Ticker

6/recent/ticker-posts

beetroot benefits for skin: అందానికి అందం, ఆరోగ్యానికి ఆరోగ్యం, బీట్‌రూట్ తింటున్నారా?

beetroot benefits for skin: బీట్‌రూట్ అంటే కొంద‌రికి అఇష్టం. ఆ పేరు విన‌గానే తిన‌డానికి నొస‌లు చిట్లిస్తారు. అదే బీట్ రూటులోకి వ‌చ్చి ఒక్క‌సారి ఆలోచిస్తే మీకే తెలుస్తుంది బీట్‌రూట్ విలువ‌. ఇది అందానికి, ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అవి తెలిస్తే బీట్‌రూట్‌ను తిన‌కుండా ఉండ‌లేరు. ఆ విశేషాలేమిటో ఇప్పుడు (beetroot benefits) చూద్ధాం!.
image show beetroot benefits for skin

beetroot benefits for skin: బ్యూటీఫుల్ కోసం బీట్‌రూట్ 

బీట్‌రూట్ తింటే మ‌న శ‌రీరం (skin) లో ర‌క్త‌హీన‌త రాకుండా ఐర‌న్ (iron) కాపాడుతుంది. దీన్ని ప్ర‌తిరోజూ తింటే రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ర‌క్త ప్ర‌స‌ర‌ణ స‌క్ర‌మంగా జ‌రిగేలా చేస్తుంది. అధిక ర‌క్త‌పోటును అడ్డుకుంటుంది. ర‌క్తాన్ని శుద్ధి ప‌ర్చ‌డంలో బీట్‌రూట్‌లో ఉండే పోష‌కాలు తోడ్ప‌డ‌తాయి. అంతే కాదండోయ్ ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఒత్తిడిని అదుపులో ఉంచి, జీర్ణ‌క్రియ‌ల‌ను వేగ‌వంతం చేస్తాయి. 

నాన‌బెట్టిన బియ్యం ఒక టేబుల్ స్పూన్, 4-5 బీట్‌రూట్ ముక్క‌ల్ని క‌లిపి మెత్త‌గా చేసుకోవాలి. దానికి తోడు చెంచా తేనె, కాసిన్ని పాలు క‌లిపి త‌ర్వాత ముఖానికి పూత‌లా రాసుకోవాలి. ఐదు నిమిషాలు ఆగిన త‌ర్వాత పాల‌తో ముఖాన్ని(face) మృదువుగా మ‌ర్ధ‌న చేయాలి. ఇలా 10 నిమిషాల పాటు చేసినంక గోరు వెచ్చ‌ని నీళ్ల‌తో క‌డిగితే ముఖం కాంతి వంతంగా క‌నిపిస్తుంది. అంతేకాకుండా గోళ్లు, జుట్టు పెర‌గ‌డంలో బీట్‌రూట్ కీల‌కంగా ప‌నిచేస్తుంది. 

చెంచా బాదం నూనె, చుక్క తేనె క‌లిపి బీట్‌రూట్ ర‌సం క‌లిపి దాన్ని పెదాల‌కు పూత‌లా వేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తుంటే న‌ల్ల‌గా మారిన పెదాలు గులాబీ రంగులో మెరిసిపోతాయి. పెద‌వుల‌పైన మృత‌క‌ణాలు తొల‌గిపోవాలంటే బీట్‌రూట్‌ను గుజ్జుగా చేసుకుని దానికి చిటికెడు పంచ‌దార క‌లిపాలి. ఆ మిశ్ర‌మాన్ని పెదాల‌పై రుద్ధాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల పెదాలు మృదువుగా తాజాగా త‌యార‌వుతాయి.

ఈ మ‌ధ్య అనేక ర‌సాయ‌నాలు క‌లిపిన రంగుల‌ను జుట్ట‌కు వేస్తున్నారు. దాని వ‌ల్ల అందం కంటే హానే ఎక్కువ‌గా జ‌రుగుతుంది. కాబ‌ట్టి బీట్‌రూట్ ర‌సాన్ని త‌ల‌పై రాసుకుని రెండు గంట‌ల పాటు వ‌దిలేస్తే స‌హ‌జ‌సిద్ధ‌మైన డై వేసుకున్న‌ట్టు ఉంటుంది. అలాగే హెన్నా క‌లుపుకునేట‌ప్పుడు గోరింటాకు మిశ్ర‌మానికి beetroot ర‌సాన్ని కొద్దిగా క‌లిపితే జుట్టుకు మంచి రంగు వ‌స్తుంది. 

బీట్‌రూట్ ఎక్కువ‌గా తింటే?

బీట్‌రూట్ దుంప‌ల్లో మంచి పౌష్టికాహారం ఉంటుంది. వీటిని ప‌చ్చిగాను, వండుకుని కూడా తినొచ్చు. అతిగా బీట్‌రూట్ తింటే మూత్రం ఎర్ర‌గా లేదా ఊదారంగులో వ‌స్తుంది. దీనివ‌ల్ల న‌ష్టం ఏమీ ఉండ‌దు. బీట్‌రూట్ ముక్క‌ల‌ను నీళ్ల‌ల్లో మ‌రిగించి, ఆ నీళ్లు (water) చ‌ల్లారాక త‌ల‌కు ప‌ట్టిస్తే చుండ్రు (dandruff) త‌గ్గుతుంది. 

ఒక‌ప్పుడు బీట్‌రూట్‌ను రంగుల త‌యారీకి ఉప‌యోగించేవారంట‌. ఇప్ప‌టికీ ఆ సాంప్ర‌దాయం ఉంద‌నుకోండి. బిటానిన్ (betanin) అనే ప‌దార్థం వ‌ల్ల బీట్‌రూట్‌కు ఆ రంగు వ‌స్తుంద‌ట‌. దీనిని మ‌నం తినే ఆహార ప‌దార్థాల్లో వాడే రంగుల‌ను త‌యారు చేయ‌డానికి ఉప‌యోగిస్తారు. మానసిక ఒత్తిడి, కుంగుబాటు తగ్గాలంటే వీటిని తినాల‌ని (beetroot benefits for skin) డాక్ట‌ర్లు సూచి స్తున్నారు. బీట్‌రూట్ ఒక్క ఎరుపే కాదండోయ్ ప‌సుపు, ప‌ర్పుల్‌, తెలుపు రంగుల్లోనూ ఉన్నాయి.

Post a Comment

0 Comments