Ticker

6/recent/ticker-posts

Ayurveda for Eye Care : ఆయుర్వేదంతో కంటి స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం

Ayurveda for Eye Care : ప్ర‌పంచ జ‌నాభాలో స‌గం మంది ఏదో ర‌కంగా కంటి లోపంతో బ్ర‌తుకు తున్నాం. డెబ్బై అయిదు సంవ‌త్స‌రాల వ‌య‌సు వున్న‌వారిలో ముప్పాతిక‌మంది క్యాట‌రాక్టు, గ్లుకోమా వంటి కంటి వ్యాధుల‌తోనే బ్ర‌తుకుతున్నారు. 

image show Ayurveda for Eye Care

పూర్వం చిన్న‌ప్ప‌డే క‌ళ్ల‌జోడు అవ‌స‌రం వ‌చ్చేది కాదు. చ‌త్వారం ముస‌లి వాళ్ల‌కొచ్చే వ్యాధి. కాని ఇప్పుడు వ‌య‌స్సుతో సంబందం లేకుండా స్కూలుకు వెళ్లే పిల్ల‌ల్లో కూడా చూపు త‌గ్గుతోంది. 

దూరంగా బోర్డు మీద అక్ష‌రాలు అబ్బాయికి అగుపించ‌డం లేదు. ఇదేమిటంటడీ అంటున్నారు త‌ల్లిదండ్రులు డాక్ట‌రుతో. అమ్మాయికి క‌ళ్ల‌జోడు (eye glasses) ఒక అలంకార‌మైంది ఈ రోజుల్లో. దీనికి కార‌ణం ఏకాగ్ర‌త‌గా చాలాసేపు కంప్యూట‌ర్ (computer) చూడ‌టం. టీవీలో కార్టున్లూ, సీరియ‌ల్స్‌. అదే ప‌నిగా చూడ‌టం వ‌ల్ల అధిక కంటిచూపు వ్యాధులు వ‌స్తున్నాయ‌ని ఈ మ‌ధ్య ప‌రిశోధ‌న‌ల‌లో తేలింది.

Ayurveda for Eye Care: చూపు త‌గ్గ‌డానికి కార‌ణాలు

మాన‌వ శ‌రీరంలో అత్య‌ద్భుత దృశ్యాల‌ని, ప్ర‌కృతిని, భ‌గ‌వంతుని కూడా చూపించ‌గ‌లిగిన ముఖ్య అవ‌యవం క‌న్ను. ఈ క‌ళ్లు జీవితంలోనే కాదు మ‌న శ‌రీరంలోనూ అతి ముఖ్య‌మైన పాత్ర‌ని పోషిస్తా యి. చుట్టూ ఉన్న ప్ర‌పంచాన్ని, ప్ర‌కృతిని, అందులోని అపురూప‌మైన దృశ్యాల‌ని మ‌న‌కి తెలియ‌ జేసేదే క‌న్ను. ఇది మిగ‌తా జ్ఞానేంద్రియాల‌క‌న్నా మిన్న‌దైన క‌న్ను జ్ఞానాన్ని ఇస్తుంది.

మ‌నం చేసే ప్ర‌తి ప‌నిలోనూ క‌ళ్లు మ‌న‌కి స‌హ‌క‌రించాలి. ఇంత ముఖ్య‌మైన కంటికి మంచిచూపు త‌గ్గుతున్న‌ది. ఈ మ‌ధ్యకాలంలో తీవ్ర‌మైన చ‌దువు ఒత్తిడి, ఆ చ‌దువు, మిగ‌తా ఆఫీసు ప‌నులు అన్నీ నెట్‌ (net) లోను, టీ.వీ లోను చూడ‌టం, ప‌రిగెత్తే ఆధునిక జీవ‌న‌విధానం, ఇవ‌న్నీ కంటిచూపు త‌గ్గ‌డా నికి దోహ‌ద‌ప‌డుతున్నాయి.

ఆహారం హ‌డావిడా తిన‌డం, అందులో కంటి చూపును పెంచే, పోషించే ఆహార‌ప‌దార్థాలు ఉన్నాయో లేవో చూసుకునే తీరిక లేక‌పోవ‌డం, తినే తీరిక కూడా లేక‌పోవ‌డం వీటివ‌ల్ల ప్ర‌పంచ జ‌నాభాలో కంటిచూపు (Eyesight) త‌గ్గ‌టం ఎక్కువ‌గా జ‌రుగుతోంది. 

మీరు ఒప్పుకుంటారు మ‌న చెవులు, ముక్కు, నోరు వీట‌న్నింటిక‌న్నా క‌న్ను, కంటిచూపు మ‌న జీవ‌నంలో ప్రాధాన్యం ఎక్కువ‌ని. మ‌న దేశంలో ముప్పాతిక‌మంది అర‌వై ఏళ్లు దాటాక కంటిచూపు త‌గ్గ‌టంతో బాధ‌ప‌డుతున్నారు. క్యాట‌రాక్టు, గ్లుకోమా, కంటికండ‌రాల శైథిల్యం వంటి వ్యాధులు పెద్ద‌వాళ్ల‌లో వ‌స్తున్నాయి.

మారుతున్న జీవ‌న‌వ్య‌వ‌స్థ వ‌ల్ల కండ్ల‌క‌ల‌క‌, క‌ళ్ల‌కు సంబంధించిన న‌రాల బ‌ల‌హీన‌త‌, కంటిరంగు మార‌టం, రాత్రిపూట క‌నిపించ‌క పోవ‌డం, వంటి కంటి వ్యాధులు వ‌స్తున్నాయి. మీరూ చూడండి. ఈ ప‌దేళ్ల‌లో కంటి వైద్య‌శాల‌లు, క‌ళ్ల‌జోళ్ల దుకాణాలు ఎంత పెరిగాయో!.

అతి ద‌గ్గ‌ర‌గా ఎక్కువ‌సేపు కంప్యూట‌ర్ చూడ‌టం, చిన్న‌చిన్న అక్ష‌రాల‌తో ఉన్న పుస్త‌కాలు ఎక్కువ‌గా చ‌ద‌వ‌డం, రాయ‌డం ఎక్కువ శ్ర‌మ‌ప‌డ‌టం, బ‌ట్ట‌లు కుట్ట‌డం, ఎల‌క్ట్రిక‌ల్ ప‌నిముట్ల‌తో ఎక్కువ సేపు ప‌నిచేయ‌డం, నిప్పుతో, మంట‌తో ఎక్కువ సేపు ప‌నిచేయ‌డం కంటికి తొంద‌ర‌గా హాని క‌లుగ‌జేస్తాయి.

దీనివ‌ల్ల కంటిచుట్టూ ఉన్న మాంస‌కండ‌రాలు బ‌ల‌హీన‌ప‌డ‌తాయి. దానివ‌ల్ల క‌ళ్లు మండ‌టం, నీరు కార‌డం, క‌ళ్ళ‌లో నీటిపొర క‌మ్మిన‌ట్లుండ‌టం జ‌రుగుతాయి. పొగ‌, ధూళి, మంచు, చిన్న చిన్న సూక్ష్మ‌జీవుల వ‌ల్ల క‌ళ్ల‌కి ఇబ్బంది క‌లుగుతుంది. కంట్లో దుర‌ద పుట్ట‌డం, మంట‌, న‌లుపు కోవాల‌ని పించ‌డం వంటివి వ‌స్తాయి.

కంటి ర‌క్ష‌ణ‌ (Eye Care) కు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు

కంట్లో చిన్న చిన్న పుళ్లులాంటివి కూడా ఏర్ప‌డ‌తాయి. ముఖ్యంగా కాంటాక్ట్ లెన్సు, ఇసుక‌, మ‌ట్టి రేణువులు, ఇవి సున్నిత‌మైన కంటిని రేప‌డం వ‌ల్ల ఇవి ఏర్ప‌డ‌తాయి. కంటి వ్యాధుల‌కి మందులు యాంటీబ‌యాటిక్స్‌, ఆయిట్‌మెంటులు, ఆప‌రేష‌న్లు, లేజ‌ర్ ట్రీట్‌మెంట్ (Laser treatment) ఆధునిక వైద్యంలో ఉన్నాయి. 

ఆచార్య వాగ్భ‌టులు కంటిచూపు క‌ఫ‌, ర‌క్త పంచ‌భూతాల సంయోగం వ‌ల్ల వ‌స్తుందంటారు. కంటి చుట్టూ ఉన్న మాంస‌క‌డ‌రాలు పృథ్వీశ‌క్తి వ‌ల్ల‌, అగ్నివ‌ల్ల‌. కార్నియా వాయుశ‌క్తి వ‌ల్ల‌, సెల‌రా (Selera) జ‌ల‌శ‌క్తి వ‌ల్ల‌, కంటి న‌రం (Optic Nerve) ఆకాశం వ‌ల్ల ఏర్ప‌డ‌తాయ‌ని ఆయుర్వేదం (Ayurveda for Eye Care) ప్ర‌తిపాదిస్తుంది.

కంటిలో ఉండే Lacrimal Sac లో చీము త‌యారైతే Dacryocystitis అంటారు. ఇది జ‌న్మ‌తః వ‌చ్చే వ్యాధి. ఈ వ్యాధి ఉన్న పిల్ల‌ల క‌ళ్లు ఎర్ర‌గా, భ‌యంక‌రంగా విప‌రీత‌మైన వేద‌న‌తో ఉంటాయి. చాల‌ జాన్ (Chalazion) అనే వ్యాధి కంటిరెప్ప‌ల‌లో పుండులాంటిది ఏర్ప‌డి కంటిలో స్థ్నిగ్థ‌త్వాన్ని త‌గ్గించి బాధ‌పెడుతుంది. స్టెయీ (Stye) కూడా ఇలాంటి చిన్న గ‌డ్డ కంటిరెప్ప‌ల క్రింద కానీ, బ‌య‌ట కాని ఏర్ప‌డ‌టం వ‌ల్ల వ‌స్తుంది. 

ట్ర‌కోమా (Trachoma) బ్యాక్టీరియా చేసే ఇన్‌ఫెక్ష‌న్ వ‌ల్ల వ‌స్తుంది. క‌ళ్ల‌పై పొర క‌ప్పిన‌ట్లుండ‌టం, కంటి నుండి ద్ర‌వం కార‌డం వంటివి వ‌స్తాయి. కండ్ల‌క‌ల‌క (Conjunctivitis) కూడా వైర‌స్ వ‌ల్ల వ‌స్తుంది. 

ఇలా అనేక కంటి వ్యాధుల‌న్నా, చిన్న వ‌య‌సులోనే కంటిచూపు త‌గ్గ‌డం మాత్రం అశ్ర‌ద్ధ చేయ‌ కూడ‌ద‌ని. వారానికి ఒక‌సారి త‌లంటు పోసుకోవ‌డం, త‌లంటుపోసుకునేముందు నువ్వుల నూనె రెండు చుక్క‌లు రెండు చెవుల‌లోను, ముక్కులోనూ వేసుకోవ‌డం మంచి ఫ‌లితాన్నిస్తాయి.

త్రిఫ‌లాఘృతం కంటిలో కాటుకలా పెట్టుకోవ‌డం, నారికేశాంజ‌నం రోజూ కంటిలో కాటుక‌లా పెట్టుకోవ‌డం కంటిని ర‌క్షించే స‌హ‌జ ఉపాయాలు, గోరువెచ్చ‌ని నీళ్ళ‌లో ఉప్పు క‌లిపి కంటిని క‌డుగుకోవ‌డం చాలా మంచిది. మ‌న త‌ల వెంట్రుక‌లు ఒక ప్ర‌త్యేక ప‌ద్థ‌తిలో కాల్చి ఆ బూడిద‌ని ఆవుపాల‌లో క‌లిపి ఒక మందు చేస్తారు. 

అది అన్ని కంటివ్యాధుల‌కీ ఉప‌శ‌మ‌నం క‌ల్గించే నేత్రా మృతం. పాల‌మీగ‌డ‌ను దూదిపై అంటించి కండ్ల‌పై వేసి క‌ట్టు క‌ట్టుకుంటే అన్ని వ్యాధుల్లో ఉప‌శ‌ మ‌నం ఉంటుంది. రేచీక‌టి ఉన్న‌వాళ్లు త‌మ‌ల‌పాకు ర‌సం రెండు చుక్క‌లు చొప్పున కంట్లో వేసుకోవ‌డం హిత‌క‌రం.

ప‌సుపుచూర్ణం 200 గ్రాములు, 600 గ్రాముల నీటిలో క‌లిపి ఆ నీళ్ళ‌తో క‌ళ్లు క‌డుగుతుంటే కండ్ల‌ క‌ల‌క‌లు త‌గ్గుతాయి. పంచ‌దార ఐదు చెమ్చాలు, ఒక గ్లాసు నీళ్ల‌లో క‌రిగించి గంట‌గంట‌కీ క‌ళ్లు త‌డుపుతూంటే కండ్ల క‌ల‌క‌లు త‌గ్గుతాయి. క‌ర్పూర‌పు గింజ‌లు గంధం తీసి కంట్లో కాటుక‌లా పెట్టుకుంటే కంట్లో పొర‌లు (layers) ఊడి పోతాయి. 

కంటి చూపు త‌గ్గిపోయి మ‌స‌క మ‌స‌క‌గా క‌నిపించే స్థితిలో కార‌ణం ఏదైనా అద్భుత‌మైన స్వ‌చ్ఛంద భైర‌వ ర‌సం, త్రిఫ‌లాఘృతం వంటివి వున్నాయి. నేత్ర త‌ర్ప‌ణం వంటి ప్ర‌త్యేక చికిత్స వ‌ల్ల చూపు నిలుస్తుంది. క‌ళ్లు ప‌విత్రంగా, ప్ర‌సన్నంగా ఉంచుకుంటే మీ జీవితం చివ‌రి వ‌ర‌కూ ఆనంద‌ మ‌య‌మ‌వుతుంది. 

Post a Comment

0 Comments