Ticker

6/recent/ticker-posts

Raw food benefits : ప‌చ్చి ఆహారం వ‌ల్ల ఉప‌యోగాలు

Raw food benefits : సూర్యుడి చేత వండిన‌ ప‌చ్చి ఆహారం మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంద‌ని మ‌నంద‌రికీ తెలుసు. మ‌నం తినే ఆహారంలో 70 శాతం ప‌చ్చి ఆహారాన్ని ప్ర‌తిరోజూ తీసుకోవ‌డం వల్ల మ‌న శ‌రీరానికి అనేక లాభాలు క‌లుగుతాయి. 

image show Raw food benefits

ఉద‌యం ఇడ్లీ, దోశ‌, కాఫీ, టీ, పాల‌ను మానేసి ప‌చ్చి కూర‌గాయ‌ల జ్యూస్ ను తాగడం, త‌రువాత మొలకెత్తిన విత్త‌నాల‌ను తిన‌డం, సాయంత్రం పండ్ల‌ను, పండ్ల‌తో త‌యారు చేసిన జ్యూస్ ల‌ను తాగ‌డం వంటివి చాలా మంది చేస్తుంటారు. కొంద‌రు మూడు పూట‌లా ప‌చ్చి ఆహారాన్ని తీసు కుంటూ ఉంటారు. మ‌రి కొంద‌రు మ‌ధ్యాహ్నం ఎటువంటి ఆహార ప‌దార్థాల‌ను తీసుకోకుండా రెండు పూట‌లూ ప‌చ్చి ఆహారాన్నే తీసుకుంటూ ఉంటారు.

ఉడికించిన ఆహార‌ ప‌దార్థాల‌ను తిన‌డం కంటే ప‌చ్చి ఆహారాన్నే తిన‌డం వల్ల మ‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అయితే మ‌న‌లో కొంద‌రు ఎటువంటి ఉడికించిన ఆహార ప‌దా ర్థాల‌ను తీసుకోకుండా కేవ‌లం ప‌చ్చి ఆహారాన్నే తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు, శ‌క్తి ల‌భించవు. ప‌చ్చి ఆహారాన్ని మాత్ర‌మే తిన‌డం వల్ల త్వ‌ర‌గా నీర‌సించి పోతాము. మ‌నం కేవ‌లం ఉడికించిన ఆహార ప‌దార్థాల‌ను మాత్ర‌మే తీసుకోవాలి అనేటువంటి అపోహాల‌ను క‌లిగి ఉంటారు.

‌
x

అయితే ప‌చ్చి ఆహారాల‌ను (Raw food) తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు, శ‌క్తి ల‌భించ‌వు అనే అపోహ స‌రైన‌ది కాదు అని నిపుణులు చెబుతున్నారు. మాన‌వులు త‌ప్ప భూమ్మీద ఉండే జీవ రాశుల‌న్నీ ప‌చ్చి ఆహారాన్ని మాత్ర‌మే తింటాయి. ఉప్పు, నూనెలు వేసి ఉడికించిన ఆహారాన్ని అవి తీసుకోవు. అయిన‌ప్ప‌టికి వాటికి కావ‌ల్సిన శక్తి, బ‌లం, పోష‌కాలు అన్నీ ల‌భిస్తున్నాయి.

ఆరోగ్యంగా, ఎవ‌రిపై ఆధార ప‌డ‌కుండా, బ్ర‌తికినంత కాలం అవి వాటి అవ‌యావాల‌న్నింటినీ ఉపయోగించుకుని జీవిస్తున్నాయి. మాన‌వులు మాత్ర‌మే ఉడికించిన ఆహార ప‌దార్థాల‌ను తిని అనారోగ్యాల బారిన ప‌డుతున్నారు. 

ప‌చ్చి ఆహారాన్ని (Raw food benefits) తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు ల‌భించ‌డ‌మే కాకుండా అనారోగ్యాల బారిన ప‌డే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయ‌ని, అంతే కాకుండా ప‌చ్చి ఆహారాన్ని తినే వారు రోజంతా చురుకుగా ప‌ని చేసుకోగ‌ల‌ర‌ని నిపుణులు చెబుతున్నారు. ఎటువంటి ఆహార ప‌దార్థాల‌ను తీసుకోకుండా ప‌చ్చి ఆహారాన్ని రెండు లేదా మూడు పూట‌లు తీసుకోవ‌డం వ‌ల్ల పోష‌కాలు అన్నీ అంద‌డంతోపాటు ఆరోగ్యంగా కూడా ఉంటారు. 

Post a Comment

0 Comments