Ayurveda for Obesity : లావు త‌గ్గేందుకు తీసుకోవాల్సిన సూచ‌న‌లు

1.ఉద‌యం ప‌ర‌గ‌డుపున 1/4 గ్లాసు గోరు వెచ్చ‌ని నీళ్ళ‌లో రెండు చెమ్చాల తేనె క‌లుపుకొని తాగు తుంటే లావు త‌గ్గుతారు. తిప్ప‌తీగ‌, త్రిఫ‌ల‌ములు వాటి బెర‌డు క‌షాయాన్ని, తేనె క‌లుపుకుని ప‌ర‌గ‌డుపున తాగితే లావు త‌గ్గుతారు. 

2.పావు గ్లాసు వేడినీళ్ల‌లో ఒక చెమ్చా నిమ్మ‌ర‌సం, ఒక చెమ్చా తేనె క‌లుపుకుని తాగితే ఒళ్లు త‌గ్గు తుంది. నిత్యం ఒక గ్లాసు ఆవుపాల‌ల్లో పంచ‌దార లేకుండా తాగితే నాజూకు అవుతారు. ప్ర‌తిరోజూ ఉద‌యంగాని, సాయంత్రం గాని ఇరువై నుండి ముప్పై నిమిషాలు న‌డుస్తుంటే అధిక బ‌రువు క్ర‌మ బ‌ద్ధ‌మ‌వుతుంది.

3.లావుగా ఉన్న‌వారు ప‌గ‌టినిద్ర‌పోకూడ‌దు. రాత్రి తిన్న వెంట‌నే ప‌డుకోకూడ‌దు. నెయ్యి, తీపి ప‌దార్థాలు, మాంసాదులు తిన‌కుండా వుంటే మంచిది. అన్నంలో మొద‌టి ముద్ద‌లో శొంఠిపొడి వేసుకొని తిన‌డం హిత‌క‌రం. క‌ర‌క్కాయ చూర్ణం, ఉసిరిక చూర్ణం, పిప్ప‌లీ చూర్ణం స‌మ‌భాగాలుగా తీసుకొని రోజుకి ఒక చెమ్చామందు వేడినీళ్ల‌తో తీసుకుంటే ఒళ్లు త‌గ్గుతుంది. 

4.పెరుగు, మీగ‌డ ఒళ్లు పెంచుతాయి. వెన్న తీసిన మ‌జ్జిగ ఒళ్లుని పెర‌గ‌నివ్వ‌దు. కైసోర‌గుగ్గులు ఉద‌యం, సాయంత్రం అన్నానికి ముందు వేసుకొనండి. మంచి ఫ‌లితాన్నిస్తుంది. ఉద్వ‌ర్త‌న మ‌నే ప్ర‌త్యేక చికిత్స బాగా లావుగా ఉన్న వాళ్లు చేయించుకుంటే అధిక బ‌రువు (Ayurveda for Obesity) త‌గ్గుతుంది. 

Post a Comment

0 Comments