Ticker

6/recent/ticker-posts

Menthi kura Benefits: మెంతికూర (Fenugreek) వ‌ల్ల హెల్త్‌కు ప్ర‌యోజ‌నాలు అన్నీ ఇన్నీ కావు!

Menthi kura Benefits: A Vitamin అధికంగా ఉండే ఆకుకూర‌ల్లో మెంతికూర చాలా ముఖ్య‌మైన ఆహారం. ఇది రుచికి కొద్దిగా చేదుగా ఉండి ఒక విశిష్ట‌మైన వాస‌న క‌లిగి ఉంటుంద‌ని గ‌మ‌నిం చ‌వ‌చ్చు. దీనిలో ఐర‌న్‌, కాల్షియం అధికంగా ఉంటాయి. మిగిలిన విట‌మిన్‌లు కూడా గ‌ణ‌నీయంగా ఉన్నాయి. 

image show Menthi kura Benefits

మ‌న ఆహారంలో ఆకుకూర‌లకు ఒక ప్ర‌త్యేక స్థానం ఉంది. ప్ర‌తిరోజూ మ‌నం తీసుకునే ఆహారంలో 35 గ్రాములు చేరిస్తేనే ప‌రిపూర్ణ‌మైన పోష‌కాహార‌వుతుంద‌ని ఒక స‌ర్వేలో తేలింది. ఆకుకూర‌లు తీసుకోవ‌డం మూలంగా ఆరోగ్యం అధికం అవ‌డ‌మే కాక‌, జీర్ణ‌క్రియ‌కు కూడా తోడ్ప‌డ‌తాయి. 

Menthi kura Benefits: మెంతి కూర వ‌ల్ల ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు!

ఏడాది పొడ‌వునా మెంతికూర మ‌న‌కు ల‌భ్యం కాక‌పోయినా, అది ల‌భ్య‌మ‌య్యే కాలంలో ఎండ‌బెట్టి నిల్వ చేసుకోవ‌చ్చు. ఎండ‌బెట్టిన మెంతికూర‌ను కూడా పచ్చికూర‌వ‌లె ర‌క‌ర‌కాల వంట‌లలో ఉప‌యోగించుకోవ‌చ్చు. తాజా మెంతికూర‌లో ట్రెగ్‌ధీస్ అనే ప‌దార్థం ఉంది. దీని ప్ర‌భావం వ‌ల్ల మెంతికూర‌తో చేసిన ఏ వంట‌క‌మైనా కాలేయం, ఊపిరితిత్తులు, హృద‌యం, మెద‌డుకు సంబంధించిన వ్యాధుల‌కు ఔష‌ధంగా ప‌నిచేస్తుంది. 

మంచి టానిక్‌ (Ayurvedic) లా ప‌నిచేసే మెంతికూర గింజ‌లు!

అర‌క‌ప్పు మెంతికూర ర‌సం (Menthi kura) లో కొంచెం తేనె క‌లిపి రోజుకొక‌సారి తాగితే లివ‌రు పెరుగుతుంది. కామెర్లు, పైత్యం వ‌ల్ల వ‌చ్చే త‌ల‌నొప్పి, కాలేయానికి వ‌చ్చే కురుపు, ఉబ్బ‌సం, క్ష‌య‌, నిద్ర‌ప‌ట్ట‌క‌పోవ‌డం, త‌ల‌తిరుగుడు నివారించ‌వ‌చ్చు. 

మెంతికూర (Fenugreek) ర‌సం ఒక టేబుల్ స్పూన్ క్ర‌మం త‌ప్ప‌కుండా మూడ్నెళ్ళ పాటు తీసుకుంటే ప్రాథ‌మిక ద‌శ‌లో ఉన్న మ‌ధుమేహం న‌య‌మ‌వుతుంది. 

మెంతి గింజ‌ల‌ను రెండు టీ స్పూన్‌లు తీసుకుని మంచినీటిలో 4 గంట‌లు నాన‌బెట్టి ఇగిరిపోయేట‌ట్టు మ‌ర‌గ‌నివ్వాలి. ఈ క‌షాయాన్ని వ‌డ‌గ‌ట్టి దానిలో ఒక టేబుల్ స్పూన్ తేనె క‌ల‌పాలి. దీనిని ప్ర‌తి రాత్రి కొద్దిగా టానిక్‌లా తీసుకుంటే ఊపిరితిత్తులు, కాలేయానికి సంబంధించిన వ్యాధులు న‌య‌మ‌వుతాయి.

మ‌ధ్య‌పానం వ‌ల్ల చెడిపోయిన కాలేయం శుభ్ర‌ప‌డుతుంది. కామెర్లు, నీర‌సం, ర‌క్త‌హీన‌త మొద‌లైన వాటి నుండి ర‌క్షించుకోవ‌చ్చు.

మెంతుల‌ (fenugreek seeds) ను వేడిచేసి పొడిగా దంచి వెన్న‌తో క‌లిపి తీసుకుంటే విరోచ‌నాలు, మూల‌వ్యాధి, అజీర్తి, క‌డ‌పునొప్పి న‌య‌మ‌వుతాయి. 

పాల‌లో మెంతులు ఉడికించి తీసుకుంటే బాలింత‌ల‌కు స‌మృద్ధిగా పాలు ప‌డ‌తాయి.

మెంతిఆకు ర‌సంలో నిమ్మ‌ర‌సం క‌లిపి కంట్లో వేసుకుంటే కండ్ల మంట పోతుంది. కండ్ల క‌ల‌క త‌గ్గుతుంది. క‌ళ్లు పుసిపోయ‌డాన్ని కూడా నివారిస్తుంది. 

మెంతికూర‌ను బాగా రుబ్బి ఆ ముద్ద‌ను స్నానానికి ముందు త‌ల‌కు మ‌ర్ద‌న చేసుకుంటే చుండ్రు, పేలు పోయి జుట్టు న‌ల్ల‌గా, పొడ‌వుగా పెరుగుతుంది. 

కొబ్బ‌రి నూనెలో మెంతులు వేసి త‌ల‌కు రాసుకుంటే వెంట్రుక‌లు న‌ల్ల‌బ‌డి జుట్టు రాలిపోకుండా ఉంటుంది. 

మెంతిగింజ‌ల ముద్ద‌ను కాగిన పాల‌లో క‌లిపి పూసుకుంటే శ‌రీరం రాగరంజిత‌మై అందం ఇనుమ‌డిస్తుంది.

మెంతి ఆకును మెత్త‌గా నూరి కొద్దిగా నూనె చేర్చి ఉడికించి గ‌డ్డ‌ల‌పై ప‌ట్టీ వేసిన గ‌డ్డ‌లు ప‌క్వ‌మై ప‌గులుతాయి.

Menthi kura recipe Benefits:

మెంతి ఆకుల‌ను ఉడికించి నేతిలో ఉడికించి అందులో కొద్దిగా మిరియాలు, ఉప్పు చేర్చి ఇచ్చినా కీళ్ల నొప్పి, న‌డుపు నొప్పి త‌గ్గుతుంది. గోధుమ ర‌వ్వ యందు మెంతికూర‌, మిరియాలు, పాలు, నెయ్యి, చ‌క్కెర చేర్చి పాయ‌స‌ము వ‌లె చేసి ఇచ్చిన శ‌రీరానికి పుష్టిని, శ‌క్తిని క‌లుగ‌జేయును. మెంతికూర‌ను నూరి ముద్ద చేసి తేనె చేర్చి ఇచ్చిన సుఖ విరేచ‌న‌ము అగును. మూల‌శంక‌ను త‌గ్గించును. ద‌గ్గు త‌గ్గును. ప్రేగుల‌లో పుండ్ల‌ను మానిపోతాయి.

ఒక టీ స్పూను మెంతులు పొడిచేసి ఒక గ్లాసు మ‌జ్జిగ‌తో రోజుకు 3 లేదా 4 సార్లు సేవిస్తే జిగ‌ట విరేచ‌నాలు, వేడి, ద‌ప్పిక త‌గ్గును. పైన తెలిసిన ప్ర‌యోజ‌నాలు (Menthi kura Benefits) కాస్త జాగ్ర‌త్త‌లు పాటించి పెద్ద‌వారి సూచ‌న‌లు పాటించి అనుస‌రించాలి. 

Post a Comment

0 Comments