Ticker

6/recent/ticker-posts

kitchen tips in telugu: వంట‌లో పాటించాల్సిన చిట్కాలు

kitchen tips in telugu: వంటింటి, కిచెన్ చిట్కాలు, సులువైన మార్గాలు, ప‌ద్ధ‌తుల‌ను ఇక్క‌డ గృహిణు లు తెలుసుకోవ‌చ్చు. వంటింట్లో మ‌నం చేస్తున్న ప‌నుల‌ను సులువుగా  చేసుకునే వీలు ఉంటుంది. స‌మ‌యం కూడా ఆదా అవుతుంది. ఇక్క‌డ వున్న కిచెన్ చిట్కాల‌ను ప‌రిశీలించి మీకు నచ్చితే ఇత‌రుల‌కు తెలియ‌జేయండి.
image show kitchen tips in telugu

 kitchen tips in telugu: వంట‌లో చిట్కాలు

1.కాయ‌గూర‌లు ఎప్పుడూ ఎక్కువ స‌న్న‌గా, నాజుగ్గా త‌ర‌గ‌కూడ‌దు. అందువ‌ల్ల పోష‌కాంశాలు న‌శించే ప్ర‌మాదం ఉంది. అలాగే ఎక్కువ నీటిలో ఏ కూర‌ల‌నూ ఉడికించ‌వ‌ద్దు. అందువ‌ల్ల ఎన్నో విట‌మిన్లు న‌ష్ట‌పోకుండా జాగ్ర‌త్తప‌డ‌వ‌చ్చు.

2.
వండిన కూర‌ల‌పై కొంచెం నిమ్మ‌ర‌సం వేస్తుంటే నీటిలో క‌రిగే పోష‌కాంశాలు న‌శించి పోవు. అంతే కాకుండా, ఆయా కూర‌ల యొక్క స‌హ‌జ‌మైన రంగు, రుచి, వాస‌న‌లు అలాగే ఉంటాయి కూడా!

3.
ఏ కూర‌లు, ఎప్పుడూ రాగిపాత్ర‌ల‌లో వండ‌రాదు. అన్ని కూర‌లు ఉడికించ‌డానికి స్టీలు పాత్ర‌లే అత్యుత్త‌మం.

4.
దొండ‌కాయ‌లు,కందిప‌ప్పు వంటివి ఉడ‌క‌డానికి కొంచెం ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంది. అప్పుడు కొంచెం, అంటే చిటికెడు వంట సోడా వేసి ఉడికిస్తే త్వ‌ర‌గా ఉడుకుతాయి.

5.
అర‌టికాయ‌లు, వంకాయ‌లు వంటి వాటిని ఎప్పుడూ నీటిలోనే త‌ర‌గాలి. అంటే ముక్క‌లుగా త‌రిగిన అనంత‌రం నీటిలోనే ఉంచాలి. లేకుంటే అవి న‌ల్ల‌గా మారిపోయే ప్ర‌మాదం ఉంది.

6.
మ‌నం అశ్ర‌ద్ధ చేసే ముల‌గ ఆకులోనూ, మెంతికూర‌లోనూ ఏ విట‌మిన్ (A Vitamin) స‌మృద్ధిగా ఉంటుంది. స‌మ‌యానికి కూర‌లు అందుబాటులో లేకుంటే పెర‌ట్లోని ముల‌గాకు పప్పులో వేసుకోవ‌చ్చు. ఆ విధంగా ముల‌గాకు నెల‌కు క‌నీసం ఒక్క‌సారైనా తినితీరాలి. 

ఇంటి చిట్కాలు (vantinti chitkalu)

1.బెండ‌కాయ కూర చేయ‌డానికి ముందు, ముక్క‌ల‌పై కాస్తంత నిమ్మ‌ర‌సం పిండితే జిగురు ఉండ‌దు.

2.
వంకాయ కూర‌లో రెండు చుక్క‌ల నిమ్మ‌ర‌సం పిండితే కూర రంగు మార‌దు. రుచిగా కూడా ఉంటుంది. (kitchen tips in telugu)

3.రాగి సామాగ్రి మీద నిమ్మ‌ర‌సం చ‌ల్లి, ఉప్పుతో రుద్దితే కొత్త‌వాటిలా మెరుస్తాయి.

4.
వంట గ‌దిలో చీమ‌లు బారులు తీరితే, అక్క‌డ కొంచెం నిమ్మ‌ర‌సం చ‌ల్లండి.

5.
ప‌చ్చ‌టి ఆకుల్లో ఉప్పు వేసి, వెండి వ‌స్తువుల‌ను తోమితే కొత్త‌గా మెరుస్తాయి.

6.
ఇత్త‌డి చెంబులు, బిందెల‌ను ముందుగా ఉప్పు నీటితో తోమి త‌ర్వాత మామూలుగా క‌డిగితే కొత్త‌వాటిలా మెరుస్తాయి.

7.
బంగారు, వెండి న‌గ‌లు వ‌న్నె త‌గ్గిపోయాయా?  విరిగిన పాల‌తో క‌డిగితే స‌రిపోతుంది.

8.
రాగి వ‌స్తువుల‌ను చింత‌పండుతో తోమి మంచి నీటితో (kitchen tips) క‌డ‌గాలి.

Post a Comment

0 Comments