Ticker

6/recent/ticker-posts

Vantinti Chitkalu : నేచ‌ర‌ల్ ఇంటిలో చేసుకునే ముఖ్య‌మైన‌ చిట్కాలు

Vantinti Chitkalu: ఇంటిలో ఆరోగ్యం బాగుండేందుకు కొన్ని చిట్కాలను ఇంటిలోనే యారు చేసుకొని ఉపయోగించచ్చు. మీరు కూడా ఇక్క క్రింద తెలిపిన కొన్ని ముఖ్యమైన చిట్కాలను గురించి తెలుసుకోండి

image show Vantinti Chitkalu

Vantinti Chitkalu : కొన్ని ముఖ్యమైన చిట్కాలు తెలుసుకుందాం

1.గేదె పాలను చిలికి తీసిన వెన్నను ముఖంపైన ఉండే మంగు మచ్చలపై రోజూ రుద్దుతుంటే మచ్చలు తగ్గుతాయి.

2.పచ్చి పసుపు, ఎర్రచందనం సమభాగాలుగా కలిపి గేదె పాలల్లో నూరి రాస్తుంటే మంగు మచ్చలు తగ్గి చెంపలపైన ఉన్న నల్లని మచ్చలూ తగ్గుతాయి.

3.జాజికాయను మేక పాలలో అరగదీసి రాయడం వల్ల మంచి గుణం కనిపిస్తుంది.

4.పాలల్లో ఎర్రకందిపప్పు నూరి నేతిలో కలిపి మంగు మచ్చలపై రాస్తుంటే కొద్ది రోజుల్లోనే నలుపు దనం పోతుంది.

5.పావు టీ స్పూన్నిమ్మరసానికి సమంగా తేనె కలిపి మచ్చలపై బాగా రుద్ది 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా నెల రోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

6.టొమాటోల గుజ్జుతో మచ్చలపై బాగా రుద్ది 20 నిమిషాల తర్వాత చల్లని నీటిలో కడగాలి. వ్యంగ మచ్చలు తగ్గి శరీర కాంతి కూడా వస్తుంది.

7.కలబంద గుజ్జును తీసి మచ్చలపై పూయాలి. మచ్చలపై తడి ఆరిపోయాక చల్లని నీటితో శుభరం చేసుకోవాలి. దీని వల్ల మచ్చలు తగ్గిపోతాయి. దీంతో పాటు ముఖంపైన ఉండే మొటిమల మంట, వాపు తగ్గుతుంది.

8.1 టీ స్పూన్టొమాటో రసం, 1 టీ స్పూన్గంధం పొడి కలిపి, 2 టీ స్పూన్ల ముల్తాని మట్టి కలిపి మెత్తని పేస్టులా చేసి మచ్చలపై పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

9. రోజ్వాటర్‌, కీరా దోస రసం, నిమ్మరసం, తేనె సమంగా కలిపి మచ్చలపై రుద్ది 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడుగుతుంటే నెలలో చక్కని మార్పు వస్తుంది.

10.Vantinti Chitkalu ఆలుగడ్డపై ఉన్న పొరను తొలగించి సన్నగా తురిమి పల్చని గుడ్డలో పిండి రసం తీయాలి. దానిలో దూది నానబెట్టి మచ్చలపై పూసి 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడుక్కుంటే మచ్చలు తొలిగిపోతాయి

Post a Comment

0 Comments