Ticker

6/recent/ticker-posts

Cooking tips: వంట గ‌దిలో పాటించాల్సిన కుకింగ్ టిప్స్ తెలుసుకోండి!

Cooking tips: వంట గదిలో అన్నం, కూర‌లతో పాటు ఇత‌ర ప‌దార్థాలు వండుకుంటాం. అప్పుడు కొన్ని కూర‌ గాయ‌లు నిల్వ వున్న స‌మ‌యంలో పాడైపోతుంటాయి. వండుకునే ఆహార ప‌దార్థాలు, ఇత‌ర వంట పాత్ర‌లు పాడ‌వ్వ‌కుండా ఉండాలంటే ఇక్క‌డ చెప్పిన వంటింటి చిట్కాలు పాటించండి. వీటి వ‌ల్ల గృహిణుల‌కు స‌మ‌యం ఆదా అవుతుంది. సులువుగా ప‌ని పూర్త‌వుతుంది. 
image show Cooking tips

Cooking tips:వంట‌గ‌ది చిట్కాలు 

1.ఫ్రిజ్‌లో కూర‌గాయ‌లు వేసే ట్రేలో చిన్న స్పాంజి (sponge) ముక్క‌ను ఉంచితే ఎక్క‌వ త‌డిని అది పీల్చి కూర‌లు బాగుంటాయి. 

2.ఐస్ క్యూబ్స్ ఎక్కువ‌గా అవ‌స‌ర‌మైతే అటువంట‌ప్పుడు పాలిథిన్ క‌వ‌ర్‌ (polythene cover)లో ఐస్ క్యూబ్స్ పెట్టి ఫ్రిజ్‌లో ఉంచండి. ట్రేలు మ‌ళ్లీ నింపుకొని ఐస్ క్యూబ్స్ మ‌ళ్ళీ ఎన్ని కావాల‌న్నా చేసుకోవ‌చ్చు.

3.ట‌మాటాలు తాజాగా ఉండాలంటే చిటికెడు ఉప్ప వేసిన నీటిలో వుంచి ఆ త‌ర్వాత వాడుకోవాలి. 

4.పిల్ల‌ల పార్టీలో ఐస్ వేసి డ్రింక్స్ ఇచ్చేట‌ప్పుడు ఐస్ ట్రేలో ప్ర‌తీ కానాలో ఓ ద్రాక్షా పండో లేదా మ‌రేదైనా పండుని వుంచి నీళ్లు పోస్తే ప్ర‌తి క్యూబ్‌తో పాటు ఒక పండు పిల్ల‌ల‌కు కూల్ డ్రింక్‌తో పాటు ల‌భిస్తుంది. 

5.మాసిన బ‌ట్ట‌లు వేసిన బుట్ట‌లో లేదా పెట్టేలో చిన్న చిన్న పురుగులు చేరి ఆ బ‌ట్ట‌ల‌ను కొట్టెయ్య‌కుండా ఉండాలంటే కొన్ని పుదీనా ఆకులున్న తీగ‌ల‌ను ఆ బ‌ట్ట‌ల‌లో ఉంచాలి. 

6.గులాబీ పూవు (rose leaf) రేకుల‌ను కానీ, ఎండినా స‌రే మొత్తం పూల‌ను కాని కొబ్బరి నూనె ఎంతో అన్ని పూలు పోసి చిన్న గిన్నెలో పెద్ద గిన్నెలో నీరు పోసి ఆ నీరు ఆవిరిలో కాచ‌వ‌లెను. స‌న్న‌కాపు చాలు. రెండు రోజులాగి వ‌డ‌పోసుకుంటే ఈ నూనె చుంట్రు పోగొడుతుంది. జుట్టు నిగ‌నిగ‌ లాడుతుంది. 

7.మెంతులు 2 రోజులు నాన‌నిచ్చి మిక్సీలో వేసి మెత్త‌గా అయిన త‌ర్వాత త‌లంతా ప‌ట్టించి 1/2 గంట‌ల‌కు త‌ల‌స్నానం చేస్తే చుండ్రు ఉండ‌దు. ఈ మెంతిపిండి తో పాటు లేత వేప చిగురు కూడా మెత్త‌గా రుబ్బి ముఖానికి వ్రాస్తే మొటిమ‌లు పోతాయి. 

8.నెయ్యి కాగేట‌ప్పుడు దింప‌బోయేట‌ప్పుడు క‌రివేపాకులు కాని, త‌మ‌ల‌పాకులు కానీ వేస్తే మురుగు వాస‌న వుండ‌దు. నెయ్యి నిల్వ ఉండాలంటే కాస్త బెల్లం (jaggery) ముక్క వేయాలి. వాస‌న లేకుండా ప్రెష్‌గా ఉంటుంది. 

9.ట‌మాటో ఊర‌గాయ వేసేట‌ప్పుడు వూట ర‌వ్వ జ‌ల్లెడ‌లో వ‌డ‌పోసుకుని కారం, ముక్క‌లూ క‌లిపి రుబ్బుకోవాలి. ఇది ఆరోగ్యానికి రుచికి కూడా మంచిది. 

10.కంద‌, చేమ త‌రిగేట‌ప్పుడు బియ్యం కుడితిలో క‌డిగితే చేతులు కూడా క‌డిగితే దుర‌ద ఉండ‌దు.

 11.కిరోసిన్ లైట్లు, స్ట‌వులు తూడ్చిన త‌ర్వాత కుడితిలో చేతులు క‌డిగితే వాస‌న పోతుంది. స‌బ్బుతో రుద్దినా వాస‌న పోదు. బియ్యం నీళ్లు (కుడితో) తో ముందు కడిగి అప్పుడు స‌బ్బుతో రుద్దాలి.

12.ఫ్రిజ్ లేని వారికి నిమ్మ‌కాయ‌లు వేస‌వికాలం నిల్వ ఉండాలంటే ఒక కుండీలో ఇసుక పోసి పాతి కాయ‌లు వుంచి నీళ్లు పోస్తూ ఉండాలి. వారం దాకా నిల్వ ఉంటాయి. 

13.బొంబాయి ర‌వ్వ నిల్వ ఉండాలంటే తీసుకురాగానే నూనె వ్రాసి వుంచాలి. గోధుమ ర‌వ్వ‌పురుగు ప‌ట్ట‌కుండా ఉండాలంటే తీసుకురాగానే చెరిగి నూనె వ్రాయాలి. 

14.త‌ల‌నొప్పి త‌గ్గాలంటే స్పూను టీ పొడి, స్పూను కాఫీ పొడి, పాలు, చ‌క్కెర వేసి కాచి త్రాగాలి. 

15.కూర‌ల్లో ఉప్పు ఎక్కువ అయితే బంగాళా దుంప‌లు చ‌క్రాల్లా కోసి కూర‌ల్లో వేస్తే ఉప్పు త‌గ్గుతుంది. లేదా క‌ట్టెలు కాల్చిన (పుల్ల‌లు) బొగ్గు ముక్క‌ల‌ను శుభ్రంగా క‌డిగి కూర‌ల్లో వేసి పావుగంట‌లో తీసేయ్యాలి. అప్పుడు ఉప్పు త‌గ్గుతుంది. 

16. గోంగూర ఉడ‌క‌బెట్టిన నీళ్ల‌ను పార‌బోయకుండా ఆ నీళ్ల‌తో వెండి, ఇత్త‌డి సామాన్లు తోమితే త‌ళ‌త‌ళ మెరుస్తాయి.

17.క‌రివేపాకు (curry leaves tips) నిల్వ ఉండాలంటే ఒక సీసాలో వేసి మూత‌పెడితే నిల్వ ఉంటుంది. 

18.ఏదైనా పాత్ర‌లో వంట ప్రారంభించేట‌ప్పుడు దానిలోప‌ల కొంచెం నూనె మెరుగు రాస్తే త‌ర్వాత తోముకోవ‌డం సుల‌భం, వంటే వంట గిన్నెకు అంటుకు పోదు. 

19.ప‌ప్పులూ, స‌న్న ర‌వ్వా మొద‌లైన‌వి ముక్కిపోకుండా ఉండాలంటే ఒక్క వైపు వేయించి డ‌బ్బాలో పోసుకోవాలి. 

20.ఎక్కువ బియ్యం కొని పెట్టుకునే వారు బియ్యం తుట్ట‌లు క‌ట్టేయ‌కుండా వేపాకు, ప‌సుపు కొమ్ములు చిత‌క్కొట్టి బియ్యంలో ప‌డేస్తే చాలు బియ్యం బాగుంటాయి. 

21.ఆవిరిమీద వండితే లోప‌ల గిన్న, నీళ్ల గిన్న కూడా న‌ల్ల‌ప‌డ‌తాయి. అలా కాకుండా ఉండాలంటే పై గిన్నె నీళ్ల‌లో గిన్నె నీళ్ల‌లో పిస‌రు చింత‌పండు వేస్తే గిన్నెలు రంగుమార‌వు. 

Cooking tips: మెంతి కూర‌ను నిల్వ చేయాలంటే తాజా మెంతి కూర‌ను తీసుకుని ఆకుల్ని, కాడ‌ల్ని వేరు చేయాలి. వీటిని ఒక పేప‌రు మీద ఆర‌బెట్టాలి. బాగా ఎండిపోయేలా ఆర‌నివ్వాలి. అలా చేయ‌డం వ‌ల్ల మెంతి కూర‌ను నిల్వ ఉంచుకోవ‌చ్చు. అయితే, ఈ ఆకుకూర‌ను ఆర‌బెట్టేట‌ప్పుడు ఎండ‌లో కాక నీడ‌లో ఆర‌నివ్వాలి. ఎండ‌లో పెడితే వాటి రంగు, రుచి, వాస‌న త‌గ్గిపోతాయి. 

వంట పాత్ర‌లు శుభ్ర‌ప‌రిచే టిప్స్‌

1.కాప‌ర్ బాట‌మ్ స్టెయిన్‌లెస్ స్టీలు పాత్ర‌ల మీద మ‌ర‌క‌లు ప‌డితే నిమ్మ‌ర‌సంలో కొద్దిగా ఉప్పు క‌లిపి తోమితే మెరుపులీనుతుంటాయి.

2.యాపిల్‌ను రెండు కోసిన పిమ్మ‌ట‌, దాని మీద రెండు చుక్క‌ల నిమ్మ‌ర‌సం వేస్తే రంగు మార‌దు. 

3.ర‌సం పిండిన నిమ్మ చెక్క‌తో క‌త్తులు, క‌త్తిపీట‌లు తుడిస్తే ఉల్లిపాయ వాస‌న పోతుంది. 

4.నిమ్మ‌ర‌సంలో రెండు స్పూన్ల ఉప్పు వేసి దుస్తుల మీద ప‌డిన టీ, కాఫీ మ‌ర‌క‌ల మీద ర‌బ్ చేసి ఉతికితే స‌రి.

5.గంజిలో కొద్దిగా ఉప్పు క‌లిపి తెల్ల‌ని దుస్తుల‌ను ఉతికితే మ‌రింత తెలుపును సంత‌రించుకుంటాయి.

6.డోర్ క‌ర్టెన్ పైన ఫారాఫిన్‌తో రుద్దితే రింగ్స్ ఫ్రీగా మూవ్ అవుతాయి.

7.కాఫీ పొడి వాస‌న పోకుండా ఉండాలంటే మూత గ‌ట్టిగా ఉన్న కంటైన‌ర్‌లో ఉంచి ఫ్రిజ్‌లో పెట్టాలి.

8.వెండి పాత్ర‌ల‌లో క‌ర్పూరం బిళ్ల వేసి ఉంచితే ఎంత‌కాల‌మైనా (Cooking tips) న‌ల్ల‌బ‌డ‌వు. 

Post a Comment

0 Comments