Ticker

6/recent/ticker-posts

Muskmelon Benefits: ఖ‌ర్భూజా పండు తిన‌డం వ‌ల్ల లాభాలు ఏమిటి? | Kharbuja Pandu

Muskmelon Benefits: ఖ‌ర్భూజా పండు (Kharbuja Pandu) ఆరోగ్యానిచ్చే అద్భుత వ‌న‌రుల ఖ‌జానా. దీనిలో పోష‌కాలు ఎక్కువ‌గా ఉన్నాయి. దీనిని పండ్ల‌కు రాజాధిరాజుగా చెబుతుంటారు. వేస‌వి కాలం మ‌న‌కు విరివిగి దొరుకుతుంది. వీటిలో ఉండే అధిక‌శాతం నీరు వాటిని చ‌ల్ల‌ద‌నాన్ని ఇచ్చేవిగా, తినేవారి శ‌రీరంలో నీటి శాతాన్ని నింపేవిగా ఉంచుతుంది. 
image show Muskmelon Benefits

Muskmelon Benefits: విట‌మిన్ల ఘ‌ని ఖ‌ర్భూజా

ఇది చ‌క్క‌టి సువాస‌న‌ను క‌లిగి ఉండ‌ట‌మే కాక ఎంతో రుచిగా కూడా ఉంటుంది. వీటి విత్త‌నాలు కూడా మ‌న‌కు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఒక ఖ‌ర్భూజా ముక్క‌లో 53 క్యాల‌రీల శ‌క్తి, 12 గ్రాముల పిండి ప‌దార్థాలు, ఒక గ్రాము మాంస‌కృత్తులు, ఒక గ్రాము పీచు, 23 మిల్లీ గ్రాముల సోడియం, 5,276 లు విట‌మిన్ ఏ, ఒక మిల్లీగ్రాము కంటే త‌క్కువ విట‌మిన్ బి6, 57 మిల్లీ గ్రాముల సి విట‌మిన్‌, 14 మిల్లీ గ్రాముల క్యాల్షియం, 19 మిల్లీ గ్రాముల మెగ్నీషియం, 417 మిల్లీగ్రాముల పొటాషియం, 3,219 మైక్రోగ్రాముల కెరోటినాయిడ్స్ ఇంకా నియాసిన్ ఉంటాయి. 

ఖ‌ర్భూజా రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేస్తుంది. ఖ‌ర్భూజా పండులో విట‌మిన్ సి (Vitamin c) పుష్క‌లంగా ఉంది. దానివ‌ల్ల మ‌న శ‌రీరంలో తెల్ల ర‌క్త‌క‌ణాలు ఉత్తేజిత‌మైన రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ మెరుగుప‌డుతుంది. తెల్ల ర‌క్త క‌ణాలు మ‌న శ‌రీరంలో స‌హ‌జ సిద్ధంగా ఉండే ర‌క్షక వ్య‌వ‌స్థ‌. ఇవి మ‌న శ‌రీరంలోకి బ‌య‌టి క‌ణ‌జాలాలు ప్ర‌వేశించ‌కుండా వాటిపై దాడి చేస్తాయి.

అలాగే మ‌న శ‌రీరంపై దాడి చేసే అంటు వ్యాధుల‌ను ఎదుర్కొని బ‌య‌ట‌కు తోసి వేస్తాయి. శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంటు (antioxidant) విట‌మిన్ సి మ‌న శ‌రీరంలో ఉన్న ఫ్రీ రాడిక‌ల్స్‌పై దాడి చేస్తేంది. ఫ్రీ రాడిక‌ల్స్ మ‌న చ‌ర్మాన్ని పాడుచేస్తాయి. ముందుగానే వ‌య‌స్సు మీద ప‌డిన‌ట్టు కూడా క‌నిపించేట‌ట్టు చేస్తాయి. అందుచేత మ‌న శ‌రీరంలో ఖ‌ర్భూజా (Muskmelon) ల‌ను తిన‌డం వ‌ల్ల వ‌య‌స్సు మీద ప‌డిన‌ట్టు క‌నిపించ‌కుండా చేసుకోవ‌చ్చు. 

మ‌ల‌బ‌ద్ధ‌కాన్ని పార‌ద్రోలుతుంది

Muskmelon Benefits: ఖ‌ర్భూజాలో పీచు ప‌దార్థాలు చాలా ఎక్కువ. వీటిని తిన‌డం వ‌ల్ల శ‌రీరంలోని వ్య‌ర్థాలు తేలిక‌గా బ‌య‌ట‌కు పంప‌బ‌డ‌తాయి. మ‌ల‌బ‌ద్ధ‌కం రాదు. ఖ‌ర్భూజాను యాంటీ ఆక్సిడెంట్ల నిధిగా కూడా చెప్ప‌వ‌చ్చు. బీటా కెరోటిన్‌, ఫోలిక్ యాసిడ్‌, పొటాషియం, ఏ, సి విట‌మిన్ల చాలా అధిక స్థాయిలో ఉంటాయి. విట‌మిన్ ఏ శ‌క్తి వంత‌మైన యాంటీ ఆక్సిడెంట్‌. మ‌న కంటి చూపుకు ఇది చాలా ముఖ్యం. ఖ‌ర్భూజాలోని యాంటీ ఆక్సిడెంట్లు చ‌ర్మానికి (skin) నునుపును, మెరుపును ఇస్తాయి. శ‌రీరంలోని మ్యూక‌స్ పొర‌ల‌ను స‌రైన స్థితిలో ఉంచుతుంది. 

Post a Comment

0 Comments