Ticker

6/recent/ticker-posts

Tea for Skin : చ‌ర్మాన్ని మెరిపించ‌డంలో టీ చేసే మేలులు ఎన్నంటే?

Tea for Skin : దిన‌చ‌ర్య చురుగ్గా సాగాలంటే పొద్దున్నే ఓ క‌ప్పు టీ ఉండాల్సిందే కొంద‌రికి. అయితే దాన్ని కేవ‌లం ఆ స‌మ‌యానికి మాత్ర‌మే ప‌రిమితం చేయ‌కుండా సౌంద‌ర్య పోష‌ణ చేసుకోవ‌డానికి ఎంచుకొంటే చ‌ర్మం, కురులు ఆరోగ్యంగా ఉంటాయి.

Tea for Skin

Tea for Skin : చ‌ర్మాన్ని మెరిపించ‌డంలో టీ చేసే మేలు

గ్రీన్ టీ (green tea) :

కేవ‌లం శ‌రీర బ‌రువును అదుపులో ఉంచ‌డ‌మే కాదు చ‌ర్మానికి మేలు చేయ‌డం లోనూ ఈ చాయ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాలి. చ‌ర్మాన్ని మెరిపించ‌డ‌మే కాదు మృత‌క‌ణాల స‌మ‌స్య‌ను కూడా అదుపులో ఉంచ‌డంలో దీని పాత్ర కీల‌క‌మే. 

అలాగే అతి నీల‌లోహిత కిర‌ణాల ప్ర‌భావం నుంచీ చ‌ర్మాన్ని కాపాడుతుంది. ఇందులో ప్ర‌త్యేకంగా ల‌భించే యాంటిఆక్సిడెంట్లు చ‌ర్మానికి కొత్త కాంతిని తెస్తాయి. ఫ్రీ రాడిక‌ల్స్ ప్ర‌భావాన్నీ త‌గ్గిస్తాయి.

జిడ్డు చ‌ర్మ‌త‌త్వం ఉన్న‌వాళ్ళు దీన్ని స్కిన్‌టోన‌ర్‌ (Skintoner) గా ఎంచుకోవ‌చ్చు. ఎలాగంటే, కొన్ని గ్రీన్‌టీ ఆకుల్ని తీసుకుని వేడినీటిలో అర‌గంట‌సేపు నాన‌నివ్వాలి. త‌రువాత వ‌డ‌క‌ట్టి చ‌ల్లారాక చ‌ర్మానికి రాసుకుని సున్నితంగా మ‌ర్ద‌న చేయాలి. 

కాసేప‌య్యాక క‌డిగేసుకుంటే చాలు జిడ్డు స‌మ‌స్య వ‌దిలి చ‌ర్మం ఆరోగ్యంగా క‌నిపిస్తుంది. అలాగే గ్రీన్ టీ బ్యాగుల్ని నీళ్ళ‌లో ముంచి క‌నురెప్ప‌ల‌పై ఉంచుకోవ‌చ్చు. అల‌సిన క‌ళ్ళ‌కు సాంత్వ‌నే కాదు చ‌ల్ల‌గానూ ఉండి, ఆ భాగంలో ఉబ్బ‌రం త‌గ్గి మిల‌మిల మెరుస్తాయి.

మృత‌క‌ణాల స‌మ‌స్య‌ను త‌గ్గించుకోవాలంటే ముఖానికి వేసుకునే ర‌క‌ర‌కాల మాస్కుల త‌యారీలో దీన్ని ఎంచుకుంటే స‌రిపోతుంది. వ్య‌ర్థాలు తొలిగి చ‌ర్మం ప్ర‌కాశ‌వంతంగా క‌నిపిస్తుంది. దీన్ని కేవ‌లం ముఖానికే కాదు, కురుల్ని ప‌ట్టుకుచ్చులా మెరిపించేలా కూడా చేయ‌వ‌చ్చు. వాడేసిన గ్రీన్ టీ ఆకుల్ని మ‌ళ్లీ కాసేపు నీటిలో మ‌ర‌గించాలి. 

ఆ త‌రువాత వ‌డ‌క‌ట్టి చ‌ల్లార‌నిచ్చి నిమ్మ‌ర‌సం క‌లిపి త‌ల‌స్నానం పూర్త‌య్యాక కురుల‌కు రాసుకుని కాసేప‌య్యాక క‌డిగేసుకోవాలి. ఫ‌లితంగా జుట్టు ప‌ట్టుకుచ్చులా మారుతుంది. చుండ్రు స‌మ‌స్య కూడా అదుపులో ఉంటుంది. ఇందులో ఉండే సి, ఇ విట‌మిన్లు చాలా కండిష‌న‌ర్ల‌లో ల‌భ్య‌మ‌య్యే ఉత్ప‌త్తులే.

కామొమైల్ టీ :

జుట్టుకు ఎలాంటి రంగు వేసుకుండానే మెరిసేలా చేయాల‌నుకుంటున్నారా? కామొమైల్ (Chamomile) టీ అందుకు చ‌క్క‌ని ప్ర‌త్యామ్నాయం అంటారు నిపుణులు. రెండు కామొమైల్ టీ బ్యాగుల్ని రెండు క‌ప్పుల వేడినీటిలో ఐదు నుంచి ప‌ది నిమిషాలు నాననివ్వాలి. 

ఆ త‌రువాత రెండు చెంచాల నిమ్మ‌ర‌సం క‌లిపి త‌ల‌స్నానం అయ్యాక ఈ డికాక్ష‌న్‌తో జుట్టును క‌డిగేసుకోవాలి. అయితే ఆ త‌రువాత మ‌ళ్లీ నీళ్ళ‌తో క‌డిగేసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. జుట్టు బంగారువ‌ర్ణంలో మెరుస్తుంది.

ఊలాంగ్ (Oolong) టీ :

ముడ‌త‌లే కాదు, మ‌చ్చ‌లు కూడా త‌గ్గుముఖం ప‌ట్టేలా చేస్తుందీ టీ. ఇందులో ల‌భించే శ‌క్తిమం త‌మైన యాంటీఆక్సిడెంట్లు చ‌ర్మంలో పేరుకొన్న హానికార‌క టాక్సిన్ల‌ను తొల‌గిస్తాయి. ఫ‌లితంగా చ‌ర్మం (Tea for Skin) పై స‌న్న‌ని ముడ‌త‌లు, వ‌య‌సు తాలూకు మ‌చ్చ‌ ల్లాంటివి సులు వుగా త‌గ్గుతాయి. చ‌ర్మంపై అతినీల‌లోహిత కిర‌ణాల ప్ర‌భావం నుంచీ ఈ టీ కాపాడుతుంది.

బ్లాక్ టీ (block tea) : చ‌ర్మానికి మేలు చేసే ఎన్నో సుగుణాలు దీని సొంతం. ఇవి చ‌ర్మంలో ప్రీ రాడిక‌ల్స్ ప్ర‌భావాన్ని త‌గ్గిస్తాయి. క‌ళ్లు ఉబ్బిన‌ట్టు క‌నిపిస్తుంటే, రెండు టీ బ్యాగుల్ని నీటిలో ఉంచి కాసేప‌య్యాక, క‌ళ్ళ‌పై పెట్టుకోవ‌చ్చు. స‌హ‌జ యాస్ట్రింజెంట్ లా ప‌నిచేస్తుంది. చ‌ర్మం తాజాగా క‌నిపించాలంటే బ్లాక్ టీ క‌షాయాన్ని కొద్దిగా తీసుకుని ముఖంపై నీళ్ళు చ‌ల్లుకున్న‌ట్టుగా చ‌ల్లుకోవాలి.

అల్లం (ginger) టీ : 

మొటిమ‌ల స‌మ‌స్య‌లు రాకుండా ఉండాలంటే ఈ టీ ని నిత్యం తాగ‌డామే కాదు, చ‌ర్మ సంర‌క్ష‌ణ‌లోనూ వాడాలి. ఇందులో వాడే యాంటీ సెప్టిక్ సుగుణాలు చ‌ర్మాన్ని ప‌రిశుభ్రంగా, తాజాగా మార్చి మ‌చ్చ‌ల స‌మ‌స్య‌ను నివారిస్తాయి. 

ఏం చేయాలంటే, అల్లం టీ పొడిని డికాక్ష‌న్‌లా చేసి చ‌ల్లారాక ముఖానికి రాసుకుని కాసేప‌య్యాక క‌డిగేసుకోవాలి. దీన్ని త‌ల‌కు రాసుకోవ‌డం వ‌ల్ల ఆ భాగంలో ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ వేగవంత‌మై జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా ఉంటుంది. చుండ్రు (dandruff) స‌మ‌స్య కూడా అదుపులో ఉంటుంది.

నిమ్మ‌గ‌డ్డి (lemongrass) టీ : 

చ‌ర్మంలో పేరుకొన్న మ‌లినాల‌ను తొల‌గించ‌డంలో ఈ ర‌కం చాయ్ పాత్ర కీల‌కం. ఈ టీ క‌షాయాన్ని ముఖానికి (face) రాసుకుంటే యాక్నే స‌మ‌స్య అదుపులో ఉంటుంది. నిమ్మ‌గ‌డ్డి టీ డికాక్ష‌న్‌ని చ‌ల్లార‌నిచ్చి అందులో దూదిని ముంచి ముఖ‌మంతా రాసుకోవాలి. ఫ‌లితంగా మ‌చ్చ‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయి. పెద్ద‌గా తెర‌చుకునే గ్రంథుల స‌మ‌స్య కూడా అదుపులో ఉంటుంది. మొటిమ‌ల ఇబ్బంది (Tea for Skin) కూడా చాల‌మ‌టుకు త‌గ్గుతుంది. 

Post a Comment

0 Comments