Ticker

6/recent/ticker-posts

Malabaddakam: అనారోగ్యాల‌కు ప్ర‌ధాన కార‌ణం మ‌ల‌బ‌ద్ధ‌కం అంట‌!

Malabaddakam: దేశంలో తిన్న ఆహారం జీర్ణ‌మైన త‌ర్వాత స‌రిగ్గా విరేచ‌నంకాక ఇబ్బంది ప‌డేవారు ముగ్గురులో ఒక‌రు త‌ప్ప‌కుండా ఉంటున్నారు. బ‌ద్ధ‌కంగా, బ‌రువుగా ఉండి విరేచ‌నం స‌రిగ్గా కాక‌పోవ‌డాన్నే మ‌ల‌బ‌ద్ధ‌కం అంటారు. ఈ స‌మ‌స్యతో బాధ‌ప‌డుతున్న వ్య‌క్తి చాలా వ్యాధుల‌తో బాధ‌ప‌డాల్సిన ప‌రిస్థితి భ‌విష్యత్తులో ఉంటుంది. వేద‌కాలం నుంచి, రోమ‌న్ సంస్కృతి నుండి ఇప్ప‌టి దాకా ఈ  అవ‌స్థ ఉన్న‌దే.

image show Malabaddakam

మ‌ల‌బ‌ద్ధ‌కాన్నిConstipation అని అంటారు. జీర్ణం త‌ర్వాత మ‌ల విస‌ర్జ‌న స‌రిగ్గా జ‌ర‌గ‌క‌పోవ‌డం లేదా క‌ష్టంగా జ‌ర‌గ‌డం లేదా పూర్తిగా జ‌ర‌గ‌క‌పోవ‌డాన్ని మ‌ల‌బ‌ద్ధ‌కం అని అంటారు.సాధార‌ణంగా జీర్ణం త‌ర్వాత మ‌నం తిన్న ఆహారంలో జీర్ణం కాక మిగిలిపోయిన అవ‌స‌రం లేని ప‌దార్థాన్ని మ‌లం అంటారు.ఇది రోజుకు ఒక‌టి రెండు సార్లు బ‌య‌ట‌కు వెళుతుంది. మ‌ల‌బ‌ద్ధ‌కం ఉన్న‌వాళ్ల‌లో ఇది అలా వెళ్ళ‌కుండా 2-7 రోజుల వ‌ర‌కు ఉంటుంది. కొంత మందిలో మ‌లం పూర్తిగా వెళ్ల‌కుండా ఉండ‌లు ఉండ‌లుగా కొద్ది కొద్దిగా వెళుతూ ఉంటుంది. 

ఆయుర్వేదం ఈ మ‌ల‌బ‌ద్ధ‌కాని (Malabaddakam) కి దూషించ‌బ‌డ్డ‌వాతం కార‌ణ‌మంటుంది. వాతం అంటే మ‌న శ‌రీరంలో క‌దిలే, క‌దిల్చే శ‌క్తి. అది మార్పు చెందితే ఈ మ‌ల‌బ‌ద్ధ‌కం అనే స‌మ‌స్య ఏర్ప‌డుతుంది.ఒక్కొక్క‌ప్పుడు మ‌లం గ‌ట్టిప‌డి, ఎండిపోయి వ‌స్తూ ఉంటుంది. అది మ‌న జీర్ణ‌ర‌సాల సామ‌ర్థ్యం త‌గ్గ‌డం వ‌ల్ల వ‌స్తుంది, దీనిని పిత్త‌దోషం అని కూడా అంటారు. అదే విధంగా మ‌లం బైట‌కెళ్లేట‌ప్పుడు క‌డుపులో నొప్పి రావ‌డం,మ‌లం జిగురుగా అంటుకుంటూ ఉండ‌టం క‌ఫ‌దోషానికి సూచ‌న‌. దీంట్లో జిగురు క‌ల్గిన ప‌దార్థం మ‌ల‌ద్వారాన్ని అడ్డుకోవ‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ధ‌కం క‌లుగుతుంది. 

Malabaddakam: మ‌ల బ‌ద్ధ‌కం ఎలా వ‌స్తుంది?

మ‌న జీర్ణాశ‌యం నోటి నుండి ఆరంభ‌మై వివిధ అవ‌య‌వాల‌తో, కొన్ని జీర్ణ ర‌సాల‌తో కొన్ని న‌రాల క‌దలిక‌ల‌తో ఉండే ఒక ఫ్యాక్ట‌రీ లాంటిది. నోటి గుండా మ‌నం తీసుకున్న ఆహారం ఈ ఫ్యాక్ట‌రీలో క‌దిలి వివిధ మార్పుల‌కి లోనై మ‌న జీవ‌క‌ణాలు తృప్తి చెంద‌డం కోసం ర‌క్తంలో క‌లియ‌టానికి త‌గ్గ సూక్ష్మ ప‌దార్థంగా మారి చిన్న ప్రేవుల ద్వారా ర‌క్తంలోకి చేర‌డం జ‌రుగుతుంది. 

మిగిలిన వ్య‌ర్థ‌ప‌దార్థం పెద్ద ప్రేవుల ద్వారా క‌దులుతున్న‌ప్పుడు ఆ ప్రేగు గోడ‌లు దానిలోని నీటిని పీల్చేస్తాయి. ఆ మిగిలిన గ‌ట్టి ప‌దార్థాన్ని మ‌లం అంటాం. అదే ప్రేగు త‌న గోడ‌లు క‌దిల్చి దాన్ని క్రింద‌కి నెడుతుంది. అప్ప‌టికి అది గ‌ట్టిప‌డి ఉంటుంది. ఆ నీరు మ‌రీ ఎక్కువ‌గా పీల్చ‌బ‌డితే మ‌లం బాగా రాయిలా అయి క్రింద‌కు జార‌దు. దాని వ‌ల్ల మ‌లం క్రింద‌కి రావ‌డం చాలా ఆల‌స్య‌ మ‌వుతుంది. అదే మ‌ల‌బ‌ద్ధ‌కం, అప్పుడు మ‌లం ఎండి, రాయిలా గ‌ట్టిప‌డి బ‌య‌ట‌కు రావ‌డం చాలా క‌ష్ట‌త‌ర‌మ‌వుతుంది. 

మ‌ల‌బ‌ద్ధ‌కంకు గ‌ల కార‌ణాలు

  • అర్థం ప‌ర్థం లేని ఆహార‌పుట‌ల‌వాట్లు, వేలా పాళా లేకుండా, ఆద‌రాబాద‌రాగా, అవ‌స‌రానికి మించి తిన‌డం. 
  • మ‌న ఆహారంలో పీచు ప‌దార్థాలు అంటే తోట‌కూర కాడ‌లు, చిక్కుడు, ఆకుకూర‌లు త‌క్కువ తిన‌డం.
  • శ‌రీరానికి త‌గ్గ వ్యాయామం కొంచెమైనా లేక‌పోవ‌డం. ఇది ముఖ్యంగా పెద్ద‌వాళ్లు తిని కూర్చోడం.
  • కొన్ని ర‌కాల మందులు వాడ‌టం, జీవ‌న‌శైలి మార‌డం, వేగ‌నిరోధం అంటే వ‌స్తున్న‌ట్లున్నా ఆపుకోవ‌డం.
  • ఏ కార‌ణం చేత‌నైనా ద్ర‌వం శ‌రీరంలో ఇంకిపోవ‌డం.  ప‌క్ష‌వాతం, న‌రాల బ‌ల‌హీన‌త వంటి వ్యాధులు. 
  • త‌ల‌లో న‌రాల కేంద్రంలో లోపాలు, కంప‌వాతం, వెన్ను పూస‌కి దెబ్బ‌లు త‌గ‌ల‌డం లేదా వాటి వ్యాధులు, ఆహారం వంట ప‌ట్ట‌ని వ్యాధులు, షుగ‌ర్ వ్యాధి, మూత్ర సంబంధిత వ్యాధులు, థైరాయిడ్ వ్యాధులు, 
  • శ‌రీరంలో కాల్షియం ఎక్కువ కావ‌డం. మ‌ల‌బ‌ద్ధ‌కం (Malabaddakam)లో స‌హ‌జ‌మ‌నీ, క్రియాత్మ‌క‌మ‌నీ రెండు ర‌కాలున్నాయి.
  • జ‌న్మ‌తః కొద్ది మందిలో నాలుగైదు రోజుల‌కొక‌సారి అవుతుంది. కార‌ణం క‌నిపించ‌దు. దీన్ని స‌హ‌జ‌మంటారు. 
  • కొంత మందిలో పెద్ద ప్రేవులు, గుద మార్గం అన్నీ బాగుంటాయి కానీ వాటి క్రియా సామ‌ర్థ్యం మాత్రం చాలా త‌క్కువ‌గా ఉంటుంది. దీన్ని క్రియాత్మ‌కం అంటారు. 

మ‌ల‌బ‌ద్ధ‌కం వ‌ల్ల క‌లిగే న‌ష్టాలు

  • నోటి పూత‌, వికారం, వాంతులు, నాలుక తెల్ల‌గా అవ‌డం, బెర‌డుక‌ట్టిన‌ట్టు ఉండ‌టం.
  • ముఖ్యంగా క‌డుపులో గాలి చేరి పొట్ట ఉబ్బి పైకి త‌న్ని గుండె క్రింద‌, పై క‌డుపులో నొప్పి వ‌స్తూ ఉంటుంది.
  • గుదం ద‌గ్గ‌ర ప‌గులు, ఆర్శ‌మొల‌లు ఏర్ప‌డుతుంటాయి.
  • కింది భాగంలో చ‌ర్మం (skin) ముడ‌త‌లు ప‌డుతుంది.
  • చాలాకాలం బాధ‌ప‌డితే మిగిలిన ఈ మ‌లం విషంగా మారి కీళ్ళ‌నొప్పులు, కాళ్లు లాగ‌డం వంటివి వ‌స్తాయి.
  • గుండెలో మంట‌, ఎసిడిటి (acidity) , త్రేన్పులు వ‌స్తాయి.
  • నిద్ర‌ప‌ట్ట‌క‌పోవ‌డం, ఆదుర్ధా, మాన‌సిక గ్లాని, చ‌ర్మం స‌హ‌జ కాంతిని కోల్పోవ‌డం జ‌రుగుతుంది.

మ‌లబ‌ద్ధ‌కాన్ని నివారించే మార్గాలు

  • అనాస‌, మామిడి, సీతా ఫ‌లాలు మంచి విరేచ‌న‌కారి. మారేడు కాయ‌లు పండిన త‌ర్వాత గుజ్జు చ‌క్క‌టి స‌హ‌జ మ‌ల‌బ‌ద్ధ‌క నివారిణి.
  • క‌ర‌క్కాయ‌, ఉసిరికాయ‌, తానికాయ క‌లిసిన త్రిఫ‌లా చూర్ణం రోజూ రెండు చెమ్చాలు రాత్రి ప‌డుకునే ముందు వేడి నీళ్ల‌తో తీసుకుంటే సుఖ విరేచ‌న‌మ‌వుతుంది.
  • బాగా మ‌గ్గిన అర‌టిపండును తొక్క‌తో క‌లిపి తీసుకుంటే ఎటువంటి మ‌ల‌బ‌ద్ధ‌క‌మైనా త‌గ్గుతుంది.
  • ఒక స్పూన్ క‌రివేపాకు పొడితో, తేనె క‌లిపి తీసుకున్నా మ‌ల‌బ‌ద్ధ‌కం పోతుంది.
  • ఒక చెమ్చా ఆముదాన్ని వేడిచేసి రాత్రిపూట తీసుకుంటే ఎలాంటి Malabaddakam మైనా త‌గ్గిపోతుంది. కొంద‌ర‌న్న‌ట్టు ఇది ఏ విధ‌మైన చెడును క‌లుగ చేయ‌దు.
  • మ‌ల‌బ‌ద్ధ‌కాన్నికి మ‌రో మందు స్పినాక్ ప‌చ్చిర‌సం. 
  • రాత్రి ప‌డుకునే ముందు నిల్వ ఉంచిన రాగిచెంబులో నీళ్ళు త్రాగి, ఉద‌యాన్నే మ‌ళ్లీ త్రాగితే మంచిది.
  • జామ‌, బొప్పాయి వంటి ప‌ళ్ళు పీచు ప‌దార్థాన్ని క‌లిగి ఉండ‌టం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ధ‌కాన్ని త‌గ్గిస్తాయి.
  • ఎండుద్రాక్ష‌ను రాత్రి నీటిలో నాన‌బెట్టి పొద్ద‌టే ప‌ర‌గ‌డుపున గింజ‌లు తీసేసి, ఆ నీటితో స‌హా తీసుకోవాలి. 
  • నువ్వులు, బెల్లం క‌లిపిన చిమ్మిలిని నిమ్మ‌కాయంత సైజులో ప్ర‌తిరోజూ రాత్రి ప‌రుండేముందు ఒక వారం తింటే మ‌ల‌బ‌ద్ధ‌కం (Malabaddakam) పూర్తిగా త‌గ్గిపోతుంది.

Post a Comment

0 Comments