Ticker

6/recent/ticker-posts

home remedies for warts: ఈ చిట్కాల‌తో మీరే ఇంటిలో పులిపిర్ల‌ను తొల‌గించుకోండి!

home remedies for warts: పులిపిరి కాయ‌ల‌ను వార్డ్స్ అని అంటారు. జ‌నాభాలో 10 శాతం మందికి పులిపిరులు ఉంటాయి. పులిపిరుల‌కు ప్ర‌ధాన కార‌ణం వైర‌స్‌. ఇవి చ‌ర్మం రంగులో కాని, కాస్తంత ముదురు గోధుమ రంగులో కాని బొడిపెల మాదిరిగా గ‌రుకుగా ఉంటాయి.

image show home remedies for warts

కానీ ఇవి నొప్పిని మాత్రం క‌లిగించ‌వు. ఒక వేళ ఒత్తిడి ప‌డే చోట వ‌స్తే మాత్రం కాస్త ఇబ్బందిని క‌లిగిస్తుంటాయి. ఇవి ఎక్కువ‌గా ముఖం పైనా, మెడ‌పైనా, చేతులు, పాదాలు మొద‌లైన ప్ర‌దేశాల్లో వ‌స్తుంటాయి. 

home remedies for warts: పులిపిర్ల‌ను తొల‌గించే ఇంటి చిట్కాలు!

1. పులిపిరుల‌కు ఔష‌ధంగా ఆముదం చ‌క్క‌గా ప‌ని చేస్తుంది. ఒక చుక్క ఆముదాన్ని పులిపిర పైన వేసి స్టికింగ్ టేప్ అతికించాలి. ఇలా రెండు పూట‌ల మూడు వారాలు చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది. 

2. అర‌టిపండు తొక్క‌ను తీసుకుని గుజ్జుభాగం పులిపిర్లుపైన పెట్టి వుంచి స్టికింగ్ ప్లాస్ట‌ర్‌తో అతికించాలి. రాత్రంతా ఉంచి ప‌గ‌టిపూట తీసేయాలి. ఇలా క‌నీసం వారం రోజుల పాటు చేస్తే ఫలితం ఉంటుంది. అనాస‌, నిమ్మ‌, నారింజ పండ్ల తొక్క‌ల‌తో కూడా ఇదే మాదిరిగా చేయ‌వ‌చ్చు. అలాగే వెల్లుల్లి రేక‌ల‌ను పులిపిరుల పైన రుద్ద‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లిత‌ముంటుంది. 

3. ఉల్లిపాయ‌ల‌తో (home remedies) ఒక చ‌క్క‌ని ప్ర‌యోజ‌నం ఉంది. దీనిని స‌గానికి కోసి మ‌ధ్య భాగాన్ని చెంచాతో తొలిచేయాలి. త‌ర్వాత ఆ భాగాన్ని స‌ముద్ర‌పు ఉప్పుతో నింపాలి. కొంత సేప‌టికి ఉప్పు, ఉల్లి ర‌సం, క‌లిసి ఒక ద్ర‌వ ప‌దార్థం ఏర్ప‌డుతుంది. దీనిని తీసి జాగ్ర‌త్త చేసుకుని 30 రోజుల పాటు పులిపిరుల పైన ప్ర‌యోగిస్తుంటే ఫ‌లితం క‌నిపిస్తుంది. 

4. కేవ‌లం ఉత్త‌రేణి బూడిద‌ను తుల‌సి ఆకుల‌తోగానీ లేదా మ‌ణిశిల‌తో గానీ క‌లిపి నూరి ఆవ‌నూనె చేర్చి ఆ మిశ్ర‌మాన్ని పులిపిరుల‌పైన రాసినా స‌రిపోతుంది. కొత్త సున్నానికి పులిపిరుల‌ను రాల్చ‌గ‌లిగే అద్భుత శ‌క్తి ఉంది. అల్లం ముక్క‌ను సూదిగా చెక్కి కొత్త సున్నంలో ముంచి పులిపిరి కాయ‌ల‌పై రాస్తే చాలు. కాక‌పోతే ఇలా చేసేట‌ప్పుడు సున్నం చుట్టు ప్ర‌క్క‌ల చ‌ర్మానికి అంట‌కుండా జాగ్ర‌త్త ప‌డాలి. 

5. బొప్పాయి పాల‌కు, జీడిపండ్ల‌తో త‌యారు చేసిన తైలానికీ, కామంచి ఆకుల క‌ల్కానికీ పులిప‌ర్ల‌ ( warts) ను త‌గ్గించే శ‌క్తి ఉంది. ఇవ‌న్నీ కొంచెం ఉగ్ర స్వ‌భావం ఉండే ఔష‌ధ ద్ర‌వ్యాలు క‌నుక వీటిని వైద్య స‌ల‌హా మేర‌కు వాడుకోవాల్సి ఉంటుంది. 

6. పులిపిర్ల చికిత్స‌ (home remedies for warts) లో విట‌మిన్ల పాత్ర కూడా ముఖ్య‌మైన‌దే. విట‌మిన్ - ఎ, విట‌మిన్ - సి ల‌ను పై పూత‌గా ప్ర‌యోగించిన‌ప్పుడు పులిపిరి కాయ‌లు త‌గ్గే అవ‌కాశం ఉంటుంది. చేప నూనె, క్యారెట్ మొద‌లైన వాటిలో విట‌మిన్ - ఎ కు సంబంధించిన అంశాలు ఎక్కువ‌గా ఉంటాయి. 

7. అలాగే ఉసిరి కాయ‌ల‌లో విట‌మిన్ - సి ఎక్కువ‌గా ఉంటుంది. వీటిని న‌ల‌గ్గొట్టి, గుజ్జుగా చేసి ఒక‌టి, రెండు నెల‌ల పాటు ప్ర‌తిరోజూ పులిపిర్ల మీద పూత‌గా లేప‌నం చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది. 

Post a Comment

0 Comments