Kusuma Oil: వాస్తవానికి విత్తనాల కోసం మాత్రమే పండించే ఈ పంటను ప్రపంచ వ్యాప్తంగా 60 దేశాల్లో పండిస్తున్నారట. పూర్వం కుసుమ (safflower) విత్తనాల నుంచి తీసిన వంటనూనెను విరివిగా వాడుకునేవారు. అందుకనే ఇప్పటికీ ఈ నూనె ప్రజలు వాడుతున్నారు. ఈ కుసుమ విత్తనాల్లో న్యూట్రిషనల్ వాల్యూ ఎక్కువగానే ఉంది. 100 గ్రాముల కుసుమ నూనెలో 38 గ్రాముల కొవ్వు వుంటుందట.
Kusuma Oil: కుసుమ నూనెలో ఉండే పోషకాలు!
శాచురేటెడ్ ఫ్యాట్
(saturated fat) - 3.7 గ్రా
పాలీశాచురేటెడ్ ఫ్యాట్(Polyunsaturated
fat) - 28 గ్రా
మోనోశాచురేటెడ్ ఫ్యాట్
- 28 గ్రా
సోడియం - 3 గ్రా
పోటాషియం - 687 గ్రా
కార్పొహైడ్రేట్స్ - 34 గ్రా
ప్రొటీన్ - 16 గ్రా
విటమిన్
బి
12 - 88%
కుసుమ నూనెతో
వంటకాలు
కుసుమ నూనె (kusuma oil) తో పాటు పువ్వుల్ని కూడా వంటకాల్లో ఉపయోగిస్తుంటారు. కుంకుమ పువ్వులా వంటకాలకు రంగు తెచ్చే చవక పువ్వు ఇది. కావున కుంకుమ పువ్వుకు బదులుగా కుసుమ నూనెను వాడొచ్చు.
కుసుమ విత్తనాల (kusuma seeds) నుంచి తీసే మోనోశాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్, ఈ రెండు నూనెలను కూరగాయల వేపుళ్లకు వాడొచ్చు. ఈ నూనెతో తక్కువ వేడిని ఉపయోగించే బేకింగ్ కోసం వాడతారు.
సాస్ తయారీలో, డీప్ ఫ్రైలకు, సలాడ్ డ్రెసింగ్‌లకు కుసుమ నూనె వాడుతుంటారు.
కుసుమ నూనెతో ఆరోగ్య ప్రయోజనాలు!
ఈ నూనెలో యాంటి ఆక్సిడెంట్స్ ఉంటాయి కావున గుండెకు మేలు చేస్తుంది. కుసుమ నూనె వాడితే రక్తంలో చక్కెర శాతం తగ్గుతుంది. ఈ నూనెలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండెకు మేలు చేస్తాయి. ఈ నూనె మన శరీరంలో కొవ్వును పేరుకోనివ్వదు. పైగా పేరుకున్న కొవ్వును కూడా ఈ నూనె కరిగిస్తుంది. కావున లావు తగ్గాలనుకునే వాళ్లు వంటకాల్లో ఈ కుసుమ నూనెను (Kusuma Oil) వాడితే చాలా మంచిది అని నిపుణులు అంటున్నారు.

0 Comments