Ayurveda in Telugu: ఆధునిక చికిత్స‌లో ఆయుర్వేదం


Ayurveda in Teluguఆయుర్వేదం ప్ర‌పంచ తొలి సంపూర్ణ జ్ఞాన మిళిత సంహిత‌మైన వేదంలో ఒక ఉప‌వేదం. వేదం ఒక వ్య‌క్తి రాసింది కాదు అది అపౌరుషేయం. త‌ను సృష్టించిన జ‌న‌హితం కోసం సాక్షాత్తూ విధాత చెప్పిన స‌మ‌గ్ర వైద్య‌శాస్త్రం ఇది.


సంస్కృత‌సంహిత‌, చ‌ర‌క‌సంహిత వంటివి. వాటికి త‌మ అనుభ‌వాలు, ప‌రిశోధ‌న‌లు జోడించి మ‌రింత విస్త‌రింప చేసి గ్రంథాలుగా నిలిపారు వ్యాఖ్యాన‌క‌ర్త‌లు. నాటి భాష‌లైన పాళీ, సంస్కృత భాష‌ల‌లో రాయ‌బ‌డ్డ‌వి అవి. నేడు ఆధునిక వైద్యం లాటిన్ భాష‌లో ఉన్న‌ట్లు అలా పెరిగిన ఆయుర్వేద‌శాస్త్రం పురోగ‌తి ప‌ర‌ణ‌తి అక్క‌డితో ఆగిపోలేదు. 

Ayurveda in Telugu: ఆయుర్వేదం స‌హ‌జ‌మైన వైద్య‌విధానం

అష్టఅంగాలుగా అంటే ఎనిమిది విభాగాలుగా ఆదిలోనే వివ‌రించ‌బ‌డ్డ ఆయుర్వేదం వైద్య‌ప‌రంగా, శ‌ల్య‌ప‌రంగా అంటే ఆప‌రేష‌న్ లేదా స‌ర్జ‌రీ విభాగాలుగా మ‌రింత ప‌రిశోధ‌ న‌ల‌లో ముందుకెళ్లింది. ఆధునిక కాలంలో గుజ‌రాత్‌లో జామ్‌న‌గ‌ర్‌, ఉత్త‌ర భార‌తంలో, బెనార‌స్ ద‌క్షిణ భార‌తంలో కేర‌ళ ప్రాంతాల‌లో విస్తార‌మైన ప‌రిశోధ‌న‌లు, వైద్య ఒర‌వ‌డితో మంచి ఫ‌లితాల‌ను సాధించారు. దేశంలో అనేక ఆయుర్వేద క‌ళాశాల‌లు, పోస్టుగ్రాడ్యుయేట్ క‌ళాశాల‌లు, వైద్య క‌ళాశాల‌లు విస్తారంగా పెర‌గ‌డ‌మే కాకుండా వివిధ దేశాల‌లో ఆయుర్వేద వైద్యం ప‌రిశోధ‌న‌లు ఆరంభించ‌బ‌డి ఎన్నెన్నో ఫ‌లితాల‌ను సాధిస్తున్నారు.

అమెరికా, జ‌ర్మ‌నీ, యూర‌ప్‌దేశాల్లో ముఖ్యంగా హాలెండ్ వంటి దేశాల‌లో ర‌ష్యాలో ఆయుర్వేద చికిత్సాశాల‌లు చ‌క్క‌టి ప్రాబ‌ల్యాన్ని పాటించ‌డ‌మే కాకుండా స‌హ‌జ‌మైన వైద్య విధానంగా గుర్తించ‌బ‌డింది. రెడ్డీస్ లాబ‌రేట‌రీ హిమాల‌యా వంటి ప్ర‌సిద్ధ ఔష‌ధ నిర్మాణ సంస్థ‌లు మంచి ప‌రిశోధ‌న‌ల‌తో ముందుకు న‌డుస్తున్నాయి. ఇప్పుడు స‌హ‌జ జీవ‌న విధానం ప్ర‌కృతికి ద‌గ్గ‌రగా ఉండే ఔష‌ధ వినియోగంపై ఆసక్తి పెరిగింది.

ఒక వైద్య విధానం అన్ని అవ‌స్థ‌ల‌కీ సంపూర్ణ వైద్యం అందించ‌లేద‌న్న‌ది జీవ‌న స‌త్యం. ఎక్క‌డో దారి మూసుకుపోయిన గుండెకు ఆధునిక వైద్యం అందిస్తున్న సాంకేతిక వైద్య విధానం అత్యవ‌స‌రం. కానీ ఎప్పుడూ వ‌చ్చే జ‌లుబుకు సంపూర్ణ చికిత్స అక్క‌డ దొర‌క్క‌ పోవ‌చ్చు. ప‌క్ష‌వాతానికి, లివ‌ర్ జ‌బ్బుల‌కి ఆయుర్వేదం (Ayurveda in Telugu) చ‌క్క‌టి సంపూర్ణ చికిత్స అందివ్వ‌క‌లుగుతుంది. శుక్ర‌బీజం త‌క్కువ‌గా ఉండి సంతానం లేని వారిని కోడీక‌ర‌ణ చికిత్స అద్భుత ఫ‌లితాల‌నిస్తుంది. 

అకాల వృద్ధాప్యం వ‌స్తున్న వారికి ర‌సాయ‌న చికిత్స‌హిత‌క‌రం. ఎక్క‌డో మారుమూల క‌ణాల మ‌ధ్య వుండిపోయిన టాక్స‌న్స్‌ను బ‌య‌టికి తెచ్చిన‌వోన్మేషాన్నిచ్చే పంచ‌క‌ర్మ చికిత్స ప్ర‌పంచ‌మంతా ఆద‌రించ‌బ‌డుతుంది. ముఖ్యంగా మ‌న‌కి అందుబాటులో మ‌న చుట్టూ ఉన్న ప‌సుపు, మారేడు, తుల‌సి వంటి మూలిక‌ల‌పై ఆధునిక శాస్త్ర‌రీత్యా HPTLC వంటి ప్ర‌క్రియ‌లో LCMS వంటి ప్ర‌త్యేకత‌ని వాటిని వాడ‌టం వ‌ల్ల చెడు ఫ‌లితాలున్నదీ లేనిదీ ప‌రిశోధించి తేల్చారు.

ఉదాహ‌ర‌ణ‌కి ఉసిరికాయ‌, క‌ర‌క్కాయ‌, తానికాయ‌ల‌ను క‌లిపి నూరితే త్రిఫ‌ల అంటారు. ఇది ప్రేవుల‌లో చ‌క్క‌టి క‌ద‌లిక‌ల‌ను క‌ల‌గ‌జేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్‌గా ప‌నిచేస్తుంది. ఇది అల‌వాటు కానీయ‌ద‌ని సూచించ‌బ‌డింది. త్రిక‌టు, మారేడు, శొంఠి, యష్టిమ‌ధు జీర్ణ‌కోశంపై ప‌నిచేసే చ‌క్క‌టి స‌హ‌జ మూలిక‌ల‌ని నిర్థారించ‌బ‌డింది. 

అలాగే వేప ప్రో- ఇన్‌ఫ్ల‌మేట‌రీ సైటోకైన్స్ అనేదాన్ని త‌గ్గించే గుణం వుంద‌ని ROS ని త‌గ్గించే చ‌క్క‌టి యాంటీ ఇన్ఫ్ల‌మేట‌రీ ద్ర‌వ్య‌మ‌ని గుర్తించ‌బ‌డింది. ప‌సుపు, మంచిష్ట‌, శారిబ వంటివి చ‌క్క‌టి చ‌ర్మ‌వ్యాధిని త‌గ్గించే స‌హ‌జ మూలిక‌లు. 

0 comments:

Post a Comment