Stomach Ulcer: క‌డుపులో పుండులా కాల్చేదే అల్స‌ర్‌!


 Stomach Ulcer: ఆధునిక మాన‌వ‌జీవితం ప్ర‌కృతి ప‌రిణామానికి విరుద్ధంగా మారి తెలియ‌ని ఎన్నో బాధ‌ల‌కి నెల‌వుగా మారుతోంది. అలాంటి బాధ‌ల్లో ఒక‌టి మ‌నం అనుభ‌విస్తూ కూడా అశ్ర‌ద్ధ చేసే క‌డుపునొప్పి. ఒక ప‌రిశోధ‌న ఒక సూత్రాన్ని క‌ల్గించే అద్భుతాన్ని సృష్టిస్తే ఆ అనుభ‌వం మ‌రో సుఖం కోసం ప‌రుగెత్తిస్తుంది.

Stomach Ulcer

 
ఈ సుఖానుభ‌వం కోసం మ‌నం స‌హ‌జ జీవ‌నానికి దూర‌మై అస‌హ‌జ‌మైన భౌతిక వ్య‌వ‌స్థ‌లో ఉండిపోయి ఆక‌లి త‌గ్గిపోవ‌డం, గుండె కింద మంట‌, క‌డుపుబ్బ‌రం, క‌డుపులో నొప్పి, వాంతి వ‌చ్చిన‌ట్టు వికారంగా ఉండ‌టం వంటివి రావ‌డానికి ఆస్కార‌మ‌ వుతున్నాం. మ‌న‌లో ప్ర‌తిక్ష‌ణం పుట్టే కోరిక‌లు, క్ష‌ణ‌కాల సుఖంకోసం ప‌డే ఆరాటం, దాంతో ప‌రుగెడుతూ తినే ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాలు మ‌న జీర్ణాశ‌యాన్ని పాడు చేసి ర‌క‌ర‌కాల వ్యాధుల‌ని క‌లుగ‌జేస్తున్నాయి.

Stomach Ulcer: అల్స‌ర్ అంటే ఏమిటి? 

పూర్వం కూడా ఆమ్ల‌, పిత్త‌మ‌ని, క‌డుపుబ్బ‌ర‌మ‌ని ఆమాశ‌య‌శూల‌, ప‌రిణామ‌శూల అని వున్నా చాలా త‌క్కువ మందిలో వ‌చ్చేవి. ఆప‌రేష‌న్ దాకా వెళ్లే ప‌రిస్థితులు ఉండేవికాదేమో. ఆక‌లి వేయ‌డం, అన్నం తిన్న త‌ర్వాత బ‌రువుగా ఉండి అర‌గంట త‌ర్వాత నొప్పి ప్రారంభ‌మై అది ఎక్కువై మెలితిరిగిపోతూ, ఒక గంట త‌ర్వాత పెద్ద వాంతి అయి నొప్పి త‌గ్గ‌డం ఆగిపోతే అది క‌డుపులో అల్స‌ర్ అని గ్ర‌హించాలి.

ఈ అల్స‌ర్ అంటే ఆమాశ‌యంలో కాని ప్రేవుల‌లో కాని లోప‌లి గోడ‌లు చిట్లి చుట్టూ ఎర్ర‌బ‌డి వాచివుండ‌టం. ఈ అల్స‌ర్ ఇక్క‌డే కాదు శ‌రీరంలోని ఏ అవ‌య‌వంలోనైనా రావ‌చ్చు. జీర్ణాశ‌యంలో వ‌చ్చే ఈ వ్యాధిని పెప్టిక్ అల్స‌ర్ (Peptic Ulcer) అని అంటారు.

మ‌న జీర్ణాశ‌యాన్ని Alimentary Tract అంటారు. ఇది ఒక పొడువైన మాంసంతో త‌యారైన గొట్టంలాంటిది. ఈ గొట్టం కొన్ని చోట్ల గుండ్రంగా, మ‌రికొన్నిచోట్ల ఒంపులు తిరిగివుంటుంది. నోటికింద గొంతుక నుంచి ఆరంభ‌మై పెద్ద సంచీగా మారి త‌ర్వాత ఒంపులు తిరిగి డియోడిన‌మ్‌గా మారి అక్క‌డ చిన్న ప్రేవులు Small Intestine గాను, పెద్ద ప్రేవులు Large Intestine గానూ మారుతుంది. వీటికి ముఖ‌ద్వార‌మైన డియోడిన‌మ్ ప‌న్నెండు వేళ్ల పొడుగు ఉంటుంది. 

లాటిన్ భాష‌లో ప‌న్నెండును Dwodeni అంటారు. అందుకే దీన్ని Duodenum అని పిలుస్తారు. 30 సెంమీ. పొడువు ఉండే ఆమాశ‌యం లో కాని, ఈ డియోడిన‌మ్‌లో గాని గోడ ప‌గిలి పుండు ఏర్ప‌డితే దాన్ని Peptic Ulcer అని అంటారు. ఆరంభంలో ఆమాశ‌యంలో ఏర్ప‌డిన ఉద్రిక్త‌త వ‌ల్ల‌, వాపు వ‌ల్ల‌, లోప‌లి గోడ‌లు పాడై త‌ర్వాత ప‌గిలిన‌ట్ల‌యి అది మ‌ళ్లీ వాచి పూర్తిగా జీర్ణం కాని ఆహారం దానికి త‌గిలి అది పుండుగా త‌యార‌వుతుంది. పుండుపైన చ‌నిపోయిన క‌ణాలు ఉంటాయి. ఈ పుండు మ‌రీ పెద్ద‌దై ప‌క్క‌న పెరిగే డియోడిన‌మ్ దాకా విస్త‌రిస్తుంది. దీన్ని Perforation స్థితి అంటారు.

అల్స‌ర్ ల‌క్ష‌ణాలు గుర్తించ‌డం ఎలా?

సాధార‌ణంగా అల్స‌ర్స్ ఆమాశ‌య‌పు  కిందభాగంలో ఏర్ప‌డ‌తాయి. మ‌న జీర్ణాశ‌యంతో తీసుకున్న ఆహారం జీర్ణం కావ‌డానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్‌, పెప్సిన్ అనే రెండు ప‌దార్థాలు ఆమాశ‌యం నుంచి స్ర‌విస్తాయి. ఇవి జీర్ణ‌ప్ర‌క్రియ‌ని కొన‌సాగిస్తాయి. ఇవి చాలా బ‌ల‌మైన‌వి, తీక్ష‌ణ‌మైన‌వి. ఒక చిన్న ఇనుప‌ర‌జ‌ను ఈ యాసిడ్‌లో క‌లిస్తే ఒక రాత్రిలో క‌రిగిపోతుంది. ప్ర‌పంచంలోని వివిధ దేశాల‌లో ఉండే వింత ఆహార‌పు అల‌వాట్లు, వాళ్ల వాళ్ల జీర్ణ‌ప్ర‌క్రియ‌ను స‌హ‌జంగా కొన‌సాగించాయి. వాటిలో తీవ్ర‌మైన మార్పులు వ్యాధుల‌కి, అల్స‌ర్స్‌కి కార‌ణ‌మ‌వుతాయి. 

ఉడికీ ఉడ‌క‌ని ఆహార ప‌దార్థాలు, నిలువ వున్న ఆహార ప‌దార్థాలు, తీక్ష‌ణ‌మైన ఆహార ప‌దార్థాలు, క‌ఠిన‌మైన జంతు మాంసాలు, మ‌ద్యం, హ‌డావిడిగా తిన‌డం, తిన‌గానే ప‌రుగెత్త‌డం, కొన్ని కుటుంబాల్లోని వార‌స‌త్వ ల‌క్ష‌ణాలు ఈ అల్స‌ర్‌కి కార‌ణాలుగా వైద్యులు గుర్తించారు. 

ఈ అల్స‌ర్‌లో వ‌చ్చే నొప్పి విచిత్రంగా ఉంటుంది. ఆమాశ‌యంలో పుండు ఏర్ప‌డితే అన్నం తిన్న వెంట‌నే నొప్పి వ‌స్తుంది. అదే డియోడిన‌ల్ అల్స‌ర్‌ (Stomach Ulcer)లో అయితే రెండు మూడు గంట‌ల త‌ర్వాత నొప్పి ఆరంభ‌మ‌వుతుంది. ఒక్కొక్క‌ప్పుడు ఖాళీ క‌డుపుతో ఉన్న‌ప్పుడు నొప్పి వ‌చ్చి, తిన్న త‌ర్వాత త‌గ్గిన‌ట్లుంటుంది. 

మ‌రొక‌ప్పుడు అన్నం తింటే నొప్పి పెరుగుతుంది. ఈ నొప్పి సాధార‌ణంగా పొట్ట పై భాగంలో ఛాతికింద మ‌ధ్య భాగంలో ఉంటుంది. ఇది ఒక్కొక్క‌ప్పుడు ప‌క్క‌కి పాకిన‌ట్లు ఉంటుంది. అప్పుడు ఛాతిలో నొప్పిగా అనిపించ‌వ‌చ్చు. వికారంగా ఉండ‌టం, వాంతులు అవ‌డం, క‌డుపు (Stomach )లో మంట‌, గుండెల్లో మంట‌గా అనిపించ‌డం, బ‌ల‌హీన‌త‌, నోరు చేదుగా ఉండ‌టం, ర‌క్త‌క్షీణ‌త‌, అజీర్ణం కూడా ఉంటాయి.

0 comments:

Post a Comment