Asthma Remedies : ఉబ్బసం అనేది శ్వాసకోశ వ్యాధి. ఇది ముందుగా స్వల్పంగా ఇబ్బందులకు గురి చేస్తుంది. పట్టించుకోకపోతే తీవ్ర ఇబ్బందులను కలగజేస్తుంది. ఓ దశలో ప్రాణాంతకం కూడా కావచ్చు. అలా జరిగితే వాయుమార్గం మూసివేయబడుతుంది. దీంతో శరీరానికి శ్వాస అందదు. ఫలితంగా ప్రాణాల మీదకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
ఇక ఆస్తమా అనేది ఏ
వయస్సులో ఉన్న
వారికి అయినా
రావచ్చు.
ఇందుకు అనేక
కారణాలు
ఉంటాయి. ఆస్తమా ఉన్నవారు
వైద్యులు ఇచ్చిన
విధంగా మందులను వాడడంతోపాటు
కింద తెలిపిన
చిట్కాలను
పాటించాలి. దీని
వల్ల
ఆస్తమా
లక్షణాలు, ఇతర సమస్యల నుంచి
బయట పడవచ్చు. మరి ఆ చిట్కాలు
ఏమిటంటే..
Asthma Remedies : ఆయాసం పోవాలంటే ఏం చేయాలి?
1. పసుపులో కర్క్యుమిన్ అనబడే సమ్మేళనం ఉంటుంది.
ఇది ఉబ్బసం నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.
అందుకుగాను రోజూ
రాత్రి పూట
ఒక గ్లాస్
గోరు వెచ్చని పాలలో
కొద్దిగా పసుపును కలుపుకుని తాగాలి.
దీంతో ఆస్తమా లక్షణాల నుంచి ఉపశమనం
పొందవచ్చు.
2. ఫ్లేవనాయిడ్స్,
విటమిన్
సి, డి,
యాంటీ ఆక్సిడెంట్లు
ఉండే ఆహారాలను తీసుకోవడం
వల్ల
కూడా ఆస్తమా నుంచి ఉపశమనం
లభిస్తుంది. ఇవి
యాంటీ ఇన్ఫ్లామేటరీ
ఏజెంట్లలా
పనిచేస్తాయి.
అందు వల్ల
ఉబ్బసం
నుంచి ఉపశమనం
లభిస్తుంది.
నారింజ, నిమ్మ,
కివీ, బంగాళాదుంపలు, పాలు, చేపలు, గుడ్లు, లివర్,
జున్ను, తృణ
ధాన్యాలు, సిట్రస్ ఆహారాలను
తీసుకోవడం
వల్ల
ఆస్తమా
నుంచి ఉపశమనం Asthma Remedies కలుగుతుంది.
3. కెఫీన్ ఎక్కువగా ఉండే కాఫీ,
టీ, గ్రీన్
వంటి పానీయాలను తీసుకోవడం
వల్ల
శ్వాస కండరాలపై ఒత్తిడి
తగ్గుతుంది.
దీంతో వాయు
మార్గాల పనితీరు మెరుగు
పడుతుంది.
అయితే కెఫీన్
ను అధిక
మోతాదులో తీసుకుంటే
శరీరంపై
దుష్ప్రభావాలను కలగజేస్తుంది. కనుక రోజుకు తగిన మోతా దులో
మాత్రమే
కాఫీ, టీలను తాగాలి. దీంతో
ఆస్తమా
నుంచి ఉపశమనం
పొందవచ్చు.
4. Asthma ను
తగ్గించేందుకు
అల్లం కూడా
పనికొస్తుంది.
ఇది శ్లేష్మాన్ని
తొలగిస్తుంది.
వాయు మార్గాలను వెడల్పు
చేస్తుంది. దీంతో
శ్వాస సరిగ్గా ఆడుతుంది.
ఆస్తమా
తగ్గుతుంది.
రోజూ ఉదయాన్నే అల్లం రసం సేవించాలి. లేదా
భోజనంలో
అల్లం తీసుకోవచ్చు. అల్లం
డికాషన్
కూడా తాగవచ్చు.
5. Eucalyptus ఆస్తమాను
తగ్గించడంలో
సహాయం
చేస్తుంది. దీర్ఘకాలిక మంటను తొలగిస్తుంది.
వాయు మార్గంలో
వాపులు తగ్గుతాయి. నాసికా
మార్గాల్లో ఉండే
శ్లేష్మం తొలగించబడుతుంది. ఒక
ఖర్చీఫ్
మీద కొద్దిగా
యూకలిప్టస్ ఆయిల్ వేసి
దాన్ని నిద్రించేటప్పుడు ముక్కుకు
దగ్గరగా పెట్టుకోవాలి.
లేదా మరుగుతున్న నీటిలో యూకలిప్టస్ ఆయిల్ చుక్కలను వేసి ఆ నీటి నుంచి వచ్చే ఆవిరిని బాగా పీల్చాలి. దీని వల్ల కూడా వాయుమార్గాలు నయం అవుతాయి. ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది.

0 Comments