Ticker

6/recent/ticker-posts

Blood Donor: ఆప‌ద స‌మ‌యంలో మీరే ప్రాణ‌దాత

image show Blood Donor

Blood Donor: శ‌రీరంలో చాలినంత రక్తం లేక‌పోతే ఏం జ‌రుగుతుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. శ‌రీరంలో ఐదారు లీట‌ర్ల ర‌క్తం ఉంటుంది. అంటే శారీర‌క బ‌రువులో ఇది 8 శాతం లేదా ఒక కిలో శ‌రీర బ‌రువుకు 80 ML చొప్పున ఉంటుంద‌న్న‌మాట‌. శ‌రీరంలోని అవ‌య‌వాలు స‌క్ర‌మంగా ప‌నిచేయ‌డానికి స‌రిప‌డ ర‌క్తం అవ‌స‌రం.

Blood Donor : ర‌క్తంలో ఏమి ఉంటాయి?

55 శాతం ప్లాస్మా, 45 శాతం సెల్స్ ఉంటాయి. ప్లాస్మా (Plasma) లో 91 శాతం నీరుంటే 8 శాతం ఆర్గానికి మాలిక్యూల్స్‌, ఒక శాతం ఇన్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఉంటాయి. సెల్స్‌లో ఎర్ర‌ర‌క్త‌క‌ణాలు (ఆర్‌బిసి), తెల్ల ర‌క్త‌క‌ణాలు (డ‌బ్ల్యూబిసి), ప్లేట్‌లెట్స్ ఉంటాయి.ఒక లీట‌రు ర‌క్తంలో ఎర్ర‌ర‌క్త‌క‌ణాలు 5 మిలియ‌న్లు, తెల్ల ర‌క్త‌క‌ణాలు 4 నుంచి11 మిలియ‌న్లు, ప్లేట్‌లెట్స్ 1.5 నుంచి 4.5 మిలియ‌న్లు సాధార‌ణంగా ఉండాల్సిన ప‌రిమాణం. 

ఎర్ర‌ర‌క్త క‌ణాలు త‌గ్గితే అనీమియా, ఆరువేల‌కు మించితే బోన్ మ్యారో ట్యూమ‌ర్ లాంటివి వ‌స్తాయి. తెల్ల‌ర‌క్త‌క‌ణాలు. స్కావెంజ‌ర్ల వంటివి, శ‌రీరంలో ఇన్‌ఫెక్ష‌న్ల‌పై దాడి చేస్తుంటాయి. బ్ల‌డ్ క్లాటింగ్‌కు ప్లేట్ లెట్స్ అవ‌స‌రం. ప్రాణం నిల‌బెట్టుకోవ‌డానికి అత్య‌వ‌స‌ర‌మైన ఈ ర‌క్తం త‌గ్గితే అనేక స‌మ‌స్య‌లు మొద‌ల‌వుతాయి. శ‌రీరంలో శ‌క్తి క్షీణిస్తుంది. ఎక్కువ కాలం ర‌క్త‌హీన‌త కొన‌సాగితే దుష్ఫ్ర‌భావాలు ఆరంభ‌మ‌వుతాయి. 

ఆహార సంబంధిత లోపాల వ‌ల్ల ఏర్ప‌డే ర‌క్త‌హీన‌త సాధార‌ణంగా అనేక మందిలో క‌న్పిస్తుంది. ర‌క్త‌హీన‌త‌ (Blood Donor) కు అనేక కార‌ణాలున్నా మ‌న‌దేశంలో ఎక్కువ‌గా ఈ స‌మ‌స్య‌కు దారితీసేది ఐర‌న్ లోపం. ఇటువంటి సంద‌ర్భంలో స‌రైన మోతాదులో ఐర‌న్ను శ‌రీరానికి అందిస్తే ప్ర‌తి స్పంద‌న క‌నిపిస్తుంది. ఫోలిక్ యాసిడ్ లోపం వ‌ల్ల అయితే చాలినంత విట‌మిన్ బి 12 ఆహారంలో ఉండే మాదిరి శ్ర‌ద్ధ వ‌హించాలి. 

దైవ‌స‌మానులు ర‌క్త దాత‌లు

ర‌క్త‌హీన‌త ఏర్ప‌డిన‌ప్పుడు, అధిక ర‌క్తాన్ని కోల్పోతున్న‌ప్పుడు, బ్ల‌డ్ ట్రాన్స్‌ఫ్యూజ‌న్ చేయాల్సి వ‌చ్చిన‌ప్పుడు వారికి ప్రాణ దాత‌లు కావాలి. వారి ప్రాణం నిల‌వాలంటే మ‌రొక‌రు త‌మ ర‌క్తాన్ని దార‌పోయాలి.ఎటువంటి స్వార్థం లేకుండా ప్రాణ‌పాయంలో ఉన్న వ్య‌క్తిని కాపాడ‌టానికి సూట‌యిన త‌మ ర‌క్తాన్నిచ్చి ఆదుకోవ‌డం అంటే సాదాసీదా విష‌యం కాదు. 

త‌మ ర‌క్తంలో మ‌రో ప్రాణాన్ని కాపాడే దైవ స‌మానులు ర‌క్త‌దాత‌లు. ఇటువంటి ర‌క్త‌దాత‌ల ధ‌న్య‌త‌ను కొనియాడుతూ, వారి సేవ‌ను గుర్తిస్తూ, అవ‌స‌రంలో గ‌ల‌వారికి ర‌క్త‌దానాన్ని, ట్రాన్స్‌ఫ్యూజ‌న్ కోసం ర‌క్తాన్ని ఇవ్వడాన్ని ప్రోత్స‌హిస్తూ ప్ర‌తి సంవ‌త్స‌రం జూన్ 14 వ తేదీన వ‌రల్డ్ బ్ల‌డ్ డోన‌ర్ (Blood Donor) డేగా నిర్వ‌హంచుకుంటున్నారు.

ప్ర‌భుత్వ నాయ‌కుల ఉన్న‌త స్థాయి క‌మిట్ మెంట్‌, మ‌ద్ద‌తు, సెల‌బ్రిటీలు, పెద్ద‌ల ప్రోత్సాహంతో, మీడియా ప్ర‌భావంతో ఈ డోనార్ డే ఉత్స‌వాలు ప్ర‌పంచాన్ని ఐక్యం చేస్తున్నాయి. త‌మ కేమీ కాని వ్య‌క్తుల ప్రాణాలు కాపాడ‌టానికి నిస్వార్థంగా ర‌క్త‌దానంచేసే దాత‌ల ఉత్స‌వ‌మ‌ది. 

ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌మాదాల సంఖ్య పెరిగిపోతున్న ఈ రోజుల్లో ర‌క్తంతో పాటు ర‌క్తం కంపోనెంట్స్ దాత‌ల డిమాండ్ కూడా పెరుగుతూ వ‌స్తుంది. తొలి వ‌ర‌ల్డ్ బ్ల‌డ్ డోనార్ డేను 2004 జూన్ 14వ తేదీన నిర్వ‌హించారు. ఆ మ‌రుయేడాది వ‌ర‌ల్డ్ హెల్త్ (world health) అసెంబ్లీ ఈ దినోత్స‌వాన్ని యేటేటా నిర్వ‌హించాల‌ని తీర్మానించింది. 

త‌మ ర‌క్తాన్ని స్వ‌చ్ఛంధంగా వివిధ కార‌ణాల‌తో చేసే ప్రాణ ర‌క్ష‌ణ దానాల వ‌ల్ల వ‌ర‌ల్డ్ డోనార్ డే దృష్టిని కేంద్రీక‌రిస్తుంది. వంద శాతం స్వ‌చ్ఛంగా, ధ‌న‌వాంఛ లేని ర‌క్త‌దానాన్ని చాలా దేశాలు సాధించాయి. 2002లో ఆ దేశాల సంఖ్య 39 ఉంటే, 2006 నాటికి ఆ సంఖ్య 54 దేశాలకు పెరిగింది.

క్ర‌మం త‌ప్ప‌కుండా ఓ సేవా కార్య‌క్ర‌మంగా భావిస్తూ ర‌క్త‌దానం (Blood Donor) చేసే స్వ‌చ్ఛంద కార్య‌క‌ర్త‌ల సంఖ్య పెరుగుతూ వ‌స్తున్న‌ది. వీళ్లు సుర‌క్షిత ర‌క్ష‌దాత‌లు మాత్ర‌మే కాదు. ట్రాన్స్ ప్యూజ‌న్ రోగుల అవ‌స‌రాల‌ను అందుకోవ‌డానికి వీలుగా అవ‌కాశాలు క‌ల్పించే వ‌రాలు కూడా. 

Post a Comment

0 Comments