Ticker

6/recent/ticker-posts

raw milk for skin: ప‌చ్చిపాలు తో చ‌ర్మ సౌంద‌ర్యం మీ సొంతం!

raw milk for skin: సాధార‌ణంగా యుక్త వ‌య‌స్సు వ‌చ్చిన‌ప్పుడు మ‌న ముఖంపై మొటిమ‌లు, వాటికి సంబంధించిన న‌ల్ల‌ని మ‌చ్చ‌లు అందాన్ని చెడ‌గొడుతుంటాయి. ఈ స‌మ‌స్య ఒక్కోసారి పెరిగి యాక్నేగా మారుతుంది. దీన్ని నిర్ల‌క్ష్యం చేయ‌కుండా ఉండాలి. ఇలాంటి స‌మ‌యంలో మ‌న ఇంటిలో దొరికే ప‌దార్థాల‌తోనే కొన్ని చిట్కాలు పాటిస్తే మెరుపు మ‌న సొంత‌మ‌వ్వ‌డం ఖాయం.

image show raw milk for skin

raw milk for skin: ప‌చ్చిపాల‌తో  అంద‌మైన  చిట్కాలు

దాల్చిన చెక్క పొడిలో కొంచెం తేనె క‌లిపి ప‌డుకునే ముందు రాత్రి వేళ ముఖంపై స‌మ‌స్య వున్న చోట రాసుకోవాలి. మ‌రుస‌టి రోజు గోరు వెచ్చ‌ని నీళ్ళ‌తో ముఖాన్ని (Face) శుభ్రం చేసుకుంటే మొటిమ‌లు (Pimple), న‌ల్ల‌ని మ‌చ్చ‌లు పోతాయి. 

క‌మ‌ల పండు లేదా నారింజ పండు తొక్క‌ల‌ను మిక్సీలో వేసి మెత్త‌గా చేసి కాస్త దానికి పాలు క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని మొహంపై పూత‌లా వేసుకోవాలి. త‌ర్వాత 20 నిమిషాల‌య్యాక నీళ్ల‌తో క‌డిగేసుకుంటే చ‌క్క‌ని ఫ‌లితం ఉంటుంది. 

నాలుగు చుక్క‌ల నిమ్మ‌రసాన్ని వేరు శ‌న‌గ నూనెలో క‌లిపి దాన్ని ముఖానికి మ‌ర్థ‌న చేసుకోవాలి. కొద్దిసేపుయ్యాక న‌లుగు పిండి పెట్టుకొని స్నానం చేస్తే న‌ల్ల‌మ‌చ్చ‌లు (blackhead) మ‌టు మాయ‌మ‌వుతాయి. అదే విధంగా పుదీన ఆకుల‌ను మెత్త‌గా దంచి ర‌సం తీసి రాసుకున్నా skin చ‌క్క‌ని ఫ‌లితం ఉంటుంది.

ప‌చ్చిపాల (raw milk for skin)లో  నిమ్మ‌ర‌సాన్ని క‌లిపి తరుచూ ముఖంపై తుడుచుకోవాలి. దీని వ‌ల్ల తైల గ్రంథులు మూసుకుపోయి ఈ స‌మ‌స్య ఇబ్బంది పెట్ట‌దు. అదే విధంగా చంద‌నం పొడిలో 4 చుక్క‌ల గులాబీనీళ్లు క‌లిపి ముఖానికి రాసుకొని, 10 నిమిషాల‌య్యాక క‌డిగేస్తే ఈ స‌మ‌స్య అదుపులో ఉండి ముఖం క‌ళ‌గా త‌యార‌వుతుంది. 

పాలు తాగితే మ‌తిమ‌రుపు మాయం

రోజుకు 3 గ్లాసుల‌కంటే ఎక్క‌వ పాలు తాగితే మ‌తిమ‌రుపు దూరం అవుతుంద‌ని అంటున్నారు. ఎక్క‌వ పాలు (raw milk) తాగే వారి శ‌రీరంలో యాంటీ ఆక్సిడెంట్ల స్థాయి పెరుగుతుంద‌ని అమెరికాకు చెందిన ప‌రిశోధ‌కులు తేల్చారు. మెద‌డులో వివిధ స్థాయిలో వ‌చ్చిన అస‌మ‌తుల్యాన్ని స‌రిచేసి ఇత‌ర వ్యాధుల‌ను ద‌రి చేర‌కుండా కాపాడుతుంద‌ట‌. అదే విధంగా న‌రాల బ‌ల‌హీన‌త‌ను త‌గ్గించ‌డంలో కూడా పాలు కీల‌క పాత్ర వ‌హిస్తాయ‌ని అంటున్నారు.

Post a Comment

0 Comments