Ticker

6/recent/ticker-posts

fitness tips weight loss: బ‌రువు త‌గ్గి స‌న్న‌జాజితీగ‌లా క‌నిపించాలంటే ఏం చేయాలి?

fitness tips weight loss: బ‌రువు త‌గ్గాల‌ని ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా నా వ‌ల్ల కావ‌డం లేద‌ని చాలా మంది అంటుంటారు.అవ‌గాహ‌న లేకుండా పాటించే నియ‌మాలు, వ్యాయామం విష‌యంలో స‌రైన ప్ర‌ణాళిక లేక‌పోవ‌డం లాంటివి బ‌రువు త‌గ్గ‌కుండా అడ్డుకొనే అస‌లైన కార‌ణాలు. కానీ ఆ లోపాల్ని స‌రిదిద్దుకోవ‌చ్చు.
image show fitness tips weight loss

fitness tips weight loss: బ‌రువు త‌గ్గేందుకు పాటించాల్సిన టిప్స్‌!

స‌న్న‌గా మారాల‌నే ఆలోచ‌న‌తో వేపుళ్ళ‌కు దూరంగానే ఉంటారు కొంద‌రు. కానీ వాటికి బ‌దులుగా ఇత‌ర ప‌దార్థాల‌ను తిన‌డం వ‌ల్ల తెలియ‌కుండానే ఎక్కువ కెలొరీలు మ‌న శ‌రీరంలో చేర‌తాయి. దీని ఫ‌లితంగా అధిక బ‌రువు, డైటింగ్ (dieting) నియ‌మాల్లో ఒక పూట భోజ‌నం మానేయాల‌ నుకుంటాం. కానీ ఒక పూట మానేడం వ‌ల్ల రెండో పూట తెలియ‌కుండానే ఎక్కువ మోతాదులో తింటాము.

అధ్యాయ‌నాలు కూడా ఇదే వాస్త‌వాన్ని చెబుతున్నాయి. కావున రోజులో రెండు కాదు మూడు పూట‌లా ఆహారాన్ని కొద్ది కొద్దిగా తినాలి. అన్నం వ‌ల్ల కెలోరీలు ఎక్కువ‌గా చేర‌తాయ‌నుకుంటే, ప్ర‌త్యామ్నంగా తృణ‌ధాన్యాల రొట్టెల్ని తిన‌వ‌చ్చు. అయితే వాటిని కూడా 1 లేదా 2 మాత్ర‌మే ప‌రిమితం చేయ‌ కుండా, అన్నం మోతాదులో తినాలి. పండ్లు, కూర‌గాయ ముక్క‌ల‌కూ ఇదే నియ‌మం వ‌ర్తిస్తుంది.

ఒక అర‌గంట వ్యాయామం (exercise) ప్ర‌తిరోజూ త‌ప్ప‌నిస‌ర‌ని తెలిసినా చాలా మంది తేలిగ్గా తీసుకుంటారు. కాసేపు చేసి విశ్రాంతి పొందుతారు. కానీ వేగంగా, శ‌రీరానికి శ్ర‌మ అందేలా వ్యాయామాన్ని చేయాలి.ఇలా ఎప్పుడూ ఒకే త‌ర‌మా వ్యాయ‌మాలు చేయ‌డం విసుగ‌నిపించి తెలియ‌కుండా బ‌ద్ధ‌కిస్తాము. కాబ‌ట్టి అప్పుడ‌ప్పుడు వ్యాయ‌మాల్ని మార్చి మార్చి చేయాలి. వారంలో క‌నీసం 3-4 రోజులు క‌ఠోర సాధ‌న త‌ప్ప‌నిస‌రిగా చేయాలి.

ద్ర‌వ‌ప‌దార్థాలు తీసుకుంటున్నారా?

ద్ర‌వ‌ప‌దార్థాలు ఎక్కువ‌గా తీసుకుంటే బ‌రువు త‌గ్గ‌డం (fitness tips weight loss) చాలా సుల‌వ‌నుకునే భ్ర‌మ‌లో కొంద‌రు ఉంటారు. ఆ ఆలోచ‌న‌తోనే ఆహారం మానేసి కాఫీ, టీ లేదా తియ్య‌ని జ్యూస్‌ (sweet juice) లు ఎక్కువ‌గా తాగుతుంటారు. కానీ తీసుకునే ఆహారం క‌న్నా కొన్నిసార్లు వీటి వ‌ల్ల వ‌చ్చే కెలోరీలే ఎక్కువ‌గా ఉంటాయి. అలాంటివి సాధ్య‌మైనంత వ‌ర‌కు ప‌రిమితం చేయాలి. స‌హ‌జ సిద్ధంగా మ‌న ఇంట్లో త‌యారు చేసుకునే పండ్లు, కూర‌గాయ‌ల ర‌సాల‌కు ప్రాధాన్య‌త ఇవ్వాలి. 

ప‌లు కార‌ణాల వ‌ల్ల ఎదుర‌య్యే ఒత్తిడి కూడా బ‌రువును పెంచుతుంది. దీంతో అధిక ఒత్తిడికి గురైన‌ప్పుడు శ‌రీరంలో కార్టిసాల్ అనే హార్మోను విడుద‌ల‌వుతుంది. అది శ‌రీరంలో కొవ్వు చేరేందుకు దోహ‌ద‌ప‌డుతుంది. కొన్నిసార్లు ఒత్తిడికి గురైన‌ప్పుడు తెలియ‌కుండా ఆహారాన్ని తీసుకుంటాం. కావున ఒత్తిడి ల‌క్ష‌ణాలు క‌నిపించిన‌ప్పుడే దాన్ని త‌గ్గించుకునేందుకు ప్ర‌య‌త్నిం చాలి. ధ్యానం, యోగా వంటివి ఒత్తిడిని నివారించే ప్ర‌త్యామ్నాయాలు.

నిద్ర‌పోవ‌డం అల‌వాటుగా మార్చుకోవాలి!

బ‌రువు పెర‌గ‌డానికి ప్ర‌ధాన కార‌ణాల్లో నిద్ర‌లేమి (sleep less) ఒక‌టి. చాలా మంది దీన్ని తేలిగ్గా తీసుకుంటారు కానీ, నిద్ర‌లేక పోవ‌డం వ‌ల్ల అల‌స‌ట‌గా అనిపిస్తుంది. దాన్ని ప్ర‌భావం దిన‌చ‌ర్య‌పై ప‌డుతుంది. ప్ర‌తి ప‌నిని వాయిదా వేయాల్సి వ‌స్తుంది. ఆహార నియ‌మాల‌న్నీ మారిపోతాయి. కావున ఎన్ని ప‌నులున్నా ప్రణాళిక ప్ర‌కారం పూర్తి చేసుకుంటూ వేళ‌కు నిద్ర పోయేలా దాన్ని అలవాటుగా మార్చుకోవాలి.

చాలా మంది ఆరోగ్య ర‌హ‌స్యాల‌లో నిమ్మ‌ర‌సం, తేనె క‌లిపిన గోరు వెచ్చ‌ని నీరు తాగ‌డం ఒక‌టి. ఆ నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో పేరుకున్న మ‌లినాలు బ‌య‌ట‌కు వ‌చ్చేస్తాయి. అవి తొలిగితే కొవ్వు స‌మ‌స్య కూడా అదుపులో ఉంటుంది. ప‌ర‌గ‌డుపున నిమ్మ‌ర‌సం, తేనె క‌లిపి నీరు తీసుకోవ‌డం ఒక అల‌వాటుగా మార్చుకోవాలి. ప్ర‌తిరోజూ క‌నీసం 8 గ్లాసుల మంచినీటిని త‌ప్ప‌కుండా తాగాలి.

పైన చెప్పిన నియ‌మాలు, సూచ‌న‌లు పాటిస్తే క‌చ్చితంగా fitness tips weight loss అయ్యే అవ‌కాశం త‌ప్ప‌కుండా వుంటుంది. ఈ నియ‌మాల‌ను అలవాటు చేసుకొని పాటించాల్సిన అవ‌స‌రం ఉంది.

Post a Comment

0 Comments