Ticker

6/recent/ticker-posts

Neerulli: నీరుల్లి ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏమిటంటే | onion benefits

Neerulli: నీరుల్లి, వెల్లుల్లి ఒకే జాతికి చెందిన‌వైనా, గుణాల‌లో కొంచెం తేడా వుంది. నీరుల్లి (ఉల్లిగ‌డ్డ‌) లేని కూరంటూ ఉండ‌దు. కొద్ది మంది మాత్ర‌మే నీరుల్లి అంటే గిట్ట‌దు. నీరుల్లికి గ‌ల ఒక ర‌క‌మైన వెగ‌టువాస‌నే దానికి కార‌ణం. ఈ నీరుల్లి (onion) దుంప‌ల్లో ఎరుపు, తెలుపు రంగు భేదాలున్న‌ప్ప‌టికీ గుణాలు మాత్రం ఒక్క‌టే.

image show Neerulli

స‌ర్వాంగాలు ఒక ర‌క‌మైన ఘాటైన వాస‌న క‌ల్గి వుంటాయి. రుచికి కొద్దిగా కారంగా, తీపిగా ఉంటాయి. నీటిలో బాగా ఉడికిస్తే మాత్రం తీపి రుచిగా తిన‌డానికి వీలుగా మార‌తాయి. నీరుల్లి గ‌డ్డ‌లు ఉడికిన త‌ర్వాత తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. ఎక్కువ శాతం నీరు ఉండ‌బ‌ట్టి దీనిని నీరుల్లి అంటారు. కానీ దీనిలో వ‌ట్టి నీరే ఉంటుంది. ఉప‌యోగం ఏమీ లేద‌నుకోవ‌డం వ‌ట్టి భ్ర‌మ మాత్ర‌మే అవుతుంది.

Neerulli: నీరుల్లి ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు

నీరుల్లి మంచి బ‌ల‌క‌ర‌మైన ప‌దార్థం. బుద్ధి వికాసానికి తోడ్ప‌డుతుంది. ఆక‌లిని పుట్టిస్తుంది. నీరుల్లికి వాతాన్ని హ‌రించి క‌ఫాన్ని పెంచే గుణం ఉంది. దీనివ‌ల్ల ర‌క్త‌ పైత్యం త‌గ్గుతుంది. వాంతులును అరిక‌డ‌తుంది. మూల‌వ్యాధులు త‌గ్గిపోతాయి. మ‌గ‌వాళ్ల వీర్య‌వృద్ధికి తోడ్ప‌డుతుంది. 

Neerulli ర‌సాన్ని ముక్కులో పిండితే  మూర్ఛ‌ల నుండి తేరుకుంటారు. ముక్కు నుండి ర‌క్తం కారే జ‌బ్బు త‌గ్గుతుంది. నీరుల్లి ప‌చ్చిదికానీ, ఉడికించిగానీ తింటే మూల‌వ్యాధి వ‌ల్ల క‌లిగే అధిక ర‌క్త‌స్రావాన్ని త‌గ్గిస్తుంది. ఆక‌లి అవుతుంది. నీళ్ల విరేచ‌నాలు క‌డ‌తాయి. నీరుల్లి ర‌సాన్ని న‌శ్యం చేయిస్తే ఎక్కిళ్లు త‌గ్గుతాయి. ఎగ‌శ్వాస త‌గ్గుతుంది.

ఉల్లిగ‌డ్డ‌ల‌తో చిట్కాలు | onion benefits

ఉల్లిపాయ‌ల‌ను ముక్క‌లుగా త‌రిగి లేదా గ‌డ్డ‌ల రూపంగా గాని నేతిలో వేయించి, పంచ‌దార లేత‌పాకం ప‌ట్టి దానిలో క‌లిపి మొత్తానికి స‌గం తేనె క‌లిపి నిల్వ ఉంచి రోజూ ఉద‌యం, సాయంత్రం తింటే మేహ ఉడుకులు త‌గ్గిపోతాయి. శుక్ర‌న‌ష్టాలు త‌గ్గి వీర్య‌పుష్టి చేస్తుంది. మ‌తిభ్ర‌మ‌లు, మూర్ఛ‌లు రావు. 

తేలు కుట్టిన (Scorpion sting) చోట నీరుల్లి ర‌సాన్ని(rasam) రుద్ది తెల్ల‌గుడ్డ వ‌త్తిగా చేసి నిప్పు అంటించి చేస్తే తేలు విషం హ‌రించిపోతుంది. నీరుల్లి ర‌సాన్ని యూక‌లిప్ట‌స్ ఆయిల్‌తో క‌లిపి తేలు కుట్టిన చోట రాస్తే విషం హ‌రిస్తుంది. 

నీరుల్లిపాయ‌లు, కొండ పిండి చెట్టు వేళ్లు (పాషాణ‌భేది చెట్టు) క‌షాయం పెట్టి తాగితే మూత్రంలో రాళ్లు క‌రిగిపోతాయి. మూత్రంలో మంట‌లు త‌గ్గుతాయి. నీరుల్లి ర‌సంలో యాల‌కుల గింజ‌ల చూర్ణం క‌లిపి తాగితే మూత్రంలో పోయే తెల్ల‌ని ప‌దార్థం (అల్బుమిన్‌) త‌గ్గుతుంది. 

నీరుల్లి ర‌సం తీసి ఒక‌టి లేక రెండు చుక్క‌లు కంటిలో వేసినా రేచీక‌టి త‌గ్గిపోతుంది. కానీ గోంగూర‌, పులుసు, అన్నం ప‌థ్య‌మివ్వాలి.

నీరుల్లిపాయ‌లో రంధ్రం చేసి దానిలో కొద్దిగా ప‌టిక, వెలిగారం పెట్టి రంధ్రం మూసి కుమ్ములో ఉడికించి తీసి మొత్తం క‌ల్వంలో వేసి నూరి దానితో ప‌ళ్లు తోముకుంటే అన్ని ర‌కాల దంత రోగాలు త‌గ్గుతాయి. 

నీరుల్లి గ‌డ్డ‌ల‌ను స‌న్న‌గా గానీ, స‌గానికి గానీ కోసి మాడుపై వేసి గుడ్డ‌క‌ట్టి ఎంత ఎండ‌లో ప్ర‌యాణించినా వ‌డ‌దెబ్బ త‌గ‌ల‌దు. 

Neerulli (నీరుల్లి) నూ మితంగా వాడితే క‌ఫాన్ని సైతం త‌గ్గిస్తుంది. మూత్రాన్ని సాఫీగా అయ్యేట‌ట్టు చేస్తుంది. నాడీ వేగాన్ని పెంచుతుంది. 

ఆరోగ్య ఔష‌ధ‌ని నీరుల్లి

నీరుల్లి ర‌సం, మిరియాలు స‌మంగా క‌లిపి నువ్వుల నూనెలో గాని, నేతితో గానీ క‌లిపి మిరియాలు మాడిపోయేంత వ‌ర‌కు నీరుల్లిర‌సం ఇగిరిపోయి తైలం మాత్రమే మిగిలేవ‌ర‌కు వండి, దించి కొద్దిగా ముద్ద‌హార‌తి క‌ర్పూరం నూరి క‌లిపి వాత నొప్పుల‌కు, చ‌ర్మ రోగాల‌కు మ‌ర్థ‌నా లాగా, పై పూత లాగా వాడితే వాత నొప్పులు, చ‌ర్మ‌రోగాలు త‌గ్గిపోతాయి.

ముదిరిన నీరుల్లి గ‌డ్డ‌లో కొద్దిగా న‌ల్ల‌మందు (Nalla Mandu)  పెట్టి ఉడికించి తింటే గ్ర‌ణిణులు, నీళ్ల విరేచ‌నాలు త‌గ్గిపోతాయి. ఉడికించిన నీరుల్లి గ‌డ్డ‌,  న‌ల్ల‌మందు, ఆముదం గింజ‌ల ప‌ప్పు మెత్త‌గా నూరి శ‌రీరంపై క‌లిగే క‌డ్డ‌ల‌కు రాసిన కొద్దిసేప‌ట్లోనే గ‌డ్డ‌లు ప‌గిలి బాధ‌లు త‌గ్గిపోతాయి.

నీరుల్లి ముక్క‌లుగా త‌రిగి రాత్రిపూట పెరుగు అన్నం (curd rice) లో క‌లిపి ఉద‌యాన్నే ఆ అన్నం తింటే మేహుడుకులు త‌గ్గిపోతాయి. ఉష్ణ‌త‌త్వం (వేడి) క‌ల‌వారికి మంచిది. 

పైన తెలిపిన విధంగా నీరుల్లి (Neerulli) ఆరోగ్యానికి ఎంతో ప్ర‌యోజ‌న‌కారిగా ప‌నిచేస్తుంది. కానీ అధికంగా తింటే మాత్రం లేనిపోని స‌మ‌స్య‌లు వ‌స్తాయి. కాబ‌ట్టి స‌మ మోతాదులో స‌హ‌జ ప‌ద్ధ‌తిలో ఆహారంగా తీసుకోవ‌డం ఉత్త‌మం.

Post a Comment

0 Comments