Kokilaksha: క‌లుపుమొక్కగా పిలిచే కోకిలాక్ష అంత ప‌వ‌ర్‌ ఫుల్లా?


 Kokilaksha: క‌లుపు మొక్క‌గా పెరిగే ఈ మొక్క‌ను హిందీలో తాల‌మ‌ఖాన అని ఆయుర్వేద మూలిక‌లు అమ్మే దుకాణాల్లో తాలంఖాన గింజ‌లు అని పిలిచే ఈ మొక్క అమోఘ‌మైన ఔష‌ధ‌గుణాలు క‌లిగి ఉంది. అయితే వృధాగా పెరిగే ముళ్ళచెట్టు (hygrophila auriculata) కాబ‌ట్టి చాలా మంది దీని జోలికి పోరు.

kokilaksha kashayam, kokilaksha, hygrophila auriculata,


ఆయుర్వేద మూలిక‌లు సేక‌రించే వారు మాత్రం దీని గింజ‌ల‌ను ఆకుల‌ను, వేర్ల‌ను సేక‌రించి అమ్ముతుంటారు. ఇది ఎక్కువ‌గా బంజ‌రుభూములు, వృధాగా నీరు ఉండే ప్రాంతాలు, మురికి కాలువ‌లు, గుంట‌లు, చెరువుల‌లో బాగా పెరుగుతుంది. 

ఇది ఆయుర్వేద మూలిక‌ల‌లో అరుదైన మూలిక‌గా చెప్పే క్షీర‌కాకోళి అనేది దొక‌న‌ప్పుడు దానికి ప్ర‌త్యామ్నాయంగా (Kokilaksha benefits) ఉప‌యోగించ‌మ‌ని తెలియ‌జేసింది. ఇది పొడ‌వైన కంట‌క‌యుత‌మైన మొక్క‌. బ‌ల్లెం ఆకారంలో ఉన్న సామాన్య ప‌త్రాలు బ‌హుముఖ విన్యాసంలో అమ‌రి ఉంటాయి. లేత నీలిరంగులో ఉన్న పుష్పాలు గ్రీవ‌స్థ‌మై జ‌త‌లుగా రూపొంది ఉంటాయి.

ఫ‌ల‌ము గుళిక‌, కేశ‌యుత‌మై చ‌క్రాకారంలో ఉన్న విత్త‌నాలు గుళిక‌లో గ‌ట్టి కొక్కేల‌పై నిలిచి ఉంటాయి. ఈ మొక్క చెరువు గ‌ట్ల‌పైన రోడ్డు ప్ర‌క్క‌న క‌లుపు మొక్క‌గా పెరుగుతుంది. ఈ మొక్క‌ను నీరుగొబ్బి అని కూడా అంటారు.

Kokilaksha: కోకిలాక్ష మొక్క ఔష‌ధ ఉప‌యోగాలు

కోకిలాక్ష స‌మూల‌ము, తిప్ప‌తీగ కాడ‌లు స‌మాన‌ముగా క‌లిపి త‌యారు చేసిన క‌షాయం 30-60 మి.లీ. చొప్పున రోజుకు రెండుపూట‌లు కొద్దికాల‌ము సేవించాలి. ఇలా చేస్తే వాత ర‌క్త‌ము త‌గ్గుతుంది.

కోకిలాక్ష స‌మూల‌మును నీడ‌న ఎండ‌బెట్టి కాల్చి బూడిద చేసిన దానిని ఒక స్పూను మోతాదులో పావు క‌ప్పు గోమూత్రంలో గానీ, నీటిలో గాని క‌లిపి త్రాగుచున్న శ‌రీర వాపు త‌గ్గుతుంది. ఇది కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వారిలో ఈ యోగం ఉప‌యోగ‌ప‌డుతుంది. ఆకుల ర‌సాన్ని రెండుస్పూన్‌లు ప‌ర‌గ‌డుపున ఒక వారం పాటు వాడాలి. 

కోకిలాక్ష గింజ‌ల చూర్ణ‌ము మ‌రియు దూల‌గొండి గింజ‌ల చూర్ణంను స‌మానంగా క‌లిపి ఒక స్పూన్ మోతాదులో అప్పుడే పితికి, చ‌క్కెర క‌లిపిన ఆవుపాల‌లో క‌లిపి సేవిస్తే వాజీక‌ర‌ణంగా ప‌నిచేయును. సంభోగ‌శ‌క్తి పెరుగును. శీఘ్ర‌స్య‌ల‌నం పోగొట్టును.

కోకిలాక్ష స‌మూల‌మును దంచి అందుకొంచెం ఆముదం క‌లిపి వెచ్చ‌గా చేసి క‌ట్టిన న‌డుము, వెన్ను, తుంటి వీనియంద‌లి నొప్పులు త‌గ్గిపోతాయి.

50-100 మి.లీ కోకిలాక్ష వేరు క‌షాయ‌మును (kokilaksha kashayam) రోజుకు రెండుపూట‌లా త్రాగుచున్న మూత్ర‌పు బ‌ద్ధ‌ము, బొట్టు బొట్టుగా నొప్పి చురుకుతో కూడి ప‌డే మూత్రం, శ‌రీర వాపులు, ఉద‌రం మొద‌ల‌గున‌వి త‌గ్గును.

రెండు స్పూన్ల విత్తుల‌ను ఒక గ్లాసునీటిలో ఒక గంట నాన‌బెట్టితే అవి ఉబ్బిగుజ్జుగా త‌యారు అవుతాయి. ఈ గుజ్జును ఆ నీటిలోనే బాగా పిసికి అందు రెండు స్పూన్ల చ‌క్కెర క‌లిపి త్రాగితే ఎండాకాలంలో శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. 

రేరును న‌ల‌గ‌గొట్టి  అర‌క‌ప్పు నీటిలో క‌లిపి తీసుకుంటే తెల్ల‌బ‌ట్ట స‌మ‌స్య పోతుంది. రెండు స్పూన్ల గింజ‌ల‌ను అర‌క‌ప్పు నీటిలో ఒక రాత్రంతా నాన‌బెట్టి ఉద‌యం అర‌క‌ప్పు చ‌క్కెర క‌లిపిన పాల‌తో సేవించాలి. మూడ్రోజుల‌కు ఒక‌సారి చొప్పున సేవించాలి.

0 comments:

Post a Comment