Ticker

6/recent/ticker-posts

happy health: ఆరోగ్యం అంటే అందం, అందం అంటే ఆరోగ్యం గురించి తెలుసుకోండి!

happy health: విష‌యం ఏమిటంటే మీ మ‌నుసుకు, మీ ఆలోచ‌న‌ల‌కు క‌ళ్ళాలు వేయ‌క‌పోతే మీ ఆరోగ్యం దెబ్బ‌ తింటుంద‌ని తెలుసుకోండి. అంతే కాదండోయ్ మీ ముఖ అందం సైతం చిన్న‌బోతుంది. ఆరోగ్యానికి, అందానికి ఉన్న సంబంధం అలాంటిది మ‌రి. ఆలోచ‌న‌లు ప‌రుగులు తీసి ఆందోళ‌న స్థాయికి చేరితే మీ ముఖం (face) లో ఆందోళ‌న ఛాయ‌లు మ‌ర‌క‌లు క‌ట్టి మ‌రీ క‌నిపిస్తాయి. దీనివ‌ల్ల మీ అందం (beauty) చిన్న‌బోతుంది. 

image show happy health

happy health: చాలా వ‌ర‌కు వ్యాధుల‌కు మాన‌సిక స్థితే కార‌ణం!

మీ అంద‌మైన ముఖం వాడిపోయిందంటే అందుకు కార‌ణం అనారోగ్య‌మే కావ‌చ్చు. కానీ అనా రోగ్యానికి కార‌ణం శారీర‌క‌మైన‌దే కాన‌వ‌స‌రం లేదు. మాన‌సిక‌మైన‌ది కూడా కావ‌చ్చు. నిజానికి చాలా వ‌ర‌కు వ్యాధులకు కార‌ణం మాన‌సిక స్థితే. అంతేకాదండోయ్‌..మాన‌సిక ఒత్తిడి (Mental stress) వ‌ల్ల వ‌చ్చే వ్యాధుల వ‌ల్ల ఆరోగ్యం (health) తో పాటు అందం కూడా హ‌రించుకుపోతుంది. అయితే అం దాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌డం అసాధ్యం మాత్రం కాదు.

ముందుగా మీ ఆలోచ‌న‌లను ఈ రోజుకే ప‌రిమితం చేసుకోండి. రేప‌టి గురించి ఆలోచించి ఆందోళ‌ న‌కు గురికాకండి. ఈ రోజు ప‌నుల్ని ఈ రోజే స‌క్ర‌మంగా పూర్తి చేసుకోగ‌ల్గితే రేపు మీ ప్ర‌మేయం లేకుండానే స‌జావుగా సాగిపోతుంది. ఇలా ఏ రోజుకా రోజు ప‌నులు, ల‌క్ష్యాల‌ను నిర్థేశించుకోవ‌డం వ‌ల్ల అనేక ర‌కాల భ‌యాలు మ‌న ద‌రి చేర‌డానికి భ‌య‌ప‌డ‌తాయి. నిజానికి మ‌నం చాలా సంద‌ ర్భాల్లో ఏమీ జ‌ర‌గ‌ని రేపు ఏదో జ‌రిగిపోతుంద‌ని ఊహించుకుని భ‌యంతో కూరుకుపోతాం. రేప‌టి భ‌యం గురించి ఈ రోజే భ‌య‌ప‌డ‌టంలో అర్థం లేదు.

ఈ ఆరోగ్య నియ‌మాల‌ను పాటించండి!

  1. అదే విధంగా మీ మ‌నుసును అదుపులో ఉంచుకోండి. మ‌నుసును, మీ ఆలోచ‌నల‌ను బ‌య‌టి ప్ర‌పంచం ప్ర‌భావితం చేయ‌కుండా చూసుకోవాలి. 
  2. మ‌నుసును ధ్యానం (meditation) లో నిల‌ప‌డం అల‌వ‌ర్చుకుంటే మీకు మ‌రింత ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది. 
  3. ఊరికే ఉరుకులు ప‌రుగులు తీయ‌డం వ‌ల్ల ప్ర‌శాంత‌త చెద‌ర‌డం మిన‌హా నిర్మాణాత్మ‌క ప్ర‌యోజ‌నం యేదీ సాధించ‌లేమ‌నే విష‌యాన్ని గుర్తుంచుకోండి. 
  4. మ‌న‌సు ప‌డే ఆందోళ‌న ముఖం మీద కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. కాబ‌ట్టి మ‌నుసును ఎంత ప్ర‌శాంతంగా ఉంచుకుంటే మీ ముఖం అంత బాగా ఉంటుంది. 
  5. మీ క‌ళ్ళ‌కో మెరుపు, మీ బుగ్గ‌ల‌లో సొగ‌సు, మీ త‌ల క‌ట్టుకోతీరు, కాస్మోటిక్స్‌ (cosmetics) తో సంపాదించ‌వ్చు. అయితే అందులో స‌హ‌జ‌త్వం ఉండ‌దు స‌రిక‌దా, ఆ మెరుపు, త‌ళుకులు చాలా తాత్కాలికం మాత్ర‌మే.
  6. స‌హ‌జంగా, శాశ్వ‌త అందాన్ని సాధించాలంటే మాత్రం ఆనందంగా (happy health) జీవించ‌డం ఒక్క‌టే చ‌క్క‌ని మార్గం.  

Post a Comment

0 Comments