Ticker

6/recent/ticker-posts

Ayurveda for Ulcer: అల్స‌ర్‌కు ఆయుర్వేదం వైద్యంతో చెక్ పెట్టండి

image show Ayurveda for Ulcer

Ayurveda for Ulcer: అమ్మో! గుండెల్లో చాలా మంట‌గా ఉంటోంది. తిన‌క‌పోతే మంట‌, తింటే అర‌ గంట త‌ర్వాత నొప్పి. దీన్ని ఆమ్ల పిత్త‌మ‌ని ఆయుర్వేదంలోను Acid Peptic Disorders అని ఆధునిక వైద్యులు అంటారు. పూర్వ‌పు రోజుల్లో, ఇన్ని ప‌రీక్ష‌లు, ప‌రిక‌రాలు లేని కాలంలో, నాడిని బ‌ట్టి క‌డుపులో ఏ ప్రాంతంలో పుండు ఏర్ప‌డిందో చెప్ప‌డంతో బాటు దానికి కార‌ణ‌మైన దోషాల‌ను కూడా గుర్తించేవారు.

ఈ స్థితిని ఆమ్ల‌పిత్త‌మ‌ని అంటూ, పిత్త అంటే మ‌న జీర్ణ‌ర‌సాలు ఎంజైముల మార్పులు కార‌ణ‌మ‌ని గుర్తించి, దానివ‌ల్ల చిర‌కాలం ఆహారం ప‌చ‌నం కాని స్తితిలో ఆక‌లి లేక‌పోవ‌డం కార‌ణ‌మ‌ని దానికి త‌గ్గ చికిత్స చెప్పారు.

మ‌న జీర్ణాశ‌యంలో జీర్ణంకాక ఉండిపోయిన ప‌దార్థాల నుండి త‌యార‌య్యే విష‌ప‌దార్థాల వ‌ల్ల అక్క‌డ పేగుల క‌ద‌లిక‌లోని హెచ్చుత‌గ్గుల వ‌ల్ల యాసిడ్ జీర్ణ‌ర‌స ఉత్ప‌త్తి మార్పుచెంది, పొర రేగ‌డం, త‌ర్వాత పుండు ఏర్ప‌డ‌టం జ‌రిగి, క‌డుపులో ముఖ్యంగా గుండె కింద భాగంలో మంట ఉండ‌టం, ఆహారం తిన్న త‌ర్వాత క‌డుపులో నొప్పి, వికారం, కొంత మందిలో త‌ల‌నొప్పి, క‌డుపు ఉబ్బ‌రం వ‌స్తుంటాయి.

దీనివ‌ల్ల జీర్ణ‌వాహిక‌లో ముఖ్యంగా ఆమాశ‌యం (Gastro) చిన్న‌ప్రేవుల‌లో (Interstan) లేదా మ‌ధ్య భాగం లోని (Devodonal) పొర‌ల‌లో పుండ్లు (Ulcers) ఏర్ప‌డ‌తాయి. మ‌నం ఉపేక్ష చేస్తే చాలా ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌వు తుంది. అన్నం తిన్న వెంట‌నే నొప్పి వ‌స్తే, మంట‌తో ఉంటే అది (Stomach) అమాశ‌యంలోను, గంట‌న్న‌ర త‌ర్వాత వ‌స్తే అది వంపులోను, రెండు గంట‌ల త‌ర్వాత వ‌స్తే అది ప్రేవుల‌లోను అని మ‌నం అనుకోవ‌చ్చు. 

Ayurveda for Ulcer: అల్స‌ర్ యొక్క‌ ల‌క్ష‌ణాలు

ఈ పుండు తీవ్ర‌మైన‌ప్పుడు ఆ నొప్పి ఎక్కువ‌గా బిగ‌పెడుతున్న‌ట్టు, నొక్కిన‌ట్టు మంట‌తో కూడి ఉంటుంది. ఒక్కోసారి వాంతి అయ్యాక కాని శాంతించ‌దు. ఆహారం తీసుకున్న రెండు మూడు గంట‌ల త‌ర్వాత క‌డుపుబ్బ‌రించి నొప్పి ప్రారంభ‌మై అది విరేచ‌న‌మైన త‌ర్వా త త‌గ్గు ముఖం ప‌డితే చిన్న ప్రేముల‌లో పుండును సూచిస్తుంది. 

అదీ విరేచ‌నం అయ్యాక క‌డుపులో నులిపెడుతున్న‌ట్టు నొప్పి వ‌స్తుంటే, క‌డుపులో చిర‌కాలం నుండి ఉన్న ఏమీబియాసిస్ ని సూచిస్తుంది. కృష్ణా గోదావ‌రి ప‌రివాహ‌క ప్రాంతాల‌లో ఇది సామా న్యంగా ఉంటుంది. చిర‌కాలం నుండి దీనివ‌ల్ల లివ‌ర్ పాడైపోతుంది. ఎక్స్‌రే, స్కానింగ్ వ‌ల్ల‌, విరేచ‌నం ప‌రీక్ష వ‌ల్ల ఈ స్థితుల‌ను గుర్తుప‌డ‌తారు. వివిద మందుల‌తోను, చివ‌ర‌కు ఆప‌రేష‌న్‌తోను దీన్ని చికిత్స చేస్తారు ఆధునిక వైద్యంలో.

ఆయుర్వేదంలో ఈ Gastric and Devodenal Ulcer ను అన్నద్ర‌వ‌శూల‌, ప‌రిణామ‌శూల‌గా అనుకో వ‌చ్చు. సుమారు వెయ్యి సంవ‌త్రాల క్రిత‌మే శాస్త్ర విజ్ఞాన నిపుణుడు ఒక‌రు వ్ర‌ణ మ‌నే పేరుతో ప్ర‌తిపాదించాడు. అది బ‌య‌ట పుళ్లుగా పేర్కొన్నా చ‌క్క‌గా ఉన్న పొర చిట్లి మ‌ధ్య‌లో వేరుప‌డ‌టం వ్ర‌ణ‌మ‌ని ప్ర‌స్తావించారు. ఈ లోకానికి తొలిసారిగా ఆమాశ‌య ప్ర‌క్వాశ‌య వ్ర‌ణాల గురించి స‌వివ‌రంగా క్రీ.శ 900 సం.లో మాధ‌వ నిదానంలో స్థూల నిదానం చెబుతూ ప్ర‌తిపాదించారు. శూల అంటే బిగ‌ప‌ట్టే నులినొప్పి అని అర్థం. 

ఎనిమిది విధాల శూల‌లో అన్న‌ద్ర‌వ ప‌రిణామ శూల‌లు ఈ గ్యాస్టిక్ డియోడిన‌ల్ అల్స‌ర్స్‌ని సూచి స్తుంది. అన్న‌ద‌ర‌వ‌వూల విప‌రీత‌మ‌న కారం, వేడి, నూనె ప‌దార్థాలు తిన‌డం వ‌ల్ల‌, ఎక్కువ మ‌ద్యం తాగ‌డం వ‌ల్ల‌, అదికంగా శ్ర‌మ ప‌డ‌టం, త‌క్కువ తిన‌డం వ‌ల్ల‌, కోపం, విచారం వంటివాటి వ‌ల్ల వ‌స్తుంది. ఇది అన్నం తిన్నాక అది జీర్ణ‌మ‌య్యే కాలంలో వ‌స్తుంది. తొలిరోజుల్లో అన్నం తిన్న అర‌గంట త‌ర్వాత ఆరంభ‌మైనా త‌రువాత ఎప్పూ నొప్పి ఉంటుంది. వాంతి అయ్యాక కాని విశ్రాంతి ఉండ‌దు. 

ప‌రిణామ‌శూల రాత్రుళ్ళు మెల‌కువుగా ఉండ‌టం, ప‌ద్ధ‌తిలేకుండా ఎప్పుడుప‌డితే అప్పుడు ఆహారం తీసుకోవడం, ఎక్కువ ఉప‌వాసాలుండ‌టం, ఎండిన ప‌దార్థాలు తిన‌డం, విచారం, బాధ‌ప‌డ‌టం వంటి వాటివ‌ల్ల‌వ‌స్తుంది. ఆహార జీర్ణ‌మైన త‌ర్వాత తిరిగి ఆక‌లి వేసిన‌ప్పుడు వ‌స్తుంది. సుమారుగా అన్నం తిన్న రెండు మూడు గంట‌ల త‌ర్వాత నొప్పి ఆరంభ‌మ‌వుతుంది. 

అల్స‌ర్ యొక్క‌ చికిత్స‌

ప్ర‌కృతి త‌న స‌హ‌జ సంప‌దైన వ‌న‌మూలిక‌ల నుండి అద్భుత చికిత్స‌ని ప్ర‌తిపాదించండి. ప్ర‌తి ఉద‌యం ఒక గ్లాసు వెన్న తీసిన మ‌జ్జిగ లో ఇనుప‌గ‌రిట వేడిచేసి ముంచి అందులో ఒక చెమ్చా పంచ‌దార‌, కొంచెం జీల‌క‌ర్ర‌, అల్లం వేసి త్రాగితే క‌డుపులో మంట (Ayurveda for Ulcer) త‌గ్గుతుంది. శొంఠి, పిప్ప‌ళ్ళు, మిరియాలు, జీల‌క‌ర్ర‌, ఉసిరిక‌, తెలుపు సైంధ‌వ ల‌వ‌ణం పొడిచేసి మ‌జ్జిగ‌తో అన్నం తిన్నాక తీసుకుంటే క‌డుపు నొప్పి త‌గ్గుతుంది. 

సైంధ‌వ‌ల‌వ‌ణం, వెల్లుల్లి ర‌సం, ఇంగువ కొంచెం కొలిపి తీసుకుంటే, శూల‌లు త‌గ్గుతాయి. మారేడు గుజ్జు, బెల్లం స‌మంగా క‌లిపి చిన్న ఉసిరికాయంత మాత్ర చేసుకొని మ‌జ్జిగ‌తో తింటే, ఎమీబి యాసిస్ నొప్పి త‌గ్గుతుంది. అన్నం ఉడుకుతున్న‌ప్పుడు నీళ్లు ఒక అర‌గ్లాసు తీసుకొని, అందులో రెండు చెమ్చాలు నెయ్యివేసుకొని తాగితే, క‌డుపులో పుండు (Ayurveda for Ulcer) త‌గ్గుతుంది. ఆక్రోటు ప‌ళ్ళు, దానిమ్మ ప‌ళ్ళు, వెల‌గ‌ప‌ళ్లు తీసుకోవ‌డం ఆమ‌ప‌క్వాశ‌యాల‌కి మంచిది. 

శొంఠి, నువ్వులు, బెల్లం స‌మంగా క‌లిపి నూరి రోజూ చిన్న ఉసిరికాయంత మాత్ర‌లుగా పాల‌తో తీసుకుంటే ప‌రిణామాశూల త‌గ్గుతుంది. కారం వ‌స్తువులు, మ‌స‌లా వ‌స్తువులు తొంద‌ర‌గా జీర్ణం కాని జున్ను, మిన‌ప‌ప్పు, పెరుగు, పుల్ల‌టి వ‌స్తువులు క‌డుపులో బాధ ఉన్న‌వాళ్ళ‌కి అహితం. క‌మ్మ‌ని మ‌జ్జిగ‌, వేయించి వండిన మెత్త‌టి అన్నం, పెస‌ర‌క‌ట్టు, దానిమ్మ ర‌సం, బెల్లం, పాలు చాలా హిత‌క‌రం.

Post a Comment

0 Comments