Ticker

6/recent/ticker-posts

b12 vitamin : విటమిన్‌ బి12 లోపం వ‌ల్ల వ‌చ్చే స‌మ‌స్య‌లు

b12 vitamin: ఇది మన శరీరంలో ఎర్ర రక్త కణాల వృద్ధికి అవసరం. నాడీ మండల వ్యవస్థ సరిగ్గా పనిచేయాలన్నా ఈ విటమిన్‌ అవసరం అవుతుంది. 

image show b 12 vitamin

అయితే ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా అనేక మందిలో విటమిన్‌ బి12 లోపం సమస్య ఏర్పడుతోంది. విటమిన్‌ బి12 లోపాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే అది మన శరీరానికి ముప్పును కలిగిస్తుంది. దీని వల్ల నీరసం, అలసట, మలబద్దకం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

b12 vitamin : శాకాహారం తినేవారిలోనే లోపం ఎక్కువ‌

సాధారణంగా మాంసాహారం తినే వారికన్నా శాకాహారం తినేవారిలోనే ఎక్కువగా విటమిన్‌ బి12 లోపం ఏర్పడుతుంది. ఎందుకంటే మాంసంలో విటమిన్‌ బి12 ఉంటుంది. కనుక మాంసాహారం తినేవారిలో ఈ లోపం రాదు. శాకాహారుల్లోనే విటమిన్‌ బి12 లోపం వస్తుంది. 

అలాగే మద్యం విపరీతంగా సేవించే వారిలో, డయాబెటిస్, అసిడిటీ తదితర అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో, దీర్ఘకాలికంగా మెడిసిన్లను వాడేవారిలోనూ విటమిన్‌ బి12 లోపం కనిపిస్తుంది.

ఏ ఆహారంలో ల‌భిస్తుంది?

విటమిన్‌ బి12 లోపం వల్ల నీరసం, అలసట, మలబద్దకం సమస్యలు వస్తాయి. చేతులు, కాళ్లలో తిమ్మిర్లు వస్తుంటాయి. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. దీని వల్ల జీర్ణాశయ, మూత్రాశయ సమస్యలు వస్తాయి. కనుక ఈ లక్షణాలు, సమస్యలు ఉన్నవారు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యున్ని కలిసి పరీక్షలు చేయించుకుని ఆ మేర చికిత్స తీసుకోవాలి. 

b12 vitamin ట్యాబ్లెట్లను డాక్టర్‌ సూచన మేరకు నిత్యం వాడాలి. ఇక మటన్‌, చికెన్‌, చేపలు తదితర ఆహారాల్లో విటమిన్‌ బి12 లభిస్తుంది. వీటిని తరచూ తీసుకోవడం ద్వారా ఈ విటమిన్‌ లోపం తలెత్తకుండా చూసుకోవచ్చు. 

ఇక శాకాహారులు పాలు, బాదంపప్పు, చీజ్‌ వంటి పదార్థాలను తినడం ద్వారా విటమిన్‌ బి12 పెరుగు తుంది. వీలైనంత వరకు మద్యం తాగడం మానేయాలి. పొగ అస్సలు తాగకూడదు. ఈ సూచనలు పాటించడం వల్ల b12 vitamin లోపం రాకుండా చూసుకోవచ్చు. 

Post a Comment

0 Comments