Ticker

6/recent/ticker-posts

Green Peas: ప‌చ్చి బ‌ఠాణీలే క‌దా అని తీసిపారేయ‌కండి! | Pachi batani

Green Peas: మ‌న ఇంట్లో ప‌చ్చి బ‌ఠానీలు ఉంటే వాటితో ర‌క‌ర‌కాల వంట‌కాలు చేసుకోవ‌చ్చు. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి క‌లిగే మేలు అంతా ఇంతా కాదు. ఈ ప‌చ్చి బ‌ఠాణీల్లో ఫైతో న్యూట్రియంట్లు, మిన‌రల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లూ అధికంగా ఉంటాయి.

image show Green Peas

 100 గ్రాముల బ‌ఠాణీల్లో 81 కేలొరీలు ఉంటాయి.

 కొలెస్ట్రాల్ త‌క్కువ‌గా ఉంటుంది. ప్రోటీన్లు, పీచు ప‌దార్థం ఎక్కువ‌.

జీర్ణ వ్య‌వ‌స్థ‌ను మెరుగు ప‌ర్చ‌డంలో ప‌చ్చి బ‌ఠాణీలు కీల‌క పాత్ర వ‌హిస్తాయి.

Green Peas: ప‌చ్చి బ‌ఠాణీల‌తో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు!

ప‌చ్చి బ‌ఠాణీల్లో ఫొలేట్లూ, బి-కాంప్లెక్సు విట‌మిన్లూ అధికంగా ఉంటాయి. గ‌ర్భిణులు ప‌చ్చి బ‌ఠా ణీల్ని ఎంత ఎక్కువ‌గా తీసుకుంటే అంత మంచిది. గ‌ర్భ‌స్థ శిశువు ఎదుగుద‌ల‌కు ఫొలేట్లు దోహ‌దం చేస్తాయి. న‌రాల వ్య‌వ‌స్థను దృఢంగా ఉంచుతాయి. బ‌ఠాణీల్లో ఉండే విట‌మిన్ సి (vitamin c in peas) రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది.

ప‌చ్చి బ‌ఠాణీలు తిన‌డం వ‌ల్ల ర‌కార‌కాల ఇన్‌ఫెక్ష‌న్లు దూర‌మ‌వుతాయి. శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపే ప‌వ‌ర్ వీటికి ఉంది. దీనిలో విట‌మిన్ కె, గాయాలైన‌ప్పుడు ర‌క్తం త్వ‌ర‌గా గ‌డ్డ‌క‌ట్ట‌డానికి దోహ‌దం చేస్తుంది. ఎముక‌లు గుల్ల‌బార‌కుండా చేయ‌డంలో, కంటి చూపుని మెరుగు ప‌ర్చ‌డంలో బ‌ఠాణీ గింజ‌ల్లో ఉండే విట‌మిన్ ఎ,సి ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఐర‌న్‌, కాప‌ర్‌, జింక్ మ‌రియు మాంగ‌నీస్ వంటివి వీటిలో అధికంగా ఉంటాయి.

బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి ప‌చ్చి బ‌ఠాణీలు (weitht loss with Green Peas) 

బ‌రువు ఎక్కువ‌గా వున్న వారు త‌రుచూ బ‌ఠాణీలు తింటే చాలా మంచిది. వీటిలో ఉండే ఫోలిక్ యాసిడ్‌, బీకాంప్లెక్స్ విట‌మిన్లు అధికంగా ఉండే వీటిని గ‌ర్భిణులూ, బాలింత‌లు తింటే ఇంకా మంచిది. విట‌మిన్ సి అధికంగా వున్న బ‌ఠాణీలు రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డానికి దోహ‌ద‌ప‌డ‌తాయి.

శ‌రీరంలో ఉండే వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపేందుకు స‌హాయ‌ప‌డ‌తాయి. ఏదైనా గాయ‌మైన‌ప్పుడు ర‌క్తం పోకుండా త్వ‌ర‌గా గ‌డ్డ‌క‌ట్టేందుకు, ఎముక‌ల సాంద్ర‌త‌ను పెంచేందుకు మేలు చేస్తాయి. అలాగే మ‌తిమ‌రుపు స‌మ‌స్య‌ను దూరం చేస్తుంది. కంటి స‌మ‌స్య‌లు రాకుండా కాపాడ‌తాయి. ఊపి రితిత్తుల ప‌నితీరును మెరుగుప‌రుస్తాయి. 

పోష‌కాల ఉన్న ప‌చ్చి బ‌ఠాణీ (Pachi batani) లు

  1. ప‌చ్చి బ‌ఠాణీలను స‌లాడ్స్ లేదా ఉడికించిన సూప్ రూపంలో తీసుకోవ‌డం మంచిది.
  2. మ‌ట‌న్‌, చికెన్‌, ఉడికించిన గుడ్ల‌తో త‌యారు చేసే వంట‌కాల్లో క‌ల‌ప‌వ‌చ్చు.
  3. పిల్ల‌ల‌కు ప‌చ్చి బ‌ఠాణీతో వండిన వంట‌కాల‌ను పెడితే ఇష్టంగా తింటారు.
  4. బ‌ఠాణీల్లో మ‌న శ‌రీనానికి కావాల్సిన పోష‌కాలైన విట‌మిన్లు, యాంటీ యాక్సిడెంట్లు, ఖ‌నిజ ల‌వ‌ణాలు పుష్క‌లంగా వున్నాయి.
  5. మ‌హిళ‌ల‌కు, చిన్నారుల‌కు ఫోలిక్ యాసిడ్ ఎంతో అవ‌స‌రం అది బ‌ఠాణీ(Green Peas)ల్లో ల‌భిస్తుంది. 

Post a Comment

0 Comments